ఆరోహణ

మీరు, ఎవరైతే జ్ఞానోదయం కొరకు తపించుచున్నారో, మిమ్ములను ఒక వలలో చిక్కుకోనివ్వకండి, కాని చూసేవారిగా అవ్వండి!

శాశ్వతమైన శాసనం ద్వరా ఒక తిరుగులేని ప్రాయశ్చిత్త-నిర్బంధం మీపై మోపబడియున్నది. దానిని మీరు ఎప్పటికీ ఇతరులపై వేయలేరు. మీ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా లేక కార్యముల ద్వారా దేనిని మీరు మీపైన వేసుకొంటారో, దానిని మీరే తప్ప వేరెవరూ ప్రాయశ్చిత్తం చేయలేరు! ఆలోచించండి, లేనియెడల దైవన్యాయం కేవలం వట్టి ధ్వనియై మాత్రమే ఉంటుంది, దానితోపాటు ఇతరమైనదంతయూ కూడా శిథిలమౌతుంది.

అందువల్ల మిమ్ములను స్వతింత్రించుకోండి! ఈ ప్రాయశ్చిత్తం చేయవలసిన నిర్బంధానికి ఒక గమ్యాన్ని నిర్ణయించుటకు ఒక్క గంట కూడా వృధాచేయకండి! నిజమైన హృదయపూర్వక ప్రార్థన ద్వారా మరింత గొప్ప శక్తిని పొందే, మంచికొరకు, మేలుకొరకైన నిజాయతీగల సంకల్పం, విమోచనను తెస్తుంది!

మంచికొరకు నిజాయతీగల, స్థిరమైన సంకల్పం లేకుండా ప్రాయశ్చిత్తం ఎప్పటికీ కలుగదు. నీచమైనది అప్పుడు ముందుకుసాగుతూ ఇకపైకూడా ఉనికిలో ఉండుటకు తనకు తాను క్రొత్త పోషణను ఇచ్చుకొంటుంది, తద్వారా పదే పదే క్రొత్త ప్రాయశ్చిత్తన్ని ఎడతెరపి లేకుండా అపేక్షిస్తుంది; ఆ విధంగా నిరంతరం నవీకరణం చెందేది మీకు కేవలం ఒకే ఒక్క వ్యసనము లేక యాతనవలే కనబడుతుంది! అయితే అది, మునుపటిది ప్రాయశ్చిత్తం చేయబడకముందే నిరంతరం క్రొత్తగా బంధించే అంతంలేని ఒక సంపూర్ణమైన గొలుసైయున్నది.

అది ఎల్లప్పుడూ ప్రాయశ్చిత్తాన్ని అపేక్షిస్తుంది గనుక విమోచన ఇక ఎప్పటికీ ఉండదు. అది మిమ్ములను నేలకు మాటువేసియుంచే ఒక గొలుసువంటిది. అ ప్రక్రియలో మరింత లోతుకు దిగజారే చాలా గొప్ప అపాయం ఉన్నది. కాబట్టి మీరు, ఎవరైతే ఇంకా ఈవలిలోకంలో ఉన్నారో లేక మీ భావనల ప్రకారం ఇప్పటికే ఆవలిలోకంలో ఉన్నారో, మిమ్ములను ఎట్టకేలకు మంచిసంకల్పం కొరకు సిద్ధపరచుకోండి! నిరంతరం మంచి సంకల్పాన్ని కలిగియున్నప్పుడు సమస్త ప్రాయశ్చిత్తం యొక్క అంతం తప్పక రావలసియుంటుంది, ఎందుకంటే మంచిని కోరేవాడు మరియు కార్యశీలుడు తదుపరి ప్రాయశ్చిత్త-నిర్బంధానికి క్రొత్త పోషణను అందించడు. మరియు అప్పుడు తద్వారా విడుదల, విమోచన వస్తాయి. అవి మాత్రమే వెలుగునకు ఆరోహణను అనుమతిస్తాయి. ఈ హెచ్చరికను వినండి! మీకు ఏ ఇతర మార్గం కూడా లేదు! ఎవ్వరికీ కూడా!

