కాళరాత్రివలే సూక్ష్మపదార్థ చీకటి ఈ భూమిపై క్రమ్ముకొనియున్నది! చాలాకాలం నుండే. అది భూమిని శ్వాసను అవరోధించే విధంగా పట్టుకొనియున్నది, ఎంత దట్టంగా మరియు దృఢంగానంటే, ప్రతి ఆరోహించే వెలుగు-అంతఃకరణానుభూతి, ఆమ్లజని లేక శక్తిని కోల్పోయే మరియు త్వరగా సమసిపోతూ ఆరిపోయే ఒక జ్వాలను పోలియున్నది.
ఈ సూక్ష్మపదార్థ స్థితి భయంకరంగా ఉన్నది, అది ప్రస్తుతం దాని అత్యంత అధ్వానమైన రకంలో కార్యరూపమౌతుంది. ఎవడైనా ఒక్కసారి కేవలం ఐదు క్షణాలు మాత్రమే ఈ ప్రక్రియను చూడగలిగినట్లైతే, వాని భయభ్రాంతులు రక్షణపైవున్న సమస్త విశ్వాసాన్ని దోచుకొంటాయి! –
మరియు అదంతా స్వయంగా మనుష్యుల దోషం ద్వారానే కలుగజేయబడింది. తుచ్ఛమైన దానికొరకుగల వారి ఇచ్ఛ ద్వారా. ఇక్కడ మానవళి యొక్క అత్యంత పెద్ద శత్రువు స్వయంగా మానవాళే అయ్యుండింది. మరల పట్టుదలతో ఉన్నతానికి ప్రయాసపడుతున్న కొద్దిమంది కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, ఏ లోతువైపునకు ఇతరులు భీతిగొల్పే వేగంతో అభివృద్ధిచెందుతున్నారో దానిలోనికి, వారితో కలిపి లాగబడుటకు.
అది చుట్టివేయుటను పోలియున్నది, అనివార్యంగా చంపివేసే పీల్చుకొనబడుట దానిని అనుసరిస్తుంది. దేనిలోనికి సమస్తం శబ్దంలేకుండా మునిగిపోతుందో, అటువంటి ఉబ్బరించే, జిగటగల ఊబిలోనికి పీల్చుకొనబడుట. అక్కడ ఎటువంటి పెనుగులాట ఇకపై ఉండదు, కాని కేవలం ఒక నిశ్శబ్దమైన, మూగబోయిన, భయానకమైన ఉపిరాడకుండాచేయుట మాత్రమే ఉంటుంది.
మరియు మనిషి దానిని గుర్తించడు. ఆత్మీయ సోమరితనం ఆ నశింపజేసే సంఘటన విషయంలో అతనిని గ్రుడ్డిగా ఉండునట్లు చేస్తుంది.
అయితే ఆ ఊబి సతతం విషపూరితమైన ఉద్గారాలను మొదట పంపుతుంది. అవి, ఇంకా బలంగా మెలుకువగావున్న వారికి నెమ్మదిగా అలసటను కలుగజేస్తాయి, తద్వారా వారు కూడా నిద్రలోనికి జారుతూ, శక్తిహీనతలో, కలిసి మునిగిపోవుటకు.
ప్రస్తుతం ఈ భూమిపై పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక్కడ నేను వర్ణించేది ఒక చిత్రం కాదు, కాని జీవితం! సమస్తమైన సూక్ష్మపదార్థత మనుష్యుల యొక్క అంతఃకరణానుభూతుల ద్వారా సృష్టించబడిన మరియు చేతనపరచబడిన రూపాలను ధరించియున్నందున, అటువంటి కలాపం నిజంగా సతతం జరుగుతూ ఉంటుంది. మరియు అదే మనుష్యులు ఈ భూమిపైనుండి పోవలసియున్నప్పుడు మరియు వెలుగైన మరియు సుందరమైన ప్రాంతముల దిశగా ఉన్నతానికి నడిపించబడలేనప్పుడు ఎదుర్కొనబోయే పరిసరం.
కాని చీకటి క్రమేణా మరింత దట్టమౌతుంది.
మానవాళి తన సంకల్పం ద్వారా దానిని వత్తిడి చేసినందువల్ల, కొంతకాలంవరకు ఈ భూమి, వెలుగునుండి ప్రతక్ష సహాయం లేకుండా చీకటి యొక్క పాలనకు వదిలివేయబడుటకు, సమయం ఆసన్నమైనది. వారి సంకల్పం యొక్క పరిమాణాల ఆధిక్యత తప్పక ఈ అంతాన్ని తేవలసివచ్చింది. – అది యోహానుకు ఒకానొకప్పుడు చూచుటకు అనుమతించబడ్డ, దేవుడు తన వదనాన్ని కప్పివేసుకొనే సమయము. –
చుట్టంతా రాత్రియైయున్నది. కాని దేనిలో మెరుగైనది కూడా కలిసి మునిగిపోయే అపాయం ఉన్నదో ఆ అత్యంత గొప్ప ఉపద్రవంలో, ఇక అదే సమయంలో ప్రొద్దుపొడుస్తుంది. అయితే ఆ ప్రొద్దుపొడుపు మొదట గొప్ప శుద్ధీకరణ యొక్క శ్రమలను తెస్తుంది, పట్టుదలతో అన్వేషించు వారందరి రక్షణ మొదలుకాక మునుపు అది అనివార్యమైయున్నది; కాగా న్యూనతమైన దానికి తాపత్రయపడే వారందరికి సహాయంకొరకు చేయి అందించబడజాలదు, వారు ఆ ఘోరమైన లోతులవరకు కూలిపోవలెను, అక్కడ మాత్రమే వారు, తమపై తమకే ఏవగింపును తప్పక కలిగించే యాతనల ద్వారా ఇంకా మేల్కొలుపును ఆశించగలరు.
