నా వాక్యమును మీలో సజీవం కానివ్వండి; కాగా అది మాత్రమే మీ ఆత్మను దేవుని నిత్యమైన ఉద్యానవనముల యొక్క వెలుగు-ఔన్నత్యములకు ఎత్తగల్గుటకు, ఏ ప్రయోజనం మీకు అవసరమైయున్నదో దానిని మీకు చేకూరుస్తుంది.
వాక్యమును గురించి తెలుసుకొనుట ఏమాత్రమూ సహాయపడదు! మీరు నేర్చుకొనుటకూ, మీ తోటిమనుష్యులకు నేర్పుటకూ, నా సందేశం మొత్తాన్ని కంఠపాఠంగా వాక్యానికి వాక్యం చెప్పగల్గినా … మీరు నా వాక్యం ప్రకారంగా నడుచుకోనట్లైతే, దాని ప్రకారం ఆలోచించనట్లైతే మరియు మీ సంపూర్ణ భౌతికజీవితాన్ని ఆ వాక్యానికి అనుగుణంగా మలచుకోనట్లైతే, అనగా
అది మీకు సహజసిద్ధమై మీ నరనరాల్లో జీర్ణించుకొన్నదై మీనుండి విడదీయరానిదై ఉండనట్లైతే, అది మీకు సహాయపడదు. అప్పుడు మాత్రమే మీరు నా సందేశంలోనుండి, మీ కొరకై అది తనలో కలిగియున్న నిత్యమైన విలువలను సంగ్రహించగలరు.
వారి కృత్యముల ద్వారా వారిని మీరు గుర్తించవలెను!” క్రీస్తు యొక్క ఈ వాక్యం మొదటిగా నా సందేశమును చదివేవారికే ఉద్దేశించబడియున్నది! వారి కృత్యముల ద్వారా అంటే, వారి కలాపంలో, అదే విధంగా వారి ఆలోచనాసరళిలో, వారి భూలోకమనుగడలో వారు అనుదినం చేసేవాటిలో! మీ కృత్యాలకు మీ చర్యలేగాక, మీ మాటలు కూడా చెందుతాయి; కాగా మాట్లాడుట కూడా ఒక చర్యయైయున్నది, దాని ఫలితాన్ని మీరు ఇంతవరకు తక్కువగా అంచనావేశారు. ఆలోచనలు సహితం దానికి చెందినవే.
ఆలోచనలు “సుంకము లేనివి” అనుట మనుష్యులకు అలవాటు. అవి మనుష్యుల చేతులకు అందని స్థాయిలో ఉన్నవి కాబట్టి వాటికి భౌతికంగా తమను జవాబుదారులుగా చేయుటకు వీలుపడదని దానితో వారు సూచించగోరుతున్నారు.
అందుచేత వారు అత్యంత అజాగ్రత్తతో తరచుగా వాటితో ఆడుతుంటారు, మరింత స్పష్టంగా చెప్పాలంటే, వారు ఆలోచనల యందు ఆడుతుంటారు. దురదృష్టవశాత్తు అది, ఎటువంటి నష్టం లేకుండా దానినుండి తాము బయటపడగలమనే అలక్ష్యంతోకూడిన భ్రమలో, వారు తరచుగా ఆడే చాలా ప్రమాదకరమైన ఆట.
కాని ఆ విషయంలో వారు పొరబడుతున్నారు; కాగా ఆలోచనలు కూడా స్థూలపదార్థలోకానికి చెందినవి మరియు ఎట్టి పరిస్థితులలో తప్పక దానిలోనే విమోచించబడవలసియుంటుంది, అనగా, ఆత్మ భౌతికశరీరంతో తనకున్న అనుబంధాన్ని తెంపివేసిన తరువాత అది ఊర్ధ్వమునకు స్వేచ్ఛగా ఆరోహించే సామర్థ్యాన్ని పొందకమునుపే.
అందువల్ల మీ ఆలోచనలతో సహితం ఎల్లప్పుడూ నా సందేశం యొక్క భావం ప్రకారం ప్రకంపించుటకు ప్రయత్నించండి, ఏ విధంగానంటే, ఎవరూ చూడరని, వినరని భ్రమిస్తూ అధోగతికి దిగజారకుండా, కేవలం ఉదాత్తతను మాత్రమే కాంక్షిస్తూ.
ఆలోచనలు, మాటలు మరియు బాహ్యకృత్యము అన్నియూ ఈ సృష్టి యొక్క స్థూలపదార్థరాజ్యానికి చెందినవి!
ఆలోచనలు సూక్ష్మ-స్థూలపదార్థంలోనూ, మాటలు మధ్య-స్థూలపదార్థంలోనూ పనిచేస్తాయి మరియు బాహ్యకృత్యములన్నీ అత్యంత-స్థూల, అనగా అత్యంత-సాంద్ర స్థూలపదార్థంలో రూపాన్ని సంతరించుకొంటాయి. మీ యొక్క ఈ మూడు రకాల కృత్యాలు స్థూలపదార్థానికి చెందినవైయున్నాయి!
కాని మొత్తం మూడింటి రూపాలు కూడా ఒకదానితోనొకటి దగ్గరగా ముడివేయబడియున్నాయి, వాటి పర్యవసానాలు ఒకదానితో ఒకటి అల్లుకొని ఉంటాయి. మీకు దాని అర్థం ఏమితో, అది ఎంత తీవ్రమైన ఫలితాలిస్తూ తరచుగా నిర్ణయాత్మకంగా మీ ఉనికి యొక్క గమనంలో ప్రభావం చూపుతుందో, మీరు మొదటి క్షణంలో అంచనావేయలేరు.
ఈ క్రింది విషయాన్ని తప్ప వేరొకదానిని అది తెలుపదు. అదేమిటంటే, ఒక ఆలోచన కూడా స్వయంచాలకంగా తన స్వభావంలో చర్యను ఇంకా కొనసాగిస్తూ, మధ్య పదార్థలోకంలో ఒక సజాతీయతను బలపరచగలదు మరియు తద్వారా మరింత బలిష్టమైన రూపాలను ఉద్భవింపజేయగలదు. అదే విధంగా, తదుపరి అంశంగా అది, బలపరచడంలో మరల ముందుకు సాగుతూ, అతిస్థూల పదార్థలోకంలో ప్రత్యక్షంగా క్రియాశీలమయ్యే రూపంగా ఉద్భవిస్తుంది, బయటకు మీ వ్యక్తిగతమైన ప్రత్యక్షజోక్యం లేనట్టుగా కనిపిస్తూనే.
భూలోకమనుష్యుల యొక్క ఆలోచనలో అల్పత్వాన్ని మరియు అజాగ్రత్తను ఎరిగినప్పుడు, దీనిని గురించి తెలుసుకొనుట వణుకు పుట్టిస్తుంది.
ఈ విధంగా మీరు, మీకు తెలియకుండానే, మీ తోటిమనుష్యులలో ఎవరో ఒకరు చేసే ఎన్నో కార్యాలలో పాలుపంచుకొంటారు, కేవలం అతడు, నా ద్వారా ఇప్పుడే వివరించబడిన విధంగా, అదనపు బలాన్ని పొందుటవల్ల. అది అతనిలో ఇంతవరకు నిద్రాణంలోవున్న, ఇంతకు మునుపు అతడు సతతం తన ఆలోచనలలో కేవలం ఆడుకుంటూ ఉండినదాన్ని, అతిస్థూలంగా నెరవేర్చుటను ప్రేరేపింపజేయుటకు సామర్థ్యాన్ని పొందింది.
ఆ విధంగా చాలామంది మనుష్యులు తమ తోటిమనుష్యులలో ఎవరో ఒకరు చేసే ఏదో ఒక కార్యాన్ని తరచుగా తిరస్కరిస్తూ దాన్ని కోపంతో నిరాకరిస్తారు, ఖండిస్తారు, కాని దేవుని నిత్యమైన శాసనాల ఎదుట దానిలో వారు కూడా సహబాధ్యులై ఉంటారు! ఈ విషయంలో, ఆ పొరుగువాడు పూర్తిగా అపరిచితుడైయుండవచ్చు మరియు ఆ కార్యం వారు అతిస్థూలపదార్థతలో ఎన్నడూ చేసియుండబోనిదై ఉండవచ్చు.
అటువంటి సంఘటనలను గురించి లోతుగా ఆలోచించండి, అప్పుడు మాత్రమే మీరు నిజంగా అర్థం చేసుకొంటారు, ఎందువల్ల
నేను నా సందేశంలో “మీ ఆలోచనల అంతికను స్వచ్ఛంగా ఉంచుకోండి, తద్వారా మీరు శాంతిని కలుగజేస్తారు మరియు సంతోషిస్తారు!” అని మీకు పిలుపునిస్తున్నానో.
ఎప్పుడు మీరు మీ స్వీయ ప్రక్షాళనలో తగినంత బలిష్టులౌతారో అప్పుడు భూమిపై, తమకు తెలియకుండానే చాలామంది సహనేరస్తులైయుండిన చాలా రకాల నేరాలు ఇంతవరకు జరిగే వాటికంటే తక్కువ జరుగుతాయి.
మీరు సహనేరస్తులు కాగలిగే అటువంటి చర్యల యొక్క సమయం మరియు స్థలం ఈ విషయంలో అప్రధానమైనది. అవి మీరు ఉంటున్న స్థలానికి సరిగ్గా భూగోళం యొక్క అవతలి అంచున, మీరు ఎన్నడు కాలిడని, మీకు అవి ఉన్నవని అసలు తెలియని చోట్లలో జరిగినా సరే. మీ ఆలోచనల ఆటల ద్వారా బలపరచబడినవి దూరాలు, దేశం మరియు సీమ అనే వాటికి స్వతంత్రంగా, ఎక్కడ అవి సజాతీయమైన వాటిని కనుగొంటాయో అక్కడికి చేరుతాయి.
ఈ విధంగా ద్వేష మరియు అసూయ ఆలోచనలు కాలక్రమంలో అవి సజాతీయతను కనుగొన్నచోట, వాటిని కార్యాలకు వత్తిడిచేస్తూ, వ్యక్తులపైన, గుంపులపైన లేక సంపూర్ణ జాతులపైన పడతాయి. కార్యసిద్ధిచెందే తమ రూపాలలో అవి మీ ఆలోచనల ఆటల ద్వారా ప్రారంభంలో ఉద్భవించిన వాటికి పూర్తిగా విభిన్నంగా ఉంటాయి.
ఫలితాన్ని కలుగజేయుటలో అది, ఆ కార్యం చేసే సమయంలో దాని కర్త ఏవిధమైన అంతఃకరణానుభూతిని కలిగియుంటాడో దానికి అనుగుణంగా కనబడవచ్చు. ఈ విధంగా మీరు, వేటి భయంకరత్వాన్ని మీరు స్వయంగా ఎన్నడూ ఊహించియుండరో, అటువంటి కార్యాలు చేయుటకు సహాయపడియుండవచ్చు. అయినా మీరు వాటితో ముడివేయబడి ఉంటారు, వాటి యొక్క ప్రతిచర్యలో ఒక భాగం తప్పక మీ ఆత్మపై భారాన్ని వేయవలసియుంటుంది, ఆత్మ శరీరం నుండి తనను వేరుపరచుకొన్నప్పుడు అది ఒక బరువువలే దానికి తప్పక వ్రేలాడబడియుండవలసియుంటుంది.
కాని దానికి విపర్యయంగా మీరు మరింత ఎక్కువ శక్తివంతంగా కూడా శాంతికి మరియు మానవసౌఖ్యానికి తోడ్పడవచ్చు. స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన ఆలోచనాసరళి ద్వారా మీరు మీకు అతి దూరంలోవున్న మనుష్యుల ద్వారా వికసించే కార్యాలలలో భాగస్వాములు కావచ్చు.
వాటిలోనుండి సహజంగా ఆశీర్వాదం కూడా మీపైకి తిరిగి ప్రవహిస్తుంది, అయితే ఎందువల్ల అది మీకు కలుగుతుందో మీరు ఎరుగరు.
మీరు కలిగియున్న ప్రతి ఆలోచన విషయంలో దేవుని సంపూర్ణ-పరిశుద్ధ-చిత్తం యొక్క తిరుగులేని న్యాయత్వం ఏ విధంగా ఈ సృష్టి యొక్క స్వయంచలిత శాసనాలలో ఎల్లప్పుడు నెరవేర్చబడుతుందో మీరు ఒకే ఒక్కసారి చూడగలిగినట్లైతే, మీరు మీ సర్వశక్తితో మీ ఆలోచనాసరళిని స్వచ్ఛంగా ఉంచుకొనుటకు కృషిచేస్తారు!
దానితో మీరు అప్పుడు, ఎవరిని సృష్టికర్త కరుణలో జ్ఞానానికి నడిపించగోరతాడో అటువంటి మనుష్యులు అవుతారు. ఆ జ్ఞానము వారికి నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది మరియు మానవాత్మకై ఉద్దేశించబడిన ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుటకు అర్హులైన సృష్టిలోని సహాయకులగునట్లు చేస్తుంది; తద్వారా వారు ఆ ఆశీర్వాదాలను పరివర్తనంచేసి ఉత్సాహకృతజ్ఞతలతో, ఏ జీవులైతే వాటిని మనుష్యుల ద్వారా ఆ విధంగా పరివర్తనచేయబడిన రూపంలో మాత్రమే గ్రహించుటకు సమర్థత కలిగియున్నాయో వాటికి అందించగల్గుటకు; మానవాళి మంచితనంలో మరియు స్వచ్ఛతలో జీవించిన కాలంలో అవతరించగల్గిన ఆ జీవులు, మానవాత్మ యొక్క పతనంవల్ల నేడు అక్రమంగా వాటినుండి వేరుచేయబడియున్నాయి.
అయితే మీరు తద్వారా నా సందేశంలోనుండి కేవలం ఒకే ఒక్క వాక్యాన్ని భూమిపై మీ కొరకు తేజంలో ప్రకాశింపచేస్తారు!
అది మీకు అత్యంత కష్టమైనది, అది అప్పుడు మిగతా వాటినన్నింటినీ చాలా సులభతరం చేస్తుంది; దాని నెరవేర్పు అధ్భుతాలు ఒకదానివెంట మరొకటి భౌతికంగా దృశ్యమానంగా, స్పర్శనీయంగా మీ ఎదుట తప్పక ప్రత్యక్షమగునట్లు చేయవలసియుంటుంది. –
ఎప్పుడు మీరు మిమ్ములను ఈ విషయంలో అధిగమించియుంటారో అప్పుడు మీ మార్గంలో, మానవ ఆలోచనాసరళి యొక్క వక్రీకరణ ద్వారా సంభవించే మరియొక ప్రమాదం మీకై పొంచియుంటుంది: మీరు దానియందు ఒక బలాన్ని కనుగొంటారు, దానిని మీరు అతిఇష్టంగా నిర్దిష్టమైన రూపాలలో అదుముటకు సంకల్పిస్తారు, తద్వారా అది స్వంత కోరికల ద్వారా రూపొందించబడిన ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనానికి ఉపయోగకరంగా ఉండుటకు!
ఈ రోజే మిమ్ములను దాని గురించి హెచ్చరించగోరుతున్నాను; కాగా సరియైన మార్గాన మీరు నడవటం మొదలుపెట్టిన తరువాత కూడా ఆ ప్రమాదం మిమ్ములను మ్రింగివేయవచ్చు, మీరు దానిలో నశించవచ్చు.
మీ ఆలోచనల స్వచ్ఛతను
తెగింపుతో కూడిన పోరాటం ద్వారా అమలుచేయకుండా జాగ్రత్తపడండి; కాగా మీరు తద్వారా వాటిని మొదట్లోనే నిర్దిష్టమైన పుంతలలో అదుమబోతారు, మీ ప్రయాస భ్రమగా మారుతుంది, కృత్రిమంగా బలవంతంతో చేయబడినదైయుంటుంది మరియు ఏనాటికీ అది తేవలసిన గొప్ప ఫలితాలను తేలేదు. అక్కడ స్వతంత్ర అంతఃకరణానుభూతి యొక్క యథార్థ్యం కొరవడినందువల్ల మీ ప్రయాస మేలుచేసే బదులు కీడుచేయవచ్చు. మరల అది మీ మేధస్సు-సంకల్పం యొక్క ప్రభావమే ఔతుంది తప్ప ఏనాటికీ మీ ఆత్మకార్యం కాలేదు! దానిని గురించి మిమ్ములను హెచ్చరిస్తున్నాను.
నిజమైన గొప్పతనం కేవలం సరళత్వం లోనే ఉండగలదని, ఎందుకంటే నిజమైన గొప్పతనం సరళమైనది అని మీకు చెప్పే సందేశంలోని నా వాక్యాన్ని గుర్తుంచుకోండి! నేనిక్కడ అనే ఆ సరళత్వాన్ని, ఎప్పుడైతే మీరు దాని స్థానంలో తాత్కాలికంగా మానవ-భూలోకపదమైన నిరాడంబరతను ఉంచుతారో అప్పుడు మరింత మెరుగుగా అర్థంచేసుకోగల్గుతారు. అది మీ అవగాహనాసామర్థ్యానికి బహుశా చేరువలోవుంటుంది మరియు మీరు సరియైన అర్థాన్ని కలిగియుంటారు.
మీ ఆలోచనలకు నేను ఉద్దేశించే ఆ స్వచ్ఛతను మీరు మీ మేధస్సు సంకల్పంతో ఇవ్వలేరు; కాని స్వచ్ఛమైన సంకల్పం, పరిమితమైన భావనను మాత్రమే ఉద్భవింపజేయగల ఒక పదంలో కుంచించబడక, నిరాడంబరతతోను మరియు పరిమితం చేయబడకుండా తప్పనిసరిగా మీ అంతఃకరణానుభూతి లోనుండి మీలో ఉద్భవించవలసియుంటుంది. అట్లుండరాదు; కాని మంచికొరకు సమస్తాన్ని పరివేష్టించే ఒక ప్రేరణయైయుండాలి. అది మీ ఆలోచనల ఉద్భవాన్ని ఆవరించుటకూ, అవి ఒక రూపం దాల్చకముందే వాటిలోనికి చొచ్చుకొనిపోవుటకూ సామర్థ్యతను కలిగియుండాలి. అదే సరియైనది, అదే మీకు అవసరం.
అది కష్టం కాదు, నిజానికి ఇతర ప్రయత్నాలకంటే చాలా సులువైనది, స్వసామర్థ్యం మరియు స్వశక్తి యొక్క మేధస్సు-అతిశయం ఉత్పన్నం కాజాలని నిరాడంబరతను మీరు పాటించిన వెంటనే. మిమ్ములను ఆలోచనారహితులనుగా చేసుకోండి, ఉదాత్తతకొరకు, మంచికొరకు ప్రేరేపణను మీలో విడుదలచేయండి, ఆలోచించుటకు అప్పుడు మీరు మీ ఆత్మ యొక్క సంకల్పంలో ఉత్పన్నమైన పునాదిని కలిగియుంటారు, దానిలోనుండి ఉద్భవించే దానిని అప్పుడు మీరు ప్రశాంతంగా మేధస్సు కర్తవ్యానికి వదిలివేయవచ్చు, అది వాటిని అత్యంతసాంద్ర స్థూలత్వంలో నెరవేర్చుటకు. అక్రమమైనది ఏనాటికీ రూపుదాల్చలేదు.
ఆలోచనల ద్వారా కలిగే సమస్త యాతనను మీనుండి దూరం చేయండి, దానికి బదులుగా మీ ఆత్మను విశ్వసించండి, మీరు దాన్ని స్వయంగా గోడతో మూసివేయనట్లైతే అది తప్పక తన మార్గాన్ని సిద్ధపరచుకుంటుంది. ఆత్మయందు స్వేచ్ఛులగుడి అంటే మీలోని ఆత్మకు దాని మార్గాన అది పోవుటకు అనుమతించండి అని తప్ప ఇంకేమీ కాదు! అప్పుడు అది ఔన్నత్యానికి ప్రయాణించగల్గుటను తప్ప ఇంకేమీ చేయలేదు; కాగా కేవలం దాని స్వభావమే దానిని అవశ్యంగా పైకిలాగుతుంది. ఇంతవరకు మీరు అది ఇకపై వికసించలేకుండా దానిని అడ్డుకొన్నారు, తద్వారా మీరు దాని ఉద్గమనమును అడ్డగించియుండినారు లేక దాని రెక్కలను కట్టివేసియుండినారు.
సరికొత్త మానవాళిని నిర్మించుటకు అవసరమైన, మీరు అలక్ష్యంచేయలేని, అలక్ష్యంచేయకూడని పునాది ఈ ఒక్క వాక్యంలోనే ఉన్నది: మీ ఆలోచనల అంతికను స్వచ్ఛంగా ఉంచుకోండి!
మరియు దానితోనే మనిషి మొదలుపెట్టవలసియుంటుంది! అదే అతని మొదటి కర్తవ్యం, అది అతన్ని అతడు అవశ్యంగా ఏమి కావలసియున్నదో దానిగా చేస్తుంది. అనగా, వెలుగుకు మరియు సత్యానికి కృషిచేసే వారికి, సృష్టికర్తను కృతజ్ఞతతో తమ సమస్త ఉనికి ద్వారా సేవించుటకు ఆకాంక్షించే వారికి ఆదర్శప్రాయునిగా చేస్తుంది! ఎవడు దానిని నెరవేరుస్తాడో, వానికి ఎటువంటి ఇతర సలహాలు అవసరంలేదు. అతడు తాను ఉండవలసిన విధంగా ఉన్నాడు, మరియు తద్వారా తనకొరకై సృష్టియందు వేచియున్న, అతన్ని అంతరాయం లేకుండా ఊర్ధ్వానికి నడిపించే సహాయాలను వాటి సంపూర్ణతలో అందుకొంటాడు.