శీలము

శీలము అనే భావన మనుష్యుల ద్వారా ఎంత నమ్మలేనంతగా కుంచించబడిందంటే, దాని నిజమైన అర్థంలోనుండి ఏమాత్రం కూడా మిగులలేదు; అంతేగాక అది ఒక తప్పు కక్షలోనికి లాగబడింది. దాని యొక్క సహజమైన అనివార్యమైన పర్యవసానం ఏమిటంటే, ఈ వక్రీకరణ చాలా మనుష్యులపైకి అక్కరకురాని అణచివేతను తెచ్చింది మరియు చాలా సార్లు చెప్పలేనంత శ్రమను కూడా.

శిలము అంటే ఏమిటి అని మీరు ఎక్కడైనా అడగండి, అన్నిచోట్లలో మీరు సమాధానంగా శారీరిక కన్నెరికం అనే భావం యొక్క వివరణను ఏదో ఒక రూపంలో పొందుతారు; ఏమైనా కాని, భూలోకమనుష్యుల అవగాహన యొక్క పరాకాష్ట ఇదే అయ్యుంటుంది.

తమను మేధస్సుకు లోబరచుకొనే మనుష్యుల యొక్క అల్పమైన ఆలోచనాసరళిని అది పూర్తిగా నిరూపిస్తుంది. మేధస్సు సమస్తమైన భౌతికతలో స్వయంగా హద్దులు ఏర్పరచింది, ఎందుకంటే అది భౌతికతలోనుండి ఉద్భవించిన తన సామర్థ్యాలతో అంతకంటే ముందుకు పోలేదు కాబట్టి.

అహంకారంతోకూడిన ఆత్మస్తుతిలో తనను తృప్తిపరచుకుంటూనే శీలపరునిగా చెల్లుబాటగుటకు మరియు తనకు దానియందు పేరుగడించుటకు మనిషికి అప్పుడు ఎంత సులువుగా ఉంటుందో. కాని దానితో అతడు ఊర్ధ్వానికి, వెలుగు ఉద్యానవనాలకు పోయే మార్గంలో ఒక్క మెట్టును కూడా ఎక్కలేడు. ఆ ఉద్యానవనాలు పరదేశుగా మనుష్యాత్మ యొక్క పరమానందభరితమైన చివరి గమ్యమైయున్నవి.

భూలోక మనిషి తన స్థూలపదార్థ శరీరం యొక్క కన్నెరికాన్ని కాపాడుకొంటూ తన ఆత్మకు మరకలు అంటించుకొన్నచో, అది అతనికి దేనికీ పనికిరాదు. ఆత్మ అప్పుడు ఒక మెట్టునుండి మరొక దానిపైకి నడిపించే గుమ్మాలను ఏనాటికీ దాటలేదు.

శీలము మనుష్యులు భావించేదానికి వేరైనది, చాల విస్తృతమైనది, గొప్పది. ప్రకృతికి వ్యతిరేకంగా నడచుకోమని అది మనిషినుండి అపేక్షించదు; కాగా అటువంటి నడవడిక దేవుని సృష్టియందు ప్రకంపించుచున్న శాసనాలకు వ్యతిరేకంగా చేసిన అపరాధమైయుంటుంది మరియు ప్రతికూలమైన ప్రభావాలను చూపకుండా ఉండలేదు.

శీలము దైవికమైయున్న శుద్ధత్వానికి భూలోక భావమైయున్నది. అది, దైవతకు అతి సహజమైన దాని యొక్క ప్రతిబింబాన్ని, తాను స్ఫురించిన విధంగా స్థూలపదార్థతలో వ్యక్తపరచుటకు, ప్రతి మనిషి చేసే ప్రయాసయైయున్నది. శుద్ధత్వము దైవికమైనది, శీలము మనిషి ద్వారా దాని యొక్క అనుకరణ, అనగా భూలోక కార్యంలో గోచరం కాగలిగే మరియు కావలసిన ఒక ఆత్మీయ ప్రతిబింబము.

పరిపక్వంచెందిన ప్రతి మనుష్యాత్మకు, శీలాన్ని నెరవేర్చుటకు ఇది ప్రాథమిక శాసనంగా సరిపోతుంది. కాని భూమిపై మనిషి, కేవలం తన కోర్కెల నెరవేర్పును సాధించుటకు, కొన్ని స్వీయకోర్కెల ఒత్తిడివల్ల, తనలో ఎదో ఉన్నట్లు తన్ను తాను మభ్యపెట్టుకొనుటకు మొగ్గుచూపుతున్నాడు, నిజానికి అది అతనిలో లేనేలేదు.

స్వార్థం నాయకత్వం వహిస్తూ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది మరియు నిజంగా స్వచ్ఛమైన సంకల్పాన్ని స్తంభింపజేస్తుంది! మనిషి దీనిని స్వయంగా ఎప్పటికీ ఒప్పుకోడు, కాని తనను ఆ విషయంలో ప్రశాంతంగా నడిపించనిస్తాడు. అతనికి, తన్ను తాను ఒప్పించుకొనుటకు వేరొకటి ఏదీ తోచనప్పుడు, సందేహాస్పదమైన స్వంతకోర్కెలను నెరవేర్చుటకు అతడు చేసే తరచుగా అతిస్పష్టమైన ప్రయాసను, మనిషి తప్పక లొంగిపోవలసిన విధిలిఖితం, అని పిలుస్తాడు.