ఎవరైతే ఇప్పటివరకు అపహస్యంచేస్తూ మరియు దృశ్యమానంగా శిక్షింపబడకుండా, ఆరోహించుటకు ప్రయాసపడేవారికి అడ్డంకులను కలుగజేయగలిగారో వారు, మౌనులౌతారు, ఆలోచనాపరులౌతారు, చివరకు అర్థిస్తూ, మూల్గుతూ సత్యముకొరకు ప్రాధేయపడతారు.
అప్పుడు వారికి అది అంత సులభంగా ఉండదు, వారు ఆపబడలేకుండా దేవుని తిరుగులేని న్యాయశాసనాల విసుర్రాయి ద్వారా విసరబడతారు, వారు ఆ అనుభవం ద్వారా వారి తప్పుల విషయంలో జ్ఞానోదోయం పొందునంతవరకు. –
నా వాక్యంతో సోమరి మనుష్యుల మధ్యలోనికి ఒక కొరివి విసరబడిందని నా ప్రయాణాలలో నేను గుర్తించగలిగాను. దేవుణ్ణి తనలోనే కనుగొనుటకు మరియు దానితో చివరకు స్వయంగా దేవునిగా కూడా అగుటకు చాలా కృషిచేయ బడుతున్న ఈ సమయంలో, ఏ మనిషి కూడా దైవానికి సంబందించినది తనది అనలేడని ఆ వాక్యం వివరిస్తుంది!
అందువల్ల నా వాక్యంతో చాలా అలజడి రేపబడింది, మానవాళి తిరగబడుతూ దానిని వ్యతిరేకించగోరుతుంది, ఎందుకంటే అది కేవలం నిద్రపుచ్చే మరియు శాంతపరిచే, దానికి ఆహ్లాదకరంగా అనిపించే మాటలను మాత్రమే వినగోరుతుంది కాబట్టి!
ఆ విధంగా తిరగబడేవారు కేవలం పిరికివారైయున్నారు, వారు అత్యంత ఇష్టంగా తమనుండి తామే దాచుకొంటారు, తద్వారా మబ్బులోనే కొనసాగుటకు. దానిలో వారు ఎంతో సుందరంగా మరియు ప్రశాంతంగా కలలుకనవచ్చు, తమ స్వంత కోరిక ప్రకారం.
వస్త్రం యొక్క లోపాలను మరియు మరకలను స్పష్టంగా మరియు నిర్దాక్షిణ్యంగా చూపే సత్యం యొక్క వెలుగునకు గురిచేయబడుటను ప్రతి ఒక్కడూ తట్టుకొనలేడు.
అటువంటివారు, “అహం” అనే బలహీనంగా కట్టబడిన విగ్రహం యొక్క మట్టికాళ్లను స్పష్టంగా గుర్తింపజేసే ఆ రాబోయే దినాన్ని చిరునవ్వుతో, అపహాస్యంతో లేక శత్రుత్వం ద్వారా అడ్డుకొనగోరుతారు. అటువంటి అవివేకులు తమతో తామే మారువేషాల ఆటలను ఆడుకుంటున్నారు, వాటివెంట నిర్దయాత్మకంగా భస్మబుధవారం అనుసరిస్తుంది. వారి తప్పుడు అభిప్రాయాలలో వారు కేవలం తమను తామే స్వయంగా దైవసమానులనుగా చేసుకోవాలనుకొంటున్నారు, మరియు దానిలో వారు భూలోకరీత్యా సుఖసౌకర్యానుభూతిని పొందుతున్నారు. ఈ సొమరితనంతోకూడిన ప్రశాంతతకు అంతరాయం కలిగించే వానిని వారు మొదటినుంచే శత్రువుగా పరిగణిస్తున్నారు!
కాని సమస్త తిరుగుబాటు ద్వారా వారికి ఈసారి ఎటువంటి ప్రయోజనం ఉండదు!
తమను స్వయంగా దైవసమానులనుగా చేసుకొనుటను చూపుతున్న, దైవసంబంధమైనది మనిషిలో ఉన్నది అనే భావన, దేవుని యొక్క ఘనతను మరియు శుద్ధతను మలినంతో తాకుటయే. దానితో మీరు మీకు అత్యంత పరిశుద్ధమైన, దేని దిశలో మీరు అత్యంతానందంతో కూడిన విశ్వాసంలో పైకిచూస్తారో దానిని అపవిత్రపరుస్తారు! –
మీ అంతరంగంలో మీ దేవుణ్ణి ఆరాధించుటకు సహాయపడవలసిన ఒక దైవపీఠం ఉన్నది. ఈ దైవపీఠం మీ యొక్క అంతఃకరణగ్రహణ సమర్థతయే. అది స్వచ్ఛంగా ఉన్నట్లైతే, సూటిగా ఆత్మికతతో మరియు తద్వారా పరదేశుతో అనుసంధానాన్ని కలిగియుంటుంది! అత్యంత లోతైన బాధలో మరియు అత్యున్నతమైన సంతోషంలో జరిగినట్లు, మీరు కూడా మీ దేవుని యొక్క సమీపత్వమును అంతఃకరణంలో సంపూర్ణంగా అనుభవించగలిగే క్షణాలు అప్పుడు వస్తాయి!
ఆయన సమీపత్వమును మీరు అప్పుడు ఏ విధంగా నిత్యమైన ఆది-ఆత్మలు పరదేశులో నిత్యం అనుభవిస్తాయో, ఎవరితో మీరు అటువంటి క్షణాలలో సన్నిహితంగా అనుసంధానించబడియుంటారో, అదే విధంగా అంతఃకరణంలో అనుభవిస్తారు. గొప్ప సంతోషం యొక్క, అదే విధంగా లోతైన విషాధం యొక్క ఉద్వేగం ద్వారా కలిగే బలమైన ప్రకంపన, భూలోకరీత్యా-అధమమైన దానినంటినీ కొన్ని క్షణాలవరకు చాలా వెనుకకు నెట్టివేస్తుంది. దానిద్వారా అంతఃకరణానుభూతి యొక్క స్వచ్ఛత విడుదల అవుతుంది. అది తక్షణమే తనకు సజాతీయమైన, స్వర్గాన్ని ఉత్తేజపరిచే శుద్ధతకు వారధిని కడుతుంది!
అది మానవాత్మ యొక్క అత్యున్నతమైన సంతోషమైయున్నది. పరదేశులోవున్న నిత్యమైనవారు దానిలో సతతం జీవిస్తుంటారు. అది సురక్షితభావం యొక్క సుందరమైన నిశ్చయతను కలుగజేస్తుంది. అప్పుడు వారు వారి దేవుని యొక్క, ఎవరి శక్తియందు వారు నిలిచియున్నారో ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని పూర్తిగా ఎరిగియుంటారు, కాని అదే సమయంలో వారు, తాము తమ అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నామనే విషయాన్ని మరియు ఏనాటికీ దేవునిని చూచుటకు సమర్థులం కాలేమనే విషయాన్ని సహజమైనదానిగా గుర్తిస్తారు.
అయితే అది వారిని క్రుంగిపోనివ్వదు, కాని ఆయన యొక్క, సమీపించుటకు విలుకాని ఘనతను గుర్తించుటలో, అహంభావియైన జీవి విషయంలో ఆయన ఎల్లప్పుడు చూపియున్న చెప్పలేనంత కృపకొరకు, ప్రహర్షంతో కూడిన కృతజ్ఞతను కలిగియుంటారు.
ఈ సంతోషాన్ని భూలొకమనిషి సహితం అనుభవించగలడు. భూలోకమనిషి పావనమైన క్షణాలలో తన దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని అనుభవిస్తాడని అనుట చాలా సరియైనది. అయితే, ఎప్పుడైతే మనిషి ఈ అద్భుతమైన దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవింపజేసే ఈ వారధిలోనుండి, తాను స్వయంగా ఒక దైవ మిణుగురును తనలో కలిగియున్నాననే భావనను నిర్మిస్తాడో, అప్పుడు అది అపవిత్రపరచుట అవుతుంది.
ఈ భావనతోపాటు దైవప్రేమను అవమూల్యపరచుట కూడా జరుగుతుంది. దేవుని ప్రేమను మానవప్రేమ యొక్క కొలతతో ఎట్లు కొలవగలం? పైగా దాని విలువను మానవ ప్రేమకంటే క్రింద ఎట్లు ఉంచగలం? ఎవరైతే దేవుని ప్రేమను అత్యంత ఆదర్శవంతమైన దానిగా, కేవలం పూర్తి నిశ్శబ్దంగా సహిస్తూ మరియు దానికితోడు అన్నింటినీ క్షమిస్తూ ఉండేదానిగా ఊహించుకొంటారో అటువంటి మనుష్యులను చూడండి! దానిలో వారు, అధమమైన జీవుల సమస్తమైన అసభ్యతను సహించే దైవత్వమును గుర్తించగోరతారు. ఆ విధంగా కేవలం అత్యంత బలహీనుడు, అత్యంత పిరికివాడైన మనిషి మాత్రమే చేస్తాడు, అయితే అందువల్ల అతడు తిరస్కరించబడతాడు. దాని గురించి ఒకసారి ఆలోచించండి, ఎటువంటి వికృతమైన అవమానం దానియందున్నదో!
మనుష్యులు దండించబడకుండా పాపం చేయగోరతారు, ఆ తరువాత చివరకు తమ దేవుణ్ణి, తాము ఎటువంటి ప్రాయశ్చిత్తం స్వయంగా చేయకుండానే క్షమించబడనిచ్చు కొనుట ద్వారా ఇంకా సంతోషపరచుటకు! అటువంటి దానిని భావించుటకు కారణం అత్యంత సంకుచిత స్వభావమైనా, శిక్షార్హమైన సోమరితనమైనా అయ్యుంటుంది లేక ఆరోహణ ప్రయాసకొరకు అవసరమైన మంచిసంకల్పం విషయంలో తమ ఆశాహీనమైన బలహీనత యొక్క గుర్తింపైనా అయ్యుంటుంది: కాని అవి ఒకదానికంటే మరియొకటి దూష్యమైనవి.
దేవుని ప్రేమను ఊహించుకోండి! సంపూర్ణంగా స్వచ్ఛమైనది, ప్రకాశవంతమైనది, శుద్ధమైనది మరియు గొప్పది! అది మనుష్యులు అతి ఇష్టంగా కోరుకొంటున్న తియ్యని-బలహీనమైన భావములు కలది, అవమానకరంగా అన్నింటినీ సహించే గుణాన్ని కలిగియుంటుందని మీరు అనుకొనగలరా? ఎక్కడ వారు బలహీనతను కోరుతున్నారో అక్కడ వారు తప్పుడు గొప్పతనాన్ని నిర్మించగోరుతున్నారు, ఒక తప్పుడు చిత్రాన్ని ఇస్తున్నారు, తద్వారా కేవలం తమను ఇంకొంత మోసపరచుకొనుటకు, తమ స్వంత లోపభూయిష్టత విషయంలో తమను శాంతపరచుకొనుటకు. అది వారిని ఇష్టపూర్వకమైన చీకటి సేవకులను చేస్తుంది.
దైవప్రేమ యొక్క సంపూర్ణ-స్వచ్ఛతకు తప్పకచెందే తారుణ్యం మరియు శక్తి ఎక్కడ ఉన్నాయి? దైవప్రేమ, దైవన్యాయత యొక్క అత్యంత గొప్ప కఠినతనుండి వేరుచేయబడలేదు. అది స్వయంగా దైవన్యాయతయై యున్నది. న్యాయత ప్రేమయైయున్నది మరియు ప్రేమ తిరిగి కేవలం న్యాయతలోనే ఉన్నది. దానిలో మాత్రమే దైవక్షమాపాణ కూడా ఉన్నది.
చర్చిలు దేవుడు సమస్తమును క్షమిస్తాడు అనుట సరియైనదే! మరియు నిజంగా క్షమిస్తాడు! దానికి విరుద్ధంగా మనిషి, ఎవడైతే ఏదో ఒక చిన్న తప్పుకు ప్రాయశ్చిత్తం చేసియుంటాడో, స్వయంగా వానిని కూడా ఎల్లప్పుడు అయోగ్యునిగా పరిగణిస్తాడు మరియు అటువంటి రకమైన ఆలోచనల ద్వారా రెండంతల దోషాన్ని తనపై మోపుకొంటాడు, ఎందుకంటే అతడు ఆ విషయంలో దేవుని చిత్తం ప్రకారం వ్యవహరించడు. ఇక్కడ మానవప్రేమకు న్యాయత లోపించియుంటుంది.
దైవ సృష్టిచిత్తము యొక్క ప్రభావం ప్రతి మానవాత్మను దాని దోషంనుండి శుద్ధపరుస్తుంది, దాని స్వంత అనుభవాల ద్వారా లేక అది స్వచ్ఛందంగా మెరుగుపడుట ద్వారా అది ఆరోహణను మొదలుపెట్టిన వెంటనే.
అది పదార్థతలోని ఈ మిల్లులలోనుండి ఆత్మికతకు తిరిగివచ్చినట్లైతే, అది శుద్ధమైన దానిగా తన సృష్టికర్త యొక్క రాజ్యంలో నిలుస్తుంది, అది ఎప్పుడు ఏమి తప్పు చేసియుండిందనేది పరిగణనలోకి రాదు! అది ఏనాడూ తప్పుచేయని దానితో సమానంగా శుద్ధమైనదైయుంటుంది. అయితే దాని మార్గం అంతకుముందుగా దైవశాసనాల ప్రభావంగుండా పోతుంది, మరియు ఆ వాస్తవికతలోనే దైవక్షమాపణకు, ఆయన కృపకు హామీ ఉంటుంది!
ఇటువంటి దుఃఖకరమైన సంవత్సరాలు దేవుని చిత్తం ప్రకారం ఎట్లు సంభవించగలిగినవి? దానిలో ప్రేమ ఎక్కడ ఉన్నది, న్యాయత ఎక్కడ ఉన్నది? అనే భీతితోకూడిన ప్రశ్నను మనం నేడు చాలాసార్లు వినమా. ఈ ప్రశ్నను మానవాళి వేస్తుంది, దేశాలు వేస్తాయి, తరచుగా కుటుంబాలు మరియు ఒక్కొక్క మనిషి కూడా! ఇది అతనికి, దేవునిప్రేమ నిజానికి చాలమంది ఊహించుకొనగోరే దానికి ఒకవేళ ఏమైనా వేరుగా ఉన్నదేమో అనేదానికి ఒక రుజువైయుండవద్దా? అన్నింటినీ క్షమించే దేవుని ప్రేమను, మనిషి ఏ విధంగా దానిని చిత్రీకరించుటకు పంతంతో ప్రయాసపడతాడో, అదే విధంగా, ఒక అంతంవరకు సమగ్రంగా ఆలోచించుటకు ప్రయత్నించండి! స్వంత ప్రాయశ్చిత్తం లేకుండా, అన్నింటినీ సహిస్తూ మరియు చివరకు పైగా ఉదాత్తతతో క్షమించే దేవుని ప్రేమను. అది ఒక బాధాకరమైన పరిణామాన్ని తప్పక కలుగజేయవలసియుంటుంది! అతని దేవుడు దానిక్రింద బాధపడవనసినంత విలువైన వానిగా మనిషి తనను పరిగణించుకొంటాడా? దాని ప్రకారంగా దేవునికంటే విలువైనవాడా? మనుష్యుల ఈ అహంకారంలో ఇంకా ఏమి ఇమిడియున్నాయో. –
ప్రశాంతంగా ఆలోచించునప్పుడు మీరు వేయి అడ్డంకులకు తట్టుకొని తూలవలసియుంటుంది మరియు ఎప్పుడు మీరు దేవుణ్ణి కించపరుస్తారో, ఎప్పుడు ఆయనను అసంపూర్ణునిగా చేస్తారో కేవలం అప్పుడు మాత్రమే ఆ విషయంలో ఒక ముగింపుకు రాగల్గుతారు.
అయితే, దానిపట్ల మనుష్యుల వైఖరి ఏ విధంగా ఉన్నదనే దానితో సంబంధం లేకుండా ఆయన సంపూర్ణునిగా ఉండియున్నాడు, ఉన్నాడు మరియు ఉంటాడు.
ఆయన క్షమాభిక్ష న్యాయతలో ఉన్నది. ఏ ఇతరదానిలో కాదు. మరియు ఈ తిరుగులేని న్యాయతలో మాత్రమే ఆ గొప్ప, ఇంతవరకు అపార్థం చేసుకొనబడిన ప్రేమ కూడా ఉన్నది!
ఆ విషయంలో భూలోక ప్రమాణముల ప్రకారం కొలిచే అలవాటును మానుకోండి. దేవుని న్యాయము మరియు దేవుని ప్రేమ మనుష్య ఆత్మకు వర్తిస్తాయి. పదార్థతకు దానిలో ఎటువంటి పాత్ర కూడా ఉండదు. అది కేవలం మనుష్యాత్మ ద్వారా స్వయంగా రూపొందించబడిందే కదా. ఆత్మ లేకుండా దానికి జీవం ఉండదు.
ఎందువల్ల మీరు అతితరచుగా పూర్తిగా భూలోకానికి సంబంధించిన, మీరు దోషంగా పరిగణించే, నిజానికి ఏమాత్రమూ దోషం కాని, అల్పమైన వాటితో మిమ్ములను హింసించుకొంటారు.
కేవలం దేనిని ఆత్మ ఒక క్రియలో కోరుకొంటుందో, అదే సృష్టిలోని దేవుని శాసనాలకు కీలకమైనది. అయితే ఈ ఆత్మీయ సంకల్పం ఆలోచనప్రక్రియ కాదు, కాని లోతైన అంతఃకరణానుభూతియైయున్నది, అదే మనిషిలోని నిజమైన సంకల్పం. అది మాత్రమే ఆవలిలోక శాసనాలను చలనంలోనికి తేగలదు మరియు స్వయంచాలకంగా కదిలిస్తుంది కూడా.
దేవుని ప్రేమ తనను మనుష్యుల ద్వారా అవమూల్యపరచ బడనీయదు; కాగా దానిలో, ఆయన చిత్తం యొక్క తిరుగులేని శాసనాలు కూడా నిలిచియున్నవి. ఆ చిత్తానికి ప్రేమ మూలమైయున్నది. ఈ శాసనాలు మనిషి దానిలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో దాని ప్రకారమే ప్రభావాన్ని చూపుతాయి. అవి అతన్ని దేవుని సమీపంవరకు అనుసంధానం చేయగలవు, లేక అవి ఏనాటికీ కూల్చబడలేని ఒక అడ్డుగోడను నిర్మిస్తాయి, మనిషి ఎట్టకేలకు వాటిని అవలంబిస్తే తప్ప, అనగా వాటికి లోబడితే తప్ప. దానిలో మాత్రమే అతడు తన విమోచనను, తన సంతోషమును పొందగలడు.
అది ఒకేఒక్క పోతయైయున్నది, ఆ గొప్పకార్యం ఎటువంటి లోపాలను కాని, ఎటువంటి కంతను కాని చూపదు. అది వేరుగా ఉండాలని కోరుకొనే ప్రతి బుద్ధిహీనుడు, ప్రతి అవివేకి, తన తలను పగులగొట్టుకొంటాడు. –
దైవప్రేమ దానిలో ఏది మనుష్యాత్మకు ఉపయోగకరమో, కేవలం దానినే కలుగజేస్తుంది కాని ఏది అతనిని భూమిపై సంతోషపరుస్తుందో మరియు అతనికి ఆహ్లాదకరంగా కనిపిస్తుందో దానిని కాదు. అది అంతకంటె చాలా దూరం పోతుంది, ఎందుకంటే అది సమస్త ఉనికిని శాసిస్తుంది. –
ఇప్పుడు చాలామంది మనుష్యులు అతి తరచుగా అనుకొంటారు: ఒకవేళ ఆ గొప్ప శుద్ధీకరణను కలుగ జేయుటకు దుఃఖము, నాశనము రావలసియుంటే, అటువంటి పక్షంలో దేవుడు తప్పక ఎంత న్యాయవంతుడైయుండ వలెనంటే, ఆయన అంతకుమునుపే పశ్చాతాపాన్ని బోధించే బోధకున్ని పంపవలసియుంటుంది, అని. మనిషి దానికంటే ముందే తప్పక హెచ్చరంచబడవలసియుంటుంది కదా. ఆ రాబోయే దానిని ప్రకటించే యోహాను ఎక్కడ ఉన్నాడు?
వారు, తాము చాలా వివేకులమని భావిస్తారు కాని వారు ఆలోచనశూన్యులైన దౌర్భాగ్యులు! కేవలం అత్యంత గొప్ప శూన్యత్వం యొక్క అహంకారం మాత్రమే అటువంటి అరుపుల వెనుక పొంచియుంటుంది. వారతన్ని కేవలం హింసించియుండేవారు, కారాగారంలో వేసేవారు!
మీ కళ్లను మరియు చెవులను తెరవండి! మనిషి తన తోటి మనుష్యుల సమస్తమైన వ్యాకులత మరియు భీతి ఎదుటనుండి నృత్యంచేస్తూ నిర్లక్ష్యంలో పోతాడు! అతడు చూడగోరడు మరియు వినగోరడు! –
రెండువేల సంవత్సరాల ముందే పశ్చాత్తాపపడమని హెచ్చరించే ఒక బోధకుడు కూడా ముందుగా వచ్చియుండెను, మనుష్యరూపం దాల్చిన వాక్యం వెనువెంటనే అతన్ని అనుసరించింది. కాని మనుష్యులు వాక్యం యొక్క స్వచ్ఛమైన తేజస్సును తిరిగి తుడిచివేయుటకు, మబ్బుపరచుటకు, అత్యాసక్తితో కృషిచేసారు, తద్వారా దాని తేజస్సు యొక్క ఆకర్షణశక్తి క్రమక్రమంగా అంతరించిపోవునట్లు. –
ఎవరైతే వాక్యమును ప్రాకుడు తీగల చిక్కులోనుండి వెలికితీయగోరుచున్నారో వారందరు, ప్రతి సంతోషకరమైన మేల్కొలుపును అడ్డగించుటకు చీకటి దూతలు ఏ విధంగా పంతంతో ప్రయాసపడుతున్నారో త్వరలోనే తప్పక తెలుసుకోవలసియుటుంది!
కాని నేడు ఏ సంఘటన కూడా క్రీస్తుకాలంలో జరిగినట్లుగా తిరిగి సంభవించదు! అప్పుడు వాక్యం వచ్చియుండింది! మానవాళి స్వతంత్ర చిత్తాన్ని కలిగియుండింది మరియు ఆనాడు ముఖ్యంగా నిరాకరించుటకు, తృణీకరించుటకు తాను నిర్ణయించుకొన్నది! అప్పటినుండి మానవాళి, ఏ శాసనాలైతే స్వయంచాలకంగా పనిచేస్తూ, తమను ఆ విధంగా ఆనాడు తీసుకొనబడిన స్వతంత్ర నిర్ణయంతో అనుసంధించు కున్నాయో, ఆ శాసనాలకు లోనుచేయబడింది. మనుష్యులు వారు స్వయంగా ఎంచుకొన్న మార్గంపై ఆ తరువాత తమ స్వంత సంకల్పం యొక్క ఫలాలను పొందారు.
త్వరలో ఆ వలయం సమాప్తమౌతుంది. క్రమంగా అది మరింత బలంగా పోగవుతున్నది మరియు ఒక ప్రాకారమువలే పేరుకొంటుంది. అది త్వరలో, ఆత్మీయ మాంద్యంలో దిక్కుతోచని జీవితాన్ని సాగిస్తున్న మానవాళిపై విరిగిపడు తుంది. అంతంలో, నెరవేర్పు కాలంలో, వారికి ప్రకృతికను గుణంగా ఇకపై ఎటువంటి స్వతంత్ర ఎంపిక ఉండదు!
వారు ఇకమీదట, దేనిని వారు ఆనాడు మరియు ఆ తరువాత వారి తప్పుడు మార్గాలపై కూడా విత్తియున్నారో దానిని తప్పక కోయవలసియుంటుంది.
ఎవరైతే ఆనాడు క్రీస్తు కాలంలో వాక్యమును తృణీకరించారో, వారందరు నేడు ఈ భూమిపై తిరిగి శరీరధారులయ్యారు. నేడు వారికి ముందుగా హెచ్చరించ బడుటకు మరియు మరియొకసారి నిర్ణయించుకొనుటకు హక్కు ఇకపై లేదు. ఆ రెండువేల సంవత్సరాలలో వారికి ఆలోచించుకొనుటకు తగినంత సమయం ఉండింది! ఎవడైతే తప్పుడు వివరణ ప్రకారం దేవుణ్ణి మరియు ఆయన సృష్టిని గ్రహిస్తాడొ మరియు దానిని మరింత స్వచ్ఛంగా గ్రహించుటకు ప్రయాసపడడో వాడు కూడా దానిని అసలే గ్రహించలేదు, అది నిజానికి మరింత అధ్వానమైనది, ఎందుకంటే, తప్పుడు విశ్వాసం సత్యాన్ని గ్రహించుటనుండి దూరంగా ఉంచుతుంది.
అయితే, ఎవడు సత్యాన్ని, సులువైన రూపంలో అది మనుష్యులకు ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని, ఆ కారణంగా ఎక్కువ అనుచరులను పొందుటకు, అసత్యీకరిస్తాడొ లేక మారుస్తాడొ వానికి శ్రమ. వాడు అసత్యీకరించుట యొక్క, తప్పుదారి పట్టించుట యొక్క దోషాన్ని మాత్రమే భరించడు కాని వాడు ఎవరిని, వాక్యమును సులువుగా చేయుట ద్వారా లేక అంగీకారయోగ్యంగా చేయుట ద్వారా, తనవైపునకు ఆకట్టుకోగలిగాడో వారందరి బాధ్యతను కూడా భరిస్తాడు. ప్రతిఫలాన్ని అనుభవించవలసిన ఘడియ వానికి వచ్చినప్పుడు వానికి సహాయం చేయబడదు, వాడు ఏనాటికీ తిరిగి రాలేనటువంటి లోతులలో పడిపోతాడు, మరియు అది తగినదే! – దానిని కూడా చూచుటకు మరియు దాని గురించి తన ప్రకటనలలో హెచ్చరించుటకు యోహాను అనుమతించబడ్డాడు.
మరియు మనుష్యులకు ఆ గొప్ప శుద్ధీకరణ మొదలైనప్పుడు, వ్యతిరేకించుటకు లేక ఆ ప్రక్రియను అసలే అడ్డగించుటకు ఈసారి ఏమాత్రమూ సమయం ఉండదు. మనిషి ఎంతో ఇష్టంగా తప్పుగా చిత్రీకరించుకొనే దైవశాసనాలు అప్పుడు కఠినంగా పనిచేస్తాయి.
మనిషి తన దుస్సాహసంలో అంటగట్టచూసిన మెత్తదనంనుండి మరియు బలహీనతనుండి దేవుని ప్రేమ చాలా దూరంలో ఉన్నదని మానవాళి ఎట్టకేలకు, సరిగ్గా భూమి ఏనాడూ అనుభవించని, కాలం యొక్క అత్యంత భయంకరత్వంలో నేర్చుకొంటుంది.
ప్రస్తుతకాల మనుష్యులందరిలో సగంకంటే ఎక్కువ మంది అసలు ఈ భూమిపై ఉండవలసినవారు కానేకాదు!
వేల సంవత్సరాలనుండే ఈ మానవాళి ఎంత దిగజారిందంటే, ఎంత బలంగా చీకటిలో జీవిస్తుందంటే, అది తన అపరిశుభ్రమైన సంకల్పంలో ఈ భూలోక-సమతలం కంటే చాలా దిగువన ఉన్న చీకటి మండలాలకు అనేక వారధులను నిర్మించింది. అక్కడ అతిలోతుగా దిగజారినవారు నివసిస్తున్నారు, వారి సూక్ష్మపదార్థ బరువు ఇక్కడికి, ఈ భూలోక-సమతలానికి వచ్చుటకు ఏనాటికీ అవకాశాన్ని ఇచ్చియుండేది కాదు.
భూమిపై నివసించుచున్న వారందరికి, అదే విధంగా ఆ చీకటివారికి సహితం దానిలో భద్రత ఉండింది. వారు సూక్ష్మ పదార్థ గురుత్వాకర్షణ ప్రకృతి శాసనం ద్వారా వేరుపరచబడి యున్నారు. ఆ లోతులో వారు తమ వ్యసనాలలో, సమస్త నీచత్వాలలో విచ్చలవిడిగా జీవించవచ్చు, తద్వారా ఎటువంటి నష్టం కలిగించకుండానే. దానికి వ్యతిరేకంగా, వారి అదుపులేని భోగలాలసత్వం అక్కడ, సజాతీయులను మాత్రమే తాకుతుంది, అదే విధంగా వారి భోగలాలసత్వానికి వీరు కూడా లోనౌతారు. దానితో వారు పరస్పరం బాధ పడతారు, అది పరిపక్వతకు నడిపిస్తుందే కాని ఇంకా ఎక్కువ దోషానికి కాదు. కాగా ఆ బాధ ద్వారా ఒకనాడు తమపైనే ఏవగింపు మరియు ఆ ఏవగింపుతోపాటు ఆ ప్రదేశంనుండి దూరంగా వెళ్లిపోవుటకు కోరిక కూడా పుట్టవచ్చు. ఆ కోరిక కాలక్రమేణా వేదనతోకూడిన నిరాశను కలుగజేస్తుంది. అది చివరకు అత్యంత లోతైన ప్రార్థనలకు మరియు తద్వారా మెరుగుకొరకు గంభీరమైన సంకల్పానికి దారితీయగలదు.
ఆ విధంగా జరగవలసింది. అయితే మనుష్యుల తప్పుడు సంకల్పం ద్వారా అది వేరుగా జరిగింది!
మనుష్యులు తమ చీకటి సంకల్పంతో చీకటి ప్రాంతానికి ఒక వంతెనను నిర్మించారు. దానితో వారు అక్కడ నివసించే వారికి చేతిని అందించారు, వారికి సజాతీయత యొక్క ఆకర్షణ ద్వారా అక్కడినుండి భూమిపైకి వచ్చుటకు అవకాశాన్నందించారు. ఇక్కడ వారు సహజంగా తిరిగి శరీరధారులగుటకు అవకాశాన్ని కూడా పొందారు. సాధారణమైన లోకగమనం ప్రకారమైతే అది వారికి ఇంకా ఉద్దేశించబడియుండలేదు.
కాగా స్థూలపదార్థత యొక్క మధ్యవర్తిత్వం ద్వారా తేజోవంతులతోపాటు మరియు మెరుగైనవారితోపాటు వారు కలిసి జీవించగల ఈ భూలొకసమతలంలో వారు కేవలం నష్టాన్ని కలుగజేస్తారు మరియు తద్వారా తమపై క్రొత్త దోషాన్ని మోపుకొంటారు. దానిని వారు తమ యొక్క అధమమైన ప్రదేశాలలో చేయలేరు; కాగా వారి సజాతీయులకు ఆ అధోగతి కేవలం ఉపయోగాన్ని కలుగజేస్తుంది, ఎందుకంటే వారు దానిలో చివరకు కేవలం తమను గురించి తామే తెలుసుకొంటారు మరియు దానిపై అసహ్యతను పెంచుకుంటారు, అది మెరుగుపడుటకు సహాయంచేస్తుంది.
సమస్త అభివృద్ధి యొక్క ఈ సాధారణమైన గమనానికి, తన స్వతంత్ర సంకల్పాన్ని నీచంగా ఉపయోగించుట ద్వారా మనిషి అంతరాయం కలుగజేశాడు, దాని ద్వారా అతడు చీకటిప్రదేశాలకు సూక్ష్మపదార్థ వారధులను నిర్మించాడు, తద్వారా అక్కడికి పతనమైనవారు ఒక అల్లరిమూకవలే భూలొకసమతలంపైకి విసిరివేయబడగల్గుటకు. ఇప్పుడు వారు దానిలో అత్యంత అధికభాగంలో సంతోషభరితంగా ఆవాసంచేస్తున్నారు.
ఎక్కడ చీకటి స్థిరత్వాన్ని సంపాదించిందో అక్కడినుండి తేజోవంతమైన జీవాత్మలు చీకటి ఎదుటనుండి తమను తప్పక ఉపసంహరించుకోవాలి కాబట్టి, ఆ విధంగా అన్యాయంగా భూలోకసమతలంపైకి వచ్చిన చీకటి జీవాత్మలకు, కొన్నిసార్లు ఎక్కడ నిజానికి కేవలం తేజోవంతమైన జీవాత్మ ప్రవేశించియుండేదో అక్కడ శరీరధారణ సులభమయింది. అటువంటి సందర్భంలో ఆ చీకటి జీవాత్మ, కాబోయే తల్లి యొక్క పరిసరంలో ఎవరో ఒకరి ద్వారా పట్టును సంపాదించింది. అది దానికి తనను స్థిరపరచుకొనుటకు మరియు ఆ తేజోవంతమైన దానిని ప్రక్కకు నెట్టివేయుటకు సహాయపడింది, ఆ తల్లికాని లేక తండ్రికాని తేజోవంతులకు చెందినవారైయున్నా సరే.
దాని ద్వారా, మంచి తల్లిదండ్రులకు వారికి తగని పిల్లలు ఎందుకు పుట్టగలిగారనే విషయం కూడా విశదమౌతుంది. అయితే, కాబోయే తల్లి తన గురించి మరియు తన సమీప పరిసరం గురించి, తాను ఎవరితో కలుస్తుందనే విషయాన్ని గురించి జాగ్రత్తపడినట్లైతే, ఇది జరుగజాలదు,
శాసనాల యొక్క అంత్యప్రభావం దాని సంపూర్ణ న్యాయతలో చివరకు ఇక్కడికి చెందని వారిని భూలోక సమతలంనుండి తుడిచివేసినప్పుడు, తద్వారా వారు, వారి స్వభావం ప్రకారం దేనికి చెందియున్నారో ఆ చీకటి రాజ్యం లోనికి పడిపోయినప్పుడు, దానిలో కేవలం ప్రేమను మాత్రమే గుర్తించవచ్చు. దాని ఫలితంగా వారు తేజోవంతులను ఇకపై ఆరోహణలో అడ్డుకొనలేరు మరియు తమపై స్వయంగా క్రొత్త దోషాన్ని మోపుకొనలేరు, కాని తమ స్వంత అనుభవాల ఏవగింపులో బహుశా పరిపక్వం చెందగలరేమో. – –
ఉక్కుపట్టుతో మనుష్యులందిరి హృదయాలను పట్టి, భయంకరమైన కఠినత్వంలో ప్రతి మానవజీవిలోని ఆత్మీయ అహంకారం నిర్మూలించబడే సమయం సహజంగా తప్పక వస్తుంది. అప్పుడు మనుష్యాత్మకు, దైవత్వం తన యందు కాదు కాని, తనకంటే చాలా ఎత్తున ఉన్నదని గుర్తించుటకు ప్రస్తుతం అడ్డువచ్చే ప్రతి అనుమానం తొలగిపోతుంది. అది కేవలం ఒక అత్యంత స్వచ్ఛమైన చిత్రం వలే అతని ఆంతరంగిక జీవితం యొక్క దైవపీఠంపై నిలువగలదు; నమ్రతతోకూడిన ప్రార్థనలో అతడు దానిని చూస్తాడు. –
తాను దైవమైయుండాలనే కోరికను మనుష్యాత్మ వ్యక్తపరచుట ఒక పొరపాటు కాదు కాని పాపమైయున్నది. అటువంటి అహంకారం దానిని తప్పక పతనంచేస్తుంది; కాగా అది, అతని దేవుని చేతిలోనుండి రాజదండాన్ని లాగుకొనుటకూ, మనిషి నిలువవలసిన స్థానంపైకి ఆయనను లాగుటకూ చేసే ప్రయత్నంతో సమానమైయున్నది. అయితే మనిషి తాను నిలువవలసిన ఆ స్థానంలో కూడా ఇంతవరకు నిలువలేకపోయాడు, ఎందుకంటే అతడు తనను హెచ్చించుకోవాలనుకొన్నాడు మరియు అతడు ఏనాటికి చేరలేని, కనీసం గుర్తించలేని ఉన్నతాలను ఆశించాడు. ఆ విధంగా అతడు నిర్లక్ష్యంతో సమస్త వాస్తవికతను పట్టించుకోలేదు, తనను సృష్టిలో కేవలం పూర్తిగా పనికిరాకుండా చేసుకొనుటయే కాకుండా అంతకంటే అధ్వానంగా సాక్షాత్తు హానికరునిగా చేసుకొన్నాడు!
ప్రస్తుతం ఎంతో అధోగతిపాలైన తన స్వభావంలో అతడు కనీసం దైవత్వం యొక్క నీడతో కూడా సమానం కాదనే విషయం అతనికి చివరకు, అతని స్వంత తప్పుడు వైఖరి యొక్క పరిణామంగా భయానకమైన స్పష్టతలో నిరూపించ బడుతుంది. అతడు వేల సంవత్సరాల పాటు ప్రయాసతో సమకూర్చుకొన్న భూలోక జ్ఞానరాశి అప్పుడు భయభీతితో కూడిన అతని కళ్ల దృష్టి ఎదుట శూన్యంగా నిరూపించ బడుతుంది; ఏకపక్షమైన అతని భూలోకప్రయత్నాల ఫలితాలు ఎంత పనికిరానివైతాయో, కొన్నిసార్లు అతనికి శాపంగా కూడా మారుతాయో, అతడు నిస్సహాయతలో తనలో అనుభవిస్తాడు. అప్పుడతడు తన స్వంత దైవత్వం గురించి ఆలోచించవచ్చు, అతనికి చేతనైతే! – –
ఒక గొప్ప స్వరం గర్జిస్తూ అతన్ని: “ఓ జీవీ, నీ దేవునియెదుట మరియు ప్రభువుయెదుట మోకరిల్లు! దైవదూషణలో నిన్ను దేవునిగా హెచ్చించుకొనుటకు ప్రయత్నించకు!” అని అజ్ఞాపిస్తుంది. – –
సోమరి మనుష్యాత్మ యొక్క స్వార్థపరత్వము ఇకపై సాగదు. – –
కేవలం అప్పుడే ఈ మానవాళి ఆరోహణ గురించి కూడా ఆలోచించవచ్చు. సరియైన పునాదిపై నిలువనిది కూలిపోయే సమయం కూడా అదే. వేషధారణజీవితాలు, తప్పుడు ప్రవక్తలు మరియు వారిచుట్టూ ఏర్పడే సంఘాలు తమలోతామే కూలిపోతాయి! దానితో అప్పుడు ఇదివరకటి తప్పుడు మార్గాలు కూడా స్పష్టమౌతాయి.
చాలామంది ఆత్మసంతృప్తిపరులు అప్పుడు, తాము ఒక అగాధం ఎదుట నిలిచియున్నామనీ, తాము ఒకప్రక్క ఆరోహిస్తూ వెలుగుకు చేరువౌతున్నామని గర్వంగా భావించినా, తప్పుగా నడిపించబడుట ద్వారా వేగంగా అధోగతికి జారుతున్నామనీ, భయభ్రాంతిలో గుర్తిస్తారు! రక్షణద్వారాలను తాము, వాటి వెనుక ప్రతిఘటించుటకు సంపూర్ణశక్తిని కలిగియుండకుండానే తెరిచామనీ, ప్రకృతి సిద్ధమైన గమనం ప్రకారం తమపైనుండి దాటిపోయివుండే అపాయాలను తమపైకి తెచ్చుకొన్నామని కూడా వారు గుర్తిస్తారు. ఎవడైతే అప్పుడు వెనుదిరిగిపోవుటకు సరియైన మార్గాన్ని కనుగొంటాడో వాడు ధన్యుడు!