కండ్లగంతలు తొలుగుతాయి మరియు నమ్మకము నిర్ధారణ అవుతుంది. నిర్ధారణలో మాత్రమే విడుదల మరియు విమోచన ఉన్నాయి!
మనస్ఫూర్తిగా అన్వేషించుచున్న వారితో మాత్రమే నేను మాత్లాడుతున్నాను. ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా పరీక్షించుటకు వారు తప్పక ఆసక్తులు మరియు సమర్థులైయుండవలెను! మతాభివేశులు మరియు మొండి మూర్ఖాభిమానులు దీనికి దూరంగా ఉండగలరు; ఎందుకంటే వారు సత్యానికి హానికరులు. ద్వేషపూరితులు, పక్షపాతులైతే ఈ వాక్యంలోనే తమ తీర్పును పొందవలెను.
ఈ సందేశము తమయందు ఇంకా సత్యపుమిణుగురును మరియు నిజంగా మనిషిగా ఉండుటకు అభిలాషను కలిగియున్నవారిని మాత్రమే తాకుతుంది. వారందరికీ అది దీపము మరియు దండము కూడా అవుతుంది. అది వారిని ప్రస్తుత సమస్త అయోమయపు అస్తవ్యస్తతనుండి నేరుగా బయటకు నడిపిస్తుంది.
ఈ క్రింది వాక్యము ఒక క్రొత్త మతాన్ని తీసుకురాదు, కాని మనస్ఫూర్తిగా వినువారందరికి లేక చదువు వారందరికి, వారు ఆకాంక్షించే ఔన్నత్యానికి నడిపించే సరియైన మార్గాన్ని కనుగొనుటకు దివిటీయై ఉండుటకు అది ఉద్దేశించబడింది.
తనను తాను చైతన్యపరచుకోనే వాడే ఆత్మీయంగా ముందుకు పోగలడు. అవివేకి, ఎవడైతే దానికొరకు ఇతరుల ద్వారా రూపొందించబడిన అభిప్రాయాలను సహాయసాధనాలుగా ఉపయోగిస్తాడో వాడు, ఒక ప్రక్క తన ఆరోగ్యవంతమైన అవయవాలు వాడుక లేకుండా ప్రక్కన ఉంచబడియుండగా, తన త్రోవపై ఊతకర్రలపై నడిచినట్లు మాత్రమే నడుస్తాడు.
కాని, అతడు తనయందు తన పిలుపుకై వేచియుంటూ నిద్రావస్థలోవున్న అన్ని సామర్థ్యాలను సాహసంతో ఒక కవచంవలే వాడిన వెంటనే తనకప్పగించిన సామర్థ్యతను తన సృష్టికర్త యొక్క చిత్తానుసారంగా అధిరోహణకై వినియోగిస్తాడు మరియు తనను మళ్ళిస్తూ తన త్రోవలో అడ్డురావాలనుకునే అన్ని అడ్డంకులను అవలీలగా దాటుతాడు.
అందువల్ల మేల్కొనండి! కేవలం నిర్ధారణలో మాత్రమే నిజమైన విశ్వాసం ఉన్నది, మరియు నిర్ధారణ విచక్షణలేకుండా సరితూచుట మరియు పరీక్షించుట ద్వారా మాత్రమే కలుగుతుంది! మీ దేవుని యొక్క అధ్భుతమైన సృష్టిలో సజీవులుగా ఉండండి!
అబ్ద్-రు-షిన్