అయితే దానితో ప్రతి ఒక్కడూ కూడా, ఎప్పటికీ ఆలస్యం కాజాలదనే నిశ్చయాన్ని పొందుతాడు. ఒంటరి కార్యానికైతే తప్పకుండా, దానిని మీరు అప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి, విమోచించాలి, కాని ఏ క్షణంలో మీరు మంచికొరకైన మీ యొక్క కృషిని పట్టుదలతో మొదలుపెడతారో అప్పుడు మీరు మీ ప్రాయశ్చిత్తాల అంతానికి గీటురాయిని ఏర్పరుస్తారు. ఈ అంతం ఎప్పుడో ఒకసారి తప్పక రావలసియుంటుందని మరియు దానితో మీ ఆరొహణ మొదలౌతుందని, ధీమాగా ఉండండి! అప్పుడు మీరు సంతోషంతో అన్ని ప్రాయశ్చిత్తాలను క్రమంగా ముగించుటకు మొదలుపెట్టవచ్చు. అప్పుడు మీకు ఇంకా ఏది ఎదురౌతుందో, అది మీ మేలుకొరకే జరుగుతుంది, మిమ్ములను విమోచన యొక్క, విడుదల యొక్క ఘడియకు చేరువగా నడిపిస్తుంది.

పూర్ణశక్తితో మంచిసంకల్పాన్ని, స్వచ్ఛమైన ఆలొచనప్రక్రియను మొదలుపెట్టండి, దానిని విడిచిపెట్టవద్దు, కాని మీ యొక్క పూర్ణవాంఛతో, పూర్ణశక్తితో దానిని కొనసాగించండి అని నేను మీకిచ్చే సలహా యొక్క విలువను మీరు ఇప్పుడు అర్థం
చేసుకొంటారా? అది మిమ్ములను ఉన్నతానికి ఎత్తుతుంది! అది మిమ్ములను మరియు మీ పరిసరాన్ని మార్చివేస్తుంది!

ప్రతి భౌతికమనుగడ ఒక కురచటి పాఠశాల అనియూ, శరీరాన్ని వదిలివేయడంతో మీకు స్వయంగా అంతం రాదనియూ గుర్తుంచుకోండి. మీరు ప్రతినిత్యం జీవిస్తూ ఉంటారు లేక ప్రతినిత్యం చనిపోతూ ఉంటారు! ప్రతినిత్యం ఆనందాన్ని అనుభవిస్తారు లేక ప్రతినిత్యం శ్రమను!

భౌతిక భూస్థాపనతో తనకు సమస్తమూ ముగిసిందని, సమస్తమూ స్మతుల్యమైనదని ఎవడు అనుకొంటాడో వాడు వెనుదిరిగి తన దారిన తాను పోవలెను; కాగా వాడు దానితో కేవలం తనను తాను మోసపరచుకొన గోరుతున్నాడు. దిగ్భ్రాంతుడై అతడు అప్పుడు సత్యము ఎదుట నిలుస్తాడు మరియు తన శ్రమ-మార్గాన్ని మొదలుపెడతాడు … తప్పనిసరిగా! అతని నిజమైన అహం, అతన్ని తన దట్టతతో ఒక గోడవలే కప్పియుంచిన శరీరం యొక్క రక్షణనుండి నగ్నపరచబడి, దానికి సజాతీయమైన దానిద్వారా అకర్షించబడుతుంది, పరివేష్టించబడుతుంది మరియు పట్టియుంచబడుతుంది.

అతన్ని విముక్తిచేయగల్గే, ఉన్నతమునకు నడిపించగల్గే, మెరుగైనదాని కొరకైన పట్టుదలతో కూడిన సంకల్పాన్ని కూడగట్టుట కష్టతరమౌతుంది, చాలాకాలం వరకు అసాధ్యమౌతుంది, ఎందుకంటే అతడు కేవలం, అతన్ని మేల్కొల్పగల్గుటకు, అతనికి సహాయం చేయగల్గుటకు తనయందు ఎటువంటి వెలుగు ఆలోచనను కూడా కలిగియుండని సజాతీయ పరిసరం యొక్క ప్రభావానికి మాత్రమే లోనైయుంటాడు. అతడు తనకు ఏమి సృష్టించుకొనియుంటాడో దానియంతటి క్రింద తప్పక రెండింతలు బాధపడవలసియుంటుంది.

ఈ కారణంగా ఆరోహణ అప్పుడు శరీరంలో ఉన్నప్పటికంటే చాలా కష్టంగా ఉంటుంది. కేవలం భౌతికశరీరం యొక్క రక్షణ మాత్రమే ఇక్కడ మంచి ప్రక్కన చెడు సంచరించుటకు వీలుకలుగజేస్తుంది, ఎందుకంటే … భౌతిక జీవితం ఒక పాఠశాలయైయున్నది. ఇక్కడ ప్రతి “అహానికి” దాని స్వతంత్ర సంకల్పం ప్రకారం అభివృద్ధి చెందుటకు అవకాశం కల్పించబడింది.

అందువల్ల ఎట్టకేలకు మిమ్ములను సిద్ధపరచుకోండి! ప్రతి ఆలోచన యొక్క ఫలము మీపై తిరిగిపడుతుంది, ఇక్కడైనా లేక అక్కడైనా, మీరు దానిని అనుభవించవలసియుంటుంది! ఏ మనిషి కూడా ఈ వాస్తవమునుండి తప్పించుకోలేడు!

ఈ వాస్తవం ఎదుట నిప్పుకోడివలే పిరికిగా మి తలను ఇసుకలో దూర్చుటకు ప్రయత్నిస్తే మీకేమి లాభం? వాస్తవాలను ధైర్యంగా ఎదిరించండి! తద్వారా మీరు దానిని మీకు కేవలం సులభం చేసుకొంటారు; కాగా పురోగతి ఇక్కడ మరింత వేగంగా జరుగుతుంది.

మొదలుపెట్టండి! కాని పాతదంతయూ తప్పక ప్రాయశ్చిత్తం చేయబడవలెనని గుర్తుంచుకోండి. చాలామంది బుద్ధిలేని వారివలే ఆపై అదృష్టం వరిస్తుందని ఆశపడకండి. బహుశా మీలో చాలమంది ఒక పెద్ద గొలుసును ప్రాయశ్చిత్తం చేయవలసియుందేమో. కాని ఎవడు అందువల్ల అధైర్యపడతాడో, వాడు తనకు తాను నష్టం చేసుకొంటాడు, ఎందుకంటే అది వానికి తప్పదు మరియు అది వానినుండి తీసివేయబడజాలదు. ఆలస్యంచేయుట ద్వారా వాడు సమస్తాన్ని మరింత కష్టతరంగా, బహుశా చాలాకాలంవరకు అసాధ్యంగా చేసుకొంటాడు.

ఇది అతనికి, ఒక్క గంట కూడా వ్యర్థం చేయకుండా ఉండుటకు ప్రోత్సాహాన్ని ఇవ్వవలెను; కాగా ఈ మొదటి అడుగుతోనే అతడు అసలు జీవించుటకు మొదలుపెడతాడు! ఎవడు దానిని చేయుటకు ధైర్యంచేస్తాడో వాడు ధన్యుడు, అది వానినుండి తొలగిపోతుంది, క్రమంగా లంకె వెనుక లంకె. అతి పెద్ద అంగలతో ఎగురుతూ అతడు ముందుకు దూసుకొనిపోతాడు, ప్రహర్షంతో మరియు కృతజ్ఞతతో చివరి అడ్డంకులను కూడా దాటుతాడు; కాగా అతడు స్వతంత్రుడౌతాడు!

అతని యొక్క ఇదివరకటి తప్పుడు చర్యలు అతని ఎదుట ఒక గోడవలే పేర్చిన, అతని పురోగతిని తప్పక అడ్డగించవలసిన రాళ్లు, ఇప్పుడేమీ తీసివేయబడవు, కాని దానికి వ్యతిరేకంగా అవి జాగ్రత్తగా అతని ముందు ఉంచబడతాయి, తద్వారా అతడు వాటిని గుర్తించుటకు మరియు అధిగమించుటకు. ఎందుకంటే అతడు అన్ని తప్పులకు తప్పక ప్రాయశ్చిత్తం చేయవలసియుంటుంది. అతడు కేవలం మంచి సంకల్పాన్ని కనబరచిన తక్షణమే అతని చుట్టూ ఆవరించియున్న ప్రేమను ఆశ్చర్యంతో మరియు ప్రశంసతో త్వరలోనే చూస్తాడు.

ఆ మార్గము అతనికి, ఒక తల్లి తన బిడ్డకు మొదటిసారి నడిచే ప్రయత్నాలలో చేసినట్లు, సున్నితమైన రక్షణతో, సులభతరం చేయబడుతుంది. అతని ఇదివరకటి జీవితంలో అతన్ని మౌనంగా భయపెడుతూ వణికించిన మరియు అతడు నిజానికి నిరంతరం నిద్రావస్థలోనే ఉంచగోరిన విషయాలు ఏవైనా ఉన్నట్లైతే … పూర్తిగా అనుకోకుండా అతడు వాటి ఎదుట అతిదగ్గరలో నిలుపబడతాడు!
అతడు తప్పక నిర్ణయించవలసియుంటుంది, కార్యం చేయవలసియుంటుంది. నిర్బంధించే ఘటనల ద్వారా దానిని చేయుటకు అతడు బలవంతపరచబడుట స్పష్టంగా కనబడుతుంది. మంచి సంకల్పం యొక్క విజయంపై విశ్వాసంతో మొదటి అడుగును వేయుటకు అతడు ధైర్యం చేసినట్లైతే, అప్పుడు ఆ ప్రమాదకరమైన ముడి విడిపోతుంది, అతడు దానిగుండా పోతాడు మరియు దానినుండి విముక్తిని పొందుతాడు.

కాని ఆ నింద తొలగుతుందో లేదో, అప్పుడే ఆ తదుపరిది కూడా అదే ప్రకారం ప్రాయశ్చిత్తాన్ని కోరుతూ ఏదో ఒక రూపంలో అతని చెంతకు చేరుతుంది.

అతన్ని ఇరుకులో ఉంచిన, తప్పక అణచివేసియుంచవలసిన లంకెలు ఆ విధంగా ఒకదాని వెంట ఒకటి పేలిపోతాయి. ఎంతో తేలికగా అయినట్లు అతడు అనుభూతిని పొందుతాడు! మరియు మీలో చాలామంది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అనుభవించియుండిన ఆ తేలికదనం యొక్క అనుభూతి మిథ్య కాదు, కాని అది ఒక వాస్తవం యొక్క ప్రభావమైయున్నది. ఆ విధంగా వత్తిడినుండి విముక్తిచేయబడిన ఆత్మ తేలికగా అవుతుంది మరియు ఆత్మీయ గురుత్వాకర్షణ శాసనం ప్రకారం త్వరగా ఎత్తునకు, ఎక్కడైతే అది ఇప్పుడు తన తేలికదనం ప్రకారం చెందుతుందో ఆ ప్రాంతంలోనికి పొతుంది.

ఆ విధంగా అది తప్పనిసరిగా ఎల్లప్పుడు పైకి, వాంఛించబడే వెలుగుదిశగా పోవలసియుంటుంది. చెడు సంకల్పం ఆత్మను క్రిందకు అణచివేస్తుంది మరియు దానిని బరువుగా చేస్తుంది, అయితే మంచిసంకల్పం దానిని పైకెత్తుతుంది.

యేసు మీకు దీనికొరకు కూడా సరళమైన, ఖచ్చితంగా గురియొద్దకు నడిపించే మార్గాన్ని ఎప్పుడో చూపియున్నడు; కాగా: “నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము!” అనే సరళమైన మాటలలో లోతైన సత్యం ఉన్నది.

వాటితో ఆయన స్వతంత్రతకు, ఆరోహణకు తాళంచెవిని ఇచ్చియున్నాడు! ఎందుకంటే ఇది ఖండించబడలేని వాస్తవమైయున్నది: మీరు దేనిని మీ పొరుగువానికి చేస్తారో, దానిని మీరు నిజానికి మీ కొరకే చేస్తారు! మీకొరకు మాత్రమే, కాగా సమస్తం కూడా శాశ్వతమైన శాసనాల ప్రకారం తప్పకుండా తిరిగి మీపైన పడుతుంది, మంచియైనా లేక చెడు అయినా, ఇప్పుడు ఇక్కడైనా లేక అక్కడైనా. అది తిరిగివస్తుంది! అందువల్ల మీకు దానితో, మంచి సంకల్పానికి వేయవలసిన అడుగును మీరు ఏ విధంగా గ్రహించవలసియున్నదో, అత్యంత సులువైన మార్గం ద్వారా సూచించబడింది.

మీ యొక్క నైజం ద్వారా మీరు మీ పొరుగువారికి ఇవ్వవలెను, మీ ప్రకృతి ద్వారా! అనివార్యంగా మీ డబ్బుతో లేక వస్తువులతో కాదు. అటువంటి పక్షంలో డబ్బులేనివారు ఇచ్చే అవకాశం నుండి మినహాయించబడియుంటారు కదా. మరియు ఈ నైజంలో, మీరు మీ పొరుగువానితో వ్యవహరించే ప్రక్రియలో “మిమ్ములను వారికి ఇచ్చుటలో”, అతనికి మీరు స్వచ్ఛందంగా చూపే జాగ్రత్తలో, ఇచ్చే మర్యాదలో, యేసు చెప్పియున్న ఆ “ప్రేమించుట” ఉన్నది; దానిలోనే మీరు మీ పొరుగువారికి ఇచ్చే సహాయం కూడా ఉన్నది. ఎందుకంటే, దానిద్వారా అతడు బలపడగలడు కాబట్టి, అతడు తనను మార్చుకొనుటకు మరియు తన ఎత్తులో ఇంకా పైకి ఆరోహించుటకు సమర్థుడౌతాడు.

అయితే వాటి యొక్క తిరిగివచ్చే వికిరణాలు తమ పరస్పరచర్య ద్వారా మిమ్ములను త్వరగా పైకెత్తుతాయి. వాటి ద్వారా మీరు ఎల్లప్పుడు క్రొత్తశక్తిని పొందుతారు. అప్పుడు మీరు వేగంగా ఎగురుతూ వెలుగుదిశగా పోగల్గుతారు …

“ఒకవేళ నేను సమస్తమైన పాతఅలవాట్లను మానివేసి నన్ను మార్చుకొన్నట్లైతే, నాకేమి వస్తుంది?” అని ఇంకా అడగగలిగే వారు పేద బుద్ధిహీనులు.

ఇదేమైనా ఒక వ్యాపారఒప్పందమా? వారు కేవలం మనుష్యులుగా మేలుపొందినట్లైతే, ఆ విధంగా ఉదాత్తమైన జీవులైనట్లైతే, కేవలం అదే తగిన బహుమతి. కాని అది దానికంటే అపరిమితంగా ఎక్కువయైయున్నది! నేను మరియొకసారి చెబుతున్నాను: మంచిసంకల్పాన్ని మొదలుపెట్టడంతో ప్రతివాడు, తాను తప్పక నిర్వర్తించవలసిన, ఏనాటికీ తప్పించుకొనలేని, తన ప్రాయశ్చిత్త-నిర్బంధం యొక్క అంతమునకు గీటురాయిని ఏర్పరుస్తాడు. వేరొకడెవడూ కూడా ఈ విషయంలో వానికొరకై వాని స్థానంలో నిలువలేడు.

అనగా, ఆ తీర్మానంతో అతడు ప్రాయశ్చిత్త-నిర్బంధానికి ఒక అంచనావేయగల అంతాన్ని నిర్ణయిస్తాడు. అది ఎంత అమూల్యమైనదంటే ఈలోక సమస్త ధనరాసులు దానికి సరితూగలేవు. దానితో అతడు తాను స్వయంగా నిరంతరం తయారుచేసుకొనే బానిసబంధాలనుండి తనను విడిపించుకొంటాడు. అందువల్ల, నిస్తేజపరిచే ఆ నిద్రనండి లేవండి. మేల్కొలుపును ఎట్టకేలకు రానివ్వండి!

విమోచకుని ద్వారా విముక్తి మీకు ఒక రక్షణ-పత్రం అయిందని, అందువల్ల మీరు మీ జీవితాంతం
చింతలేకుండా “స్వార్థం”లో మునిగిపోవచ్చనీ, కేవలం చివరిలో విశ్వాసులుగా మారి, వెనుదిరిగి, విమోచకునిపై మరియు ఆయన కార్యంపై విశ్వాసంతో ఈ భూమినుండి గతిస్తే సరిపోతుందనీ మీరనుకొనునట్లు చేసి, మిమ్ములను శక్తిహీనంచేస్తూ, మీకు మతిభ్రంశాన్ని కలిగించే ఆ మత్తును దూరపరచండి. దైవం నుండి అటువంటి దౌర్భాగ్యమైన, లోపభూయిష్టమైన అతుకుల కార్యాన్ని ఆశించేవారు బుద్ధిహీనులు! దాని అర్థం చెడును పోషించుటయే కదా! దాని గురించి ఆలోచించండి, మిమ్ములను స్వతంత్రించుకోండి!