అనగనగా ఒకనాడు…!

ఇవి రెండే పదాలైనా ఒక మంత్రసూత్రాన్ని పోలియున్నాయి; కాగా ఇవి తమలో, ప్రతిమనిషిలో సత్వరమే ఏదో ఒక విశేషమైన అంతఃకరణానుభూతిని పుట్టించే ప్రత్యేకతను కలిగియున్నాయి. ఈ అంతఃకరణానుభూతి అరుదుగా ఒకే రకంగా ఉంటుంది. సంగీతం యొక్క ప్రభావంవలే. సరిగ్గా సంగీతంలాగే ఈ రెండు మాటలు కూడా నేరుగా మనిషి యొక్క ఆత్మను, అతని నిజమైన “అహాన్ని” చేరుతాయి. సహజంగా కేవలం ఎవరైతే ఆత్మను తమలో పూర్తిగా మూసివేసి తద్వారా నిజమైన మానవత్వాన్ని భూమిపై ఇప్పటికే కోల్పోయి ఉండరో వారి విషయంలో మాత్రమే అది జరుగుతుంది.

కాని ప్రతి మనిషి ఈ మాటలను విన్నప్పుడు అసంకల్పంగా తక్షణమే ఏదో ఒక పూర్వానుభావాన్ని గుర్తుచేసుకొంటాడు. అది అతని ఎదుట సజీవంగా నిలుస్తుంది మరియు ఆ చిత్రంతోపాటు దానికి అనుగుణమైన అంతఃకరణానుభూతి కూడా.

ఒకరి విషయంలో అది కాంక్షతోకూడిన మృదుత్వమై యుంటుంది, బాధతోకూడిన సంతోషము లేక మౌనమైన, తీర్చబడలేని వాంఛయై కూడా ఉంటుంది. ఇతరుల విషయంలోనైతే గర్వం, క్రోధం, భయం లేక ద్వేషమై యుంటుంది. మనిషి ఎల్లప్పుడు, దేనిని అతడు ఒకప్పుడు అనుభవించాడో, ఏది అతనిపై అసాధారణమైన ప్రభావాన్ని చూపిందో, ఏది తనలో ఎప్పుడో చెరిపివేయబడింది అనుకొన్నాడో, అటువంటి ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తాడు.

అయితే ఏదీ కూడా అతనిలో చెరిపివేయబడలేదు, అతడు ఒకనాడు వాస్తవంగా అనుభవించిన దానిలోనుండి దేనిని కూడా కోల్పోలేదు. ఆ సమస్తాన్ని అతడు నిజంగా ఆర్జించిన దానిగా మరియు తద్వారా గతించలేని దానిగా, ఇంకా తన స్వంతం అనవచ్చు. కాని కేవలం నిజంగా అనుభవించినది మాత్రమే! ఈ మాటలతో వేరొకటి ఉద్భవించలేదు.

మనిషి ఒకసారి జాగ్రత్తతో మరియు అప్రమత్తమైన మెదడుతో దానిని సరిగ్గా గమనించవలెను, అప్పుడు అతడు త్వరలోనే గుర్తిస్తాడు, ఏది నిజంగా తనలో సజీవంగా ఉన్నదో, మరియు ఏది అర్థంలేని జ్ఞాపకాల యొక్క ఒక జీవములేని తొడుగుగా మరణించిన దానిగా పిలువబడవచ్చో.

ఉద్దేశాన్ని మరియు ప్రయోజనాన్ని మనిషికి, – మనిషి అన్నప్పుడు మనం శరీరం అనుకోరాదు – ఏదైతే అతని జీవాత్మపై ఒక గతించని, చెరిపివేయలేని ముద్రను వేయుటకు అతని భౌతిక జీవితకాలంలో అతన్ని తగినంత లోతుగా ప్రభావితం చేసిందో, అది మాత్రమే కలిగియుంటుంది. కేవలం అటువంటి ముద్రలే జీవాత్మ రూపొందుటపై ప్రభావాన్ని కలిగియుంటాయి మరియు దానితో ముందుకుసాగుతూ ఆత్మ యొక్క పురోగతిపైన కూడా, దాని నిరంతర అభివృద్ధికొరకు.

అనగా కేవలం ఏదైతే అటువంటి లోతైన ముద్రను వేస్తుందో అది మాత్రమే నిజంగా అనుభవించినది మరియు తద్వారా స్వంతమైనది. మిగతాదంతా ప్రభావం లేకుండా పైనుండి దూసుకుపోతుంది లేక మహా అంటే అటువంటి గొప్ప అనుభవాలను కలుగజేయుటకు సంఘటనలను రూపొందింపజేయుటకు సహాయకంగా ఉపయోగపడుతుంది.

ఎవడు అటువంటి శక్తివంతమైన చాలా అనుభవాలను, అవి కలుగజేసింది సంతోషమా లేక దుఃఖమా అనేదానితో సంబంధం లేకుండా, తన స్వంతం అనగలడో, వాడు ధన్యుడు; కాగా వాటి ప్రభావాలు ఒకనాడు మనుష్యజీవాత్మ ఆవలిలోకానికిపోయే తన మార్గంపై వెంటతీసుకొనిపోయే అత్యంత విలువైనవైయుంటాయి. –

నేడు వాడుకలో ఉన్నట్టి స్వచ్ఛమైన భూలోక మేధో కార్యము, కేవలం మంచిగా వాడినప్పుడే శరీరసంబంధమైన భూలోక ఉనికిని సులభతరం చేయుటకు ఉపయోగపడు తుంది. నిశితంగా ఆలోచించినట్లైతే, అదే మేధస్సు చేసే ప్రతి పని యొక్క అసలైన చివరి ధ్యేయం! చివరిగా చూసినట్లైతే ఎప్పటికీ వేరొక ఫలితం ఉండదు, సమస్త పాండిత్యం విషయంలో, అది ఏ పాఠ్యాంశమైనా, మరియు సమస్త కలాపంలో, అది ప్రభుత్వవ్యవస్థలోకాని లేక కుటుంబంలోకాని, ప్రతియొక్క మనిషి విషయంలోకాని లేక దేశాల విషయంలో కాని, చివరకు సంపూర్ణ మానవాళి విషయంలో కూడా.

అయితే సమస్తం కూడా దురదృష్టవశాత్తు పూర్తిగా బేషరతుగా కేవలం మేధస్సుకు మాత్రమే లొంగిపోయింది మరియు దానితో గ్రహణసమర్థత యొక్క భూలోక సంకుచితత్వపు బరువైన గొలుసులతో కట్టివేయబడి యున్నది; సహజంగా అది సమస్త కార్యంలో మరియు సంఘటనల్లో దురదృష్టకరమైన పరిణామాలను తప్పక కలుగజేయవలసియుండింది మరియు ఇకపై కూడా కలుగజేస్తుంది.

భూమియంతటిలో ఆ విషయంలో కేవలం ఒక్క మినహాయింపు మాత్రమే ఉన్నది. అయితే ఆ మినహాయింపును చాలామంది భావించునట్లు మరియు నిజానికి ఆ విధంగా ఉండవలసియున్నట్లు, చర్చి మనకివ్వదు, కాని కళ ఇస్తుంది! ఈ విషయంలో మేధస్సు అనివార్యంగా ద్వితీయ పాత్రను పోషిస్తుంది. కాని ఎక్కడ మేధస్సు పైచేయిని సంపాదిస్తుందో అక్కడ కళ తక్షణమే వృత్తిపనిగా దిగజార్చబడుతుంది; అది నేరుగా మరియు పూర్తిగా నిర్వివాదంగా లోతుకు దిగజారిపోతుంది. ఇది సాధారణమైన సహజత్వంలో వేరొక విధంగా అసలు సాధ్యంకాని పరిణామమైయున్నది. ఒక్క మినహాయింపు కూడా దానిలో రుజువుచేయబడలేదు.

అదే నిర్ధారణ సహజంగా వేరే విషయాలన్నింటిలో కూడా చేయబడవలసియుంటుంది! అది మనిషిని ఆలోచింప జేయదా? అది అతనికి, అతని కళ్లనుండి పొలుసులు పడిపోయినట్లు ఉండవలసింది కదా. ఆలోచించేవానికి మరియు సరిపోల్చేవానికి అది చాలా స్పష్టంగా చెబుతుంది, మేధస్సు ఆధిపత్యం కలిగియుండే వేరే విషయాలన్నింటిలో అతడు కేవలం ఒక ప్రత్యమ్నాయాన్ని మాత్రమే, తక్కువ నాణ్యతగల దానినే పొందగలడని! ఈ వాస్తవం ద్వారా మనిషి, ఏదైనా సరియైనది మరియు విలువైనది ఉద్భవించవలసినప్పుడు, ప్రకృతిసిద్ధంగా ఏ స్థానం మేధస్సుకు చెందుతుందనే విషయాన్ని గుర్తించవలెను!

ఇంతవరకు కేవలం కళ మాత్రమే సజీవమైన ఆత్మ యొక్క కార్యంనుండి, అంతఃకరణానుభూతినుండి ఉద్భవించింది. అది ఒక్కటే ఒక సహజమైన, అనగా సాధారణమైన ఆరోగ్యమైన మూలాన్ని మరియు అభివృద్ధిని కలిగి యుండింది. అయితే ఆత్మ తనను మేధస్సులో కాదు కాని అంతఃకరణానుభూతులలో వ్యక్తపరచుకొంటుంది, మరియు మనిషి సాధారణంగా *“అంతరాత్మ” అని పిలిచే దానిలో మాత్రమే తనను కనబరచుకొంటుంది. సరిగ్గా దానినే అపరిమితంగా గర్విష్టియైన ఈనాటి మేధో మనిషి ఇష్టపూర్వకంగా వెక్కిరిస్తాడు మరియు అపహాస్యం చేస్తాడు. దానితో అతడు మనిషిలోని అత్యంత విలువైన దానిని హేళనచేస్తాడు. నిజానికి, సరిగ్గా ఏదైతే మనిషిని అసలు మనిషిగా చేస్తుందో దానిని!

మేధస్సుతో ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. మనిషి ఎట్టకేలకు సమస్తంలో మెరుగును ఆశించినట్లైతే అతడు తప్పక: “వారి కార్యముల ద్వారా మీరు వారిని తెలుసుకొన వలెను!” అనే క్రీస్తు వాక్యాన్ని గమనించవలసియుంటుంది. అది జరగబోయే సమయం ఇప్పుడు ఆసన్నమైనది.

కేవలం ఆత్మ యొక్క కార్యాలే అవి ఉనికిలోనికి వచ్చినప్పటినుండి తమలో జీవాన్ని, దానితోపాటు సుదీర్ఘమైన మనుగడను మరియు స్థిరత్వాన్ని కలిగి యుంటాయి. వేరైనదంతా దాని వికసించే సమయం ముగిసినప్పుడు తప్పక తనలో తాను పతనం కావలసి యుంటుంది. ఫలాలు రావలసిన సమయం దానికి వచ్చిన వెంటనే దాని గొడ్డుతనం వెల్లడియవుతుంది!

ఒక్కసారి కేవలం చరిత్రనే చూడండి! ఆత్మ యొక్క కార్యం ఒక్కటే, అనగా కళ మాత్రమే, తమ జీవంలేని, అనాదరమైన మేధస్సు యొక్క కార్యం ద్వారా పతనమైన జాతుల కంటే ఎక్కువకాలం నిలిచింది. వారి ఉన్నతమైన, చాలా ప్రసిద్ధిగాంచిన జ్ఞానం వారికి దానినుండి ఎటువంటి రక్షణను ఇవ్వలేకపోయింది. ఈజిప్టువారు, గ్రీకువారు, రోమీయులు ఈ మార్గంలోనే పోయారు, ఆ తరువాత ఫ్రెంచివారు, స్పెయినువారు కూడా, ఇప్పుడు జర్మనీవారు – అయితే నిజమైన కళ యొక్క కార్యాలన్నీ వారందరికంటే ఎక్కువకాలం జీవించాయి! అవి ఎప్పటికీ కూడా నశించలేవు. కాని ఎవ్వరూ కూడా ఆ సంఘటనల పునరావృత్తాలలోవున్న ఖచ్చితమైన క్రమబద్ధతను గమనించలేదు. ఏ మనిషి కూడా ఆ గొప్ప చెడు యొక్క నిజమైన మూలాన్ని కనుగొనుటను గురించి ఆలోచించలేదు.

దానిని వెదుకుటకు బదులు, మరియు నిరంతరం పునరావృత్తమయ్యే క్షయాన్ని ఒకసారి ఆపుటకు బదులు, మనుష్యులు గ్రుడ్డిగా దానికి లొంగిపోయారు మరియు ఫిర్యాదుచేస్తూ మరియు ఘోషిస్తూ ఆ గొప్ప “ఏది కూడా మార్చబడలేదు” అనే భావనకు అణుకువగా ఉండియున్నారు.

ఇప్పుడు అది చివరకు సమస్త మానవాళిపై దెబ్బతీస్తుంది! ఎంతో యాతన గడచిపోయింది, దానికంటే మరింత గొప్పది మనకు రాబోతుంది. మరియు లోతైన బాధ దానికి ఇప్పటికే కొంతవరకు గురియైన వారి దట్టమైన శ్రేణులగుండా సాగుతున్నది.

తమ ఉచ్ఛదశను, మేధస్సు యొక్క తారాస్థాయిని చేరిన వెంటనే తప్పక పతనమైపోయిన జాతులను గురించి ఆలోచించండి. వికాసంలోనుండి ఉద్భవించే ఫలాలు అంతటా ఒకటే విధంగా ఉండినవి! అవి అనైతికత, సిగ్గులేనితనము మరియు పలువిధమైన రూపాలలో తిండిపోతుతనము. అనివార్యమైన క్షయము మరియు పతనము వాటిని అనుసరించాయి.

ఆ ఖచ్చితమైన సామ్యత ప్రతిమనిషికి చాలా స్పష్టంగా కనబడుతుంది! మరియు ఆలోచించే ప్రతివాడు కూడా ఆ ప్రక్రియలో తప్పక అత్యంత కఠినమైన శాసనాల యొక్క ఒక నిర్దిష్టమైన పద్ధతిని మరియు క్రమబద్ధతను కనుగొనవలసి యుంటుంది.

ఈ జాతులు ఒకదాని తరువాత మరొకటి చివరకు, తమ గొప్పతనము, అధికారము మరియు వైభవాలు కేవలం దృశ్యమానవైయుండినవని, అవి హింస మరియు బలత్కారం ద్వారా మాత్రమే నిలబెట్టబడినవని, ఆరోగ్యవంతంగా అవి తమలో దృఢపడియుండలేదని, తప్పక గుర్తించవలసి వచ్చింది.

నిరాశపడుటకు బదులుగా మీ కళ్లను తెరవండి! మీ చుట్టూ చూడండి, గతంనుండి నేర్చుకోండి, దైవత్వంనుండి వేల సంవత్సరాలకు ముందే మీకు చేరిన సందేశాలతో దానిని సరిపోల్చండి, అప్పుడు మీరు, మ్రింగివేసే చెడు యొక్క మూలాన్ని తప్పక కనుగొనవలసియుంటుంది, అది ఒక్కటే ఒంటరిగా సమస్త మానవాళి యొక్క ఆరోహణకు అడ్డంకిని నిర్మిస్తుంది.

ఆ చెడు సమూలంగా నాశనం చేయబడినప్పుడు మాత్రమే సర్వతోముఖ ఆరోహణకు మార్గం తెరువబడి యుంటుంది, అంతకుముందు కాదు. మరియు అది అప్పుడు స్థిరమైనదైయుంటుంది, ఎందుకంటే అది, ఇంతవరకు అసాధ్యమైయుండిన, ఆత్మ యొక్క సజీవతను తనలో కలిగియుండగలదు. –

ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించకముందు నేను, మనిషిలోని ఏకైక, నిజంగా సజీవమైయున్న ఆత్మ అంటే ఏమిటో వివరించగోరుతున్నాను. ఆత్మ అంటే బుద్ధి కాదు మరియు మేధస్సు కాదు! ఆత్మ అంటే నేర్చుకొన్న విద్య కూడా కాదు. అందువల్ల ఒకవేళ ఒక మనిషి చాలా చదువుకొని యుంటే, పఠించియుండినట్లైతే, గమనించియుండినట్లైతే మరియు దాని గురించి బాగా మాట్లాడుటను ఎరిగియున్నట్లైతే అతన్ని తప్పుగా “ఆత్మసంపన్నుడు” అంటారు. లేక అతడు మంచి ఆలోచల ద్వారా మరియు మేధోచాతుర్యము ద్వారా చాలా మెప్పుపొందినప్పుడు సహితం అది తప్పే.

ఆత్మ పూర్తిగా వేరైనది. అది తన సజాతీయ లోకం లోనుండి వచ్చే ఒక స్వతంత్రమైన సంగతత్వమైయున్నది. ఆ లోకము, ఏ భాగానికి భూమి మరియు దానితోపాటు శరీరం చెందియున్నవో దానికి వేరైనది. ఆత్మీయ లోకం మరింత ఎత్తున ఉన్నది. అది సృష్టి యొక్క ఎగువనవున్న మరియు అత్యంత తేలికైన భాగాన్ని నిర్మిస్తుంది. మనిషిలోని ఈ ఆత్మీయమైన భాగం తన సంగతత్వం ద్వారా, సమస్త పదార్థపు తొడుగులు దానినుండి విడిపోయిన వెంటనే, ఆత్మికత వైపుగా తిరిగిపోవలసిన బాధ్యతను తనలో కలిగి యున్నది. దానికొరకైన ప్రేరణ పరిపక్వత యొక్క ఒక నిర్దిష్టమైన స్థాయి వద్ద ఉద్భవిస్తుంది మరియు ఆ ప్రేరణ అప్పుడు, సజాతీయత యొక్క ఆకర్షణ ద్వారా పైకెత్తబడుతున్న ఆ ఆత్మను దాని సజాతీయత దిశగా పైకి నడిపిస్తుంది.[^*]

[^*] ఉపన్యాసం: “నేనే పునరుత్థానమును మరియు జీవమునైయున్నాను”

ఆత్మకు భూలోక మేధస్సుతో ఎటువంటి సంబంధం లేదు, కేవలం మనిషి యొక్క “అంతరాత్మ” అని పిలువబడే గుణంతో మాత్రమే. అందువల్ల ఆత్మసంపన్నుడు అంటే “అంతరాత్మలో సంపన్నుడు” అని మాత్రమే అర్థం కాని మేధోసంపన్నుడని కాదు.

ఈ వ్యత్యాసాన్ని సులువుగా కనుగొనుటకు మనిషి “అనగనగా ఒకనాడు!” అనే వాక్యాన్ని ఉపయోగించాలి. చాలామంది అన్వేషకులు ఆ ఒక్కదాని ద్వారానే స్పష్టతను పొందుతారు. వారు తమను తాము జాగ్రత్తగా గమనించినట్లైతే, ఇదివరకటి భౌతికజీవితంలో ఏ విషయాలన్నీ తమ జీవాత్మకు సహాయపడ్డాయో, లేక ఏవి వారికి కేవలం మనుగడను మరియు వారి భూలోక పరిసరాలలో తమ కార్యమును సులభతరం చేశాయో గుర్తించగల్గుతారు. అనగా ఏది కేవలం భూలొక విలువలనే కాక ఆవలిలోక విలువలను కూడా కలిగియున్నదో, మరియు ఏది కేవలం భౌతిక అవసరాలకు పనికివస్తుందే కాని ఆవలిలోకానికి విలువలేనిదై ఉంటుందో అనే విషయాన్ని కూడా. ఒక దానిని మనిషి తనతోపాటు ఆవలిలోకానికి తీసుకొనిపోగలడు, అయితే ఆ వేరొక దానిని, అతడు గతించినప్పుడు, ఇక్కడి వాటికి చెందినదానిగా, ఇక్కడే వదిలివేస్తాడు, ఎందుకంటే అది ఆపై పనికిరాదు కాబట్టి. అయితే దేనిని అతడు వదిలివేస్తాడో అది కేవలం భౌతిక కలాపాలకు సాధనము, భౌతికకాలానికి సహాయసాధనమే తప్ప మరేమీ కాదు.

ఒకవేళ ఒక సాధనము, సాధనంవలే మాత్రమే వాడబడకుండా చాలా ఉన్నతమైన దానిగా విలువకట్టబడినట్లైతే, సహజంగా అది ఆ ఉన్నతస్థాయి యొక్క సవాళ్లకు తట్టుకోలేదు; అది తప్పు స్థానంలో ఉన్నది, తద్వారా ప్రకృతికనుగుణంగా పలువిధమైన లోపాలను కలుగజేస్తుంది, కాలక్రమంలో అవి ఎంతో అరిష్టమైన పరిణామాలను వెంటతెస్తాయి.

ఈ సాధనాలకు భూలోకమేధస్సు అన్నింటికంటే ఎగువనవున్న దానిగా చెందియున్నది. సమస్త శరీర-స్థూలపదార్థత, తన స్వీయస్వభావం ద్వారా, ఏ పరిమితికి ఎల్లప్పుడు లోబడియుంటుందో దానిని మనిషి మెదడు యొక్క ఉత్పాదనగా భూలోకమేధస్సు తనలో తప్పక కలిగియుండవలసియుంటుంది. మరియు ఆ ఉత్పాదన తన మూలానికి వేరుగా ఉండలేదు. అది ఎల్లప్పుడు తన మూలం యొక్క జాతితో ముడివేయబడియుంటుంది. అదే విధంగా ఆ ఉత్పాదనలోనుండి ఉద్భవించిన కార్యాలు కూడా.

దాని ఫలితంగా మేధస్సుకు ప్రకృతిసిద్ధంగా అత్యంత సంకుచితమైన, స్థలకాలములతొ దగ్గరగా ముడివేయబడిన, భూలోక గ్రహణసామర్థ్యత మాత్రమే ఉంటుంది. తనలో జడత్వాన్ని కలిగియున్న, తనలో ఎటువంటి స్వంత జీవాన్ని కలిగియుండని స్థూలపదార్థతలోనుండి అది ఉద్భవిస్తున్న కారణంగా, అది కూడా తనలో ఎటువంటి సజీవమైన శక్తిని కలిగియుండదు. ఈ పరిస్థితి సహజంగా అదే విధంగా మేధస్సు యొక్క సమస్త కార్యంలో కొనసాగుతుంది. తద్వారా దానికి తన కార్యాలకు సజీవతను అందించుట అసంభవమౌతుంది.

ఈ చిన్న భూమిపై మనుష్యుని భూలోకమనుగడలో సాగే అసంతృప్తికరమైన కార్యకలాపాలకు మూలం మార్చబడలేని ఈ సహజమైన గమనంలోనే ఉంటుంది.

మనం ఎట్టకేలకు ఆత్మకు మరియు మేధస్సుకు మధ్య, మనిషి యొక్క సజీవమైన మూలానికి మరియు అతని సాధనానికి మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించుటను తప్పక నేర్చుకోవలసియుంటుంది! ఇప్పటివరకు జరిగినట్లు ఈ సాధనం సజీవమైన మూలం ఎగువన ఉంచబడినట్లైతే, అనారోగ్యకరమైనది దాని ఫలితమైయుంటుంది. ఆ అనారోగ్యమైనది తన ప్రారంభ దశనుండే తనలో మరణపువిత్తనాన్ని తప్పక కలిగియుంటుంది. తద్వారా ఆ సజీవమైనది, అత్యున్నతమైనది, అత్యంత విలువైనది అణిచివేయబడుతుంది, కట్టివేయబడుతుంది, దాని యొక్క అవసరమైన కలాపంనుండి తెంపివేయబడుతుంది, అది ఆ స్థితిలో కొనసాగుతూ, జడత్వంతోకూడిన నిర్మాణం అనివార్యంగా పతననమైనప్పుడు, దాని శిథిలాలలోనుండి, అసంపూర్ణ స్థితిలో, స్వేచ్ఛగా అరోహించునంతవరకు.

ఇప్పుడు మనం “అనగనగా ఒకనాడు” అనే దానికి బదులుగా “పూర్వకాలంలో ఎట్లు ఉండింది?” అనే ప్రశ్నను ఊహించుకొందాం. దాని ప్రభావం ఎంత వేరుగా ఉంటుంది. ఆ గొప్ప వ్యత్యాసాన్ని మనం వెంటనే గమనిస్తాం. ఆ మొదటి ప్రశ్న ఆత్మతో అనుసంధానించబడియున్న అంతఃకరణానుభూతితో మాట్లాడుతుంది. అయితే ఆ రెండవ ప్రశ్న మేధస్సును ఉద్దేశించి వేయబడుతుంది. పూర్తిగా వేరైన చిత్రాలు ఆ ప్రక్రియలో ఉద్భవిస్తాయి. అవి ప్రారంభంనుండే సంకుచితమైనవి, అనాదరమైనవైయుంటాయి, జీవపువెచ్చదనాన్ని తమలో కలిగియుండవు, ఎందుకంటే మేధస్సు వేరొక దానిని దేనినీ అందించలేదు కాబట్టి.

ప్రారంభంనుండే మానవాళి చేసిన అత్యంత పెద్ద తప్పు ఏమిటంటే, అది, కేవలం అసంపూర్ణమైన దానిని, జీవంలేని దానిని ఉత్పత్తిచేయగల మేధస్సును ఒక ఎత్తైన పీఠంపైన ఉంచింది మరియు దాని చుట్టూ ఆరాధిస్తూ లాంఛనంగా నాట్యం చేసింది. కేవలం ఆత్మకొరకు మాత్రమే ప్రత్యేకించబడియుండవలసిన ఆ స్థలాన్ని మనిషి దానికిచ్చాడు.

ఆ కార్యము సృష్టికర్త యొక్క నియమాలకు సమస్తంలో ఎదురు నిలిచియున్నది మరియు తద్వారా ప్రకృతికి వ్యతిరేకంగా కూడా, ఎందుకంటే అవి ప్రకృతి యొక్క కలాపంలో నాటబడియున్నాయి కాబట్టి. అందువల్ల ఏదియు కూడా ఒక నిజమైన గమ్యం యొద్దకు నడిపించలేదు, కాని ఎక్కడ పంట ప్రారంభం కావలసియున్నదో ఆ స్థానంలో సమస్తం తప్పక విఫలం కావలసియుంటుంది. అది వేరొక విధంగా జరుగుటకు అసాధ్యమైన, ముందుగానే ఊహించుకోగలిగే ఒక సహజమైన ప్రక్రియయైయున్నది.

కేవలం సంపూర్ణంగా సాంకేతికమైన విషయంలో, ప్రతి పరిశ్రమలో మాత్రమే అది వేరుగా ఉంటుంది. అది మేధస్సు ద్వారా ఎంతో ఉన్నతమైన స్థాయిని చేరియున్నది మరియు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధిచెందుతుంది! అయితే ఈ వాస్తవం నా వివరణల యొక్క సత్యానికి ఒక రుజువుగా పనిచేస్తుంది. సాంకేతికత అన్ని విషయాలలో పూర్తిగా భూలోక సంబంధమైనది, జీవంలేనిది మరియు ఆ విధంగానే కొనసాగుతుంది. మేధస్సుకూడా అదే విధంగా భూలోక సంబంధమైనది కాబట్టి, సాంకేతికతలో అది చాలా అద్భుతంగా అభివృద్ధికాగలదు, నిజంగా గొప్పదానిని సాధించగలదు. మేధస్సు దానిలో సరియైన స్థానంలో, దాని నిజమైన కర్తవ్యంలో నిలిచియున్నది!

అయితే ఎక్కడ “సజీవమైనది” కూడా, అనగా స్వచ్ఛంగా మానవసంబంధమైనది దానితోపాటు తప్పక పరిగణనలోనికి తీసుకొనబడవలెనో అక్కడ మేధస్సు తన జాతి ప్రకారం సరిపోదు మరియు అందువల్ల అది ఆ విషయంలో ఆత్మ ద్వారా నడిపించబడని వెంటనే తప్పక విఫలమౌతుంది. ఎందుకంటే, కేవలం ఆత్మ మాత్రమే జీవమైయున్నది. ఒక నిర్దిష్టమైన జాతిలో సఫలతను ఎల్లప్పుడు కేవలం సజాతీయత యొక్క కలాపం మాత్రమే తేగలదు. అందువల్ల భూలోక మేధస్సు ఎప్పటికీ కూడా ఆత్మలో పనిచేయలేదు! ఈ కారణంగా మేధస్సును జీవంకంటే పైన ఉంచుట మానవాళి యొక్క తీవ్రమైన నేరమైయున్నది.

మనిషి దానితో తన బాధ్యతను, సృజనాత్మకమైన, అనగా పూర్తిగా సహజమైన నియమానికి వ్యతిరేకంగా నేరుగా తలక్రిందులు చేశాడు, అనగా రెండవస్థానంలో మరియు భూలోకస్థానంలో ఉండవలసిన మేధస్సుకు అన్నింటికంటే పైనవున్న, సజీవమైన ఆత్మకు చెందవలసిన స్థానాన్ని ఇచ్చుట ద్వారా దానిని తలక్రిందులు చేశాడు. దాని ద్వారా ఇకపై అతడు క్రిందినుండి పైకి శ్రమతో వెదుకుటకు బలవంతపరచబడుట పూర్తిగా సహజమైనది. ఆ పరిస్థితిలో అతడు ఆత్మ ద్వారా పైనుండి క్రిందకు చూచుటకు బదులుగా, పైన ఉంచబడిన ఆ మేధస్సు తన యొక్క పరిమితమైన గ్రహణశక్తితో ప్రతి విశాలమైన వీక్షణను ఆటంకపరుస్తుంది.

అతడు మేల్కొనగోరినచో, ముందుగా “ఆ దీపాల స్థానాలను మార్చుటకు” అతడు నిర్బంధపరచబడతాడు. ప్రస్తుతం పైనవున్న మేధస్సును, దానికి ప్రకృతిసిద్ధంగా ఇవ్వబడిన స్థానంలో పెట్టుటకు మరియు ఆత్మను తిరిగి అన్నింటికంటే పైస్థానంలోనికి తెచ్చుటకు. ఈ ఆవశ్యకమైన స్థానమార్పిడి ఈనాటి మనిషికి ఇకపై అంత సులువుగా ఉండదు. –

సృష్టికర్త యొక్క చిత్తానికి, అనగా సృష్టి శాసనాలకు తీవ్రంగా వ్యతిరేకంగా నిలిచియుండిన మనుష్యుల యొక్క ఆనాటి స్థానమార్పిడి కార్యమే మనిషి యొక్క నిజమైన “పాపపతనమైయున్నది”, దాని పర్యవసానాలు అత్యంత ఘోరమైనవి; కాగా అది ఆ తరువాత “వారసత్వపాపంగా” అభివృద్ధిచెందింది, ఎందుకంటే, మేధస్సును ఏకైక పాలకునిగా హెచ్చించుట తిరిగి ప్రకృతిసిద్ధమైన మరియొక పరిణామాన్ని కలుగజేసింది; అదేమిటంటే, ఏకపక్షంగా శ్రద్ధచూపుట మరియు ఉపయోగించుట, కాలక్రమంలో మెదడును కూడా ఏకపక్షంగా బలపరచింది. ఆ కారణంగా, మేధస్సు యొక్క పనిని చేయవలసిన మెదడులోని భాగం మాత్రమే పెద్దగా పెరిగింది, మరియు ఆ వేరొక భాగం తప్పక కృశించిపోవలసివచ్చింది. దానివల్ల, అశ్రద్ధత ద్వారా కృశించిపోయిన ఆ భాగం నేడు కేవలం అవిశ్వసనీయమైన కలల-మెదడుగా మాత్రమే పనిచేయగలదు; ఆ ప్రక్రియలో కూడా అది మేధస్సును ఉపయోగించే పగటిమెదడు యొక్క బలమైన ప్రభావానికి లోనైయుంటుంది.

మెదడు యొక్క ఆ భాగం, ఏదైతే ఆత్మకు వారధిని, లేక నిజానికి ఆత్మనుండి సమస్త భూలోక సంబంధమైన దానికి వారధిని నిర్మించవలసియున్నదో, అది తద్వారా కుంటు పడింది, అనుసంధానం తెగిపోయింది లేక చాలా ఎక్కువగా సడలించబడింది, దాని ద్వారా మనిషి తనకు తాను ఆత్మ యొక్క ప్రతి కలాపాన్ని అడ్డగించాడు మరియు దానితోపాటు తన మేధస్సును “చైతన్యవంతం” చేయుటను, దానిని ఆత్మీయపరచుటను మరియు సజీవంగా చేయుటను కూడా.

మెదడు యొక్క ఆ రెండు భాగాలు పూర్తిగా సమానంగా పెంచబడియుండవలసింది, శరీరంలో అన్నింటివలే సామరస్యపూర్వకమైన ఉమ్మడి కలాపానికి, అనగా ఆత్మ నడిపిస్తూ, మేధస్సు ఇక్కడ భూమిపై అమలుచేస్తూ. ఆ కారణంగా శరీరం యొక్క సమస్త కలాపం, మరియు స్వయంగా శరీరం కూడా, ఏనాటికీ అవి ఎట్లు ఉండవలెనో అట్లు ఉండలేవనే విషయం సహజమే. ఈ ప్రక్రియ ప్రకృతికనుగుణంగా అన్నింటిలోనూ జరుగుతుంది! ఎందుకంటే, దానిలో సమస్త భూలోక సంబంధమైన విషయాలలో ప్రధానమైనది లోటైయుంటుంది కాబట్టి!

ఆ అడ్డుకొనుటతో అదే సమయంలో దైవత్వంనుండి ఎడబాటు మరియు వైమనస్యము జతపరచబడియున్నవనేది చాలా సులభంగా అర్థమయ్యే విషయం. నిజానికి దానికి ఆపై వేరొక మార్గం లేకుండింది.

అది తిరిగి చివరకు ఎటువంటి నష్టాన్ని తనలో కలిగియుండిందంటే, వేల సంవత్వరాల నుండే, జన్మించబడే ప్రతి బిడ్డ యొక్క శరీరం, క్రమంగా మరింత లోతుగా ప్రభావం చూపే వంశపారంపర్యం ద్వారా, చాలా పెద్దదైన ముందు భాగంలోవున్న మేధో-మెదడును తనతోపాటు భూమిపైకి తెస్తుంది. అది ఎంత పెద్దదంటే, ఆ పరిస్థితివల్ల ప్రతిబిడ్డ కూడా, మెదడు సంపూర్ణ కార్యకలాపాన్ని మొదలుపెట్టిన ప్రారంభదశనుండే వెంటనే, సునాయాసంగా దానికి లోబడునట్లు చేయబడుతుంది. ఆ రెండు భాగాల మధ్య అగాధం ఎంత పెరిగిందంటే, వాటి కార్యావకాశాల నిష్పత్తి ఎంత అసమానమంటే, మనుష్యులందరిలో అధికశాతం విషయంలో ఎటువంటి విపత్కరమైన జోక్యం లేకుండా మెరుగుబాటు ఇకపై కలుగజేయనీయలేదు.

ఈనాటి మేధో-మనిషి ఇక సాధారణమైన మనిషి ఏమాత్రమూ కాదు, కాని అతనికి, సంపూర్ణమైన మనిషి యొక్క లక్షణమైయున్న, అతని మెదడులోని ప్రధానభాగం యొక్క ఎదుగుదల, వేల సంవత్సరాలనుండి దానిని కృశింపజేయనిచ్చుట ద్వారా, లోటైయున్నది. మినహాయింపు లేకుండా ప్రతి మేధో-మనిషి కేవలం అంగవైకల్యాన్ని కలిగియున్న సాధారణమెదడును మాత్రమే కలిగియున్నాడు. అందువల్ల మెదడు-వికలాంగులు వేల సంవత్సరాలనుండే ఈ భూమిని ఏలుతున్నారు, సాధారణమైన మనిషిని వారు తమ శత్రువువలే పరిగణిస్తున్నారు మరియు అతనిని అణచి వేయుటకు ప్రయత్నిస్తున్నారు. తమ అంగవైకల్యంలో తాము చాలా సాధిస్తున్నామని వారు ఊహించుకొంటారు. మరియు వారికి తెలియదు, సాధారణమైన మనిషి అంతకు పదిరెట్లు సాదించుటకు తనలో సామర్థ్యతను కలిగియున్నాడని మరియు చాలాకాలం నిలిచే, ఇప్పటి ప్రయాసలకంటే మరింత సంపూర్ణతను కలిగియున్న కార్యాలను సాధిస్తాడని! ఈ సామర్థ్యతను పొందుటకు నిజంగా శ్రద్ధతో అన్వేషించే వానికి మార్గం తెరువబడియున్నది!

అయితే మేధో-మనిషి ఇకపై తన మెదడు యొక్క కృశించిన భాగానికి చెందిన కలాపంనుండి దేనినైనా గ్రహించుటకు అంత సునాయాసంగా సమర్థుడు కాలేడు! అతడు దానిని కోరుకొన్నా కూడా, అసలు చేయలేడు; మరియు అతడు, కేవలం అతని స్వచ్ఛంద సంకుచితత్వంలో, అతనికి అందని సమస్తాన్ని అపహసిస్తాడు; వాస్తవానికి, వెనుకబడియున్న, అసాధారణమైన అతని మెదడు కారణంగా అది అతని ద్వారా ఇకపై ఎన్నటికీ గ్రహించబడలేదు.

ఈ సహజమైన మతిభ్రమ-శాపం యొక్క అత్యంత భయంకరమైన భాగం సరిగ్గా దానిలోనే ఉన్నది. ఒక సాధారణ మనిషికి నిశ్చయంగా చెందే మానవమెదడు యొక్క రెండు భాగాల సామరస్యపూర్వక సహకారం, భౌతికవాదులు అని పిలువబడే నేటి మేధో-మనుష్యులకు ఖచ్చితంగా అసంభవమైయుంటుంది. –

భౌతికవాదియైయుండుట నిజానికి ఒక మెప్పు కాదు, కాని కృశించిపోయిన మెదడుకు ఒక రుజువు.

అనగా, ఇప్పటివరకు ఈ భూమిపై అసహజమైన మెదడు ఏలినది; దాని కలాపం సహజంగా చివరకు అంతటిలో అనివార్యమైన పతనాన్ని కూడా తప్పక కలుగజేయవలసి యుంటుంది; ఎందుకంటే, అది తేగోరే సమస్తం, అది ఏదైనా సరే, గిడసబారుట ద్వారా ప్రకృతికనుగుణంగా తనలో ప్రారంభంనుండే సామరస్యలేమిని మరియు అనారోగ్యతను కలిగియుంటుంది.

ఆ విషయంలో ఇకపై ఏది కూడా మార్చబడలేదు, కాని మనిషి, సహజసిద్ధంగా పురోగమించే ఆ పతనాన్ని మౌనంగా తప్పక రానియ్యవలసియుంటుంది. అయితే అప్పుడు అది ఆత్మకు పునరుత్థానదినము మరియు ఒక నూతన జీవితమై యుంటుంది! వేల సంవత్సరాలనుండి నాయకత్వంవహిస్తూ వచ్చిన మేధస్సు యొక్క బానిస దానితో శాశ్వతంగా తొలగించబడతాడు! అతడు ఎప్పటికీకూడా మరల లేవలేడు, ఎందుకంటే రుజువు మరియు అతని స్వంత అనుభవం అతన్ని, దేనినైతే అతడు అర్థంచేసుకోలేకపోయాడో దానికి ఒక రోగిగా మరియు ఆత్మీయంగా పేదవానిగా చివరకు స్వచ్ఛందంగా లోబడుటకు నిర్బంధిస్తాయి. అతనికి ఇకపై, పరిహాసం ద్వారా కాని లేక దైవకుమారునికి వ్యతిరేకంగా వాడబడిన, ఆయన దానికి వ్యతిరేకంగా పోరాడవలసి యుండిన, అధికారం ద్వారా అమలుచేయబడ్డ, దృశ్యమాన హక్కు ద్వారా కాని, ఆత్మకు వ్యతిరేకంగా ఎదురునిల్చుటకు ఎప్పటికీ అవకాశం ఇవ్వబడదు.

చాలా అశుభాన్ని అడ్డుకొనుటకు ఆనాడు ఇంకా సమయం ఉండింది. ఇప్పుడైతే ఇక లేదు; కాగా ఈలోగా మెదడు యొక్క రెండు భాగాల మధ్య సడలించబడ్డ అనుసంధానం ఇకపై కలుపబడలేదు.

ఈ ఉపన్యాసంలోని వివరణలను తిరిగి అపహసించగోరే మేధస్సు మనుష్యులు చాలామంది ఉంటారు, కాని ఆ విషయంలో వారు ఎప్పటివలే వట్టి ప్రగల్భాలు పలుకుతారే తప్ప నిజంగా వస్తుగతమైన ఏ ఒక్క ప్రతిరుజువును కూడా చూపలేరు. కాని శ్రద్ధతో వెదికే మరియు ఆలోచించే ప్రతి ఒక్కడూ కూడా అటువంటి గ్రుడ్డి ఆతురతను, నేను ఇక్కడ విశదీకరించిన దానికి మరియొక రుజువుగా మాత్రమే పరిగణించవలసియుంటుంది. మనుష్యులు శ్రమపడినా కాని దానిని అసలు చేయగల్గలేరు. అందువల్ల మనం వారిని ఇక నేటినుండి సహాయాన్ని త్వరలో పొందనవసరం కలిగియున్న రోగులనుగా పరిగణిద్దాం, మరియు … ప్రశంతాంగా వేచియుందాం.

ఎటువంటి పోరాటం కాని మరియు హింసాత్మకచర్య కాని అవసరం లేదు ఆ అవసరమైన అభివృద్ధిని కలుగజేయుటకు; కాగా అంతం స్వతహాగా వస్తుంది. ఈ విషయంలో కూడా ఆ సహజమైన కలాపం సమస్త పరస్పరచర్యల తిరుగులేని శాసనాలలో పూర్తి కఠినంగా మరియు సకాలంలో జరుగుతుంది. – –

కొన్ని ప్రవచనల ప్రకారం అప్పుడు ఒక క్రొత్తతరం ఉత్పన్నం కావలెను. అయితే అది, కేవలం క్రొత్తగా పుట్టినవారితో, ఒక “క్రొత్త భావనను” కలిగియున్నవారిగా ఇప్పటికే కాలిఫోర్నియా మరియు ఆస్త్రేలియాలలో గమనించబడిన వారితో మాత్రమే కాదు కాని ప్రధానంగా ఇప్పటికే జీవిస్తున్న, రాబోయే చాలా సంఘటనల ద్వారా అనతికాలంలోనే “చూడగలిగే” వారిగా మారబోయే మనుష్యులతో కూర్చబడియుంటుంది. అప్పుడు వారు, ఇప్పుడు క్రొత్తగా జన్మించినవారు కలిగియున్న అదే “భావనను” కలిగియుంటారు; కాగా దాని అర్థం, తెరచియున్న మరియు అనియంత్రిత ఆత్మతో లోకంలోనిలిచే సామర్థ్యత తప్ప మరేమీ కాదు; అది తనను మేధస్సు యొక్క నియంత్రణ ద్వారా ఇకపై అణగద్రొక్కనీయదు. వారసత్వపాపం దానితో నిర్మూలించబడుతుంది!

అయితే దీనియంతటికీ ఇప్పటివరకు “గుప్త సామర్థ్యతలుగా” పిలువబడిన లక్షణాలతో ఎటువంటి సంబంధంలేదు. అప్పుడు అతడు, మనిషి ఏ విధంగా ఉండవలెనో ఆ విధంగావున్న ఒక సాధారణమైన మనిషి మాత్రమే! ఆ “చూడగలిగే సామర్థ్యతకు” “దివ్యదృష్టితో” ఎటువంటి సంబంధంలేదు, కాని దాని అర్థం “అంతర్‌దృష్టిని” కలిగియుండుట, గుర్తించగల్గుటయే.

అప్పుడు మనుష్యులు సమస్తమును పక్షపాతం లేకుండా గమనించే స్థితిలో ఉంటారు, దాని అర్థం మదింపుచేయుట తప్ప ఇంకేమీకాదు. వారు మేధో-మనిషిని అతడు వాస్తవంగా ఎట్లు ఉన్నాడో అట్లే చూస్తారు, అనగా అతన్ని, అతనికి మరియు అతని పరిసరానికి అపాయకరమైన అతని సంకుచితత్వంతోపాటు; దానిలోనుండి, అదే సమయంలో ఉద్భవించే, దానికి నిజంగా చెందియున్న అహంకారంతో కూడిన అధికారదాహమును మరియు మూర్ఖత్వమును కూడా చూస్తారు.

వారు ఇంకా, ఏ విధంగా వేల సంవత్సరాలుగా ఖచ్చితమైన క్రమబద్ధతలో ఒకసారి ఈ రూపంలో, మరొకసారి మరొక రూపంలో సమస్త మానవాళి ఈ కాడి క్రింద బాధపడిందో, మరియు ఏ విధంగా ఈ హానికరమైన రాచపుండు బద్ధశత్రువువలే ఎల్లప్పుడు మానవ ఉనికి యొక్క ప్రధాన ఉద్దేశమైన, స్వతంత్ర మనుష్య ఆత్మ యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా నిలిచియుండిందో చూస్తారు! ఏది కూడా వారికి కనుమరుగై ఉండబోదు. ఈ చెడు ద్వారా, వ్యధ, సమస్తమైన బాధలు, ప్రతి పతనం తప్పక రావలసి యుండిందనే విషయం యొక్కా మరియు ప్రతి అంతర్‌దృష్టి ప్రారంభంనుండే, నియంత్రించబడిన గ్రహణశక్తి ద్వారా అడ్డగించబడినందున, మెరుగుదల ఏనాడూ కలిగియుండ లేదనే విషయం యొక్కా, చేదు నిశ్చయత కూడా వారికి కలుగకుండా ఉండబోదు.

అయితే మేల్కొలుపుతో ఈ మేధో-మనుష్యుల యొక్క ప్రతి ప్రభావం, ప్రతి అధికారం కూడా అంతమైనది. చిరకాలానికి; కాగా మానవాళికి అప్పుడు ఒక క్రొత్త, మెరుగైన శకం మొదలౌతుంది, దానిలో పాతది ఇకమీదట నిలువలేదు.

దానితో లక్షలమంది ద్వారా నేడే కాంక్షించబడుతున్న, విఫలమౌతున్న మేధస్సుపై ఆత్మ యొక్క ఆవశ్యకమైన విజయం కలుగుతుంది. జనసందోహాలలో ఇప్పటివరకు తప్పుదారి పట్టించబడిన చాలామంది అప్పుడు గుర్తిస్తారు కూడా, వారింతవరకు “మేధస్సు” అనే వ్యక్తీకరణను పూర్తిగా తప్పుగా వివరించియుండినారని. కేవలం ఇతరులు దానిని ఒక విగ్రహంగా పరిగణించినందునా మరియు దాని అనుచరులందురు అధికారం ద్వారా మరియు శాసనాల ద్వారా తమను సతతం ఏనాడూ తప్పుచేయని వారివలే, నిరంకుశ పాలకులవలే కనబరచుకొనుటకు ఎరిగియున్నందునా, అత్యధికులు అసలు పరీక్షించకుండానే, అది కేవలం ఒక విగ్రహమేనని అనుకొన్నారు. చాలామంది అందువల్ల, దానివెనుక దాగియున్న అసలైన డొల్లతనాన్ని మరియు లొసుగులను ఎత్తిచూపుటకు ఎటువంటి శ్రమను తీసుకోరు.

అయితే, దశాబ్దాల పాటు మొండిశక్తితో మరియు దృఢవిశ్వాసంలో, రహస్యంగా మరియు కొంతమట్టుకు బహిరంగంగా కూడా, కొన్నిసార్లు తీవ్రమైన బాధకు గురిచేయబడుతున్నా కూడా, ఈ శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారు కొంతమంది ఉన్నారు. అయితే వారు శత్రువును స్వయంగా ఎరుగకుండానే పోరాడుతున్నారు! అది సహజంగా మొదటినుండే విజయాన్ని కష్టతరం చేసింది. నిజానికి అది దానిని ప్రారంభంనుండే అసంభవం చేసింది. ఆ పోరాటకుల ఖడ్గం సరిగా పదునుపెట్టబడియుండలేదు, ఎందుకంటే వారు దానితో ఎల్లప్పుడు అప్రధానమైన వాటిపై వేటువేస్తూ దానిని మొద్దుబారజేశారు. ఈ అప్రధానమైన వాటితో వారు ఎల్లప్పుడు కూడా ప్రక్కన, శూన్యంలో వేటువేశారు, స్వంత బలాన్ని వృధాచేశారు మరియు తమ మధ్య కేవలం విభేదాలను కలుగజేసుకొన్నారు.

నిజానికి సంపూర్ణ గమనక్రమంలో మానవాళికి కేవలం ఒకే ఒక్క శత్రువు ఉన్నది: మేధస్సు యొక్క ఇదివరకటి నిరంకుశమైన పరిపాలన! అదే మనిషి యొక్క ఆ గొప్ప పాపపుపతనము, సమస్తమైన చెడును వెంటతెచ్చిన, మనుష్యుల యొక్క అత్యంత ఘోరమైన పాపము. అదే వారసత్వపాపం అయింది, మరియు తన తలను ఎత్తబోతుందని దేనిగురించి ప్రవచించబడిందో ఆ క్రీస్తు విరోధి కూడా అదే. వివరంగా చెప్పలంటే, మేధస్సు యొక్క పరిపాలన క్రీస్తు విరోధి యొక్క సాధనమైయున్నది, దానిద్వారా మనుష్యులు దానికి ఎర అయ్యారు. అనగా దేవునికి శత్రువైన, స్వయంగా క్రీస్తు విరోధికి … లూసీఫరుకు![^*]

[^*] ఉపన్యాసం: “క్రీస్తువిరోధి”

మనం ఈ కాలం మధ్యలో ఉన్నాం! అతడు నేడు ప్రతి మనిషిలో నివసిస్తున్నాడు, అతన్ని నాశనంచేయుటకు సిద్ధంగా, కాగా అతని కలాపం పూర్తి సహజమైన పర్యవసానంగా తక్షణమే దేవునినుండి ఎడబాటును తెస్తుంది. పరిపాలించుటకు అనుమతించబడిన వెంటనే అతడు ఆత్మను తెంచివేస్తాడు.

అందువల్ల మనిషి నిశితమైన జాగ్రత్తతో ఉండవలెను. –

అందువల్ల అతడు తన మేధస్సును ఇప్పుడేమీ చులకన చేయరాదు, కాని దానిని అది ఏమైయున్నదో దానిగా, అనగా అతని సాధనంగా చేయవలెను, నిర్ణయాధికారాన్ని కలిగియున్న సంకల్పంగా కాదు. తన యజమానిగా కాదు!

రాబోయే తరానికి చెందిన మనిషి ఇదివరకటి కాలాన్ని కేవలం ఏవగింపుతో, భీతితో మరియు సిగ్గుతో మాత్రమే చూడగలడు. ఒక పురాతన యాతనశాలలోనికి మనం ప్రవేశించినప్పుడు మనకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో దాదాపు అదే విధంగా. దానిలోకూడా మనం అనాదరమైన మేధోవ్యవస్థ యొక్క దుష్టఫలాలను చూస్తాం. కాగా, కేవలం ఏ కొంచెమైనా అంతఃకరణానుభూతిని మరియు ఆ ప్రకారంగా ఆత్మీయకార్యశీలతను కలిగియున్న ఒక మనిషి అటువంటి రకమైన దారుణాలను ఏనాటికీ తలపెట్టి యుండలేడనే విషయం నిర్వివాదమైనది. అయితే మొత్తానికి అది ఈనాడు వేరుగా లేదు, కేవలం కొంత ఎక్కువగా కప్పిపుచ్చబడియున్నది, మరియు జనసందోహాల దుర్భరపరిస్థితులు, ఆనాటి ఒంటరి హింసను పోలియున్న, అదే విధమైన క్రుళ్లిన ఫలాలైయున్నవి.

మనిషి ఒక్కసారి గతకాలాన్ని సమీక్షించినట్లైతే, తన ఆశ్చర్యంనుండి ఇకపై తేరుకోనేలేడు. ఆ అపరాధాలను సహస్రాబ్దాలకొలది మౌనంగా భరించుటకు ఎట్లు సాధ్యమయిందో అని అతడు తనను ప్రశ్నించుకొంటాడు. దానికి జవాబునిచ్చుట సహజంగా సులభం: హింస ద్వారా. మనిషి ఎక్కడ చూసినా దానిని చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. దానిని గుర్తించుటకు, భీతిగొల్పే పురాతనకాలాలను ప్రక్కన ఉంచి, మనం కేవలం ఇప్పటికే ప్రస్తావించబడిన, అనతికాలం క్రితమే వాడబడిన, నేడు కూడా అంతటా సందర్శించబడ గలిగే యాతనశాలలలోనికి ప్రవేశిస్తే చాలు.

ఆ పాత పనిముట్లను చూసినప్పుడు మనకు వణుకు పుడుతుంది. ఎటువంటి అనాదరమైన క్రూరత్వం, ఎటువంటి మృగత్వం వాటిలో ఉన్నవో! ఆనాటి ఆ కార్యాలలో అతిఘోరమైన నేరం ఉన్నదనే విషయాన్ని నేటి మనుష్యులలో ఏ ఒక్కడూ కూడా సందేహించడు. నేరస్థులపై ఆ విధంగా మరింత గొప్ప నేరాలు చేయబడ్డాయి. కాని చాలామంది అమాయకులు కూడా కుటుంబాలలోనుండి మరియు వారి స్వతంత్రతనుండి బయటకులాగబడి కక్కసంతో ఈ చీకటి గుయ్యారాలలోనికి నెట్టివేయబడ్డారు. హింసించే వారికి పూర్తి నిస్సహాయతలో వదిలివేయబడ్డ వారి యొక్క ఎటువంటి ఆక్రందనలు, బాధాకరమైన కేకలు ఇక్కడ ప్రకంపించియుండినవో! వేటిని గురించి కేవలం తలచుకుంటేనే భీతి మరియు ఏవగింపులు కలుగుతాయో అటువంటి వాటిని మనుష్యులు తప్పక అనుభవించవలసి వచ్చింది.

అక్కడ అటువంటి రక్షణలేని వారికి సంభవించిన దంతయూ, అది కూడా సంపూర్ణ న్యాయత యొక్క ముసుగులో, నిజంగా మనుష్యులకు సాధ్యమా అని ప్రతిఒక్కరు అసంకల్పితంగా తమను ప్రశ్నించుకొంటారు. ఆ న్యాయతను మనిషి ఆనాడు కేవలం దౌర్జన్యం ద్వారా మాత్రమే అమలుచేశాడు. మరియు శారీరకంగా బాధించుట ద్వారా అనుమానితులనుండి నేరాంగీకారాన్ని రాబట్టాడు, దానితో అప్పుడు తీరికగా వారిని హత్యచేయగల్గుటకు. ఆ నేరాంగీకారాలు, నిరర్థకమైన ఆ భౌతిక హింసను తప్పించు కొనుటకుగాను, కేవలం బలవంతపరచుట ద్వారా మాత్రమే ఇవ్వబడినా, అవి న్యాయమూర్తులకు సరిపోయినవి. ఎందుకంటే అవి వారికి, శాసనం యొక్క “పదజాలానికి” అనుగుణంగా వ్యవహరించుటకు అవసరమైయుండినవి. అటువంటి సంకుచిత స్వభావంగలవారు, తమను తద్వారా దైవచిత్తం ఎదుట శుద్ధిచేసుకోగలమని మరియు కఠినంగా పనిచేసే మూల శాసనాల పరస్పరచర్యనుండి తప్పించుకోగలమని నిజంగా తలంచియుంటారా?

ఇతరులపై తీర్పు చెప్పుటకు ధైర్యించిన ఆ మనుష్యులు కరుడుగట్టిన నేరస్థులలోనుండి వచ్చియుండినారు లేక ఆ ప్రక్రియ అంతటిలో భూలోకమేధస్సు యొక్క రోగగ్రస్తమైన సంకుచితత్వం అతి స్పష్టంగా గోచరమయింది. ఈ రెండింటికీ మధ్య వేరొకటి ఏదియూ ఉండలేదు.

దైవ సృష్టిశాసనాలకు అనుగుణంగా ప్రతి అధికారి, ప్రతి న్యాయమూర్తి, ఎటువంటి అధికారాన్ని అతడు భూమిపై కలిగియున్నాడనే దానితో సంబంధంలేకుండా, తన కార్యాచరణలో ఎప్పటికీ ఆ అధికారం యొక్క రక్షణలో నిలువరాదు, కాని అతడు ఒక్కడే మరియు పూర్తి వ్యక్తిగతంగా, ప్రతి ఇతర మనిషివలే రక్షణలేకుండా, తన అధికారంలో చేసేదానియంతటికీ స్వయంగా పూర్తి బాధ్యతను వహించవలెను. కేవలం ఆత్మీయంగా మాత్రమే కాకుండా భూలోకసంబంధంగా కూడా. అప్పుడు ప్రతిమనిషి ఆ విషయాలలో ఎక్కువ పట్టుదలను, మరింత శ్రద్ధను కలిగియుంటాడు. మరియు, వేటి పర్యవసానాలు ఎప్పటికీ సరిదిద్దబడలేవో అటువంటి, “తప్పులు” అని పిలువబడేవి ఖచ్చితంగా అంత సులువుగా మరల జరగవు. వాటికి గురియైనవారి మరియు వారి బంధువుల యొక్క శారీరక మరియు మానసిక బాధలు సహితం.

అయినా మనం ఇంకొకసారి దానికే సంబంధించిన విషయమైయున్న, “మంత్రగత్తెలు” అని పిలువబడే వారి విచారణ ప్రక్రియలను గమనిద్దాం!

ఎవడు ఒక్కసారి అటువంటి రకమైన విచారణ ప్రక్రియలకు సంబంధించిన న్యాయస్థాన దస్త్రాలకు ప్రవేశం కలిగియుండినాడో వాడు తనలో పెల్లుబికే అత్యంత సిగ్గుతో కోరుకొంటాడు, ఏనాటికీ ఈ మానవాళి క్రింద తాను లెక్కించ బడకుండా ఉండాలని. ఆనాడు ఒకవేళ ఒక మనిషి ఆచరణాత్మక అనుభవం ద్వారా కాని లేక సాంప్రదాయాల ద్వారా కాని, కేవలం ఔషధమూలికల గురించి పరిజ్ఞానం కలిగియుండినట్లైతే, మరియు దానితో అతడు బాధపడే మనుష్యులకు, వారు దానిని కోరినందున, వారికి సహాయం చేసియుండినచో, దానివల్ల అతడు నిర్దయాత్మకంగా అటువంటి చిత్రహింసకు గురిచేయబడ్డాడు. అతని శరీరం అంతకుమునుపే ఆ హింసలబారికి మరణించనట్లైతే, అతనికి దానినుండి విముక్తి చివరకు కేవలం చితాగ్నిలో చావు ద్వారా మాత్రమే లభించింది.

స్వయంగా శారీరక సౌందర్యం అనగా శీలం కూడా ఆనాడు, అది లొంగనట్లైతే, అటువంటి వాటికి కారణాన్ని ఇవ్వగలిగింది.

మరియు ఆపై మతవిరోధుల విచారణ (ఇంక్విజిషన్) యొక్క భయంకరచర్యలు! సాపేక్షంగా కేవలం కొన్ని సంవత్సరాలే మనకు “ఆ కాలానికి” మధ్య ఉన్నవి!

ఏ విధంగా మనం నేడు ఆ అన్యాయమును గుర్తిస్తున్నామో, అదే విధంగా ఆనాటి జనం దానిని అనుభవించింది. కాగా ఆ జనం “మేధస్సు” ద్వారా ఇంకా అంత ఎక్కువగా సంకుచితపరచబడియుండలేదు, దానిలోనుండి అక్కడక్కడ అంతఃకరణనుభూతి, ఆత్మ, పొడచూపింది.

దానియంతటిలో మనం నేడు సంపూర్ణ సంకుచితత్వాన్ని, బాధ్యతారహితమైన తెలివితక్కువతనాన్ని గుర్తించమా?

మనిషి వాటి గురించి అతిశయంతో మరియు వాటితో నాకేమి సంబంధం అనే ధోరణిలో మాట్లాడతాడు, కాని ప్రాథమికంగా ఆ విషయంలో ఏమాత్రం మార్పురాలేదు. అర్థంచేసుకొనని సమస్తంపట్ల సంకుచితత్వంతోకూడిన అహంకారం ఇంకా అదే విధంగా ఉన్నది! తన స్వీయ సంకుచితత్వం ద్వారా మనిషి దేనిని అర్థంచేసుకొనడో, దాని విషయంలో ఇప్పుడు ఆ చిత్రహింసల స్థానంలో బహిరంగ హేళన జరుగుతున్నది.

చాలామంది తమను తాము కాచుకోకుండా గంభీరంగా హృదయశోధన చేసుకొనుట మేలు. మేధస్సును ఆదరించే వారిద్వారా, అనగా పూర్తిగా సహజమైన మనుష్యులు కాని వారి ద్వారా, చాలాసార్లు న్యాయస్థానాలలో కూడా, ఇతరులకు మరుగైయున్న దానిని తెలుసుకొనుటకు, బహుశా సూక్ష్మపదార్థ కనుల ద్వారా, పరిపాటిగా సూక్ష్మపదార్థలోకాన్ని చూచుటకు సామర్థ్యత కలిగియున్న ప్రతి మనిషి, మొదటినుండే మోసగానివలే పరిగణించబడతాడు. అనతికాలంలోనే మనిషి ఆ సామర్థ్యతను ఆపై అనుమానించబోడు, దానితో క్రూరంగా పోరాడబోడు కూడా.

మరియు ఎవడు, దానితో ఏమిచేయవలెనో ఎరుగక, దేనిని అతడు చూశాడో, మరియు విన్నాడో దాని గురించి సంపూర్ణ అమాయకత్వంలో మాట్లాడతాడో, వానికి శ్రమ. దాని పరిణామాలకు అతడు, మొదటి క్రైస్తవులు నీరో మరియు అతని యొక్క ఎల్లప్పుడు హత్యచేయుటకు సిద్ధంగావున్న సహాయకుల ఎదుట ఏ విధంగా భయపడ్డారో ఆ విధంగా, తప్పక భయపడవలసియుంటుంది.

ఒకవేళ అతడు, ఆ సంపూర్ణ మేధస్సు మనుష్యుల ద్వారా ఏనాటికీ గ్రహించగల్గలేని ఇంకా ఏవైనా సామర్థ్యాలను కలిగియున్నట్లైతే అతడు అనివార్యంగా నిర్దాక్షిణ్యంగా వెంటాడబడతాడు, నిందించబడతాడు, వెలివేయబడతాడు, అతడు ప్రతివానికి లోబడియుండనట్లైతే; ఒకవేళ ఏ విధంగానైనా వీలైతే, చాలా ఇంపైనమాటలలో వర్ణించబడినట్లు, అతడు “నిరపాయునిగా” చేయబడతాడు. ఎవడు కూడా ఆ విషయంలో ఎటువంటి అనుతాపములను కలిగియుండడు. అంతరంగంలో కొన్నిసార్లు చాలా అపరిశుభ్రమైన ప్రతిమనిషికి అటువంటి వ్యక్తి నేడు కూడా ఒక వేటపశువుతో సమానం. మనుష్యులు ఎంత సంకుచిత స్వభావులైయుంటే, అంత గొప్పగా వారి తెలివిని గురించిన భ్రమ మరియు అహంకార ప్రవృత్తి ఉంటాయి.

మనిషి ఆ పాతకాలపు, చిత్రహింస మరియు దహనాలతోకూడిన కలాపాలనుండి మరియు ఆ న్యాయవిచారణల యొక్క హాస్యాస్పదమైన దస్త్రాలనుండి ఏమీ నేర్చుకోలేదు! కాగా నేడు కూడా, ఇప్పటివరకు అసాధారణమైన దానిని మరియు గ్రహించలేని దానిని శిక్షింపబడకుండానే కళంకపరచవచ్చు మరియు అవమానపరచవచ్చు. ఆ విషయంలో పూర్వానికి, ఇప్పటికీ ఏమాత్రమూ తేడాలేదు.

న్యాయస్థానాల విచారణలకంటే చర్చి ద్వారా చేయబడిన మతవిరోధుల విచారణలు (ఇంక్విజిషన్లు) మరింత అధ్వాన్నంగా ఉండినవి. హింసించబడినవారి కేకలు ఇక్కడ భక్తిపూర్వకమైన ప్రార్థనల శబ్దం క్రింద వినబడకుండా సమసిపోయినవి. అది సృష్టియందున్న దైవచిత్తము యొక్క వెక్కిరింతయైయుండింది! ఆనాటి చర్చిల ప్రతినిధులు తద్వారా, తమకు క్రీస్తు యొక్క నిజమైన బోధను గురించి, దైవతను గురించి మరియు దాని సృజనాత్మకమైన చిత్తమును గురించి ఏమీ తెలియదని నిరూపించారు; ఆ చిత్తం యొక్క శాసనాలు సుస్థిరంగా సృష్టిలో నిలిచియున్నవి మరియు అక్కడ అవి ఏకరీతిగా ఆదినుండే పనిచేయుచున్నవి మరియు కాలాంతంవరకు పనిచేస్తాయి.

దేవుడు మనుష్యాత్మకు దాని తత్వంలో నిర్ణయించుటకు స్వతంత్ర సంకల్పమును ఇచ్చియున్నాడు. కేవలం దీనిలో మాత్రమే అతడు, అతడు ఏ విధంగా పరిపక్వం చెందవలసి యున్నదో ఆ విధంగా పరిపక్వం చెందగలడు, తనను మెరుగుదిద్దుకోగలడు మరియు పూర్తిగా అభివృద్ధిచెంద గలడు. కేవలం దానిలో మాత్రమే అతనికి దానికొరకు అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ స్వతంత్ర సంకల్పం అణచివేయ బడినట్లైతే, అది దౌర్జన్యంగా వెనుకకు విసిరివేయబడుట అవుతుంది, అట్లు కాని పక్షంలో అది కనీసం ఒక అడ్డంకిగా నిలుస్తుంది.

అయితే క్రైస్తవ చర్చిలు, చాలా మతాలవలే ఆనాడు ఈ దైవ నిర్ణయంతో పోరాడినవి, అతి గొప్ప క్రూరత్వంలో దానిని ఎదిరించినవి. హింస ద్వారా మరియు చివరకు మరణం ద్వారా అవి మనుష్యులను బలవంతపరచగోరినవి, వారి నిర్ధారణకు వ్యతిరేకంగా, అనగా వారి సంకల్పానికి వ్యతిరేకంగా ఉండిన ఒప్పుకోలును ఇచ్చుటకు, మార్గాలను ఎంచుకొనుటకు మరియు వాటిలో పోవుటకు. దానితో అవి దైవ ఆజ్ఞను అతిక్రమించినవి. అంతేకాక అవి మనుష్యులను వారి ఆత్మాభివృద్ధిలో అడ్డుకొన్నాయి మరియు వారిని శతాబ్దాల వెనుకకు కూడా విసిరివేసినవి.

ఆ ప్రక్రియలో నిజమైన అంతఃకరణానుభూతి యొక్క, అనగా ఆత్మ యొక్క కేవలం ఒక్క మిణుగురైనా తనను కనబరచుకొనియుండినట్లైతే, అటువంటిది ఏనాటికీ సంభవించకుండా ఉండవలసింది మరియు ఉండగలిగేది! అనగా కేవలం మేధస్సు యొక్క క్రూరత్వం మాత్రమే ఆ అమానుషమైన దానిని కలుగజేసింది.

చారిత్రాత్మకంగా రుజువుచేయబడుతున్నట్లు, చాలామంది పోపులు స్వయంగా, తమ స్వచ్ఛంగా భౌతికమైన కోరికలను, తమ లక్ష్యాలను నెరవేర్చుటకు విషాన్ని మరియు బాకును వాడనిచ్చారు. అది కేవలం మేధస్సు యొక్క పరిపాలన క్రిందే జరగగలిగింది; అది తన విజయయాత్రలో సమస్తాన్ని వశపరచుకొన్నది, దేనిముందు కూడా ఆగలేదు. –

మరియు సమస్తంపైన, అనివార్యమైన సంఘటనల గమనంలో మన సృష్టికర్త యొక్క చిత్తం నిర్దయాత్మకంగా నిలిచియుండినది మరియు నిలిచియున్నది. ఆవలిలోకం లోనికి దాటినప్పుడు ప్రతిమనిషినుండి భూలోక అధికారం మరియు దాని రక్షణ తొలగించబడతాయి. అతని నామము, అతని అంతస్తు, అంతయూ వెనుక వదలివేయబడుతుంది. కేవలం ఒక పేద మనుష్యజీవాత్మ ఆవలిలోకంలోనికి దాటుతుంది, అది విత్తిన దానిని అక్కడ పొందుటకు, రుచిచూచుటకు. కేవలం ఒక్క మిహాయింపు కూడా అసంభవమైయుంటుంది! దాని మార్గం దానిని దైవన్యాయత యొక్క కఠినమైన పరస్పరచర్య చక్రవ్యవస్థయంతటి ద్వారా నడిపిస్తుంది. అక్కడ చర్చి ఉండదు, రాజ్యం ఉండదు, కాని తాము చేసిన ప్రతి పొరపాటుకు వ్యతిగతంగా లెక్క ఇవ్వవలసిన ఒంటరి మనుష్యజీవాత్మలు మాత్రమే ఉంటాయి!

ఎవడు దేవుని చిత్తనికి వ్యతిరేకంగా పనిచేస్తాడో, అనగా సృష్టిలో పాపం చేస్తాడో, వాడు ఆ అతిక్రమం యొక్క పర్యవసానాలకు గురిచేయబడతాడు. వాడు ఎవడైయున్నాడు, మరియు ఎటువంటి సాకుతో అది చేయబడింది అనే దానితో సంబంధంలేకుండా. చర్చి యొక్క, శాసనాల యొక్క ముసుగులో ఒక ఒంటరి మనిషి అయినా సరే … శరీరానికి లేక జీవాత్మకు వ్యతిరేకంగా చేయబడ్డ నేరం నేరమే మరియు అది నేరంగానే నిలుస్తుంది. అది దేని ద్వారా కూడా మార్చబడలేదు. దృశ్యమానంగా న్యాయమే అనిపించే ఆభాసం ద్వారా కూడా మార్చబడలేదు. నిజానికి అటువంటి ఆభాసాలు ఎల్లప్పుడు న్యాయమైనవైయుండవు. కాగా సహజంగా ఆ శాసనాలు కూడా కేవలం మేధో-మనుష్యుల ద్వారా చేయబడ్డాయి మరియు అందువల్ల అవి తమలో తప్పక భౌతిక ప్రతిబంధకాన్ని కలిగియుంటాయి.

చాలా దేశాలలో, ప్రత్యేకంగా మధ్య మరియు దక్షిణ అమెరికాలోవున్న న్యాయవ్యవస్థలను చూడండి. ఏ మనిషి నేడు రాజ్యాన్ని నడిపిస్తాడో మరియు సమస్త గౌరవాలను కలిగియుంటాడో అతడు మరునాడే ఒక నేరస్తునిగా చెరసాలలో వేయబడవచ్చు లేక చంపబడవచ్చు, ఒకవేళ అతని విరోధి ఆ ప్రభుత్వాన్ని ఒక హింసాత్మకచర్య ద్వారా తన వశంచేసుకొనుటలో సఫలుడైనట్లైతే. ఒకవేళ అది అతనికి సాధ్యం కానిచో, అతడే పరిపాలకునిగా పరిగణించబడుటకు బదులుగా ఒక నేరస్తునిగా ఎంచబడతాడు మరియు వెంటాడబడతాడు. అన్ని ప్రభుత్వవ్యవస్థలు అతని క్రింద అదే విధంగా ఇతని క్రింద ఇష్టపూర్వకంగా పనిచేస్తాయి. ఒక ప్రపంచ ప్రయాణికుడు కూడా, ఒకవేళ అతడు ఒక దేశంనుండి మరొక దేశానికి పోయినట్లైతే, అంతటా మంచివానిగా చలామణియగుటకు తరచుగా తన మనస్సాక్షిని బట్టలు మార్చుకొన్నట్లు తప్పక మార్చుకోవలసియుంటుంది. ఏది ఒక దేశంలో నేరంగా పరిగణించబడుతుందో అది వేరొకదానిలో అతి తరచుగా అనుమతించబడుతుంది, పైగా బహుశా ఆహ్వానించబడవచ్చు కూడా.

అది సహజంగా కేవలం భూలోక మేధస్సు యొక్క ఉపార్జనలలో మాత్రమే సాధ్యమౌతుంది, కాని ఎక్కడ మేధస్సు సజీవమైన ఆత్మ యొక్క సాధనంగా తన ప్రకృతి సిద్ధమైన స్థానాన్ని అందుకొనవలసియుంటుందో అక్కడ ఎప్పటికీ కాదు; కాగా ఎవడు ఆత్మస్వరాన్ని వింటాడో, వాడు ఎప్పటికీ దేవుని శాసనాలను నిర్లక్ష్యంచేయడు. మరియు ఎక్కడ ఇవి పునాదిగా తీసుకొనబడతాయో, అక్కడ ఎటువంటి లోపములు ఉండలేవు, ఎటువంటి కంతలు ఉండలేవు కాని సంతోషాన్ని మరియు శాంతిని కలుగజేసే ఏకరూపత మాత్రమే ఉంటుంది. ఆత్మ యొక్క వ్యక్తీకరణలు తమ మూలలక్షణాలలో అంతటా ఎల్లప్పుడు పూర్తిగా ఒకే విధంగా మాత్రమే ఉండగలవు. అవి ఎప్పటికీ ఒకదానినొకటి ఎదురించుకోవు.

ఎక్కడ కేవలం మేధస్సు మాత్రమే పునాదిని నిర్మించగలదో మరియు ఆత్మీయమైనది దానిలో లోపిస్తుందో, అక్కడ న్యాయ, వైద్య, రాజ్యాంగ కళలు కూడా తప్పనిసరిగా లోపభూయిష్టమైన వృత్తిపనులై మాత్రమే ఉంటాయి. వేరొక విధంగా అది అసలు అసాధ్యమైయుంటుంది. సహజంగా ఇక్కడ ఎల్లప్పుడు “ఆత్మ” యొక్క నిజమైన భావనలో మాత్రమే ఆలోచించాలి. –

విజ్ఞానం ఒక ఉత్పాదకమైయున్నది, కాని ఆత్మ జీవమైయున్నది. దాని విలువ మరియు శక్తి ఆత్మికత యొక్క మూలంతో దానికిగల సంబంధం ప్రకారం మాత్రమే లెక్కగట్టబడగలవు. ఈ సంబంధం ఎంత సన్నిహితమై యుంటుందో, అంత విలువైనది, శక్తివంతమైనదై మూలంనుండి వెలువడిన ఆ భాగం ఉంటుంది. అయితే ఈ సంబంధం ఎంత వదులుగా అవుతుందో, అంత దూరంగా, అపరిచితంగా, ఒంటరిగా మరియు బలహీనంగా ఆ వెలువడిన భాగం కూడా, అనగా ఆ సంబంధిత మనిషి, తప్పక ఉండవలసియుంటుంది.

ఇవియన్నియూ ఎంతో సాధారణమైన, సహజసిద్ధమైన విషయాలైనా, తప్పుదారిన పోయే మేధో-మనుష్యులు పదే పదే గ్రుడ్డివారివలే వాటిని దాటిపోవుట గ్రహింపశక్యం కాదు. కాగా దేనిని వేరు ఇస్తుందో దానినే కాండము, పూత మరియు ఫలము పొందుతాయి! కాని, దీనిలో కూడా, అవగాహన చేసుకోవడంలో గల నిరాశకరమైన స్వీయసంకుచితత్వం విదితమౌతుంది. శ్రమతో వారు తమ ఎదుట ఒక గోడను కట్టుకొన్నారు మరియు ఇప్పుడు ఇకపై దానిపైనుండి చూడలేరు, దానిగుండానైతే అంతకంటే తక్కువగా చూడగలరు.

అయితే, తమ యొక్క అహంకారాతిశయంతో కూడిన అపహసించే చిరునవ్వుతో తమను హెచ్చించుకొని, అంత ఎక్కువగా బానిసలు కాని ఇతరులను నీచదృష్టితో చూసేవారు, ఆత్మీయంగా సజీవులైన వారందరికి కొన్నిసార్లు, పేదలైన, అనారోగ్యులైన, అవివేకులవలే తప్పక కనబడ వలసియుంటుంది. ఎంతో జాలికలిగినప్పటికీ వారిని తప్పక వారి మతిభ్రంశంలో వదిలివేయవలసియుంటుంది, ఎందుకంటే వారి పరిమితమైన అవగాహన, స్వయంగా దానికి వ్యతిరేకమైన వాస్తవమైన రుజువులను కూడా గమనించ కుండా వదిలివేయునట్లు చేస్తుంది. ఆ విషయంలో దేనినైనా మెరుగుపరచుటకు చేసే ప్రతియొక్క కృషి, ఒక వ్యాధిగ్రస్త శరీరానికి ఒక నూతనమైన మెరుస్తున్న తొడుగును వేయుట ద్వారా స్వస్థతను కూడా కలుగజేయుటకు చేసే వ్యర్థమైన ప్రయత్నాన్ని పోలినట్లు తప్పక ఉండవలసియుంటుంది.

ఇప్పటికే భౌతికవాదము తన తారాస్థాయిని దాటింది మరియు ఇక అంతటా విఫలమౌతూ త్వరలోనే తప్పక పతనం కావలసియుంటుంది. అయితే ఆ ప్రక్రియలో అది పలు మంచివాటిని తనతోపాటు లాగుకొనిపోకుండా ఉండదు. దాని అనుచరులు ఇప్పటికే తమ సామర్థ్యపు అంచున ఉన్నారు, త్వరలోనే వారు తమ కార్యం గురించి మరియు ఆ తరువాత తమ గురించి తామే కలవరపడతారు, తమ ఎదుట తెరుచుకొన్న అగాధాన్ని గుర్తించకుండానే. ఒక కాపరిలేని మందవలే వారు త్వరలోనే ఉండబోతారు, ఒకరినొకరు నమ్మకుండా, ప్రతివాడు తన స్వంత మార్గాన్ని అనుసరిస్తూ, అయిననూ గర్వంతో తమను ఇతరులకంటే హెచ్చించు కొంటూ ఉంటారు. పర్యాలోచించకుండానే కేవలం పాత అలవాట్లనే అనుసరిస్తుంటారు.

వారి శూన్యత్వం యొక్క బాహ్య ఆభాసానికి చెందిన సమస్త చిహ్నాలతో వారు చివరకు గ్రుడ్డిగా ఆ అగాధంలో పడిపోతారు. తమ స్వంత మెదళ్ల యొక్క ఉత్పత్తులైయున్న వాటిని వారింకా ఆత్మగా పరిగణిస్తున్నారు. కాని, జీవంలేని పదార్థం సజీవమైన ఆత్మను ఎట్లు ఉత్పత్తి చేయగలదు? చాలా విషయాల్లో వారు తమ ఖచ్చితమైన ఆలోచన గురించి గర్వపడుతున్నారు మరియు ప్రధానమైన విషయాల్లో పూర్తి వివేకహీనతలో అత్యంత బాధ్యతారహితమైన కంతలను వదులుతున్నారు.

ప్రతి క్రొత్త అడుగు, మెరుగుకొరకు చేసే ప్రతి ప్రయత్నం తనలో మరల మరల మేధస్సు యొక్క సమస్త నిష్ఫలతను మరియు దానితోపాటు అనివార్యమైన పతనం యొక్క బీజాన్ని తప్పక కలిగియుండవలసియుంటుంది.

నేను చెప్పే అటువంటిదంతా ప్రవచన కాదు, నిరాధారమైన భవిష్యవాణి కాదు కాని దేని శాసనాలను నేను నా ఉపన్యాసాలలో వివరిస్తున్నానో, ఏది సమస్తాన్ని చైతన్యపరుస్తుందో, ఆ సృష్టిచిత్తం యొక్క తిరుగులేని పరిణామమైయున్నది. ఎవడు ఆత్మయందు నాతోపాటు వాటిలో స్పష్టంగా సూచించబడిన మార్గాలను అనుసరిస్తాడో, వాడు అవశ్యమైన ముగింపును కూడా తప్పక పర్యవేక్షించ వలసియుంటుంది మరియు గుర్తించవలసియుంటుంది. మరియు దాని యొక్క అన్ని సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి.

భౌతికవాదం యొక్క అవాంఛనీయ వృద్ధి ఏ విధంగా నేడు తనను దాదాపు నమ్మలేనటువంటి రూపాలలో కనబరచు కొంటుందో చూసినప్పుడు మనుష్యులు ఫిర్యాదుచేస్తారు మరియు ఘోషిస్తారు, వారికి ఏవగింపు కలుగుతుంది. మనుష్యులు ఆ వేదననుండి విడుదలకొరకు, మెరుగుదల కొరకు, ఆ హద్దులులేని పతనంనుండి పునరుద్ధరణకొరకు బ్రతిమలాడుతారు మరియు ప్రార్థిస్తారు. ఆ కొద్దిమంది, ఎవరైతే నమ్మశక్యం కాని సంఘటనల తుఫానువరదనుండి తమ అంతరాత్మలోని ఏదో ఒక ప్రేరణను కాపాడగలిగారో, ఎవరైతే, మభ్యపెడుతూ “అభివృద్ధి” అనే నామాన్ని గర్వంగా తమ నుదుటిపై కలిగియున్న సార్వత్రిక పతనంలో ఆత్మీయంగా మునిగిపోలేదో, వారు వెలివేయబడిన వారమని, వెనుకబడిన వారమని భావిస్తున్నారు. మరియు వారు ఆధునికకాలం యొక్క నిర్జీవులైన అనుచరుల ద్వారా ఆ విధమైనవారిగా పరిగణించబడుతున్నారు మరియు పరిహాసించబడుతున్నారు కూడా.

జనసందోహాలతో చేరకుండా ఉండుటకు ధైర్యం కలిగియున్న వారందరికి విజయమాల! వారు నిటారుగా క్రిందికిపోయే పథంపై గర్వంగా వెనుకకు నిలిచారు.

దీనివల్ల తనను ఇంకా అభాగ్యునిగా పరిగణించుకొనే వాడు ఒక నిద్రసంచారి! కళ్లుతెరవండి! మిమ్ములను క్రుంగదీసే సమస్తం కూడా కేవలం పేరుకు మాత్రమే ఏలుతున్నట్లు కనిపించే భౌతికవాదం యొక్క ఆకస్మిక ముగింపు యొక్క ప్రారంభం అని మీరు చూడరా? ఆ కట్టడమంతా ఇప్పటికే, దాని క్రింద బాధపడిన మరియు ఇంకా బాధపడవలసిన వారి జోక్యం లేకుండానే, కూలిపోతున్నది. మేధొ మానవత్వం, అది సహస్రాబ్దాలుగా ఉద్భవింపజేసిన, పెంచిన, పెద్దచేసిన మరియు శ్లాఘించిన దాని యొక్క ఫలితాన్ని ఇకపై తప్పక పొందవలసియుంటుంది.

అది మానవలెక్క ప్రకారం ఒక సుధీర్ఘమైన కాలం, కాని సృష్టిలోని దేవుని స్వయంచలిత మిల్లులకు ఒక స్వల్ప సమయమే. మీరు ఎటుచూసినా, అంతటా వైఫల్యం ఉన్నది. అది వెనుకకు పొంగివస్తున్నది మరియు ఒక భారీ గోడవలే భీతిగొల్పుతూ ఎత్తుగా పేరుకొంటున్నది, త్వరలో మీద పడుతూ మరియు కూలిపోతూ దాని ఆరాధకులను తన క్రింద లోతుగా పాతిపెట్టుటకు. అది, అట్లు కార్యరూపమగుటలో తనను భయంకరంగా ప్రత్యక్షపరచుకొనవలసిన నిర్దయాత్మకమైన పరస్పరచర్య శాసనమైయున్నది, ఎందుకంటే సహస్రాబ్దాలలో చాలా రకాల అనుభవాల తరువాత కూడా ఎప్పుడూ ఉన్నతమైన దానికొరకు ఒక మార్పు కలుగలేదు, కాని దానికి వ్యతిరేకంగా అదే తప్పుదారి ఇంకా వెడల్పుగా తొక్కబడింది.

నిరాశపూర్ణులారా, సమయం వచ్చియున్నది! అన్యాయము మరియు మూర్ఖత్వము మీకు ఎంతో గొప్ప బాధను కలుగజేసినప్పుడు మీరు సిగ్గుతో వంచుకోవలసి వచ్చిన మీ తలలను పైకెత్తండి. మిమ్ములను ఆ విధంగా అణగద్రొక్కగోరిన ఆ వ్యతిరేకుణ్ణి నేడు ప్రశాంతంగా తేరిచూడండి!

ఇదివరకటి వైభవ-వస్త్రం ఇప్పటికే చాలా చినిగిపోయింది. అన్ని రంధ్రాలగుండా చివరకు మనిషి ఆ ఆకారాన్ని దాని నిజమైన రూపంలో చూస్తాడు. ఆ అలసిపోయిన, తనను ఆత్మగా హెచ్చింపజేసుకొన్న, మనుష్య మెదడు యొక్క ఉత్పాదనయైన మేధస్సు అయోమయంగా, అయినా ఏమీ తగ్గని అహంకారంతో, అవగాహనలేకుండ దానిలోనుండి చూస్తున్నది!

విశ్వాసంతో కండ్లగంతలను విప్పండి మరియు మరింత నిశితంగా చుట్టూచూడండి. అన్యథా చాలా మంచివైన దినపత్రికల యొక్క పరిశీలన మాత్రమే స్పష్టమైన దృష్టికి వివిధరకమైన వాటిని వెల్లడిస్తుంది. సమస్తమైన పాతభ్రమకు అంటిపెట్టుకొనియుండుటకు తాపత్రయంతోచేసే కృషిని మనిషి చూస్తాడు. మనుష్యులు అహంకారంతో మరియు తరచుగా చాలా వికృతమైన హాస్యోక్తులతో క్రమేణా మరింత స్పష్టంగా తనను కనబరచుకొనే అవగాహనలేమిని కప్పిపుచ్చుటకు ప్రయత్నిస్తారు. మనిషి తరచుగా, నిరర్థకమైన వ్యక్తీకరణలతో, దేని గురించి అతనికి నిజానికి ఎటువంటి అవగాహన కూడా లేనట్లు అతి స్పష్టంగా కనిపిస్తున్నదో, అటువంటి దానిని నిర్ధారించగోరతాడు.

మంచి సామర్థ్యాలు కలిగియున్న మనుష్యులు కూడా నేడు నిస్సహాయతలో అపరిశుభ్రమైన మార్గాలను ఆశ్రయిస్తారు. తద్వారా, ఏ విషయాలపై మాత్రమే ఇప్పటివరకు వారు ఆధారపడగోరియున్నారో అటువంటి చాలా విషయాలు వారి గ్రాహ్య సామర్థ్యానికి వెలుపల ఉన్నాయని కేవలం ఒప్పుకొనకుండా ఉండుటకు. వీరు తమ ప్రవర్తన యొక్క నిరర్థకతను గ్రహించరు, దాని బలహీనతలను చూడరు, దానితో వారు కేవలం వాటిని పెద్దచేయుటకు సహాయం చేస్తారు. అయోమయంలో, బైర్లు క్రమ్మిన కళ్లతో వారు త్వరలోనే సత్యం ఎదుట నిలుస్తారు మరియు దుఃఖిస్తూ తమ గాడితప్పిన జీవితాన్ని పర్యవేక్షిస్తారు. ఆ ప్రక్రియలో వారు చివరకు సిగ్గుతో గుర్తిస్తారు, సరిగ్గా ఎక్కడ వారు తమను జ్ఞానవంతులనుగా భావించుకొన్నారో అక్కడే బుద్ధిహీనత ఉండిందని.

నేటివరకే అది ఎంతదూరం వచ్చియున్నది? కండగల మనిషే గొప్పవాడు! దశాబ్దాల కొలది శ్రమించి ఒక ఔషధాన్ని కనుగొని, ఏటా లక్షలాదిమంది పిల్లలకు మరియు పెద్దలకు రక్షణను మరియు ప్రాణాంతకరమైన రోగాలలో సహాయాన్ని అందించిన ఒక గంభీరమైన పరిశోధకుడు, కేవలం పూర్తిగా ఇహలోక సంబంధమైన, మోటైన క్రూరత్వంలో తన తోటిమనిషిని చిత్తుచేసే ఒక బాక్సర్ జరుపుకున్నటువంటి విజయవేడుకలను ఎప్పుడైనా జరుపుకోగలిగాడా? అయినా ఆ ప్రక్రియలో కేవలం ఒక్క మనుష్య జీవాత్మ అయినా ఎటువంటి మేలునైనా పొందిందా? అది కేవలం ఇహలోకపరమైనది, సంపూర్ణంగా ఇహలోకపరమైనది, అనగా సమస్త సృష్టికార్యంలో అధమమైనది! అది మేధోకలాపం యొక్క బంగారుదూడకు పూర్తిగా అనుగుణంగా ఉన్నది. సంకుచిత స్వభావం కలిగియున్న మానవాళిపై, భూమితో ఎంతో బలంగా బంధించబడియున్న, మట్టితో చేయబడిన దృశ్యమాన రాకుమారుని యొక్క విజయంవలే ఉన్నది! – –

మరియు ఎవ్వరూ కూడా, పిచ్చి వేగంతో భయంకరమైన లోతునకు దిగజారుటను చూడరు!

ఎవడు దానిని అంతఃకరణానుభూతితో గ్రహిస్తాడో, వాడు ఒకవేళ తాను మాట్లాడినచో అపహసించబడతాననే సిగ్గును కలిగించే అవగాహనలో తాత్కాలికంగా మౌనంగా ఉంటాడు. అది ఇప్పటికే ఒక వెర్రి ఆవేశమైయున్నది, అయితే దానిలో అసమర్థత యొక్క అంకురిస్తున్న గుర్తింపు ఉన్నది. మరియు గుర్తింపును పసిగట్టడంతో వారు కేవలం మొండితనంలో, గర్వంలో మరియు అంతేకాక రాబోయేదాని గురించిన భయభ్రాంతులతో ఇంకా ఎక్కువ తిరగబడతారు. మనిషి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ గొప్ప తప్పిదం యొక్క అంతాన్ని గురించి ఇప్పుడే ఆలోచించ గోరడు! అది, గతించిన సహస్రాబ్దాల అతిశయపూర్వకమైన కట్టడాన్ని అతి బలంగా ఒడిసి పట్టుకోవడమే అవుతుంది; పూర్తిగా బాబేలు గోపురాన్ని అది పోలియున్నది మరియు దానిలాగే అంతమౌతుంది!

ఇప్పటివరకు లొంగని భౌతికవాదం మరణం యొక్క పూర్వసూచనను తనయందు కలిగియున్నది, గడిచే ప్రతినెలతో అది మరింత స్పష్టంగా అభివ్యక్తమౌతుంది. –

అయినా అదికసంఖ్యాకమైన మనుష్యజీవాత్మలలో, సమస్త భూమిపై, అన్ని ప్రదేశాలలో ఏదో రేగుతున్నది! సత్యం యొక్క తేజస్సుపై పురాతనమైన, తప్పైన భావనల యొక్క ఒక పలచని పొర మాత్రమే ఇంకా ఆవరించియున్నది, అది శుద్ధిచేసే మొదటి గాలిదెబ్బకు చెదరగొట్టబడుతుంది, తద్వారా మూలాన్ని బయటపెట్టుటకు; తన కిరణాల శంకువును విప్పుటకు దాని వెలుగు చాలా ఇతర వాటితో తనను ఏకంచేసుకొంటుంది; అది ఒక కృతజ్ఞతాజ్వాలవలే స్వచ్ఛ-సంతోష-రాజ్యం వైపునకు, సృష్టికర్త యొక్క పాదాల వద్దకు ఆరోహిస్తుంది.

ప్రకాశవంతమైన వాగ్దానంలో ఒక గొప్ప ఆకాశనక్షత్రంవలే మన ఎదుట ఉన్న, బహుగా ఎదురుచూడబడే వేయిసంవత్సరాల రాజ్యం యొక్క సమయమై అది ఉంటుంది!

మరియు దానితో, ఆత్మను మేధస్సు ద్వారా భూమిపై బంధించియుంచిన, ఆత్మకు వ్యతిరేకమైన, సమస్త మానవాళి యొక్క ఆ గొప్ప పాపం చివరకు విమోచించబడుతుంది! అది మాత్రమే అప్పుడు సహజత్వానికి తిరిగి నడిపించే సరియైన మార్గం, సృష్టికర్తచిత్తము యొక్క మార్గమైయుంటుంది; అది మానవకార్యాలను గొప్పవాటిగానే కొనసాగింప గోరుతుంది, మరియు సజీవమైన అంతఃకరణానుభూతులతో నింపివేస్తుంది! అయితే, ఆత్మ యొక్క విజయం అదే సమయంలో అత్యంత స్వచ్ఛమైన ప్రేమ యొక్క విజయం అవుతుంది!