మౌనము

క ఆలోచన ఆకస్మికంగా నీకు వస్తే, దానిని పట్టియుంచుకో, తక్షణమే దానిని బయటకు చెప్పకుండా దానిని పోషించు; కాగా మౌనంలో పట్టియుంచబడుట ద్వారా అది దట్టమౌతుంది మరియు ఎదురు-వత్తిడి ద్వారా ఆవిరివలే శక్తిని పొందుతుంది.

శాసనం ప్రకారం వత్తిడి మరియు దట్టమగుట ఎటువంటి అయస్కాంత గుణాన్ని పుట్టిస్తాయంటే, ఎక్కువ బలమైనదంతయూ బలహీనమైన దానిని తనవైపుకు ఆకర్షిస్తుంది. తద్వారా సజాతి ఆలోచనల ఆకారములు అన్ని ప్రక్కలనుండి ఆకర్షించబడతాయి, పట్టియుంచబడతాయి, స్వంత మూలాలోచన యొక్క శక్తిని క్రమంగా బలపరుస్తాయి; అయిననూ అవి ఏ విధంగా పనిచేస్తాయంటే, మొదట రూపొందించబడిన ఆకారం ఇతర ఆకారాలు దానికి తోడగుట ద్వారా పదునుపెట్టబడుతుంది, మార్పుచెందుతుంది, పరిపక్వం అగునంతవరకు మారుతున్న ఆకారాలను పొందుతుంది. దానినంతటినీ నీవు నిజానికి నీయందు అనుభవిస్తున్నావు, అయితే అది సంపూర్ణంగా నీ స్వంతమైనదని నీవు భావిస్తావు. కాని ఏ విషయంలో కూడా నీవు కేవలం నీ స్వంత సంకల్పాన్ని మాత్రమే ఇవ్వవు,
ఎల్లప్పుడు అన్యమైన దానిని దానియందు కలిగియుంటావు!

ఈ ప్రక్రియ నీకు ఏమి చెబుతుంది?

చాలా అంశాలు సంగమమగుట ద్వరా మాత్రమే ఏదైనా సంపూర్ణమైనది సృష్టించబడగలదని అది చెబుతుంది! సృష్టించబడుతుందా? అది సరియైనదా? కాదు, కాని కేవలం రూపొందించబడుతుంది! కాగా క్రొత్తగా సృష్టించుటకు ఏమియూ లేదు, అంతటిలో కేవలం క్రొత్త ఆకారాలను రూపొందించుటయే జరుగుతుంది, కాగా అన్ని అంశాలు ఈ గొప్ప సృష్టిలో ఇప్పటికే ఉనికిలో ఉన్నాయి. ఈ అంశాలు పరిపూర్ణతకు నడిపించే మార్గంకొరకు కేవలం ఉపయోగకరంగా చేయబడవలసియుంటుంది; సంగమము దానిని కలుగజేస్తుంది.

సంగమము! తేలికగా దానిని దాటిపోవద్దు, కాని పరిపక్వత మరియు సంపూర్ణత సంగమం ద్వారానే సాధ్యమగుననే ఈ భావాన్ని లోతుగా అర్థంచేసుకొనుటకు ప్రయత్నించు. ఈ వాక్యము, వెలికి తీయబడవలెనని కాంక్షించే ఒక నిధివలే సృష్టియంతటిలో నిలిచియున్నది! అది ఇచ్చుటలోనే పొందగల్గవచ్చుననే శాసనంతో సన్నిహితంగా అనుసంధించబడియున్నది! మరి ఈ వాక్యాలను సరిగా గ్రహించుటకు, అనగా వాటిని అనుభవించుటకు ఏమి అవసరమైయున్నది? ప్రేమ! అందుకే ప్రేమ అత్యున్నతమైన శక్తివలే, అపరిమితమైన అధికారంవలే గొప్ప ఉనికి యొక్క రహస్యములలో నిలిచియున్నది!

ఏ విధంగా సంగమము ఒకే ఒక్క ఆలోచనను నిర్మిస్తుందో, పదును పెట్టుతుందో మరియు రూపొందిస్తుందో, అదే విధంగా అది స్వయంగా మనిషి విషయంలోనూ మరియు సృష్టియంతటిలోనూ ఉన్నది; ఆ సృష్టి, సంకల్ప శక్తి ద్వారా కలుగజేయబడే, విడివిడిగా ఉనికిలోవున్న రూపాల యొక్క నిరంతరమైన సంగమములో, క్రొత్తరూపాలను అనుభవిస్తుంది మరియు ఆ విధంగా పరిపూర్ణతకు మార్గం అవుతుంది.

