గ్రాలు సందేశము

సత్యము యొక్క వెలుగులో – గ్రాలు సందేశము | అబ్ద్-రు-షిన్

„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క మూడు సంపుటాలలో మొత్తం 168 ఉపన్యాసాలు ఉన్నాయి. అవి వాటి వరుసక్రమంలో విషయాన్ని క్రమంగా విస్తరిస్తూ సమస్త సృష్టి యొక్క సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి.

ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు 1923 నుండి 1938 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినా, నేటివరకు అవి తమ అర్థాన్ని కోల్పోలేదు. అవి సృష్టి శాసనాల ఆధారంగా ఒక సమగ్రమైన విశ్వవివరణను అందిస్తాయి. ఆ వివరణ పాఠకునికి, జీవితంలోని మర్మమైయున్న అవినాభావ సంబంధాలను గుర్తించునట్లు చేస్తుంది మరియు తద్వారా విలువైన జీవితసహాయాలను అందిస్తుంది.

ఇంకా చదవండి »

అబ్ద్-రు-షిన్ ఎవరు?

Abd-ru-shin

„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథ రచయిత అబ్ద్-రు-షిన్ పౌరనామము ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్. జర్మనీ దేశస్తుడైయుండిన అతడు 18 ఏప్రిల్ 1875న (డ్రెస్‌డెన్ నగర సమీపంలోని) బిషోఫ్స్‌-వెర్ద లో జన్మించాడు. అబ్ద్-రు-షిన్ అనే పేరుతో అతడు తన „గ్రాలుసందేశము“ కొరకు ఉపన్యాసలను వ్రాసాడు. ఆ పేరు యొక్క భావార్థం „వెలుగు యొక్క సేవకుడు“.

1928లో ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్ ఆస్త్రియా దేశానికి తరలిపోయాడు. జాతీయ సామ్యవాదులు అతని ఆస్తిని స్వాధీనం చేసుకొని „సత్యము యొక్క వెలుగులో“ గ్రంథాన్ని నిషేధించేంతవరకు అతడు అక్కడ నివసించాడు. తన కార్యంలో నిరోధించబడి అబ్ద్-రు-షిన్ 6 డిసెంబరు 1941న సాక్సొనీలోని ఎర్జ్ పర్వతశ్రేణిలో ఉన్న ఓబర్‌-కిప్స్‌-డోర్ఫ్‌ లో మరణించాడు. అతని జీవితంలోని చివరి సంవత్సరాలను అతడు గెస్టాపొ-పర్యవేక్షణ క్రింద గడపవలసివచ్చింది.

ఇంకా చదవండి »

„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క ఉద్భావచరిత్ర

బ్ద్-రు-షిన్ దాదాపు రెండు దశాబ్దాల వ్యవధిలో ఈ గ్రంథాన్ని రచించాడు. మొదట “గ్రాల్స్-బ్లెట్టర్” అనే పత్రికలో కొన్ని ఉపన్యాసాలు ప్రచురింపబడ్డాయి. 1926వ సంవత్సరంలో “గ్రాలుసందేశం” యొక్క మొదటి “చిన్న” ప్రచురణ ప్రచురించబడింది, 1931వ సంవత్సరంలో “పెద్ద” ప్రచురణ ఒకే సంపుటంలో ప్రచురించబడింది మరియు చివరిగా అది మూడు సంపుటాలలో, నేడు లభ్యమౌతున్న రూపంలో ప్రచురించబడింది. మార్పులతో కూడిన ఈ చరిత్ర కొన్ని అపార్థాలకు దారితీసింది.

ఇంకా చదవండి »

స్టిఫ్ టుంగ్ గ్రాల్స్ బోట్షాఫ్ట్

Stuttgart, Lenzhalde

„స్టిఫ్‌టుంగ్ గ్రాల్స్‌-బోట్‌షాఫ్ట్“ లాభాపేక్షలేని, మతాతీతమైన గ్రాలుసందేశ సంస్థయైయున్నది. అది 1951లో „గ్రాలుసందేశ“ రచయిత యొక్క విధవరాలైన మరియ బెర్న్‌-హార్డ్ సూచనమేరకు స్థాపించబడింది మరియు ఎన్నికచేయబడిన దార్శనిక ప్రశ్నలపై ప్రచురణలను అందిస్తుంది. దాని కార్యక్రమంలో ప్రధానమైనది అబ్ద్-రు-షిన్ యొక్క „సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం. ఇప్పటివరకు 23 భాషలలోనికి అనువదించబడిన మరియు దాదాపు 90 దేశాలలో అందుబాటులోవున్న ఈ మౌళికమైన దార్శనిక గ్రంథాన్ని పలు ఇతర ప్రచురణలు అనుసరిస్తాయి.

ఇంకా చదవండి »