నా సందేశంలో నా ద్వారా ఇవ్వబడిన సృష్టిజ్ఞానంలో మరియు దానికి సంబందించిన స్వయంచాలకంగా సృష్టియందు పనిచేయుచున్న, మనం ప్రకృతి శాసనాలు అని కూడా పిలువగలిగే సమస్త శాసనాలను గురించిన వివరణలో, సృష్టి యొక్క నేతక్రమం సమస్తం కంతలు లేకుండా కనబడుతుంది; అది అన్ని ప్రక్రియలను స్పష్టంగా గుర్తించగలుగునట్లు చేస్తుంది, దానితో మానవ జీవితమంతటి యొక్క ఉద్దేశాన్ని సహితం. తిరుగులేని హేతుబద్ధతలో అది అతని యొక్క “ఎక్కడనుండి” మరియు “ఎక్కడికి” అనే అంశాలను విశదపరుస్తుంది. అందువల్ల, మనిషి మనస్ఫూర్తిగా వెదికినట్లైతే, ప్రతి ప్రశ్నకు అది సమాధానం ఇస్తుంది.
- – అబ్ద్-రు-షిన్
దుఃఖము మరియు సంతోషము కూడా మనిషిని ఉత్తేజపరచుటకు, ఆత్మీయంగా మేల్కొల్పుటకు ఎల్లప్పూడూ తలుపు తట్టుతుంటాయి. మనిషి అప్పుడు అతితరచుగా కొన్ని క్షణాలపాటు ప్రతివిధమైన అనుదిన జీవితపు నిరర్థకములనుండి విముక్తి పొంది, సుఖంలోను అదే విధంగా బాధలోను, జీవించే సమస్తం ద్వారా ప్రవహించే ఆత్మతో, సూచనపూర్వకంగా అనుబంధానుభూతిని పొందుతాడు.
మరి సమస్తమూ జీవమే కదా, ఏదియూ నిర్జీవము కాదు! ఎవడైతే అటువంటి అనుబంధపు క్షణాలను సంగ్రహిస్తాడో మరియు భద్రపరచుకొంటాడో, వాటి ఆధారంగా ఉడ్డీనమౌతాడో, వాడు ధన్యుడు.
- – అబ్ద్-రు-షిన్
తాను దేని నిమిత్తం ఈ భూమిపై లేక అసలు ఈ సృష్టిలో జీవిస్తున్నదో, దేనిలో అది వేయి దారములతో వ్రేలాడుతున్నట్లు ఉన్నదో పరిశోధించుట మానవాత్మ యొక్క పవిత్రమైన కర్తవ్యమైయున్నది. తన ఉనికికి ఎటువంటి ప్రయోజనమూ లేదని ఊహించుకొనుటకు ఏ మనిషి కూడా తనను తాను అంత తక్కువగా అంచనా వేసుకోడు, అతడే దానిని ఉద్దేశరహితం చేస్తే తప్ప. నిశ్చయంగా అతడు తనను చాలా ముఖ్యమైన వానిగా ఎంచుకొంటాడు. అయిననూ చాలా కొద్దిమంది మనుష్యులు మాత్రమే, భూమిపై తాము కలిగియున్న కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా పరిశోధించుటలో నిమగ్నమగుటకు అవసరమైనంత మట్టుకు తమ ఆత్మీయ సోమరితనంనుండి తమను ప్రయాసతో విడిపించుకొనగల్గుటకు సమర్థులైయుంటారు.
- – అబ్ద్-రు-షిన్
పూర్ణశక్తితో మంచిసంకల్పాన్ని, స్వచ్ఛమైన ఆలొచనప్రక్రియను మొదలుపెట్టండి, దానిని విడిచిపెట్టవద్దు, కాని మీ యొక్క పూర్ణవాంఛతో, పూర్ణశక్తితో దానిని కొనసాగించండి అని నేను మీకిచ్చే సలహా యొక్క విలువను మీరు ఇప్పుడు అర్థం చేసుకొంటారా? అది మిమ్ములను ఉన్నతానికి ఎత్తుతుంది! అది మిమ్ములను మరియు మీ పరిసరాన్ని మార్చివేస్తుంది!
- – అబ్ద్-రు-షిన్