స్టిఫ్ టుంగ్ గ్రాల్స్ బోట్షాఫ్ట్

Stiftung Gralsbotschaft Hauptsitz Stuttgart
„స్టిఫ్‌టుంగ్ గ్రాల్స్‌-బోట్‌షాఫ్ట్“ లాభాపేక్షలేని, మతాతీతమైన గ్రాలుసందేశ సంస్థయైయున్నది. అది 1951లో „గ్రాలుసందేశ“ రచయిత యొక్క విధవరాలైన మరియ బెర్న్‌-హార్డ్ సూచనమేరకు స్థాపించబడింది మరియు ఎన్నికచేయబడిన దార్శనిక ప్రశ్నలపై ప్రచురణలను అందిస్తుంది. దాని కార్యక్రమంలో ప్రధానమైనది అబ్ద్-రు-షిన్ యొక్క „సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం. ఇప్పటివరకు 22 భాషలలోనికి అనువదించబడిన మరియు దాదాపు 90 దేశాలలో అందుబాటులోవున్న ఈ మౌళికమైన దార్శనిక గ్రంథాన్ని పలు ఇతర ప్రచురణలు అనుసరిస్తాయి.

స్టిఫ్‌టుంగ్ గ్రాల్స్‌-బోట్‌షాఫ్ట్ అబ్ద్-రు-షిన్ యొక్క గ్రంథమైన „సత్యము యొక్క వెలుగులో – గ్రాలుసందేశమును“ కేవలం దాని „ఆఖరి అధికృత ప్రచురణ“ రూపంలో మాత్రమే వ్యాపింపజేస్తుంది.

రచయిత తన చివరి జీవిత సంవత్సరాలలో గ్రాలుసందేశాన్ని సవరించాడు మరియు పునర్వ్యవస్థీకరించాడు మరియు కేవలం ఈ ప్రచురణ మాత్రమే వ్యాప్తిచేయబడుటకు ఉద్దేశించబడియున్నది.

రచయిత వ్యక్తంచేసిన – అతని విధవరాలు మరియ బెర్న్‌-హార్డ్ మరియు అతని కుమార్తె ఇర్మింగార్డ్ బెర్న్‌-హార్డ్ ద్వారా ప్రకటించబడిన – ఈ ఆశయానికి స్టిఫ్‌టుంగ్ గ్రాల్స్‌-బోట్‌షాఫ్ట్ కట్టుబడియున్నది.