అందువల్ల అతనికి మార్గదర్శకంగా మరియు పట్టుగా ఇంకా ఇతరమైన సూచనలు అవసరం; అవి అతన్ని శీలమంటే నిజంగా ఏమైయున్నదో, భూమిపై ప్రకృతినుండి ఎటువంటి విభజనను కోరని దేవుని చిత్తంలో అది ఏ విధంగా ఇమిడియున్నదో అనుభవించునట్లు మరియు గుర్తించునట్లు చేస్తాయి.

దైవతలో శుద్ధత్వం ప్రేమతో దగ్గరగా ఐక్యమైయున్నది! అందువల్ల మనిషి, అతనికి దానిలోనుండి ఆశీర్వాదం కలుగవలెనంటే, భూమిపైకూడా వాటిని విడదీయుటకు ప్రయత్నించరాదు.

అయితే ప్రేమ కూడా భూమిపై, అది నిజంగా ఏమైయున్నదో దాని యొక్క ఒక చెడ్డ వ్యంగ్యచిత్రం మాత్రమే అయ్యున్నది. అందువల్ల అది ముందుగా ఎటువంటి మార్పుకు లోనుకాకుండా శుద్ధత్వం యొక్క నిజమైన భావంతో ఏకీభవించలేదు.

దీనితో నేను, శీలాన్ని సాధించుటకు ప్రయాసపడుతున్న వారందరికి, సృష్టిశాసనంలో ఎట్లు ఉన్నదో ఆ విధంగా జీవించుటకు, ఆ కారణంగా దేవుని ఇష్టప్రకారంగా కూడా జీవించుటకు, మనిషికి భూమిపై అవసరమైన సూచనను ఇస్తున్నాను:

“ఎవడు ఎల్లప్పుడు
తన కార్యంలో తనను విశ్వసించే పొరుగువానికి నష్టం కలుగజేయకుండా ఉండాలని కూడా ఆలోచిస్తాడో, ఆ పొరుగువానిని తదనంతరం కృంగదీయగలిగేది ఏదియూ చేయకుండా ఉంటాడో, అతడు ఆత్మీయంగా తనపై భారం మోపబడకుండా ఉండే విధంగా సతతం నడచుకొంటాడు మరియు అందువల్ల నిజంగా శీలపరుడని పిలువబడవచ్చు!”

ఈ సాధారణమైన మాటలు, సరిగా గ్రహించబడినప్పుడు, మనిషిని సమగ్రమైన రక్షణతో సృష్టియంతటి ద్వారా నడిపించగలవు మరియు అతన్ని ఊర్ధ్వానికి, వెలుగు ఉద్యానవనములకు, అతని అసలైన స్వదేశానికి తీసుకొనిపోగలవు. ఈ మాటలు భూమిపై సక్రమంగా పనిచేయుటకు కీలకమైనవి; కాగా నిజమైన శీలం వాటిలో ఉన్నది.

దేవుని కుమారుడైన యేసు సరిగ్గా దీనినే ఈ మాటలతో వ్యక్తపరచియున్నాడు:

“నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించు!”

అయితే మీరు, మనుష్యుల పాతతప్పిదములలో పడకుండా తప్పక జాగ్రత్తగా ఉండవలసియుంటుంది. అంతేకాక మీరు, ఈ మాటల యొక్క భావాన్ని, మీ స్వంత లక్ష్యాలకు అనుగుణంగా ఉండునట్లు, మీకు మీ తప్పుడు-పనులలో సంతుష్టిని కలుగజేయునట్లు మరియు మీ తోటిమనుష్యులను అజాగ్రత్తలోనికి ఉపలాలనం చేయుటకు లేక మొత్తానికే భ్రమపెట్టుటకు సహాయపడునట్లు, మరల సరిదిద్దకుండా మరియు పాక్షికంగా వక్రీకరించకుండా జాగ్రత్తగా ఉండవలసియుంటుంది.

అటువంటి మాటలను అవి నిజంగా ఏ విధంగా గ్రహించబడవలెనో, అదే విధంగా గ్రహించండి, మీకు అవి ఏ విధంగా అనువుగా కనబడతాయో మరియు మీ మొండి బుద్ధికి సరిపోయినట్లుంటాయో ఆ విధంగా కాదు. అప్పుడు అవి మీకు మీ చేతిలోవున్న ఒక పదునైన ఖడ్గంవలే ఉంటాయి, దానితో మీరు సమస్త చీకటిని ఓడించగలరు, కేవలం మీరు కోరుకొన్నట్లైతే. సంతోషధ్వనులు చేయుచున్న విజేతలుగా కృతజ్ఞతతో నింపబడిన వారై భూమిపై జీవితాన్ని సంగ్రహించుటకు, వాటిని సరియైన రీతిలో మీలో సజీవం కానివ్వండి!