ఒక వ్యక్తి నీకు సంపూర్ణతను అందించలేడు, కాని మానవజాతి సమస్తం దానియొక్క పలురకాల ప్రత్యేక లక్షణాలలో దానిని అందించగలదు! ప్రతి వ్యక్తి కూడా సర్వానికి అనివార్యంగా చెందే ఎదో ఒక దానిని కలిగియుంటాడు. మరియు అందువలననే చాలా అభివృద్ధి చెందినవాడు, సమస్త భౌతిక కాంక్షలను ఇకపై ఎరుగనివాడు, ఒక ఒంటరి వ్యక్తిని కాదు కాని మానవజాతి మొత్తాన్ని ప్రేమిస్తాడు; కాగా సమస్త మానవాళి మాత్రమే, పరిపక్వం చెందిన అతని జీవాత్మ యొక్క, శుద్ధీకరణ ద్వారా సిద్ధపరచబడిన తీగలను మీటి, దివ్యమైన స్వరసమ్మేళనమును మ్రోగునట్లు చేయగలదు. ఆ స్వరసమ్మేళనమును అతడు తనయందు కలిగియుంటాడు, ఎందుకంటే అన్ని తీగలు కూడా మ్రోగుతాయి కాబట్టి!

ఇతర ఆకారములను తన వైపునకు ఆకర్షించిన మరియు తద్వారా అంతకంతకు బలపడిన ఆలోచన వద్దకు తిరిగిపోదాం. అది చివరకు దృఢంగా సంగమం చెందిన శక్తితరంగాలుగా నిన్ను దాటి బయటకుపోతుంది, నీ వ్యక్తిగత తేజోమండలాన్ని ఛేదిస్తుంది మరియు విశాలమైన పర్యవరణంపై ప్రభావాన్ని చూపిస్తుంది.

మానవాళి దానిని వ్యక్తి యొక్క అయస్కాంతత అని పిలుస్తుంది. తెలియనివారు “నువ్వు దేనినో ప్రసరిస్తున్నావు!” అని అంటారు. నీ ప్రత్యేక స్వభావం ప్రకారం అప్రీతికరమైన దానిని లేక ఆహ్లాదకరమైన దానిని, ఆకర్షిస్తూ లేక వికర్షిస్తూ. అది అనుభవించబడుతుంది!

కాని నువ్వు దేనినీ ప్రసరించవు! ఇతరులలో ఆ అనుభూతిని కలిగించే ప్రక్రియ తన మూలాన్ని, సమస్త ఆత్మీయ సజాతీయతను నీవు అయస్కాంతంవలే నీ యొద్దకు ఆకర్షించుటలో ఉంటుంది. ఈ ఆకర్షణ పొరుగువారికి అనుభూతిని కలుగజేస్తుంది. అయితే దీనియందు కూడా పరస్పరచర్య ఉన్నది. ఈ అనుబంధంలో పొరుగువాడు అప్పుడు స్పష్టంగా నీ శక్తి యొక్క అనుభూతిని పొందుతాడు మరియు తద్వారా “సానుభూతి” పుడుతుంది.

ఎల్లప్పుడు గుర్తుంచుకో: మన భావనల ప్రకారం, ఆత్మీయమైన సమస్తామూ అయస్కాంత గుణాన్ని కలిగియున్నది. బలమైనది ఎల్లప్పుడు బలహీనమైన దానిని ఆకర్షణ ద్వారా, లీనం చేసుకొనుట ద్వారా, అధిగమిస్తుందని నీకు కూడా తెలియును. తద్వారా “లేనివాని (బలహీనుడైనవాని) యొద్ద నుండి వానికున్న కొంచం సహితం తీసుకొనబడుతుంది.” వాడు పారాధీనుడౌతాడు.

దానిలో ఎటువంటి అన్యాయం కూడా లేదు, కాని అది దైవశాసనాల ప్రకారం జరుగుతుంది. సరిగా కాంక్షించుటకు మనిషి తనను కేవలం సిద్ధపరచుకొంటే చాలు, అతడు దానినుండి కాపాడబడతాడు.

ఇప్పుడు నీవు బహుశా ప్రశ్నిస్తావు: అందరూ బలంగా ఉండగోరినట్లైతే, ఎవనినుండి కూడా ఇకపై ఏదియూ తీసుకొనబడలేనట్లైతే అప్పుడు ఏమౌతుంది? అని. అప్పుడు ప్రియ స్నేహితుడా, కేవలం ఇచ్చుటయందు మాత్రమే పుచ్చుకొనగల్గుట ఉండుననే శాసనాన్ని తన మూలంగా కలిగియున్న ఐచ్చికమైన ఇచ్చిపుచ్చుకొనుట జరుగుతుంది.
అందువల్ల ఎటువంటి నిస్తబ్ధత ఉండదు కాని సమస్త న్యూనత తొలగించబడుతుంది.

ఈ విధంగా ఏమి జరుగుతుందంటే, సోమరితనం ద్వారా చాలామంది ఆత్మయందు పరాధీనులవుతారు, కొన్నిసార్లు చివరకు స్వంత ఆలోచనలను అభివృద్ధిచేసే సామర్థ్యతను తమలో దాదాపు లేకుండా ఉంటారు.

నొక్కిచెప్పవలసింది ఏమిటంటే, కేవలం సజాతీయమైనది మాత్రమే ఆకర్షించబడుతుంది. అందువల్లనే: “సజాతీయమైనవి ఇష్టపూర్వకంగా గుమిగూడుతాయి” అనే నానుడి పుట్టింది. ఈ ప్రకారంగా త్రాగుబోతులు ఎల్లప్పుడు కలుసుకొంటారు, ధూమపానులు పరస్పరం “సానుభూతిని” కలిగియుంటారు, కబుర్లు చెప్పేవారు, జూదరులు ఇత్యాది కూడా; అయితే ఉదాత్తులు కూడా ఉన్నతమైన లక్ష్యంకొరకు కలుస్తారు.

అయితే అది ఇంకా ముందుకు సాగుతుంది: ఆత్మీయ ఆకర్షణ చివరకు భౌతికంగా కూడా అభివ్యక్తమౌతుంది, కాగా ఆత్మీయమైనది సమస్తమూ స్థూలపదార్థతలోనికి చొచ్చుకొనివస్తుంది; దాని ద్వారా మనం తప్పక ప్రతిచర్య శాసనాన్ని గమనించవలసియుంటుంది, ఎందుకంటే, ఒక ఆలోచన ఎల్లప్పుడూ తన మూలంతో అనుబంధాన్ని ఉంచుకొంటుంది మరియు ఈ అనుబంధం ద్వారా తిరుగు-ప్రసరణను కలుగజేస్తుంది.

ఇక్కడ నేను ఎల్లప్పుడు జీవాత్మ సంబంధిత అంతఃకరణానుభూతి యొక్క జీవశక్తిని తమలో కలిగియున్న నిజమైన ఆలోచనలను గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కాని నీకు సాధనంగా అప్పజెప్పబడిన మెదుడు-పదార్థం యొక్క శక్తిని వ్యర్థంచేయుటను గురించి కాదు; అది కేవలం క్షణభంగురమైన ఆలోచనలను మాత్రమే రూపొందిస్తుంది, అవి వ్యగ్రమైన గందరగోళంలో కేవలం ఆవిరి క్రీనీడలవలే తమను కనబరచుకొంటాయి మరియు అదృష్టవశాత్తు చాలా త్వరగా చెదిరిపోతాయి. అటువంటి ఆలోచనలు కేవలం నీ సమయాన్ని మరియు శక్తిని వ్యర్థంచేస్తాయి, మరియు దానితో నీవు నీకు అప్పగించబడిన ఆస్తిని వృధాచేస్తావు.

ఉదాహరణకు నీవు ఏదో ఒకదాని గురించి తీక్షణంగా ఆలోచించినచో, ఆ ఆలోచన నీలోపల, మౌనం యొక్క శక్తి ద్వారా బలమైన అయస్కాంతతను పొందుతుంది, తనను పోలిన దానినంతటినీ తనవైపుకు ఆకర్షిస్తుంది మరియు ఆ విధంగా ఫలదీకరణం చెందుతుంది. అది పరిపక్వం చెందుతుంది మరియు సాధారణమైన ఎల్లలను దాటి బయటకు పోతుంది, తద్వారా ఇతర క్షేత్రాలలోనికి సహితం చొచ్చుకొనిపోతుంది, మరియు అక్కడినుండి మరింత ఉన్నతమైన ఆలోచనలను పొందుతుంది … స్ఫూర్తిని! అందువల్ల, సోదె ప్రక్రియకు వ్యతిరేకంగా, స్ఫూర్తి విషయంలో మౌళిక ఆలోచన తప్పనిసరిగా నీనుండే వెలువడవలసియుంటుంది మరియు అది ఆవలిలోకానికి, ఆత్మీయ లోకానికి, ఒక వంతెనను తప్పక కట్టవలసియుంటుంది, తద్వారా అక్కడ స్పృహతో ఒక ఊటనుండి తోడుకొనుటకు.

స్ఫూర్తికి అందువల్ల సోదెచెప్పే ప్రక్రియతో ఎటువంటి సంబంధం లేదు.

ఆ విధంగా ఆలోచన నీయందు పరిపక్వం చేయబడుతుంది. నీవు దానిని నెరవేర్చుటకు పూనుకొంటావు మరియు లెక్కించలేనన్ని అంశములలో అప్పటికే ఆలోచనరూపాలుగా విశ్వంలో తేలియాడుచుండిన దానిని నీ శక్తి ద్వారా దట్టంగాచేసి నెరవేరుస్తావు.

ఈ విధంగా నీవు, ఆత్మీయంగా ఎప్పటినుండో ఉనికిలోవున్నదానితో, సంగమం ద్వారా మరియు దట్టంచేయుట ద్వారా, ఒక క్రొత్త రూపాన్ని ఉత్పత్తిచేస్తావు. ఆ విధంగా సృష్టియంతటా ఎల్లప్పుడు కేవలం రూపాలు మాత్రమే మారుతాయి, ఎందుకంటే ఇతరమైనదంతయూ శాశ్వతమైనది మరియు నశింపజేయరానిదైయున్నది.

అస్తవ్యస్తమైన ఆలోచనల గురించి, ఆలోచనప్రక్రియలో సమస్త లోతులేనితనం గురించి జాగ్రత్తగా ఉండు. అజాగ్రత్తత యొక్క ఫలితం చాలా చేదుగా ఉంటుంది; కాగా అది నిన్ను త్వరగా పరప్రభావాలకు ఆటస్థలంగా దిగజారుస్తుంది, తద్వారా నీవు అతితేలికగా చిరచిరలాడుతూ, చిత్తవికారంతో ఉంటావు మరియు నీకు చేరువలోవున్న పరిసరంపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తావు.

ఒకవేళ నీవు ఒక నిజమైన ఆలోచనను కలిగియున్నట్లైతే మరియు దానిని బలంగా పట్టుకొని ఉండినట్లైతే, తద్వారా జమకూడిన శక్తి చివరకు నెరవేర్పుకు కూడా తప్పనిసరిగా వత్తిడిచేస్తుంది; కాగా అన్నింటి యొక్క పరిణతి పూర్తిగా ఆత్మీయంగా జరుగుతుంది, ఎందుకంటే ప్రతియొక్క శక్తి కేవలం ఆత్మీయమైనది కాబట్టి! ఏవి నీకు అప్పుడు కనబడతాయో, అవి ఎల్లప్పుడూ కూడా అంతకుముందే జరిగిన ఆత్మీయ-అయస్కాంత ప్రక్రియల యొక్క చివరి ప్రభావాలై మాత్రమే ఉంటాయి. స్థిరంగా నిలిచియున్న క్రమం ప్రకారంగా అవి ఎల్లప్పుడూ ఏకరీతిగా జరుగుతాయి.

నీ ఆలోచనలను మరియు అనుభూతులను నీవు గమనించినట్లైతే త్వరలోనే నీకు, వాస్తవమైన
సమస్త జీవితం కేవలం ఆత్మీయమైనదై మాత్రమే ఉండగలదని, ఆ ఒక్కదానిలో మాత్రమే మూలం మరియు అభివృద్ధి ఉన్నవి అనే విషయాలకు రుజువు దొరుకుతుంది. నీవు వేటిని భౌతికకళ్లతో చూస్తావో అవియన్నియూ వాస్తవానికి నిరంతరం పనిచేసే ఆత్మ యొక్క ప్రభావాలు మాత్రమే అని నీకు తప్పక నిర్ధారణ కలుగవలసియుంటుంది.

ప్రతి కార్యము, మనిషి యొక్క అతిచిన్న కదలిక కూడా, నిజానికి ఎల్లప్పుడూ ముందుగా ఆత్మీయంగా సంకల్పించబడియుంటుంది. శరీరాలు ఇక్కడ కేవలం ఆత్మీయంగా సజీవపరచబడిన సాధనాలుగా మాత్రమే పనిచేస్తాయి. స్వయంగా అవి కూడా మొదట ఆత్మ యొక్క శక్తి ద్వారా సాంద్రతను పొందియున్నవి. అదే విధంగా చెట్లు, రాళ్ళు మరియు భూమి సమస్తం కూడా. సమస్తం కూడా సృజనాత్మకమైన ఆత్మ ద్వారా ఉత్తేజపరచబడుతుంది, సమస్తం గుండా అది ప్రవహిస్తుంది, సమస్తమూ దాని ద్వారా నడిపించబడుతుంది.

అయితే ఈ సమస్త పదార్థం, అనగా భూలోకరీత్యా కనబడేదంతా, కేవలం ఆత్మీయ జీవితం యొక్క పర్యవసానమైనందువల్ల, అత్యంత సమీపంలో మన చుట్టూవున్న ఆత్మీయ జీవితం యొక్క స్వభావం ప్రకారమే మన భూలోక పరిస్థితులు కూడా రూపొందుతాయిని గ్రహించుట నీకు కష్టం కాదు. తత్ఫలితంగా తార్కికంగా దానిలోనుండి ఏది నిర్ధారణ అవుతుందో అది స్పష్టమైన విషయమే: మనిషికి ఈ సృష్టి యొక్క జ్ఞానవంతమైన వ్యవస్థీకరణ ద్వారా, తన పరిస్థితులను సృష్టికర్త యొక్క శక్తితో, స్వయంగా రూపొందించుకొనుటకు శక్తి ఇవ్వబడింది. అతడు దానిని మంచికొరకు మాత్రమే వాడినప్పుడు, అతనికి ధన్యత కలుగుతుంది! కాని అతడు దానిని చెడుకొరకు వాడుటకు తనను ప్రలోభపెట్టబడనిచ్చినట్లైతే అతనికి శ్రమ కలుగుతుంది!

మనుష్యుల ఆత్మ ఐహికేచ్ఛ ద్వారా కేవలం పరివేష్టించబడుతుంది మరియు నల్లబడుతుంది, అది మష్టువలే దానికి అంటుకొనియుంటుంది, దానిపై భారం వేస్తుంది మరియు దానిని క్రిందకు లాగుతుంది. అయితే అతని ఆలోచనలు ఆత్మ యొక్క శక్తిని కలిగియున్న సంకల్ప-కార్యములు. మనిషి మంచిగా లేక చెడుగా ఆలోచించుటకు నిర్ణయం తీసుకోగలడు, మరియు తద్వారా దైవశక్తిని మంచికి అదే విధంగా చెడుకు మళ్లించగలడు! దానిలోనే మనిషి వహించే బాధ్యత ఉన్నది; కాగా దాని యొక్క బహుమానం లేక శిక్ష అనివార్యమైనది, ఎందుకంటే సమస్త ఆలోచనల యొక్క ఫలితాలు, కార్యశీలమౌతున్న, ఎప్పటికీ విఫలంకాని పర్పరచర్య ద్వారా ప్రారంభస్థానికి తిరిగివస్తాయి; మరియు ఆ పరస్పరచర్య ఆ విషయంలో అచంచలమైనది, అందువల్ల కరుణలేనిదైయున్నది. తద్వారా అది అక్షయమైనది, కఠినమైనది, న్యాయమైనది కూడా! దేవుని గురించి కూడా మనుష్యులు దానినే అనరా?

ఒకవేళ చాలామంది మతవిరోధులు దైవతను గురించి నేడు ఏమీ పట్టించుకొనగోరనట్లైతే, అది అంతయూ నేను వివరించిన యథార్థాలలో దేనినీ మార్చలేదు. ప్రజలు కేవలం “దేవుడు” అనే చిన్న పదాన్ని వదిలివేసి శాస్త్రాలలో పట్టుదలతో లోతుగా వెదికినట్లైతే, సరిగ్గా దానినే వారు కనుగొంటారు, అది కేవలం వేరే మాటలలో వివరించబడియుంటుంది. మరి ఇంకా దానిని గురించి వాదించుట హాస్యాస్పదం కాదా?

ప్రకృతి శాసనాలను ఏ మనిషి కూడా తప్పించుకొనలేడు, ఎవడూ వాటికి ఎదురీదలేడు. ప్రకృతి శాసనాలను నడిపే ఆ శక్తి దేవుడైయున్నాడు; ఆ శక్తిని ఇంతవరకూ ఎవ్వరూ గ్రహించలేదు, ఎవ్వరూ చూడలేదు, కాని దాని ప్రభావాలను ప్రతివాడు ప్రతిదినము, ప్రతిగంటలో, నిజానికి ప్రతిక్షణము యొక్క భాగాలలో సహితం తప్పక చూడవలసియుంటుంది, అంతఃకరణంలో గ్రహించవలసియుంటుంది మరియు గమనించవలసియుంటుంది; అతడు కేవలం చూడగోరినట్లైతే, తనయందు, ప్రతి జంతువులొ, ప్రతి చెట్టులో, ప్రతి పూవులో, ఆకు యొక్క ప్రతి నార వెలుగులోనికి వచ్చుటకు ఉబ్బుతూ తొడుగును చీల్చినప్పుడు చూస్తాడు.

ప్రతివాడు, స్వయంగా ఈ మొండిగా నిరాకరించేవారు కూడా, ఈ శక్తి యొక్క ఉనికిని ధృవీకరిస్తున్నప్పుడు, గుర్తించుచున్నప్పుడు దానిని మొండిపట్టుతో వ్యతిరేకించుట గ్రుడ్డితనం కాదా? గుర్తించబడిన ఈ శక్తిని దేవుడు అని పిలుచుటకు వారిని ఏమి అడ్డుకొంటున్నది? అదేమైనా పిల్లతనపు మంకుపట్టా? లేక అది, దేని ఉనికి వారికి ఏనాటినుండో స్పష్టమైయున్నా దానిని తాము ఇంతకాలం మొండిపట్టుతో నిరాకరించుటకు ప్రయత్నించామని తప్పనిసరిగా ఒప్పుకొనుటకు వారికి కలిగే ఒక రకమైన సిగ్గా?

బహుశా వీటిలో ఏది కూడా కాకపోవచ్చు. మానవాళికి చాలా ప్రక్కలనుండి చూపబడుతున్న దైవత యొక్క వ్యంగ్యచిత్రాలు, వేటిని అది జాగ్రత్తగా పరీక్షించి
అంగీకరించలేకపోతుందో అవి, దానికి కారణమైయుండవచ్చు. సమస్తమును ఆవరించియున్న మరియు సమస్తం ద్వారా చొచ్చుకొనిపోయే దైవత యొక్క శక్తిని ఒక చిత్రంలో ఇముడ్చుటకు ప్రయత్నించినప్పుడు అది తప్పక కించపరచబడుతుంది మరియు అగౌరవపరచబడుతుంది కదా!

లోతుగా ఆలోచించినట్లైతే, ఏ చిత్రం కూడా దానితో సమతులితం చేయబడలేదు! కేవలం ప్రతి మనిషి దేవుని గురించిన ఊహను తనయందు కలిగియున్నందువల్లనే, ఆ గొప్ప, గ్రహింపశక్యంకాని, అతనిని సృష్టించిన, అతనిని నడుపుతున్న శక్తిని కించపరచుటను అతడు అనుమానంతో వ్యతిరేకిస్తాడు.

చాలా తరచుగా, తమ అంతరంగంలో సజీవంగావున్న నిశ్చయత్వానికి వ్యతిరేకంగా జరిపే తమ పోరాటంలో, ప్రతి హద్దును దాటుటకు ప్రయత్నించే చాలామంది విషయంలో పిడివాదమే దానికి కారణమైయున్నది.

అయితే, ఆత్మీయ చైతన్యం కలిగే ఘడియ ఎంతోదూరం లేదు! దానిలో విమోచకుని మాటలు సరిగా వివరించబడతాయి మరియు ఆయన యొక్క గొప్ప విమోచనకార్యం సరిగా గ్రహించబడుతుంది. కాగా క్రీస్తు సత్యమునకు మార్గాన్ని సూచించుట ద్వారా, మానఫునిగా వెలుగు ఉన్నతమునకు మార్గాన్ని చూపుట ద్వారా, చీకటిలోనుండి విముక్తిని తెచ్చాడు! మరియు సిలువపై కార్చిన తన రక్తంతో ఆయన తన నిర్ధారణపై ముద్రను వేశాడు!

సత్యం ఆనాడు ఎట్లు ఉండిందో, ఈనాడు ఎట్లు ఉన్నదో, మరియు రాబోయే పదివేల సంవత్సరాలలో కూడా ఎట్లు ఉండబోతుందో అట్లే తప్ప ఏనాడూ అది వేరుగా ఉండియుండలేదు; కాగా అది శాశ్వతమైనది!

అందువల్ల సమస్త సృష్టి యొక్క గొప్ప పుస్తకంలో ఉన్నట్టి శాసనాలను తెలుసుకోండి. వాటికి లోబడుట అనగా: దేవున్ని ప్రేమించుటయే! కాగా నీవు తద్వారా అనుస్వరతలో ఎటువంటి అపశృతిని తేవు, కాని మ్రోగుతున్న శృతి సంపూర్ణ ఘనతలో మ్రోగుటకు తోడ్పడతావు.

నువ్వు: నేను ఉనికిలోవున్న ప్రకృతిశాసనాలకు స్వచ్ఛందంగా లోబడతాను, ఎందుకంటే అది నా మేలుకొరకే అన్ననూ, లేక: నేను ప్రకృతిశాసనాలలో వ్యక్తమయ్యే దేవుని చిత్తాన్ని అనుసరిస్తాను అన్ననూ, లేక: ప్రకృతిశాసనాలను నడిపించే గ్రహింపశక్యం కాని శక్తిని నేను అనుసరిస్తాను అన్ననూ … దాని ప్రభావంలో ఏమైనా తేడా ఉంటుందా? శక్తి ఉనికిలో ఉన్నది మరియు నీవు దానిని గుర్తిస్తున్నావు. దానిని నీవు అనివార్యంగా గుర్తించవలసియుంటుంది, ఎందుకంటే నీవు కొద్దిగా ఆలోచించిన వెంటనే నీకు అది తప్ప గత్యంతరం ఉండదు … మరియు దానితో నీవు నీ దేవున్ని, సృష్టికర్తను గుర్తిస్తావు!

మరియు ఈ శక్తి ఆలోచించునప్పుడు కూడా నీయందు పనిచేస్తుంది! అందువల్ల దానిని నీవు చెడుకొరకు దుర్వినియోగం చేయవద్దు, కాని మంచినే ఆలోచించు! ఎప్పటికీ మరువవద్దు: ఆలోచనలను ఉత్పత్తి చేస్తున్నప్పుడు నీవు దైవశక్తిని ఉపయోగిస్తావు, దానితో అత్యంత స్వచ్ఛమైన దానిని, అత్యున్నతమైన దానిని సాధించుటకు నీవు సమర్థతను కలిగియున్నావు!

ఈ విషయంలో ఎప్పటికీ మరువకుండా ఉండుటకు ప్రయత్నించు, మంచిలోనూ మరియు చెడులోనూ, నీ ఆలోచనల యొక్క సమస్తమైన పరిణామాలు, వాటి శక్తికి, పరిమాణానికి మరియు ఆలోచనల ప్రభావం యొక్క పరిమితికి అనుగుణంగా ఎల్లప్పుడూ నీపై తిరిగిపడతాయని.

అయితే ఆలోచన ఆత్మీయమైనది కాబట్టి, పరిణామాలు ఆత్మీయంగా తిరిగివస్తాయి. అందువల్ల అవి ఈ భూమిపైన కాని లేక నీవు గతించిన తరువాత ఆత్మికతలో కాని, అంతరం లేకుండా నిన్ను తాకుతాయి. అవి ఆత్మీయమైనవి కాబట్టి పద్దార్థతకు కట్టుబడియుండవు కూడా. దాని ఫలితం ఏమిటంటే, శరీరం యొక్క క్షయము పరిణామాలను రద్దుచేయదు! ప్రతిచర్య ప్రభావంలో ప్రతిఫలం తప్పకుండా వస్తుంది, త్వరలోనైనా లేక ఆలస్యంగానైనా, ఇక్కడైనా లేక అక్కడైనా, ఖచ్చితంగా.

ఆత్మీయమైన బంధం నీ సమస్త కార్యములతో స్థిరంగా నిలిచియుంటుంది; కాగా భౌతికతకు, పదార్థతకు సంబంధించిన కార్యములు కూడా సృజనాత్మకమైన ఆలోచనల ద్వారా ఆత్మీయమైన మూలాన్ని కలిగియున్నవి. భౌతికమైన సమస్తమూ గతించినప్పటికీ, అవి ఇంకా ఉనికిలోనే ఉంటాయి. అందువల్ల: “ప్రతిచర్య-ప్రభావాన్ని అనుభవించుట ద్వారా నీకు విడుదల కలుగనంతవరకు నీ కార్యములు నీకొరకు వేచియుంటాయి” అనే మాట సరియైనది.

ప్రతిచర్య కలుగునప్పుడు నీవు ఇంకా ఈ భూమిపై ఉన్నా లేక తిరిగి ఇక్కడ ఉన్నా, ఆత్మీయతనుండి వచ్చే పరిణామాల యొక్క శక్తి అప్పుడు దాని రకము ప్రకారంగా మంచిలోనూ అదే విధంగా చెడులోనూ, పరిస్థితుల ద్వారా కాని, నీ పరిసరాల ద్వారా కాని లేక నేరుగా నీపై కాని, నీ శరీరంపై కాని పనిచేస్తుంది.

ఇక్కడ
మరియొకసారి అతి ప్రత్యేకంగా సూచించబడవలసింది ఏమిటంటే: నిజమైన అసలైన జీవితము ఆత్మీయంగా సాగుతుంది! మరియు అది సమయాన్ని కానీ స్థలాన్ని కానీ ఎరుగదు, అందువల్ల ఎటువంటి విభజనను కూడా. అది భూలోక భావనలకు అతీతమైనది. ఈ కారణంగా పరిణామాలు నీవు ఎక్కడ ఉన్నా, శాశ్వతమైన శాసనం ప్రకారం, పర్యవసానం తన ప్రారంభస్థానానికి ఎప్పుడు తిరిగివస్తుందో అదే సమయానికి నిన్ను తాకుతాయి. ఈ ప్రక్రియలో ఏది కూడా తప్పిపోదు, అది ఖచ్చితంగా వస్తుంది.

ఇప్పుడు ఇది, ఇప్పటికే ఎన్నోసార్లు వేయబడిన ఈ ప్రశ్నకు జవాబును కూడా ఇస్తుంది: ఎందువల్ల ప్రత్యక్షంగా మంచివారైన మనుష్యులు కొన్నిసార్లు భౌతికజీవితంలో చాలా బాధపడవలసియుంటుంది, తద్వారా అది అన్యాయంవలే పరిగణించబడుటకు? అవి వారిని అనివార్యంగా మొత్తవలసిన పరిణామాలు!

ఇప్పుడు నీవు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఎరిగియున్నావు; కాగా నీ యొక్క సంబంధిత భౌతికశరీరం ఈ విషయంలో ఎటువంటి పాత్రనూ పోషించదు. నీ శరీరం వ్యక్తిగతంగా నువ్వు కాదు కదా. అది నీ యొక్క సంపూర్ణమైన “అహం” కాదు, కాని ఒక సాధనమైయున్నది. దానిని నీవే ఎన్నుకొనియుంటావు లేక ఆత్మీయ జీవితం యొక్క ఉనికిలోవున్న శాసనాల ప్రకారం, దానిని నీవు తప్పనిసరిగా తీసుకొనవలసియుండెను. ఆ శాసనాలను నీవు, అవి నీకు ఆ విధంగా మెరుగుగా అర్థమైనట్లైతే, విశ్వశాసనాలని కూడా పిలువవచ్చు. ఆ సంబంధిత భౌతికజీవితం నీ యొక్క అసలైన ఉనికిలో కేవలం ఒక కురచదైన మనుగడయైయున్నది.

ఒకవేళ తప్పించుకొనుటకు వీలుకాకుండినట్లైతే, ఎటువంటి శక్తి కూడా కాపాడుతూ దానికి వ్యతిరేకంగా పనిచేయకపోయినట్లైతే, అది ఒక కృంగదీసే ఆలోచన. ఆత్మీయతకు మేల్కొన్నప్పుడు ఎంతమంది అప్పుడు తప్పక నిరాశపడియుంటారో మరియు పాతపద్ధతిలొ ఇంకా నిద్రించుటయే మేలని కోరుకొనియుంటారో. కాని వారికి తెలియదు, వారి కొరకై ఇంకా ఏమి వేచియున్నదో, గతించిన కాలంలోనుండి తిరిగివచ్చే పరిణామాల రూపంలో ఇంకా వారిని ఏది తగలబోతుందో! లేక మనుష్యులు అన్నట్లు: “దేనిని వారు ఇంకా సరిదిద్దవలసియున్నదో”.

కాని ఆందోళనపడవద్దు! ఈ గొప్ప సృష్టి యొక్క జ్ఞానవంతమైన వ్యవస్థీకరణలో, నీవు మేల్కొన్నప్పుడు నీకు ఒక మార్గం చూపబడింది, మంచి సంకల్పం యొక్క శక్తి ద్వారా. దానిని నేను ఇంతకు మునుపే చాలా ప్రత్యేకంగా సూచించియున్నాను. అది కార్యరూపమౌతున్న కర్మ యొక్క అపాయముల తీవ్రతను తగ్గిస్తుంది లేక వాటిని పూర్తిగా ప్రక్కకు నెట్టివేస్తుంది.

దానిని కూడా తండ్రి ఆత్మ నీ చేతిలో ఉంచింది. మంచి సంకల్పం యొక్క శక్తి నీచుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. అది తోసుకొనివచ్చే అనర్థాన్ని విచ్ఛిన్నంచేయుటకు సామర్థ్యాన్ని కలిగియుంటుంది లేక కనీసం దాని తీవ్రతను అతి ఎక్కువ మోతాదులో తగ్గిస్తుంది, సరిగ్గా వాయుమండలం భూమిని కూడా కాపాడినట్లుగా.

అయితే మంచి సంకల్పం యొక్క శక్తి, ఆ బలమైన రక్షణ, మౌనం యొక్క ప్రభావం ద్వారా పెంపొందించబడుతుంది మరియు ప్రోత్సాహించబడుతుంది.

అందువల్ల అన్వేషకులారా నేను మీకు మరియొకసారి అత్యవసరంగా ఉద్బోధించుచున్నాను:

“మీ ఆలోచనల అంతికను స్వచ్ఛంగా ఉంచుకోండి మరియు ఆ ప్రకారంగా అన్నింటికంటే ముందుగా, మీరు ఆరోహించగోరినట్లైతే, మౌనం యొక్క గొప్ప శక్తిని అభ్యాసం చేయండి.”

తండ్రి సమస్తం కొరకు శక్తిని ఇప్పటికే మీయందు ఉంచాడు! మీరు దానిని కేవలం ఉపయోగించవలసియుంటుంది!