1920-1941:„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క ఉద్భావచరిత్ర

“గ్రాల్స్-బ్లెట్టర్” పత్రికల నుండి ఆఖరి అధికృత ప్రచురణ వరకు

బ్ద్-రు-షిన్ దాదాపు రెండు దశాబ్దాల వ్యవధిలో ఈ గ్రంథాన్ని రచించాడు. మొదట “గ్రాల్స్-బ్లెట్టర్” అనే పత్రికలో కొన్ని ఉపన్యాసాలు ప్రచురింపబడ్డాయి. 1926వ సంవత్సరంలో “గ్రాలుసందేశం” యొక్క మొదటి “చిన్న” ప్రచురణ ప్రచురించబడింది, 1931వ సంవత్సరంలో “పెద్ద” ప్రచురణ ఒకే సంపుటంలో ప్రచురించబడింది మరియు చివరిగా అది మూడు సంపుటాలలో, నేడు లభ్యమౌతున్న రూపంలో ప్రచురించబడింది. మార్పులతో కూడిన ఈ చరిత్ర కొన్ని అపార్థాలకు దారితీసింది. క్రింద ఇవ్వబడిన సమగ్రమైన వివరణలో మీరు “గ్రాలుసందేశం” యొక్క వివిధ ప్రచురణల గురించిన సమాచారాన్ని మరియు అబ్ద్-రు-షిన్ ద్వారా ఒక్కొక్క ప్రచురణలో ఉపన్యాసాల యొక్క పునర్వ్యవస్థీకరణను గురించిన సమాచారాన్ని పొందవచ్చు.

ఇక్కడ మీరు దాని చరిత్రను గురించిన మరిన్ని వివరాలను చదువవచ్చు:

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము