బెత్లెహేము నక్షత్రము

వాగ్దానం చేయబడ్డ నక్షత్రం బెత్లెహేములో ఒక పాకపై ప్రకాశించినప్పుడు జరుగవలసియుండినట్లుగా, ఇప్పుడు లోకంలో వెలుగు కలుగవలెను.

కాని ఆనాడు ఆ వెలుగు కేవలం కొద్దిమంది ద్వారానే గ్రహించబడింది, వారిని విన్నవారు భూలోక మానవస్వభావం ప్రకారం దానిని చాలా త్వరగా వక్రీకరించారు మరియు అర్థాన్ని మార్చివేశారు, మరచిపోయిన దానిని స్వయంగా ఆలోచించిన దానితో పూరించుటకు ప్రయత్నించారు మరియు తద్వారా కేవలం గందరగోళాన్ని సృష్టించారు, అది నేడు మీరరాని సత్యముగా వర్తించవలెనట.

కేవలం అత్యంత చిన్న స్థంభం మాత్రమే తనను నకిలీదానిగా కనబరచుకొన్నట్లైతే సమస్తం కూలిపోతుందనే భయంలో, జ్ఞానోదయాన్ని కలిగించగలిగే ప్రతి వెలుగుకిరణం ప్రతిఘటించబడుతుంది, మలినపరచబడుతుంది మరియు వేరొక విధంగా వీలుకానిచోట కనీసం అపహాస్యం చేయబడుతుంది, ఎటువంటి కక్షతో, కపటంతోనంటే, అది భయంలో నుండి పుట్టిందని తేట ఆలోచనకు స్పష్టంగా కనబడుతుంది! కాని తేటగా ఆలోచించుట భూమిపై కేవలం అరుదుగానే కనుగొనబడగలదు.

అయిననూ నిజమైన జ్ఞానోదయం యొక్క వెలుగు చివరికి సంపూర్ణ మానవాళిపైకి తప్పక రావలసియుంటుంది!

మానవమెదడు కనిపెట్టిన అనారోగ్యమైనది సమస్తం సృష్టిలోనుండి తుడిచివేయబడే సమయం ఆసన్నమైనది, తద్వారా అది ఇకపై, సత్యం నిరాధారమైన చిత్రాలకంటే వేరుగా కనిపిస్తుందనే జ్ఞానోదయాన్ని అణచివేయకుండా. ఆ చిత్రాలను బింకంతోకూడిన అతిశయము మరియు వ్యాపారదృష్టి, వ్యాధిగ్రస్తమైన ఊహ మరియు కపటనటనలు, అధమమైన సంకుచిత స్వభావాల యొక్క ఉబ్బరించే ఊబిలోనుండి, అధికారం మరియు భూలోక ప్రశంసకొరకైన వాంఛలో, సృష్టించాయి.

తప్పుదారి చూపుట ద్వారా మిలియన్ల మంది మనుష్యులను బానిసలుగా చేసినవారు ఇప్పుడు శాపగ్రస్తులగుదురుగాక. ఆ మనుష్యులను వారు ఏ విధంగా బానిసలుగా చేశారంటే, నేడు వారు తమ కళ్లను ఇకపై వెలుగుకు తెరుచుటకు భయపడుటయే కాక ఇంతవరకు వారు విన్నదానికి వేరైనది ఏదైనా తమ చెవులను చేరిన తక్షణమే, దానిని ఎట్టకేలకు జాగ్రత్తగా వినుటకు మరియు ఆ క్రొత్తది వారి అవగాహనకు వారింతవరకు నేర్చుకొన్న దానికంటే చేరువగా ఉన్నదేమోనని తమలో పరీక్షించుటకు బదులుగా గ్రుడ్డిగా దూషిస్తున్నారు.

చెవులు మూసుకుపోయినవి మరియు భయంతో ఎటువంటి తాజాగాలి వాటిలోనికి రాకుండా చూడబడుతున్నది, నిజానికి కేవలం సోమరితనంలో మరియు ఆ తాజాగాలి అది తెచ్చే స్వస్థతలో దృశ్యమానంగా సుఖప్రదమైన ప్రస్తుత ఆత్మీయ కునుకునకు వ్యతిరేకంగా ఆత్మీయ చురుకుదనాన్ని నిర్దేశిస్తుందేమో, స్వయంకృషిని అపేక్షిస్తుందేమో మరియు బలవంతం చేస్తుందేమోననే భయంతో. ఆ ఆత్మీయ కునుకు యొక్క పర్యవసానం నిస్తేజమైన నిరంతర నిద్రయైయుంటుంది. తద్వారా అది కేవలం గోప్యంగావున్న, చెడిపోయిన మేధస్సు యొక్క కపటానికి స్వేచ్ఛను ఇస్తుంది!

కాని, మీరు ఆ వాక్యానికి చెవులను మూసుకొనుట, ఆ వెలుగు కళ్లను చెదరగొట్టకుండా మరియు మిమ్ములను భయపెట్టకుండా కళ్లను మూసుకొనుట, దేనికీ ఉపయోగపడదు! మీరు ఇప్పుడు బలవంతంగా ఈ విచారకరమైన మత్తులోనుండి ఉలికిపడునట్లు మేల్కొల్పబడతారు! శీతలమైన వెలుగు ఎదుట మీరు చలికి వణుకుతూ నిలువవలెను; అది కనికరం లేకుండా సమస్తమైన తప్పుడు తొడుగులను తొలగిస్తుంది. చలికి వణుకుతూ, ఎందుకంటే, తన లోపలనుండి వెచ్చగా అవుతూ వెలుగుతో ఐక్య మగుటకు మీ ఆత్మ-మిణుగురు మీలో ఇకపై రాజుకొన జేయబడలేదు కాబట్టి.

నిజానికి మీకు నమ్మశక్యం కాని దానిని నమ్ముట చాలా సులభం; కాగా అట్లుచేయునప్పుడు స్వయంగా ఆలోచించుటకు మరియు పరీక్షించుటకు మీరు శ్రమపడవలసిన అవసరం ఉండదు. కేవలం అది దేవుని ప్రకృతి శాసనాల ప్రకారం ఎటువంటి పరీక్షను తట్టుకొనలేదు కాబట్టి మీరు తప్పక ఊరికె నమ్మాలి, ఎట్లు మరియు ఎందుకు అనే విషయాలను ప్రశ్నించకుండా తప్పక గ్రుడ్డిగా నమ్మాలి; దానిని మీరు గొప్పగా ఊహించుకొంటారు! ఈ సౌకర్యవంతమైన స్వభావంలో ప్రత్యేకంగా భక్తిపరులమని భావిస్తున్న మీరు ఈ విషయంలో మిమ్ములను అన్ని సందేహాలకంటే పైన ఉంచుకొంటారు మరియు … సంతోషపడతారు, సురక్షితంగా ఉన్నామనుకొంటారు, ఉదాత్తమైనవారమని, ఆరాధనాస్వభావులమని మరియు పరదేశులో తప్పక స్థానం పొందుతామని అనుకొంటారు!

అయితే మిరు మిమ్ములను తద్వారా అన్ని సందేహాల కంటే పైన ఉంచుకోలేదు, కాని పిరికిగా దాని ప్రక్కగా పోయారు! ఆ విషయంలో మీరే స్వయంగా ఏదైనా చేయుటకు ఆత్మీయంగా చాలా సోమరివారై ఉండినారు మరియు దైవచిత్తం యొక్క శాసనాలలోని ప్రకృతికలాపాన్ని గురించిన జ్ఞానానికి బదులుగా మీరు గ్రుడ్డి నమ్మకాన్ని ఎన్నుకొన్నారు. దానికొరకు మానవమెదడు యొక్క కల్పనలు మీకు సహాయపడ్డాయి. కాగా మీరు నమ్మవలసింది ఎంత ఎక్కువ అసాధ్యమైనదో, గ్రహించబడలేనిదో, అంత సులభంగా అది మీకు ఉంటుంది, అక్షరాలా గ్రుడ్డిగా దానిని నమ్ముటకు, ఎందుకంటే అటువంటి విషయాలలో వేరొకటి సాధ్యం కాదు కాబట్టి. అక్కడ జ్ఞానము మరియు దృఢనమ్మకము తప్పక నిలిపివేయబడవలసియుంటాయి.

అసాధ్యమైనది ఒక్కటే గ్రుడ్డిదైన, అభ్యంతరాలులేని నమ్మకాన్ని అపేక్షిస్తుంది; కాగా సాధ్యమయ్యే ప్రతీదీ తక్షణమే స్వంత ఆలోచనను ప్రేరేపిస్తుంది. నిత్యము సహజత్వాన్ని మరియు క్రమబద్ధతలను కనబరిచే సత్యము ఎక్కడ ఉన్నదో, అక్కడ ఆలోచన మరియు అంతఃకరణనుభూతులు స్వతహాగా కలుగుతాయి. ఎక్కడ అది సహజమైన దానిని కనుగొనలేదో, అనగా ఎక్కడ సత్యము ఉండదో, కేవలం అక్కడ మాత్రమే అది ఆగిపోతుంది. మరియు కేవలం అంతఃకరణనుభూతి ద్వారా మాత్రమే ఏదైనా దృఢనమ్మకంగా కాగలదు, అది ఒక్కటే మానవాత్మకు విలువలను తెస్తుంది!

ఆ విధంగా ఇప్పుడు సమస్త ఇతరమైన దానితోపాటు, బెత్లెహేములో శుద్ధరాత్రితో మొదలయ్యే ఆ వలయం కూడా సమాప్తమౌతున్నది! మరియు ఈ వలయసమాప్తి లేఖనాలలో ఉన్నట్టి సరికాని దానిని తప్పక బయటకు విసిరివేయవలసి యుంటుంది మరియు దాని స్థానంలో సత్యమును విజయానికి నడిపించవలసియుంటుంది. మానవాళి సృష్టించిన చీకటి, చొచ్చుకొనివచ్చే వెలుగు ద్వారా చెదరగొట్టబడుతుంది!

యేసు జీవితంచుట్టూ కాలక్రమంలో అల్లబడియున్న అన్ని ఆఖ్యానాలు, తప్పక తొలగిపోవలసియుంటుంది, తద్వారా అది ఎట్టకేలకు స్వచ్ఛంగా, దైవశాసనాలకు అనుసారంగా ఉద్భవించుటకు, ఈ సృష్టిలో వేరొక విధంగా అసలు సాధ్యం కాకుండా ఉండవలసినట్లు. మీరింతవరకు మీరు స్వయంగా సృష్టించిన ఉపాసనములతో సృష్టికర్త యొక్క, మీ దేవుని యొక్క సంపూర్ణతను, సులభంగా నమ్మే స్వభావంలో బుద్ధిపూర్వకంగా నిరాకరించారు.

ఆ ఉపాసనములలో మీరు ఉద్దేశపూర్వకంగా మరియు తెలిసితెలిసి ఆయనను తన చిత్తములొ అసంపూర్ణునిగా చూపించారు! దాని గురించి నేను ఇప్పటికే మాట్లాడియున్నాను, మరియు మీరు ఎటు తిరిగినా ఏమి చేసినా, కేవలం ఒక్క సాకు కూడా మిమ్ములను, స్వయంగా దాని గురించి ఆలోచించుటకు మీరు చాలా సోమరిగా ఉండినారనే దానినుండి రక్షించలేదు. మీరు సృష్టిశాసనాలకు అనుగుణంగా లేని విషయాలను గ్రుడ్డిగా నమ్మినప్పుడు మీరు దానితో దేవుణ్ణి గౌరవించరు! దానికి వ్యతిరేకంగా, ఎప్పుడు మీరు సృష్టికర్త యొక్క సంపూర్ణతను నమ్ముతారో అప్పుడు మీరు తప్పనిసరిగా ఎరిగియుండవలసి ఉంటుంది, దేవుని సుస్థిరమైన శాసనాల తార్కికక్రమానికి ఖచ్చితంగా అనుగుణంగా సంభవించలేనిది ఏదియూ ఇక్కడ సృష్టిలో సంభవించజాలదని. ఆ ఒక్కదానిలో మాత్రమే మీరు ఆయనను నిజంగా గౌరవించగలరు.

ఎవడు వేరుగా ఆలోచిస్తాడో, వాడు దానితో సృష్టికర్త యొక్క, తన దేవుని యొక్క సంపూర్ణతను సందేహిస్తాడు! కాగా ఎక్కడ మార్పులు లేక తదుపరి మెరుగుపరచుటలు సాధ్యమౌతాయో అక్కడ ఎటువంటి సంపూర్ణత ఉండదు మరియు ఉండియుండలేదు! అభివృద్ధి దానికి వేరైనది. అది ఈ సృష్టిలో నిర్దేశించబడియున్నది మరియు ఉద్దేశించబడి యున్నది. కాని అది తప్పక బేషరతుగా ఇప్పటికే ఉనికిలో వున్న శాసనాల ప్రభావం యొక్క తార్కికక్రమమువలే జరగవలసియుంటుంది. కాని అదంతా కూడా, ముఖ్యంగా క్రీస్తు జీవితంలో, చాలామంది విశ్వాసుల ద్వారా పూర్తిగా సహజమైనవిగా అంగీకరించబడుతున్న వాటిని తేజాలదు!

మీ కలలలోనుండి చివరకు మేల్కొనండి, మీ అంతరంగంలో సత్యనిష్టులు అవ్వండి! సృష్టిలోని శాసనాల ప్రకారం మానవ భౌతికశరీరాల జననం స్థూలపదార్థ ప్రజననం ముందుగా జరగనిదే ఎప్పటికీ అసాధ్యమని, ఒక స్థూలపదార్థ శరీరం దాని భౌతికమరణం తరువాత సూక్ష్మపదార్థ రాజ్యంలోనికి ఎత్తబడుట అంతే అసాధ్యమని, జీవసముదాయతలోనికి లేక అసలు ఆత్మికతలోనికైతే అంతకంటే అసాధ్యమని, మరియొకసారి మీకు చెప్పబడ వలెను! మరియు యేసు ఇక్కడ భూమిపై తప్పక పుట్టించబడవలసి యుండినందున, ఈ సంఘటన కూడా పూర్వప్రజననం అనే దైవశాసనానికి లోబడియుండింది.

లేఖనాలు చెబుతున్నట్లు క్రీస్తు విషయంలో జరిగియుండి నట్లైతే, దేవుడు తప్పక తన స్వంత శాసనాలకు వ్యతిరేకంగా పనిచేయవలసియుండేది. కాని దానిని ఆయన చేయలేడు, కాగా ఆయన ఆదినుండి సంపూర్ణుడైయున్నాడు మరియు అదే విధంగా సృష్టిశాసనాలలోవున్న ఆయన చిత్తం కూడా సంపూర్ణమైనది. ఎవడు అయిననూ వేరొక విధంగా ఆలోచించుటకు ధైర్యంచేస్తాడో, వాడు ఈ సంపూర్ణతను సందేహిస్తాడు మరియు తద్వారా చివరకు దేవుణ్ణి కూడా! కాగా దేవుడు సంపూర్ణత లేకుండా దేవుడైయుండలేడు. ఇక్కడ ఎటువంటి సాకు ఉండదు! ఇప్పటివరకున్న చాలా అభిప్రాయాల యొక్క పునాదులు ఇప్పుడు తద్వారా తప్పక కదిలించబడవలసినాకూడా, ఈ సరళమైన నిశ్చయతను ఒక మనుష్యాత్మ తనకు ఇష్టంవచ్చినట్లు వక్రీకరించలేదు, ఇక్కడ కేవలం అటో-ఇటో మాత్రమే ఉన్నది. సంపూర్ణత లేక శూన్యత. ఒక వంతెన ఇక్కడ కట్టబడనివ్వదు, ఎందుకంటే ఏదైనా సగమైనది, అసంపూర్ణమైనది దైవత్వంలో ఉండలేదు. దేవునికి సంబంధించిన విషయంలో కూడా ఉండదు!

యేసు భౌతికంగా ప్రజననం చేయబడ్డాడు, లేనిచో భౌతికజననం సాధ్యమైయుండేది కాదు.

కేవలం కొద్దిమంది ద్వారా మాత్రమే ఆనాడు ఆ నక్షత్రం, ప్రవచనాల యొక్క నెరవేర్పుగా గుర్తించబడింది. అదే విధంగా స్వయంగా మరియ ద్వారా మరియు లోతుగా కదిలించబడి తన ముఖాన్ని దాచుకొన్న యోసేపు ద్వారా కూడా.

ముగ్గురు రాజులు ఆ పాకకు మార్గాన్ని కనుగొన్నారు మరియు భౌతిక బహుమానాలు ఇచ్చారు; కాని ఆ తరువాత, ఆ బిడ్డకు తన సద్భావకార్యమును పూర్తిచేయుటలో ఎటువంటి హాని కలుగకుండా భూమిపై దాని యొక్క మార్గమును తమ నిధులతో, తమ శక్తితో, సుగమం చేయవలసియుండిన ఆ రాజులు, ఆ బిడ్డను రక్షణలేకుండా వదిలివేశారు. వారికి ఆ బిడ్డను కనుగొనగల్గుటకు దర్శనం కలిగినాకూడా వారు తమ ఉన్నతమైన పిలుపును సంపూర్ణంగా గుర్తించియుండలేదు.

అశాంతి మరియను నజరేతునుండి వెళ్లిపోవుటకు ప్రేరేపించింది, మరియు యోసేపు, ఆమె మౌనమైన బాధను, ఉత్కంఠను చూసి, ఆమె కోరికను తీర్చాడు, తద్వారా కేవలం ఆమెను సంతోషపరచుటకు. తన వడ్రంగి పనిశాల యొక్క యాజమాన్యాన్ని తన సహాయకులలో అత్యంత అనుభవజ్ఞునికి అప్పగించి మరియతో మరియు ఆ బిడ్డతో ఒక దూరదేశానికి ప్రయాణించాడు. రోజువారీ పనిలో మరియు అనుదిన దిగుళ్లలో నెమ్మదిగా ఆ ప్రకాశవంతమైన నక్షత్రం యొక్క జ్ఞాపకం వారిద్దరిలో సమసిపోయింది, ముఖ్యంగా ఎందుకంటే యవ్వనకాలంలో యేసు ఎటువంటి అసాధారణమైన దానిని చూపలేదు కాని పిల్లలందరివలే పూర్తిగా సహజంగా ఉండెను కాబట్టి.

యేసుకు ఎల్లప్పుడు తండ్రివంటి అత్యంత మంచి స్నేహితుడైయుండిన యోసేపు, తన స్వంతనగరానికి తిరిగివచ్చిన తరువాత తన అంత్యశయ్యపై మరణించే సమయంలో భూమిపై అతని చివరిక్షణాలలో మాత్రమే, తన అంత్యశయ్య ప్రక్కన ఒంటరిగా నిలిచియున్న యేసుపైన సిలువను మరియు పావురమును చూశాడు. అతని చివరిమాటలు లోతుగా కదిలించబడినవైయుండినవి: “అంటే ఆయనవు నివే అన్నమాట!”

యేసు తాను యోహాను వద్దకు పోవుటకు ప్రేరేపించబడునంతవరకు స్వయంగా దాని గురించి ఎరిగియుండలేదు. యోర్దాను నదీతీరంలో జ్ఞానవంతమైన బోధలు చేయుచున్నాడని మరియు బాప్తీస్మమిచ్చుచున్నాడని అతని గురించి యేసు వినియుండెను.

ఈ స్థూలపదార్థ కార్యమైన బాప్తీస్మములో ప్రేషణము యొక్క ప్రారంభం స్థూలపదార్థ లోకంలో స్థిరంగా నాటబడింది. కండ్లకట్టు తొలగిపోయింది. యేసు స్వయంగా, ఆ క్షణంనుండి, తాను తండ్రివాక్యమును భూలోక మానవాళి మధ్యకు తీసుకొనిపోవలసియున్నదని ఎరిగియుండెను.

ఆయన జీవితం మొత్తం, అది వాస్తవంగా ఏ విధంగా ఉండిందో ఆ విధంగా, మానవమెదళ్ల యొక్క అన్ని కాల్పనికాలనుండి స్వతంత్రించబడినదై, మీ ఎదుట ఉంచబడుతుంది! ఈ సంఘటన యొక్క వలయసమాప్తితో, తీర్పునందు సత్యం యొక్క విజయంలో అందరికి విశదమౌతుంది, సత్యమును ఇకపై చాలాకాలంవరకు మసకబారజేయరాదని!

మరియ తనలో అనుమానలతో పోరాడింది; కుమారుని విషయంలో తల్లి దిగుళ్ల ద్వారా అవి బలపరచబడ్డాయి, గొల్గొతా దిశగా బాధకరమైన నడకవరకు. స్వచ్ఛంగా మానవప్రదంగానే కాని భూలోకాతీతంగా కాదు. అక్కడ మాత్రమే ఆమెకు చివరకు ఆయన ప్రేషణ విషయంలో గుర్తింపు మరియు దానితోపాటు నమ్మకము కలిగాయి.

కాని ఇప్పుడు, ఆ నక్షత్రం యొక్క పునరావృత్తంలో దేవునికృప ద్వారా అన్ని పొరపాట్లు తొలగించబడవలెను మరియు ఎవరు ఆనాడు క్రీస్తుమార్గాన్ని మూర్ఖత్వం లేక చెడుసంకల్పం లేకుండా కష్టతరం చేసియున్నారో మరియు ఇప్పుడు వలయసమాప్తి వద్ద గుర్తింపు పొంది, అలక్ష్యంచేసిన వాటిని లేక తమ వైఫల్యాలను సరిచేయుటకు ప్రయత్నిస్తున్నారో, వారి యొక్క అన్ని తప్పులు విమోచించబడవలెను.

వాటిని తిరిగి సరిదిద్దవలెననే కోరికలో ఆ ప్రకాశవంతమైన నక్షత్రంతో వారికి విమోచన ఉదయిస్తుంది. సతంత్రించబడినవారై వారు, తన జ్ఞానంలో మరియు మంచితనంలో శాసనాలను సృష్టించిన ఆయనకు సంతోషభరితమైన కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఆ శాసనాల ప్రకారం జీవులు తప్పక తీర్పును మరియు విడుదలను పొందవలసియుంటుంది.