సారంశము

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము
అధ్యాయము 05

పాఠకుల వర్గాలలో “పాత” సందేశమును గురించి ప్రస్తావించబడినప్పుడు వారు దానితో 1931వ సంవత్సరపు “పెద్ద ప్రచురణను”, 1934లో ప్రచురించబడిన “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I ని మరియు ఆ తరువాత 1937 వరకు (పాక్షికంగా “దీ స్టిమ్మె” పత్రికలో) వెలువడిన ఏకమాత్ర ఉపన్యాసాలను సూచిస్తారు. ఇవి గ్రాలుసందేశము “సత్యము యొక్క వెలుగులో” సంపుటాలు I, II, III “ఆఖరి అధికృత ప్రచురణ” కు వ్యతిరేకంగా చూపబడతాయి. దానితో గ్రాలుసందేశము “సత్యము యొక్క వెలుగులో”, పెద్ద ప్రచురణ 1931, తరచుగా “అసలు” సందేశంగా లేక గ్రాలుసందేశం యొక్క “ఆదిరూపంగా” పిలువబడుతుంది. ఈ 1931వ సంవత్సరపు ప్రచురణ కొంతమేరకు “సంపూర్ణం చేయబడిన రూపంలో ఆకాశమునుండి ఊడిపడిందేమోననే” అభిప్రాయాన్ని వారు కలుగజేస్తుంటారు. అదే సమయంలో “ఆఖరి అధికృత ప్రచురణ” ఒక సవరణగా చూపబడుతుంది. అంతేకాక ఇంకా అబ్ద్-రు-షిన్ ఈ సవరణను స్వయంగా చేసాడా అనే సందేహాలు కూడా తలెత్తుతాయి. నిజానికి 1931వ సవత్సరపు ఈ “పెద్ద ప్రచురణ” కూడా ఆ తరువాత “ఆఖరి అధికృత ప్రచురణ”లాగే ఒక పరిణామాన్ని కలిగియుండిందనే విషయం చూడబడదు లేక ఎరిగియుండబడదు. 1926వ సంవత్సరంలోని “చిన్న ప్రచురణతో” పోల్చినట్లైతే, అబ్ద్-రు-షిన్ ఈ “పెద్ద ప్రచురణ” కొరకు కూడా వరుసక్రమాన్ని మార్చాడు, కొత్త ఉపన్యాసాలను చేర్చాడు మరియు ఇతర వాటిలో (ఉదాహరణకు అక్షరక్రమాన్ని మరియు పునరావృతాలను) సవరించాడు.

1931వ సంవత్సరపు “పెద్ద ప్రచురణ” యొక్క చివరిమాటలో అబ్ద్-రు-షిన్ తన ఆత్మీయ మూలమును గురించిన గుర్తింపును మరియు దానితో జోడించబడియున్న మనుష్యులకొరకు సహాయమును ప్రకటించాడు.

అక్కడ అతడు, అబ్ద్-రు-షిన్ మనుష్యులకు తన సందేశాన్ని సంపూర్ణం చేసియున్నాడని వ్రాసియున్నా, దాని అర్థం, అతడు మనుష్యులకు బోధించవలసింది ఇకపై ఏమీ లేదని కాదు. కాగా అతడు ఆ తరువాత ఇంకా ఎన్నో ఉపన్యాసాలను రచించాడు. అయితే దానిలోని ఉపన్యాసాలలోని విషయాలతో అతడు ఆ రూపంలో ఆ కాలపు మనుష్యులకు “ఆధారాన్ని” అందజేసాడు. అది వారికి, గ్రాలుసందేశంలో మనుష్యులకు సృష్టికర్త యొక్క సహాయాన్ని గుర్తించుటకు సాధ్యం చేసింది. తద్వారా మాత్రమే వారు, “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనుల” రూపంలో ఆ తరువాత ఇచ్చిన వివరణలను గ్రహించుటకు మరియు పాటించుటకు సమర్థులైయుండినారు.

“సందేశము ఏ విధంగా గ్రహించబడవలసియున్నది” అనే చివరిమాటలో (“గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I) “… నా సందేశమును మీరు తప్పక మార్చకుండా ఉంచవలెను …” అనే వ్యక్తీకరణ తరచుగా ఒక వాదనగా తీసుకోబడుతుంది, ఈ ప్రచురణ మార్చబడరాదనే దానిని “రుజువుచేయుటకు”. కాని ఈ సూచన శ్రోతలు లేక పాఠకులుగా కేవలం మనకు మాత్రమే వర్తిస్తుంది కాని స్వయంగా రచయితకు కాదు. గ్రాలుసందేశమును తెచ్చిన వానిగా అతడు దాని రూపమును తప్పకుండా మార్చగలడు.

సవరణ యొక్క ఈ సంభావన, “దెర్ రూఫ్” లిమిటెడ్, మ్యూనిక్ ప్రచురణ సంస్థకు మరియు అబ్ద్-రు-షిన్ కు మధ్య 1.10.1930న, 19.9.1932న మరియు 28.1.1935న కుదిరిన ప్రచురణ ఒప్పందాలలో అక్షరాలా వ్రాయబడియున్నది:

“అచ్చు చిత్తులలో తప్పులను దిద్దుటకు మరియు వాటి పరీక్షలను ఉచితంగా చేపట్టేందుకు బెర్న్-హార్డ్ గారు సమ్మతించారు. అవసరం కాబోయే సవరణలకు కూడా అదే విధంగా ఎటువంటి పారితోషికం చెల్లించబడదు.” (28.1.1935)

గ్రాలు లోనుండి వచ్చిన సందేశమును గ్రహించుటకు మరియు పాటించుటకు తదనంతర సంవత్సరాలలో క్రమంగా కష్టతరమయింది. మనుష్యులలో అత్యధికులు, గ్రాలుసందేశం చూపిన మార్గాలను కాక వేరే మార్గాలను అనుసరించారని చరిత్ర చూపింది. కేవలం మనుష్యులలో అధికులే కాక గ్రాలుసందేశమును అంగీకరించిన వారిలో కూడా కొందరు, దానిని జీవితసహాయంగా గుర్తించిన తరువాత కూడా వేరే మార్గాలను అనుసరించారు.

1937 సంవత్సరంలోనే అబ్ద్-రు-షిన్, పరిణామాల దృష్ట్యా తన ఉపన్యాసాల సవరణ ఆవశ్యకమయిందని, తనకు సుపరిచితమైన వ్యక్తులకు తెలియజేసాడు. ఈ విషయం ఆ వ్యక్తుల ఉత్తరాలలోనుండి మరియు వివరణలలోనుండి విశదమౌతుంది.

ఈ సవరణను అబ్ద్-రు-షిన్, తన నిర్బంధ నివాసస్థలమైన కిప్స్-డోర్ఫ్ లో చేపట్టాడు. ఆ సమయంలో, అతి క్లిష్టమైన పరిస్థితులలో సహితం, చాలా కొద్దిమంది గ్రాలుసందేశ అనుయాయులకు అతన్ని మరియు అతని కుటుంబాన్ని అక్కడ సందర్శించుటకు అవకాశం కలిగింది. ఆ వ్యక్తులతో అతడు తన ఉపన్యాసాల సవరణను గురించి ప్రస్తావించాడు మరియు వారికి గ్రాలుసందేశాన్ని తాను మూడు సంపుటాలలో పొందుపరిచానని వివరించాడు. ఆ వ్యక్తులలో కొందరు ఆ తరువాత ఆ సందర్శనల గురించిన తమ జ్ఞాపకాలను వివరణలలో లేక ఉత్తరములలో లిఖించారు.

అబ్ద్-రు-షిన్ తన బలవంత ప్రవాసం యొక్క పరిస్థితులలో ఎంత బాధపడియుంటాడో ఊహించుకొనుట ఏమాత్రం సాధ్యం కాకపోవచ్చు. అతని కార్యమును నిరోధించుట యొక్క అంతరంగిక ఆందోళనలు మరియు భారములు చివరకు అతని శరీరంపై కూడా తమ ప్రభావాన్ని చూపాయి. నవంబరు 1941లో అతడు వైద్యశాలలో ఉన్నప్పుడు వైద్యులు ఎటువంటి భౌతికమైన కారణాలను కనుగొనలేకపోయారు మరియు కిప్స్-డోర్ఫ్ లో తన “ఇంటికి” తిరిగిపోవాలనే అతని కోరికను మన్నించారు. అబ్ద్-రు-షిన్ అక్కడ 6 డిసెంబరు 1941 తేదీ మధ్యాహ్న సమయంలో ఈ భూమిని వదిలాడు. స్వంత ఇంటికి తిరిగిపోవాలనే అతని కోరికకు, భూమికి ఆకాశమంత ఎత్తులో ఉన్న గమ్యం గురిగా ఉండింది.

అబ్ద్-రు-షిన్ స్వంత ఇంటికి వెళ్లిపోయిన తరువాత అతని కార్యాన్ని కొనసాగించిన వారు మరియ మరియు ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు. యుద్ధం 1945లో ముగిసిన తరువాత అబ్ద్-రు-షిన్ యొక్క భూలోక కార్యస్థానమైన ఫొంపర్‌బెర్గ్ (పర్వతం)పైకి తిరిగివచ్చే వరకు బాధకరమైన యుద్ధకాలాన్ని వారు భరించవలసియుండింది.

కొంతకాలం తరువాత వారు ఒక ప్రకటన పత్రిక ద్వారా, అబ్ద్-రు-షిన్ తన సందేశాన్ని, కిప్స్-డోర్ఫ్ లో అతడు నివసించిన సంవత్సరాలలో సవరించాడని గ్రాలుసందేశ అనుయాయులకు తెలియజేసారు.

మరియ మరియు ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ – అప్పుడప్పుడు భావించబడుతున్నట్లు – గ్రాలుసందేశం యొక్క సవరణ ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందలేదు. నిజానికి వారికి, యుద్ధం ముగిసిన తరువాత, 1931వ సంవత్సరపు “పెద్ద ప్రచురణను”, 1934వ సంవత్సరపు “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులను” మరియు 1937 వరకు వెలువడిన ఏకమాత్ర ఉపన్యాసాలను వాటి “పాత” రూపంలోనే తిరిగి ప్రచురించుట ఎంత సులభమైయుండేదో! ఎంతో శ్రమ, కలత, శత్రుత్వాలు మరియు ఖర్చులు తద్వారా వారికి తప్పియుండేవి.

అబ్ద్-రు-షిన్ యొక్క చిత్తమును నెరవేర్చగోరుట మరియు అతని సందేశమును అతడే స్వయంగా, చివరిగా నిర్ణయించినట్లు వాపింపజేయుటలో ఉన్నట్టి నిశ్చయతయే వారి కార్యానికి ఆధారమైయుండింది.

Ausgabe letzter Hand

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము