1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము
అధ్యాయము 04

1938వ సంవత్సరంలోనే అబ్ద్-రు-షిన్ తన ఉపన్యాసాలను వర్గీకరించుటకు మొదలుపెట్టాడు. 1939 నుండి 1941 సంవత్సరాలలో అతడు తన సంపూర్ణ రచనను, ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ 15 మే 1956న ఇచ్చిన వివరణలో వర్ణించిన విధంగా క్రమబద్ధీకరించాడు.

శ్వాత్స్ జిల్లా కోర్టు ఎదుట ఇవ్వబడిన వివరణ యొక్క నకలు:

„గ్రాలుసందేశము, దాని రచయిత, ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ ద్వారా స్వయంగా 1939 నుండి 1941 సంవత్సరాలలో సవరించబడింది.

1938వ సంవత్సరం సెప్టెంబరు నెలలో మేము – ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్, అతని భార్య మరియ బెర్న్-హర్డ్, నా సహోదరుడు అలెక్సాండరు మరియు నేను – గెస్టపో ద్వారా గోర్లిట్స్ సమీపంలో ఉన్న శ్లౌరోత్ కు బలవంతంగా పంపబడ్డాము. 1939 మార్చి నెలలో గెస్టపో అనుమతితో మేము ఎర్జ్ పర్వతశ్రేణిలో ఉన్నట్టి కిప్స్-డోర్ఫ్ అనే ఆరోగ్య కేంద్రానికి తరలిపోయాము. అదే సంవత్సరంలో ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ గ్రాలుసందేశమును సవరించుటకు మొదలుపెట్టాడు. 1941 మే నెలాఖరికి సవరణ యొక్క లిఖిత ప్రతి ముద్రణకు సిద్ధమైయుండింది.

సవరణలు పలు విధమైన మార్పులతో కూడియుండినవి. కొంతమట్టుకు విరామ చిహ్నాలను సరిచేయుట, పదముల స్థానమార్పిడి, అంతకు పూర్వపు వాక్యములు మరియు పరిచ్చేదములలో వ్యక్తీకరించబడిన ఆలోచనలను పునరావృతంచేసే పూర్తి వాక్యముల లేక పరిచ్చేదముల తొలగింపు లేక కుదింపు మొదలగునవి.

అయితే, వ్యక్తీకరించబడిన ఆలోచనలను మనుష్యులు గ్రహించలేరనే అభిప్రాయాన్ని కలిగియున్న చోట్లలో అతడు పదాలను, వాక్యాలను మరియు పూర్తి పేజీలను కూడా తొలగించాడు. ఈ అభిప్రాయాన్ని అతడు కలిగియుండుటకు అతడు వెళ్ళిపోవుటకు ముందు ఆఖరి సంవత్సరాలలో అతని అనుభవాలు దీనికి కారణమైయుండినవి.

ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ ఈ దిద్దుబాట్లను ఏ విధంగా చేసాడంటే, అతడు దానికై ప్రత్యేకించబడిన ఒక గ్రాలుసందేశ ప్రతిని తీసుకొని, దానిలో పెన్సిలుతో తన సూచనలను వ్రాసాడు, కొట్టివేతలు చేసాడు మరియు ఎక్కడ అతడు మార్పులను లేక పూరింపులను ఆశించాడొ అక్కడ వివరణలను వ్రాసాడు. ఈ మార్పులను మరియు పూరింపులను ఒక ప్రత్యేకమైన పేపరు మీద వ్రాసాడు. ఆ తరువాత నేను, పెన్సిలుతో వ్రాయబడిన వివరణలు అస్పష్టమైపోయి చదువరాకుండా కాగలవనే ప్రమాదమున్నందువల్ల, పేపరు చీటీలను టైపుచేసి, గ్రాలుసందేశం యొక్క ఆ సవరణల-ప్రతిలోని పెన్సిలు వ్రాతలను తుడిపివేసి, టైపుచేసిన చీటీలను దానిలో అతికించుట ద్వారా పూరించాను. గ్రాలుసందేశంలో ఏ పేజీలలోనైతే పెద్ద పరిచ్చేదములు కొట్టివేయబడ్డాయో అక్కడ కొట్టివేతలు ఉన్నంతవరకు వాటిని పేపరు అతికించుట ద్వారా కప్పివేసాను, లేక ఆ పేజీని మార్పుచేయబడిన రూపంలో పూర్తిగా కొత్తగా టైపుచేసి ఆ కొత్త పేజీని దానిలో అతికించాను.

ఉపన్యాసాల వరుసక్రమం కూడా మారినందున, ఒక ఉపన్యాసం దాని వరుసలోనుండి తీయబడి వేరొకచోట చేర్చబడవలసివచ్చింది.

సవరణలనన్నింటిని నేను గ్రాలుసందేశ రచయిత చేసిన సూచనల ప్రకారమే ఖచ్చితంగా చేసాను. ప్రతి సవరణను అతడు పరీక్షించాడు.

ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ చేతివ్రాతతో చేసిన సవరణలను కలిగియిన్న లిఖిత ప్రతి పేజీలు కేవలం కొన్ని మాత్రమే అందుబాటులో ఉండుటకు ఈ సవరణ విధానమే కారణం.“

ఫొంపర్‌బెర్గ్, 15 మే 1956

ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్

గ్రాలుసందేశము యొక్క “ఆఖరి అధికృత ప్రచురణ” సంపుటం I లో అబ్ద్-రు-షిన్ ముఖ్యంగా, 1937వ సంవత్సరంలో “దీ స్టిమ్మె” పత్రికలో ప్రచురించబడిన ఉపన్యాసాలను, 1931వ ప్రచురణలోని వాటి వరుసక్రమం ప్రకారమే చేర్చాడు కాని అవి ఆ పత్రికలో వెలువడిన క్రమంలో కాదు. ఇది “ఉపాసనము”, “జడత్వము”, “పిల్లలవంటి నైజము”, “శీలము”, “మొదటి అడుగు”, “రక్షణ! విమోచన!” మరియు “ప్రభువు యొక్క భాష” అనే ఉపన్యాసాలకు వర్తిస్తుంది.

సంచిక 1 లోని “రక్తం యొక్క మర్మము” అనే ఉపన్యాసం సంపుటం IIIలో “భౌతికశరీరము” మరియు “స్వభావము” అనే ఉపన్యాసాల మధ్యలో చేర్చబడింది.

“గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I లోనుండి మరియు ఏకమాత్ర ఉపన్యాసాల సేకరణలోనుండి కూడా ఉపన్యాసాలు ఈ మొదటి సంపుటంలో చేర్చబడ్డాయి.

దీనికొరకు కొన్ని శీర్షికలు మార్చబడ్డాయి. ఉదాహరణకు “ఒక చివరి మాట” అనేది “ఒక ఆవశ్యకమైన మాట”గా వెలువడింది, “అంత్యతీర్పు” అనేది “లోకము” అనే శీర్షికను పొందింది మరియు “నాయకుని కొరకు కేక” అనేది “సహాయకుని కొరకు కేక” అని మారింది. (ఎందుకంటే “నాయకుడు” అనే పదం జాతీయ సామ్యవాదుల వాడుక ద్వారా చెడ్డపేరు పొందియుండింది.)

గ్రాలుసందేశము యొక్క “ఆఖరి అధికృత ప్రచురణ” సంపుటం II ప్రధానంగా 1931వ సంవత్సరపు ప్రచురణలోని ఉపన్యాసాలను, ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ వర్ణించినట్లు సవరించబడిన రూపంలో కలిగియున్నది. “దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు” మరియు “పిలువబడినవారు” అనే ఉపన్యాసాలు అబ్ద్-రు-షిన్ ద్వారా ప్రచురణకొరకు పరిగణించబడలేదు. అదే విధంగా “మరియు అది నెరవేరింది” అనే ఉపన్యాసము మరియు “చివరిమాట” కూడా వదిలివేయబడ్డాయి. అనుబంధంలోని “జీవము” అనే ఉపన్యాసంతో సంపుటం II ముగుస్తుంది.

సంపుటం III, “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I లోని ఉపన్యాసాలను మరియు ఏకమాత్ర ఉపన్యాసాల సేకరణలోనుండి అబ్ద్-రు-షిన్ ప్రచురించుటకు నిశ్చయించిన వాటిని, కలిగియున్నది.

“దీ స్టిమ్మె” పత్రిక, సంచిక 1 లోని “రక్తం యొక్క మర్మము” అనే ఉపన్యాసం కూడా దీనిలో చేర్చబడింది. “ఎవడు నా వాక్యమును … ఎరుగగోరడో …” అనే ఉపన్యాసం “నామము” అనే శీర్షికతో వెలువడింది. “గ్రాలుసందేశము ఏ విధంగా గ్రహించబడవలసియున్నది” అనే చివరిమాటతో సంపుటం III ముగుస్తుంది.

“గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I నుండి ఐదు ఉపన్యాసాలు మరియు ఏకమాత్ర ఉపన్యాసాల సేకరణలోనుండి నాలుగు ఉపన్యాసాలు గ్రాలుసందేశం సంపుటాలు I, II, III లలో చేర్చబడలేదు. అవేవనగా, “ఆవశ్యకమైన పరిహారము”, “యేసు మరియు ఇమ్మానుయేలు”, “శుద్ధరాత్రి” (ఇది మరియు “ఆఖరి అదికృత ప్రచురణ” సంపుటం లోని “శుద్ధరాత్రి” ఒకటికావు), “శుద్ధరాత్రి ధ్వనులు హెచ్చరిస్తూ విశ్వం ద్వారా ప్రకంపిస్తున్నవి”, “నేను మిమ్మును పంపుతున్నాను!”, “ద్వారము తెరువబడుతుంది! “, “గాయము”, “నూతనసంవత్సరము 1935” మరియు “త్యాగము”.

 

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము