ఆధునిక మానసిక శాస్త్రము! ఈ జెండా క్రింద ఏమేమి గుమిగూడుతాయో! అక్కడ ఏవి ఒకటౌతాయో మరియు ఏవి దానిక్రింద పరస్పరం పోరాడుకొంటాయో! ఆసక్తితోకూడిన అన్వేషణకు, తక్కువ విజ్ఞానానికి, గొప్ప ప్రణాళికలకు, అహంకారానికి మరియు మూర్ఖత్వానికి, చాలాసార్లు ఒట్టి ప్రగల్భాలకు మరియు మరియెక్కువగా పూర్తిగా మనస్సాక్షిలేని వ్యాపారబుద్ధికి అది ఒక ఆటస్థలం. ఆ అస్తవ్యస్తతలోనుండి తరచుగా అసూయ మరియు హద్దులులేని ద్వేషం చిగురిస్తాయి, అవి చివరకు అత్యంత హీనకరమైన ద్రోహచింతగల ప్రతీకారేచ్ఛను కలుగజేస్తాయి.
అటువంటి పరిస్థితులలో చాలామంది మనుష్యులు, ఒకవేళ వారు వాటితో సంపర్కం కలిగియున్నచో తాము విషపూరితులం అవుతామేమోననే జంకుతో ఆ విచిత్రమైన కార్యకలాపాలనుండి దూరంగా ఉండుట, సహజంగా ఆశ్చర్యకరమేమీ కాదు. వారట్లు చేయడంలో తప్పులేదు; కాగా లెక్కలేనంతమంది మానసికశాస్త్రం యొక్క అనుచరులు తమ ప్రవర్తనలో నిజంగా ఎటువంటి ప్రలోభపెట్టే దానిని చూపరు, ఆకర్షించే దానిని అసలే చూపరు, కాని వారిని గురించిన దంతయూ నిజానికి ప్రతి ఇతర మనిషిని అత్యంత గొప్ప జాగ్రత్తను కలిగియుండమని హెచ్చరిస్తుంది.
విచిత్రమేమిటంటే, ద్రోహచింతకుల ద్వారా లేక అజ్ఞానుల ద్వారా తరచుగా ప్రేతల శాస్త్రంగా తారుమారు చేయబడే మరియు మానసికశాస్త్రం అనబడే దాని క్షేత్రమంతయూ, నేడు కూడా ఒక రకమైన స్వతంత్రభూమిగా పరిగణించ బడుతున్నది, దానిపై ప్రతివాడూ ఆటంకపరచబడకుండా, అసలు అదుపేలేకుండా మరియు శిక్షించబడకుండా తన స్వభావ-ప్రవృత్తులకనుసారంగా ప్రవర్తించుటకు.
అట్లు భావించబడుతుంది. అయితే అనుభవాలు ఇప్పటికే చాలా తరచుగా నేర్పియున్నవి, అది అట్లు లేదని!
ఆ రంగంలో లెక్కలేనంత మంది మార్గదర్శకులు, ఎవరైతే కేవలం ఊహించుకొన్న జ్ఞానంతో పరిశోధిస్తూ కొన్ని అడుగులు ముందుకుపోవుటకు అజాగ్రత్తను కలిగి యుండినారో వారు తమ అశ్రద్ధ యొక్క నిస్సహాయులైన బాధితులయ్యారు. ఇక్కడ బాధాకరమైన విషయమేమిటంటే, వీరందరు మానవాళికి ఏకొంత మేలైనా కలిగించకుండానే బలియైపోయారు!
వీటిలో ప్రతి సందర్భం కూడా ఆ ఎంచుకొనబడిన మార్గం సరియైనది కాదనుటకు ఒక రుజువైయుండవలసింది కదా, ఎందుకంటే అది కేవలం నష్టాన్ని మరియు నాశనాన్నే తెస్తుంది కాని ఎటువంటి దీవెననూ తేదు. అయిననూ ఒక విధమైన విచిత్రమైన మొండితనంతో ఈ తప్పుదారులు ఇంకా అనుసరించబడుతున్నాయి. పదే పదే క్రొత్త బాధితులు బలిచేయబడతారు; మహాసృష్టిలోని సహజసిద్ధత విషయంలో క్రొత్తగా గుర్తించబడిన ప్రతి చిన్న విశేషంపై గొప్ప సందడి చేయబడుతుంది, లెక్కలేనన్ని గ్రంథాలు వ్రాయ బడతాయి. అవి చాలామంది ఆసక్తితో వెదికే మనుష్యులను తప్పక బెదరగొట్టవలసియుంటుంది, ఎందుకంటే వాటిలో అసురక్షితమైన తడుములాడుట స్పష్టంగా గోచరమౌతుంది.
ఇప్పటివరకు చేసిన సమస్త పరిశోధన వాస్తవానికి, మంచినికోరే నేపథ్యంలో ఒక అపాయకరమైన ఆట అని పిలువబడాలి.
మనిషి, ఆత్మీయ శాసనాలను వాటి సంపూర్ణ పరిమితిలో గమనించుటకు ముందుగా అర్థంచేసుకోనంతవరకు స్వతంత్ర భూమిగా పరిగణించబడే మానసికశాస్త్రం యొక్క క్షేత్రం ఎప్పటికీ శిక్షించబడకుండా ప్రవేశింపబడలేదు. బుద్ధి పూర్వకంగా లేక తెలియకుండా వాటిని ప్రతిఘటించిన ప్రతి సందర్భం, అనగా వాటిని “పాటించకుండుట”, వాటి ఉల్లంఘనతో సమానమైయున్నది. వాటిని ఖచ్చితంగా గమనించని లేక గమనించుటకు సమర్థుడుకాని సాహసవంతున్ని, నిష్ప్రయోజకున్ని లేక అజాగ్రత్తపరున్ని ఆ ఉల్లంఘన యొక్క నివారింపబడజాలని పరస్పరచర్య తప్పక తాకుతుంది.
భూలోకంతో సంబంధంలేని దానిలో భూలోక మాధ్యమాలతో మరియు అవకాశాలతో సంచరించగోరుట అనే విషయం, భూలోక అపాయాల గురించి ఇంకా తెలియని, అభివృద్ధి చెందని ఒక బిడ్డను, ఏ కీకారణ్యంలో కేవలం దానికి తగినట్లు సన్నద్ధుడైన మనిషి తన పూర్ణ శక్తిలో సమస్త జాగ్రత్తతో ఉన్నప్పుడే హానిచేయబడకుండా బ్రతకగల్గుటకు అవకాశాన్ని కలిగియుంటాడో అటువంటి కీకారణ్యంలోనికి తెచ్చి ఒంటరిగా వదిలివేయడంతో సమానమైయున్నది.
మనుష్యులకు, ఏ సరిహద్దు ఎదుట వారు చాలాకాలం నుండి తట్టుతూ వేచియున్నారో దానిని దాటి ముందుకు పోవుటకు సహాయమందించుటకు తాము ఎంతో ఆసక్తితో ఉన్నామని ఆధునిక మానసిక శాస్త్రజ్ఞులు ఊహించుకొన్నా మరియు వారు వాస్తవంగా కేవలం విజ్ఞానం కొరకే చాలా ధైర్యంగా పనిచేస్తున్నా, వారి ప్రస్తుత పనితీరు పైన చెప్పబడిన దానికి వేరుగా లేదు.
ఒకవేళ ఆ పరిశోధకుల గ్రుడ్డి ప్రయత్నాలు, ఏ రక్షణగోడ చాలామందికి మూయబడియుంటేనే శ్రేయస్కరమో దానిలో ఒక గండికొట్టినట్లైతే లేక ఒక తలుపును తెరచినట్లైతే ఏ క్షణంలోనైనా వారిపైకి లేక వారి ద్వారా ఇతర మనుష్యులపైకి అపాయాలు ప్రవహించగలవు. ఆ పరిశోధకులు నేడు కూడా పిల్లలవలే నిస్సహాయతలో, తడుముకుంటూ, ఈ అపాయాలను ఎరుగకుండా, దాని ఎదుట నిలిచియున్నారు.
ఆ విధంగా ముందుకు సాగగోరేవారు, తమకే కాక ఇతరులకు కూడా రాబోయే అన్ని అపాయాలను, తప్పకుండా మరియు తక్షణమే జయించుటకు సమర్థులమని ఖచ్చితంగా ఎరిగియుండనంతవరకు, అది అంతయూ అజాగ్రత్త అనే పిలువబడవచ్చు కాని సాహసమని కాదు.
ఎవరైతే ప్రయోగాలు చేస్తున్నారో ఆ “పరిశోధకులు” అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. వశీకరణ నేరం గురించి ఇప్పటికే పలుసార్లు హెచ్చరించబడింది.[^*]
[^*] ఉపన్యాసం: “వశీకరణం యొక్క అపరాధం”
వేరొకరకంగా ఇంకా ప్రయోగాలుచేసే పరిశోధకులు ఎక్కువ సందర్భాలలో శోచనీయమైన తప్పును చేస్తున్నారు. వారు తమకు తెలియకుండానే, కాగా లేనిచో వారు ఖచ్చితంగా దానిని చేసియుండరు, చాలా సున్నితమైన లేక సోదె చెప్పగల ఇతర మనుష్యులను అయస్కాంత నిద్రలోనికి లేక ఏకంగా వశీకరణ నిద్రలోనికి తరలిస్తారు, తద్వారా వారిని శారీరకంగా కనిపించని “ఆవలి” లోక ప్రభావాలకు చేరువగా తెచ్చుటకు, తద్వారా వివిధమైనవి వినగలము మరియు గమనించ గలము అనే నిరీక్షణలో; సంపూర్ణ పగటిస్పృహ స్థితిలో ఆ ప్రయోగం చేయబడిన వ్యక్తికి అది సాధ్యమైయుండదు.
వంద సందర్భాలలోనుండి కనీసం తొంభైతొమ్మిది సందర్భాలలో వారు అటువంటి మనుష్యులను, వారు ఇంకా తట్టుకోలేని గొప్ప అపాయాలకు గురిచేస్తారు; కాగా లోతుగా పోవుటకొరకు ఇవ్వబడే ప్రతివిధమైన కృత్రిమ సహాయం జీవాత్మ యొక్క బంధనయే, తద్వారా అది తన సహజమైన అభివృద్ధి అనుమతించే దానికంటే ఎక్కువ సున్నితత్వం లోనికి బలవంతపరచబడుతుంది.
దాని ఫలితం ఏమిటంటే, అటువంటి ప్రయోగాలకు బలియైనవాడు మానసికంగా అకస్మాత్తుగా ఏ ప్రాంతంలో అతడు తన సహజమైన భద్రతను కృత్రిమ సహాయం ద్వారా కోల్పోయి ఉంటాడో లేక దేనికొరకు అతడు తన సహజమైన భద్రతను లేకుండా ఉంటాడో, దానిలో నిలుస్తాడు. ఆ సహజమైన భద్రత కేవలం, స్వంత, ఆరోగ్యకరమైన ఆంతరంగిక అభివృద్ధి ద్వారా మాత్రమే ఉద్భవించగలదు.
అటువంటి దయనీయమైన మనిషిని, అతడు ఎరగా అపాయకరమైన ప్రాంతంలో చాలా లోపలికి త్రోయబడి, దిగంబరంగా ఒక స్తంభానికి కట్టివేయబడి నిలిచియున్నట్లు చిత్రీకరించుకోవలసియుంటుంది, తద్వారా అతడు ఇంకా అపరిచితమైన అక్కడి జీవనాన్ని మరియు కలాపాన్ని తనపైకి ఆకర్షించుకొనుటకు, పైగా తనపై పనిచేయనిచ్చుటకు, తద్వారా అతడు దానిపై నివేదికను ఇవ్వగల్గునట్లు లేక వివిధమైన ప్రభావాలు, అతని సహకారంతో, అతని శరీరంనుండి స్రవించే నిర్దిష్టమైన భౌతిక పదార్థాల ద్వారా ఇతరులకు గోచరమగునట్లు.
అటువంటి ప్రయోగం చేయబడిన వ్యక్తి కొన్ని సమయాల్లో, ముందుకు త్రోయబడిన అతని జీవాత్మ అతని భౌతిక శరీరంతో తప్పక ఉంచవలసిన అనుసంధానం ద్వారా, జరిగేదానినంతటినీ ఒక టెలిఫోను ద్వారా వివరించునట్లు వివరించుటకు మరియు ప్రేక్షకునికి అందజేయుటకు సమర్థుడైయుంటాడు.
అయితే, ఆ విధంగా కృత్రిమంగా ముందుకు త్రోయబడిన ఆ స్థానంపై ఏ విధంగానైనా దాడిచేయబడినట్లైతే, సహజమైన భద్రతలేమివల్ల అతడు దానిని ప్రతిఘటించలేడు, అతడు నిస్సహాయతలో వదిలివేయబడతాడు, ఎందుకంటే అతడు ఇతరుల సహాయంతో కేవలం కృత్రిమంగా, తన స్వంత అభివృద్ధి ప్రకారం ఇంకా చెందని లేక అసలుకే చెందని ప్రదేశంలోనికి త్రోయబడ్డాడు. పరిశోధకునిగా పిలువబడే వాడు, ఎవడైతే విజ్ఞానతృష్ణలో అతన్ని లోపలికి త్రోశాడో అతడు కూడా అంతే తక్కువగా అతనికి సహాయం చేయగలడు, ఎందుకంటే ఆ పరిశోధకుడు స్వయంగా, అపాయం ఎక్కడనుండి వస్తుందో అక్కడ, అపరిచితుడు మరియు అనుభవహీనుడైయుంటాడు, అందువల్ల ఎటువంటి రక్షణనైనా ఇచ్చుటకు అసమర్థుడైయుంటాడు.
ఈ విధంగా పరిశోధకులు దానిని ఆశించకుండానే మరియు భూలోకన్యాయవ్యవస్థ ద్వారా విచారించబడకుండానే నేరస్థులు అవుతారు. అయితే అది, ఆత్మీయ శాసనాలు సంపూర్ణ శక్తితో వాటి పరస్పరచర్యను కలుగజేయుటనుండి మరియు పరిశోధకున్ని అతని బాధితునితో బంధించుట నుండి మినహాయించదు.
చాలామంది ప్రయోగం చేయబడిన వారు సూక్ష్మపదార్థపు దాడులకు గురియైయుండినారు. అవి కాలక్రమేణా, తరచుగా త్వరగా కూడా లేక తక్షణమే స్థూలపదార్థ-శారీరక పర్యవసానాన్ని కలుగజేస్తాయి, దానితో భౌతికరోగం లేక మరణం సంభవిస్తుంది, అయిననూ ఆత్మీయ నష్టం దానితో తొలగించబడదు.
అయితే, తమ బాధితులను తెలియని ప్రాంతాలలోనికి బలవంతపరిచే, తమను పరిశోధకులమని పిలుచుకొనే ఆ పరిశీలకులు, అటువంటి అపాయకరమైన ప్రయోగాలు జరుగుతున్నప్పుడు అత్యధిక సందర్భాలలో మేలైన భౌతిక కప్పు క్రింద తమ శరీరం యొక్క మరియు పగటిస్పృహ యొక్క రక్షణలో నిలిచియుంటారు.
పరిశోధకులు, ఆ ప్రయోగం చేయబడిన వ్యక్తుల యొక్క అపాయాలలో వారితోపాటు ఏకకాలంలో పాలుపంచుకొనుట చాలా అరుదు, ఆ విధంగా అవి తక్షణమే వారిపైకి వచ్చుటకు. కాని వారి భౌతికమరణం సంభవించినప్పుడు, వారు సూక్ష్మపదార్థ లోకంలోనికి దాటినప్పుడు, బాధితులతో వారు బంధించబడియున్నందున, ఆ బాధితులతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎక్కడికి బాధితులు చివరకు లాగబడతారో అక్కడికి తప్పక పోవలసియుంటుంది, తద్వారా అప్పుడు వారితోపాటు నెమ్మదిగా తిరిగి ఆరోహించగల్గుటకు.
ఒక జీవాత్మను కృత్రిమంగా వేరొక ప్రదేశంలోనికి నెట్టినప్పుడు, ఆ జీవాత్మ శరీరంలోనుండి బయటకు పోతుందని మరియు ఇతర ప్రాంతంలోకి తేలుతూ పోతుందని ఎల్లప్పుడు అర్థం చేసుకొనబడరాదు. ఎక్కువ సందర్భాలలో అది గమ్మున శరీరంలోనే ఉంటుంది, అది కేవలం ఆ అయస్కాంత లేక వశీకరణ నిద్ర ద్వారా అసహజంగా సున్నితంగా చేయబడుతుంది, తద్వారా అది దాని యొక్క సహజమైన స్థితిలో వేటికి స్పందించలేదో అటువంటి చాలా సున్నితమైన ప్రవాహాలకు మరియు ప్రభావాలకు స్పందించునట్లు.
ఈ కృత్రిమమైన స్థితిలో జీవాత్మకు సంపుర్ణశక్తి అందుబాటులో ఉండకపోవుట సహజమే. ఒకవేళ ఆంతరంగిక అభివృద్ధిలో ఆ జీవాత్మ స్వయంగా అంతవరకు వచ్చియుండినట్లైతే మరియు తద్వారా ఆ క్రొత్తదైన, సున్నితపరచబడిన నేలపై దృఢంగా మరియు సురక్షితంగా నిలిచియుండగలిగినట్లైతే, అప్పుడు అది ఆ శక్తిని కలిగియుండేది, సమస్త ప్రభావాలకు సమానమైన శక్తిని ఎదురుతెస్తూ.
ఆరోగ్యకరమైన ఈ సంపూర్ణశక్తి యొక్క లేమివల్ల, ఆ కృత్రిమత్వం ద్వారా ఒక అసమానత్వం ఏర్పడుతుంది, అది తప్పక అంతరాయాలను కలుగజేయవలసియుంటుంది, దాని పర్యవసానం, సమస్త అంతఃకరణానుభూతులలో అనివార్యమైన కలకపాటు, దానిద్వారా వాస్తవికత యొక్క వక్రీకరణాలు ఉత్పన్నమౌతాయి.
తప్పుడు నివేదికలకు, లెక్కలేనన్ని తప్పులకు ఎల్లప్పుడు మరల స్వయంగా పరిశోధకులే తమ హానికరమైన సహాయం ద్వారా కారణాన్నిస్తారు. అందువల్ల గుప్తవిద్యారంగంలో ఇప్పటికే అందుబాటులోవున్న చాలా “పరిశోధించబడిన” విషయాలలో పలు విషయాలు ఖచ్చితమైన తర్కంతో సరిపోవు. దానిలో ఇప్పటివరకు తప్పులుగా ఇంకా గుర్తించబడలేని లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయి.
ఈ స్పష్టమైన తప్పుడుమార్గాల ద్వారా మనుష్యులకు కనీసం కొంతవరకైనా ఉపయోగాన్ని లేక దీవెనను కలిగించగలిగేది ఏది కూడా అసలు సాధించబడదు.
కేవలం ఏదైతే వారికి ఊర్ధ్వదిశలో సహాయపడుతుందో లేక కనీసం దానికొరకు ఒక మార్గాన్ని చూపుతుందో అదే మనుష్యులకు వాస్తవంగా ఉపయోగకరమైనది. కాని అది అంతయూ ఈ ప్రయోగాలలో మొదటినుండే మరియు ఎప్పటికీ పూర్తిగా అసాధ్యమైయుంటుంది!
అయితే, కృత్రిమ సహాయం ద్వారా ఒక పరిశోధకుడు కొన్నిసార్లు ఎవరో ఒక సున్నితమైన లేక సోదె చెప్పగల మనిషిని, చివరకు భౌతిక-స్థూలపదార్థ శరీరంలోనుండి బయటకు, అతనికి చేరువలోవున్న సూక్ష్మపదార్థ లోకంలోనికి నెట్టగలడు, కాని ఎక్కడ అతడు తన ఆంతరంగిక స్వభావం ప్రకారం ఎలాగైనా చెందుతాడో, దానికంటే కనీసం ఒక వెంట్రుక మందమంత కూడా పైకి నెట్టలేడు. దానికి వ్యతిరేకంగా, కృత్రిమ సహాయం ద్వారా అతడు అతన్ని కనీసం అక్కడకు కూడా తేలేడు, కాని ఎల్లప్పుడూ కేవలం సమస్త భూలోకానికి అతి సమీప పరిసరంలోనికి మాత్రమే తేగలడు.
అయితే, భూలోకానికి అత్యంత చేరువైన ఈ పరిసరం తనలో, కేవలం ఏదైతే భూమితో దగ్గరగా ముడిపడియున్నదో మరియు తన న్యూనత, వ్యసనం మరియు మోహం ద్వారా భూమితో బంధించబడి ఇకపై కూడా కొనసాగుతుందో, అటువంటి ఆవలిలోక సమస్తాన్ని మాత్రమే కలిగియుండగలదు.
సహజంగా కొంత ఎక్కువ అభివృద్ధిచెందినది కూడా ఈ పరిసరాలలో అక్కడక్కడ తాత్కాలికంగా నిలుస్తుంది. కాని అది ఎల్లప్పుడు ఆశించబడలేదు. ఉన్నతమైనది కేవలం ప్రకృతిశాసనాల కారణంగా అక్కడ ఉండలేదు. దానికంటే ముందుగా లోకం తలక్రిందులు కావచ్చు, లేక … ఒక మనిషిలో వెలుగును నాటుటకు పునాది తప్పక అందుబాటులో ఉండవలసియుంటుంది!
కాని అది, ఒక ప్రయోగం చేయబడే వ్యక్తిలోకాని లేక ఆ విధంగా తడిమే పరిశోధకునిలోకాని ఉంటుందేమోనని వెదకడాన్ని మనం ఊహించుకోలేము. అనగా ఆ ప్రయోగాలన్నింటి యొక్క ప్రమాదం మరియు వాటి నిష్ప్రయోజకత కొనసాగుతాయి.
ఏదైనా నిజంగా ఉన్నతమైనది, సమస్త స్థూలమైన దానిని శుద్ధిచేసే చాల అభివృద్ధిచెందిన ఒక మనుష్యుని సముఖం లేనిదే సోదె చెప్పగలిగేవాని చెంతకు రాలేదు, అంతకంటే చాలా అరుదుగా అతని ద్వారా మట్లాడగలదు. ఉన్నతమైన క్షేత్రాలనుండి వచ్చే ప్రత్యక్షాలైతే అసలే పరిగణనలోకి రావు; తట్టుట, వస్తువులను కదిలించుట మొదలైన వాటితో కూడిన ఆదరణపొందిన తమాషా ఆటలలోనైతే అది అత్యంత అరుదైనది. అతి సులభంగా వాటిని కలుపుటకు వాటి మధ్యవున్న అగాధం చాలా పెద్దదైయున్నది.
సోదె చెప్పేవ్యక్తి ఉన్నాకాని, ఇటువంటి విషయాలన్నీ, కేవలం పదార్థతతో ఇంకా చాలా దగ్గరగా ముడిపడియున్న వారి ద్వారా మాత్రమే చేయబడగలవు. ఒకవేళ వేరొక విధంగా వీలైయుంటే, అనగా, ఉన్నతమైనది అంత సులభంగా మానవాళితో అనుసంధానం ఏర్పరచగలిగినట్లైతే, క్రీస్తుకు మనిషిగా అగుటకు అసలు అవసరమే ఉండేది కాదు, కాని ఆయన సద్భావకార్యం ఆ ప్రాణత్యాగం లేకుండానే నెరవేర్చ బడగలిగేది.[^*] కాని, అప్పటికంటే సులభంగా వెలుగుతో అనుసంధానం ఏర్పరచవచ్చని భావించుటకు, నేటి మనుష్యులు మానసికంగా ఖచ్చితంగా క్రీస్తు యొక్క భూలోకకాలంలో కంటే ఎక్కువ అభివృద్ధి కాలేదు.
[^*] ఉపన్యాసం: “విమోచకుడు”
అయితే మానసిక శాస్త్రజ్ఞులు ఇప్పుడు, ఆవలిలోక జీవనాన్ని, అనగా భౌతికమరణం తరువాత కొనసాగే జీవితాన్ని నిర్ధారించుటయే తమ ప్రాథమిక ధ్యేయమై యున్నదని మరియు అనుమానం ప్రస్తుతం అంతటా ప్రబలియున్నందున వ్యతిరేకుల రక్షణవలయంలో గండివేయుటకు చాలా బలమైన మరియు స్థూలమైన, అనగా భూలోకపరంగా స్పర్శించబడగలిగే రుజువులు అవసరమని అంటారు.
అయితే మానవజీవాత్మలను అంత అజాగ్రత్తతో పదే పదే అపాయంలోకి తేవడాన్ని ఈ వాదన క్షమించదు!
అంతేగాక, దుష్టచిత్తులైన వ్యతిరేకులను తప్పక ఒప్పించగోరుటకు అసలు ఎటువంటి నిర్బంధించే అవసరం లేదు! ఒకవేళ ఒక దేవదూత వారికి నిజాన్ని ప్రకటించుటకు నేరుగా ఆకాశంనుండి వచ్చినా కూడా వారు నమ్మడానికి సిద్ధంగా ఉండరనేది తెలిసిందే కదా. అది వెళ్లిపోయిన తరువాత వారు, అది ఒక మూకుమ్మడి మతిభ్రమణం అయ్యుండిందే కాని ఒక దేవదూత కాదని వాదిస్తారు లేక ఇంకేదో సాకును చెబుతారు. ఒకవేళ భూలోక స్థితిలోనే కొనసాగే ఇంకా ఏదైనా లేక ఎవరైనా, అనగా మరల అదృశ్యం కానిది లేక కనిపించకుండా పోనిది తేబడినట్లైతే, తిరిగి ఇతర సాకులు ఉంటాయి, ఎందుకంటే ఆవలిలోకాన్ని నమ్మగోరని వానికి సరిగ్గా అదే విషయం మరల చాలా భూలోక సంబంధమైనదై ఉంటుంది కాబట్టి.
వారు అటువంటి రుజువును మోసంగా, ఆ మనిషిని స్వాప్నికునిగా, మూఢభక్తిగలవానిగా లేక మోసగానిగా పరిగణించుటకు వెనుకాడబోరు. అది పూర్తిగా భూలోక సంబంధమైనదైనా లేక పూర్తిగా భూలోకానికి అతీతమైనదైనా లేక రెండూ కలిసియున్నదైనా, తప్పు పట్టడానికి లేక అనుమానించుటకు ఏదో ఒక సాకును వారు ఎల్లప్పుడు కలిగియుంటారు. ఒకవేళ ఇంకే విధంగా వీలుకానట్లైతే వారు అభాండాలు వేస్తారు, ఇంకా బలమైన దాడులకు దిగుతారు మరియు దౌర్జన్యకార్యాలకు వెనుకాడరు.
అందువల్ల వీరిని ఒప్పించుటకొరకు త్యాగాలు సరియైనవి కావు! మరి వారి సందేహాత్మకమైన చాలామంది అనుచరుల కొరకైతే అంతకంటే కాదు. ఒక వింతైన అహంకారంలో వీరు, అత్యధిక సందర్భాలలో కొంత అస్పష్టమైన మరియు చోద్యమైన ఆవలిలోక జీవనం గురించిన తమ విశ్వాసం కారణంగా, దానిపై నిర్దిష్టమైన అపేక్షలు చేయగలమని అనుకొంటారు, తద్వారా వారు దేనినైనా తప్పక “చూడవలెనని” లేక “అనుభవించవలెనని”. వారి యొక్క మంచితనానికి బహుమతిగా వారు తమ నాయకులనుండి ఆవలిలోక సంజ్ఞలను ఎదురుచేస్తారు.
వారు సహజమైన వాటిగా పరిగణించే వారి ఆకాంక్షలు తరచుగా హాస్యాస్పదంగా ఉంటాయి, అదే విధంగా వారి యొక్క చాలా ఎరిగియున్న, దయతో క్షమించే, వారి వాస్తవమైన అజ్ఞానాన్ని కప్పిపుచ్చే ముసుగువంటి చిరునవ్వు కూడా. ఈ గుంపులకు ఇంకా ప్రదర్శనలు కూడా ఇవ్వగోరుట విషమైయున్నది; కాగా, వారు తమకు చాలా తెలియునని అనుకొంటారు కాబట్టి, ఆ ప్రయోగాలు వారికి, ఆవలిలోకస్తులు కచేరీ కళాకారులుగా ఉండవలెనని వారు ఎదురుచూసే, అవి తమ హక్కు అని వారు భావించే వినోదపు ఘడియలకంటే ఎక్కువేమీ కావు.
ఇప్పుడు మనం మన దృష్టిని ఆ గొప్ప ప్రయోగాల పైనుండి బల్లను కదిలించుట అనే చిన్న విషయాలపై సారిద్దాం. ఇవి అందరు అనుకొనే విధంగా ఎట్టి పరిస్థితులలో కూడా నిరపాయమైనవి కాదు కాని తమ అత్యంత సులువుగా వ్యాప్తిపొందే అవకాశాల కారణంగా చాలా తీవ్రమైన ప్రమాదమైయున్నవి!
ప్రతివాడు వాటి గురించి హెచ్చరించబడవలెను! ఎంత అజాగ్రత్తతో ఈ విషయాలు చేయబడుతున్నాయనేది ఒకవేళ చూసినట్లైతే, తెలిసినవారు తప్పక భయంతో వెనుదిరుగ వలసియుంటుంది. బల్లను కదిలించుటకు ప్రయత్నాలను ప్రోత్సాహించుట ద్వారా లేక కుటుంబాలలో చిరునవ్వుతో లేక రహస్యమైన గుసగుసలతో, అక్షరాల పటాలు మరియు గ్లాసు లేక వేరొక సహాయసాధనంతో దాదాపు ఆటగా మారే ప్రయోగాన్ని ప్రవేశపెడుతూ, ఎంతమంది అనుచరులు తమ “జ్ఞానాన్ని”, వివిధ వర్గాలకు చూపుటకు ప్రయత్నిస్తారో; ఆ సాధనం చేతిని మృదువుగా దానిపై ఉంచినపుడు వివిధ అక్షరాలవైపుకు కదులుతుంది లేక లాగబడుతుంది, ఆ విధంగా పదాలను నిర్మిస్తుంది.
భయానకమైన వేగంతో ఇది అంతయూ సమాజపు ఆటలుగా వృద్ధిచెందింది, అక్కడ అది హాస్యంతో, వెక్కిరింతతో మరియు కొన్నిసార్లు ఆహ్లాదకరమైన గగుర్పాటుతో ఆడబడుతుంది.
ప్రతిదినం కుటుంబాలలో స్త్రీలు మరియు యువతులు ఒక చిన్న బల్ల వద్ద ఒక అట్టపై వ్రాయబడిన అక్షరాల ఎదుట కలిసి లేక ఒంటరిగా కూర్చుంటారు. ఆ అక్షరాలు, వీలైతే, భూతకల్పనను రేకెత్తించే మాయజాలానికి లోటులేకుండా ఉండుటకు, ఒక ప్రత్యేకమైన ఆకారంలో వ్రాయబడియుండాలి; నిజానికి ఇది పూర్తిగా అనవసరం; కాగా అది లేకుండా కూడా ఆ పని జరుగుతుంది, ఒకవేళ ఆ సంబంధిత వ్యక్తి కొంతవరకైనా దానికి అనుకూలంగా ఉన్నట్లైతే. అటువంటి వారు లెక్కలేనంతమంది ఉన్నారు!
దానిని చేసే వ్యక్తి స్పృహలో కాని లేక అనాలోచితంగా కాని ఆలోచించియుండని, నిజమైన పదాలు మరియు వాక్యాలు కట్టబడుతున్నందుకు ఆధునిక మానసిక శాస్త్రజ్ఞులు మరియు గుప్తసంఘాల నాయకులు సంతోషపడతారు. తద్వారా ఆ వ్యక్తికి తప్పక దృఢనమ్మకం కలుగవలసి యుంటుంది మరియు “గుప్తమైనదాని” అనుచరుల యొక్క సంఖ్య పెరగవలసియుంటుంది.
గుప్తసంఘాల సాహిత్యం దానిని సూచిస్తుంది, ఉపన్యాసకులు దానిని సమర్థిస్తారు, ఈ అర్థరహితమైన దానిని సులభతరం చేసే సహాయసాధనాలు తయారుచేయ బడతాయి మరియు అమ్మబడతాయి. ఆ విధంగా దాదాపు సమస్త గుప్తలోకం, తాను తద్వారా వెలుగు యొక్క ఆచార్యుడనైయున్నాననే నిజాయితీగల నమ్మకంలో, చీకటి యొక్క సమర్థవంతంగా పనిచేయుచున్న సేవకునిగా మెలుగుతుంది!
కేవలం ఈ సంఘటనలే, ఈ రకమైన గుప్తప్రయత్నాలలో ఉన్నటువంటి సంపూర్ణమైన అజ్ఞానాన్ని రుజువుచేస్తున్నాయి! అవి చూపుతున్నాయి, వారందరిలో ఎవాడూ కూడా నిజంగా చూడగలిగేవాడు కాడని! ఒకవేళ ఈ యొక్క ప్రారంభాల లోనుండి ఒక మంచి సోదె-మాధ్యమం ఏదైనా అక్కడక్కడ అభివృద్ధి చెందియుంటే, లేక సరిగా చెప్పాలంటే, ఒకవేళ ఒక మంచి సోదె-మాధ్యమం మొదట్లో కొంత కాలంవరకు వారి వైపునకు ఆకర్షించబడియుంటే, అది దానికి ప్రతిరుజువుగా పరిగణించబడరాదు.
మొదటినుండే దానికొరకు ప్రత్యేకించబడిన కొద్దిమంది మనుష్యులు ప్రకృతిసిద్ధమైన తమ స్వంత అభివృద్ధిలో ఒక పూర్తిగా వేరైన మరియు ప్రతి స్థాయిపై అతిజాగ్రత్తతో నిఘావుంచే రక్షణను కలిగియున్నారు, ఇతరులు దానిని అనుభవించరు, అయితే ఈ రక్షణ కూడా ఎటువంటి కృత్రిమమైన సహాయం లేనటువంటి, కేవలం ప్రకృతిసిద్ధమైన స్వంత అభివృద్ధిలోనే పనిచేస్తుంది! ఎందుకంటే సహజ సిద్ధంగా కేవలం సమస్త సహజత్వంలో మాత్రమే రక్షణ ఉంటుంది.
ఆ వ్యక్తి యొక్క స్వంత సాధన ద్వారానైనా లేక వేరొక ప్రక్కనుండి అస్కాంత నిద్ర లేక వశీకరణం ద్వారానైనా, అత్యంత చిన్న సహాయం దానికి తోడైన వెంటనే అది కృత్రిమమౌతుంది మరియు తద్వారా, కేవలం ఏ శాసనాలు మాత్రమే రక్షణ కల్పించుటకు సమర్థతను కలిగియున్నాయో ఆ ప్రకృతి శాసనాలకు ఆపై సంపూర్ణంగా తగినట్లు ఉండదు. ప్రస్తుతం అంతటా వ్యాప్తిలో ఉన్నట్లు, అజ్ఞానం దానికి తోడైనట్లైతే, అప్పుడు అక్కడ ప్రమాదం పొంచియుంటుంది. చర్య విషయానికి వస్తే, సంకల్పం ఒక్కటే ఎప్పటికీ సమర్థత స్థానాన్ని పూరించలేదు. అయితే, ఎవ్వరూ కూడా తన సమర్థతను దాటిపోరాదు.
ఈ ప్రమాదకరమైన ఆటలలో నిమగ్నమైయున్న లక్షలాదిమందిలో అక్కడక్కడ ఒక మనిషి నిజంగా శిక్షించ బడకుండా దానినుండి బయటపడుట మరియు మంచి రక్షణను కలిగియుండుట సహజంగా సంభవమే. అదే విధంగా, చాలామంది, భూలోకపరంగా ఇంకా గుర్తించబడలేని విధంగా మాత్రమే నష్టపరచబడతారు, అందువల్ల వారు దానిని కేవలం మరణించిన తరువాతే అకస్మాత్తుగా గుర్తించవలసియుంటుంది, నిజానికి వారు ఎటువంటి బుద్ధిలేని పనులు చేసియున్నారని. అయితే ఇప్పుడే భౌతికంగా కనిపించే నష్టాన్ని పొందినవారు చాలామంది ఉన్నారు, వారు తమ భూలోకమనుగడలో ఎప్పటికీ దాని యొక్క నిజమైన కారణాన్ని గుర్తించలేకపోయినా కూడా.
ఈ కారణలవల్ల ఈ ఆటలు ఆడే సమయంలో జరిగే సూక్ష్మపదార్థలోక మరియు ఆత్మీయ ప్రక్రియలు ఒకసారి వివరించబడవలసియుంటుంది. అది సృష్టిలో అంతయూ ఎంత సులభమో అంతే సులభమైయున్నది మరియు అసలు క్లిష్టమైనదే కాదు, అయితే అది మరల చాలామంది ఊహించుకొనే దానికంటే కష్టమైనది.
భూమి యొక్క ప్రస్తుత స్థితిలో, మానవాళి యొక్క సంకల్పం ద్వారా, సమస్త భౌతికతపై చీకటి పైచేయిని సాధిచింది. అనగా అది సమస్త భౌతికతలో దాదాపు స్వంతదైన, తనకు సుపరిచితమైన నేలపై నిలిచియున్నది మరియు తద్వారా భౌతికతలో తన ప్రభావాన్ని సంపూర్ణంగా చూపుటకు సమర్థతను కలిగియున్నది. అనగా అది, భౌతికతయందు తన అంశంలో ఉన్నది, తాను ఎరిగియున్న నేలపై పోరాడుతున్నది. తద్వారా అది ప్రస్తుతం సమస్త భౌతికతలో, అనగా స్థూలపదార్థతలో, వెలుగుకంటే బలమైనదైయున్నది.
దాని పర్యవసానం ఏమిటంటే, సమస్త పదార్థతలో చీకటి యొక్క శక్తి వెలుగు శక్తికంటే బలపడుతుంది. ఇకపోతే, బల్లను కదిలించుట మొదలైన ఆ రకమైన ఆటలలో వెలుగు, అనగా ఉన్నతమైనది అసలు పరిగణనలోకి రాదు. మహా అంటే మనం చెడుదాని గురించి, అనగా చీకటి గురించి మరియు మంచిదాని గురించి, అనగా ప్రకాశవంతమైనదాని గురించి మాత్రమే మాట్లాడవచ్చు.
ఒక మనిషి ఒక బల్లను లేక ఒక గ్లాసును లేక అసలు ఎదో ఒక స్థూలపదార్థ వస్తువును వాడినప్పుడు, దానితో అతడు చీకటికి పరిచయమైన యుద్ధభూమిలోనికి ప్రవేశిస్తాడు. అది సమస్త చీకటి నాది అని పిలిచే భూమి. తద్వారా అతడు చీకటికి మొదటినుండే, ఏ శక్తికి వ్యతిరేకంగా అతడు ఎటువంటి సముచితమైన రక్షణను సమకూర్చుకోలేడో, అటువంటి శక్తిని కేటాయిస్తాడు.
ఒకసారి మనం ఒక ఆధ్యాత్మవాదానికి చెందిన కాలక్షేపాన్ని లేక కేవలం బల్లతోకూడిన ఒక సమాజపు ఆటను గమనిద్దాం మరియు అక్కడ జరిగే ఆత్మీయ లేక నిజానికి సూక్ష్మపదార్థ ప్రక్రియను గమనిద్దాం.
ఒక మనిషి లేక పలువురు ఒక బల్లవద్దకు, దానిద్వారా ఆవలిలోకస్తులతో అనుసంధానం పొందవలెననే ఉద్దేశంతో, అనగా తద్వారా ఆవలిలోకస్తులు తట్టే శాబ్దాలు చేయునట్లు, లేక సాధారణంగా జరిగే విధంగా, బల్లను కదిలించునట్లు, దాని సహాయంతో పదాలను కట్టగల్గుటకు, వచ్చినప్పుడు, పదార్థతతో జరిగే అనుసంధానంలో మొదటిగా చీకటికి సంబంధించినది ఆకర్షించబడుతుంది; అది ఆ వ్యక్తీకరణ ప్రక్రియను చేపడుతుంది.
చాలా గొప్ప నైపుణ్యంతో ఆవలిలోకస్తులు తరచుగా గొప్పగా వినబడే మాటలను వాడుతారు, తాము సునాయాసంగా చదవగలిగే మనుష్యుల ఆలోచనలకు, వారు కోరుకొన్న రీతిలో జవాబును ఇచ్చుటకు ప్రయత్నిస్తారు, కాని గంభీరమైన ప్రశ్నల విషయంలో వారిని ఎల్లప్పుడు తప్పుదారి పట్టిస్తారు మరియు అది తరచుగా సంభవించినట్లైతే, రానురాను వారిని తమ యొక్క క్రమేణా బలపడే ప్రభావం క్రిందికి తెచ్చుకొనుటకు మరియు ఆ విధంగా నెమ్మదిగానే కాని ఖచ్చితంగా అధోగతికి లాగుటకు ప్రయత్నిస్తారు. తప్పుదోవ పట్టించినవారిని వారు చాలా నైపుణ్యంతో ఊర్ధ్వదిశగా పోవుచున్నామనే నమ్మికలో ఉంచుతారు.
బహుశా మొదట్లోనే కాని లేక ఇంకా ఏదైనా ఇతర సందర్భంలోనైనా చనిపోయిన ఒక బంధువు లేక స్నేహితుడు, చాలా తరచుగా జరుగుతున్నట్లు, బల్ల ద్వారా మాటకొస్తే, అప్పుడు ఆ మోసం మరింత సులభతరం అవుతుంది. మనుష్యులు, తనను ప్రత్యక్షపరచుకొనేవాడు తప్పక ఫలనా సేహితుడైయుండవలెనని గుర్తిస్తారు, మరియు ఆపైన, బల్ల ద్వారా ఏవైనా ప్రకటనలు వచ్చినప్పుడు మరియు ఆ పరిచయస్తుని పేరు రచయితగా పేర్కొనబడినప్పుడు, ఎప్పుడూ అతడే అయ్యుంటాడని నమ్ముతారు.
కాని అది నిజం కాదు! ఎల్లప్పుడూ గమనిస్తూవుండే చీకటి, తప్పుదారి పట్టించే ప్రక్రియలకు సాధ్యమైనంత విశ్వసనీయతను కలుగజేయుటకు మరియు ప్రశ్నించే వారి విశ్వాసాన్ని కైవసం చేసుకొనుటకు నైపుణ్యంతో ఆ పేరును వాడటమే కాకుండా, ఎంతవరకు అది పోతుందంటే, నిజమైన స్నేహితుని ద్వారా ప్రారంభించబడిన వాక్యం మధ్యలో ఒక చీకటికి చెందినవాడు జోక్యం చేసుకొంటాడు మరియు దానిని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ముగిస్తాడు. అప్పుడు, సజావుగా మరియు ధారాళంగా చెప్పబడిన ఒకే వాక్యంలో ఇద్దరు పాల్గొన్నారనే అరుదుగా తెలిసిన వాస్తవం కార్యరూప మౌతుంది. ప్రశ్నించేవాడు దానిలోనుండి దేనినీ గమనించ లేకుండానే మొదట అసలైనవాడు మరియు బహుశా చాలా ప్రకాశవంతుడు, అనగా మరింత స్వచ్ఛుడైన స్నేహితుడు, ఆ తరువాత ఒక చీకటివాడు, చెడు కోరేవాడు పాల్గొంటారు.
దాని పర్యవసానాలను చాలా సులభంగా ఊహించు కోవచ్చు. నమ్మేవాడు మోసపరచబడతాడు మరియు అతని విశ్వాసంలో చలించబడతాడు. ప్రత్యర్థి ఆ ప్రక్రియను తన ఎగతాళిని మరియు అనుమానాలను బలపరచుటకు ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు ఆ సమస్త విషయంపై బలమైన దాడులు చేయుటకు కూడా. కాని నిజానికి ఇద్దరిదీ తప్పే. దానికి కారణం ఆ సమస్త విషయంపై ఇంకా వ్యాపించియున్న అజ్ఞానంలో మాత్రమే ఉన్నది.
అయితే ఆ ప్రక్రియ సంపూర్ణ ప్రకృతిసిద్ధతలో జరుగుతుంది: ప్రశ్నించే వాని కోరికను మన్నించుటకు మరియు తనను పరిచయం చేసుకొనుటకు ఒక ప్రకాశవంతుడు, నిజమైన స్నేహితుడు, బల్లవద్ద ఉన్నప్పుడు ఒక చీకటి-వాడు ముందుకు చొచ్చుకొని వచ్చినట్లైతే, అప్పుడు ఆ ప్రకాశవంతుడు తప్పక వెనుకకు జరగవలసియుంటుంది, కాగా ఆ చీకటివాడు బల్ల యొక్క వాహకత్వ-పదార్థం ద్వారా ఎక్కువ బలాన్ని పొందగలడు, ఎందుకంటే సమస్త పదార్థత ప్రస్తుతం చీకటి యొక్క అసలైన క్షేత్రమైయున్నది.
ఆ తప్పును, పదార్థపు వస్తువులను ఎన్నుకొన్న మనిషిచేస్తాడు మరియు ఆ విధంగా మొదటినుండే ఒక అసమానమైన నేలను సిద్ధపరుస్తాడు. ఆ అధికసాంద్రత గలది, బరువైనది, అనగా చీకటిది స్థూలపదార్థానికి తన సాంద్రతలో, ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన, తేలికైన దానికంటే మరింత చేరువలో ఉంటుంది మరియు ఆ దగ్గరి సంబంధం ద్వారా మరింత గొప్ప శక్తిని కలిగియుంటుంది.
మరొక ప్రక్క, పదార్థత ద్వారా తనను ఇంకా పరిచయం చేసుకోగలిగే ఆ ప్రకాశవంతుడు కూడా అదే విధంగా, దానికి కొంత స్థాయివరకు దగ్గరగా వచ్చే సాంద్రతను ఇంకా కలిగియుంటాడు, లేనిచో ఏదైనా ప్రకటనను చేయుటకు పదార్థతతో ఆ అనుసంధానం ఆపై అసలు ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు. పదార్థతకు దగ్గరగా వచ్చుటను అది నిర్దేశిస్తుంది, అది తిరిగి పదార్థత ద్వారా చీకటితో అనుసంధానం కలిగిన వెంటనే మలినపడుటకు ఒక అవకాశాన్ని కలుగజేస్తుంది.
ఒక చీకటి-వాడు జోక్యం చేసుకొన్న వెంటనే ఆ అపాయాన్ని తప్పించుకొనుటకు ప్రకాశవంతునికి పదార్థతనుండి, అనగా ఆ బల్ల లేక ఒక ఇతరమైన సహాయసాధనంనుండి, సత్వరం తనను ఉపసంహరించు కొనుట తప్ప వేరొక మార్గం ఉండదు, తద్వారా అతడు, సహజమైన, వేరుగావుంచే మరియు ఆ విధంగా రక్షణను కలుగజేసే అగాధంపై ఒక వారధిని నిర్మించియుండే లంకెను తెంచివేయుటకు.
అప్పుడు ఆవలిలోకంలో అటువంటి సందర్భాలలో బల్లద్వారా ప్రయోగంచేసే మనిషి అధమమైన ప్రభావాలకు వదిలివేయబడుట తప్పక అనివార్యమౌతుంది. నిజానికి అతడు తన స్వంత చర్య ద్వారా వేరొక దానిని ఆశించలేదు కదా; కాగా శాసనాల గురించిన అజ్ఞానం ఇక్కడ కూడా అతన్ని కాపాడలేదు.
ఈ ప్రక్రియ ద్వారా చాలామందికి ఇప్పటివరకు వివరించ బడలేని దానిలో చాలా మటుకు స్పష్టమౌతుంది, అంతుచిక్కని అనేక వైరుధ్యాలు పరిష్కరించబడతాయి. మరి ఇప్పుడు ఇంకా చాలామంది మనుష్యులు అటువంటి అపాయకరమైన ఆటవస్తువుల జోలికిపోకుండా ఉంటారని ఆశించాలి!
ఇప్పుడు అంతే సవివరమైన రీతిలో సమస్తమైన ఇతర ప్రయోగాల యొక్క ఇంకా పెద్దవైన మరియు బలమైన అపాయాలను వర్ణించవచ్చు. కాని అత్యంత వాడుకలోవున్న మరియు వ్యాపించియున్న ఈ విషయాలతో ఇప్పటికి సరిపోతుంది.
కేవలం మరొక్క అపాయం ప్రస్తావించబడవలెను. ఈ విధంగా ప్రశ్నించుట ద్వారా మరియు జవాబులు, సలహాలు అర్థించుట ద్వారా మనుష్యులు తమను చాలా అస్వతంత్రులనుగా మరియు పరాధీనులనుగా చేసుకొంటారు. భౌతిక జీవితం కలిగియున్న ఉద్దేశానికి అది వ్యతిరేకమైనది.
ఆ మార్గం ప్రతియొక్క దిశలోనూ తప్పే! అది కేవలం నష్టాన్ని కలుగజేస్తుంది, ఎటువంటి ఉపయోగాన్నీ కాదు. అది, ఏవగింపును కలిగించే పురుగులతో పదే పదే కలిసే అపాయం ఎక్కడ ఉన్నదో అక్కడ నేలపై ప్రాకుట, తన శక్తులను వ్యర్థంచేయుట మరియు చివరకు పూర్తిగా అలిసిపోయి దారిలో పడియుండుటయైయున్నది … ఏ కారణం లేకుండానే!
అయితే ఈ “పరిశోధించే కోరిక” ద్వారా ఆవలిలోకస్తులకు కూడా గొప్ప నష్టం కలుగజేయబడుతుంది.
చాలామంది చీకటి-వారికి దానితో అవకాశం కల్పించ బడుతుంది, దానితో వారు నేరుగా, దుష్టమైనదానిని చేయుటకు మరియు తమపై క్రొత్తనేరాన్ని మోపుకొనుటకు ప్రలోభపెట్టబడతారు కూడా. అట్లు జరగని పక్షంలో దానిని చేయుటకు వారు అంత సులభంగా ముందుకు వచ్చియుండగలిగే వారు కాదు. మరి ఇతరులైతే కోరికల మరియు ఆలోచనల నిరంతరం కొనసాగే బంధనం ద్వారా తమ ఆరోహణ కృషిలో వెనుకకు లాగబడతారు.
స్పష్టంగా పరిశీలించినప్పుడు ఈ పరిశోధనాప్రక్రియ తరచుగా ఎంత కుర్రతనపు మొండితనంగా, ఎంత అత్యంత నిర్లక్ష్యంతో కూడిన స్వార్థమును కలిగియున్న దానిగా, ఇంకా ఎంత వికారంగా కనిపిస్తుందంటే, చూసేవాడు తలవిదిలిస్తూ తప్పక ప్రశ్నించుకోవలసియుంటుంది, ఇది అసలు ఎట్లు సంభవమని, ఎట్లు ఎవడైనా సర్వజనులకు, తనకే స్వయంగా కేవలం ఒక్క అడుగంత కూడా తెలియని ఒక క్షేత్రాన్ని తెరువగోరతాడో.
ఆ సమస్తమైన వెదుకుట అంత బహిరంగంగా జరుగుట కూడా తప్పే. దానితో స్వాప్నికులకు మరియు ధూర్తులకు మార్గం సుగమం చేయబడుతుంది మరియు మానవాళికి విశ్వాసాన్ని పొందుట కష్టతరం చేయబడుతుంది.
ఏ విషయంలో కూడా ఇది ఏనాడూ జరుగలేదు. మరియు నేడు సంపూర్ణంగా సఫలమైనట్లు గుర్తించబడే ప్రతి పరిశోధన మునుపు, వెదికే సమయంలో అనేక వైఫల్యాలను కలిగి యుండింది. కాని సర్వజనులు వాటిని అనుభవించుట నివారించబడింది! వారు దానిద్వారా అలసట చెందుతారు మరియు కాలక్రమేణా ప్రతివిధమైన ఆసక్తిని కోల్పోతారు. దాని పర్యవసానం ఏమిటంటే, ఎట్టకేలకు నిజం కనుగొన బడినప్పుడు, విప్లవాత్మకమైన మరియు సమూలంగా మార్చివేయగల ఉత్సాహం, తప్పక అంతకు ముందే కోల్పోబడవలసియుంటుంది. సమస్తాన్ని ఒప్పిస్తూ నడిపించగలిగే ప్రహర్షాన్ని మానవాళి ఇకపై కూడగట్టుకోలేదు.
తప్పుడు మార్గాలను గుర్తించుచున్నప్పుడు తగిలే ఎదురుదెబ్బలు చాలామంది శత్రువుల చేతులలో పదునైన ఆయుధాలు అవుతాయి, అవి కాలక్రమేణా ఎటువంటి అపనమ్మకాన్ని లక్షలాదిమంది మనుష్యుల మనసుల్లో నాటుకొనునట్లు చేస్తాయంటే, ఆ అత్యంత దౌర్భాగ్యులు సత్యము ప్రత్యక్షమైనప్పుడు మరియు క్రొత్త భంగపాటుకు పూర్తిగా భయపడుతూ దానిని ఆపై పట్టుదలతో పరీక్షించ గోరరు! సాధారణంగా తెరచియుండే తమ చెవులను వారు మూసుకొంటారు, మరియు ఆ విధంగా వారు, వారికి వెలుగుదిశగా ఆరోహించుటకు అవకాశాన్ని ఇచ్చియుండ గలిగే, సమయం యొక్క చివరి వ్యవధిని వృధాచేస్తారు.
దానితో అప్పుడు చీకటి ఒక క్రొత్త విజయాన్ని పొందుతుంది! తన కృతజ్ఞతను అది, దానికి తమ చేతులను అందించి, సంతోషంగా మరియు గర్వంగా ఆధునిక మానసికశాస్త్రాలకు నాయకత్వం వహించుటకు తమను సిద్ధపరచుకొన్న పరిశోధకులకు తెలుపగలదు!