పిల్లలవంటి నైజము

“పిల్లలవలే” అనే పదము మనుష్యుల ద్వారా వారి అజాగ్రత్తతోకూడిన మరియు ఆలోచనారహితమైన మాట్లాడే తీరులో అత్యధిక సందర్భాలలో తప్పుగా వాడబడే ఒక వ్యక్తీకరణ.

ఆత్మ యొక్క సోమరితనం ద్వారా అడ్డగించబడి, ఆ వ్యక్తీకరణ సరిగా గ్రహించబడుటకు తగినంత అంతఃకరణానుభూతిని కలిగించదు. కాని ఎవడు దానిని దాని సంపూర్ణతలో గ్రహించియుండడో, వాడు దానిని ఎప్పటికీ కూడా సరిగా వాడలేడు.

మరియు అయిననూ సరిగ్గా పిల్లలవంటి నైజమే మనుష్యులకు వెలుగు ఔన్నత్యాలకు ఆరోహించుటకు, ప్రతి మనుష్యాత్మ పరిపక్వం చెందగల్గుటకు మరియు తండ్రియైన దేవుని ఇల్లైయున్న ఈ సృష్టిలో చిరకాలం ఉనికిలో కొనసాగగల్గుటకు పరిపూర్ణతను పొందుటకు ఒక బలమైన వారధిని అందిస్తుంది. ఈ సృష్టిని ఆయన మనుష్యులకు అందజేస్తున్నాడు … వారు దానిలో ఆహ్లాదకరమైన అతిథులుగా ఉండవలెననే షరుతుపై. ఎల్లప్పుడు సంపన్నమైన విందు బల్లతో, కేవలం వాడుటకు మాత్రమే కృపతో ఇవ్వబడిన ఆ గదులలో నష్టం కలిగించని అతిథులకు.

కాని అతనికి ఎంతగానో అవసరమైయున్న పిల్లలవంటి నైజం నుండి మనిషి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడో!

అయితే ఇది లేకుండా అతడు తన ఆత్మకొరకు అసలు దేనినీ సాధించలేడు. ఆత్మ తప్పనిసరిగా పిల్లలవంటి నైజమును కలిగియుండవలసియుంటుంది; కాగా, అది తన సంపూర్ణ పరిపక్వతను సాధించినప్పటికీ అది సృష్టి యొక్క బిడ్డయైయున్నది మరియు ఉండబోతుంది.

సృష్టి యొక్క బిడ్డ! దానిలో ఒక లోతైన అర్థం ఉన్నది; కాగా ఒక దేవుని బిడ్డగా అగుటకు అది తప్పక అభివృద్ధిచెందవలసియుంటుంది. అది ఎప్పటికైనా దానిని సాధిస్తుందో లేదో అనేది, అది సమస్త పదార్థలోకముల ద్వారా సంచరించునప్పుడు తాను పొందుటకు ఆశించిన జ్ఞానోదయం యొక్క స్థాయిపై మాత్రమే ఆధారపడియుంటుంది.

అయితే ఈ సంసిద్ధత, క్రియగా కూడా తప్పక కనబడవలసియుంటుంది. ఆత్మీయక్షేత్రాలలో సంకల్పం ఏకకాలంలో క్రియ కూడా అయ్యున్నది. అక్కడ సంకల్పం మరియు క్రియ ఎల్లప్పుడు ఒకటై ఉన్నవి. కేవలం ఆత్మీయక్షేత్రాలలో మాత్రమే ఆ విధంగా ఉంటుంది, పదార్థలోకాలలో కాదు. ఒక పదార్థక్షేత్రం ఎంత దట్టంగా, బరువుగా ఉంటుందో, అక్కడ క్రియ సంకల్పం నుండి అంత దూరంలో ఉంటుంది.

దట్టత ఆటంకపరుస్తూ పనిచేస్తుందని ధ్వని విషయంలోనే మనం చూస్తాం. ధ్వని దాని గమనంలో, తన దట్టత యొక్క రకానికి అనుగుణంగా ధ్వనిని ఆటంకపరిచే పదార్థత గుండా, తప్పక చొచ్చుకొని పోవలసియుంటుంది. తక్కువ దూరాలలోనే అది చాలా స్పష్టంగా గమనించబడవచ్చు.

ఒక మనిషి కట్టెలు కొట్టుతున్నప్పుడు లేక దేనినైనా నిర్మిస్తున్నప్పుడు దూలంలోనికి మేకులు కొడుతున్నప్పుడు, అతడు కొట్టడాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు, కాని దాని ధ్వని కొన్ని క్షణాల తరువాత మనలను చేరుతుంది. అది ఎంత స్పష్టమైనదంటే, దానిని ప్రతి మనిషి అక్కడక్కడ అనుభవించియుంటాడు.

భూలోకమనుష్యుల యొక్క సంకల్పము మరియు క్రియల మధ్య ఈ విధంగానే ఉన్నది, కాని అది ఇంకా ఎక్కువ కష్టతరమైయున్నది. సంకల్పము ఆత్మలో తటుక్కున ఉత్పన్నమౌతుంది, అది తక్షణమే ఆత్మలో కార్యమైయుంటుంది. కాని ఆ సంకల్పాన్ని స్థూలపదార్థతలో కనపడునట్లుచేయుటకు ఆత్మకు స్థూలపదార్థ శరీరం యొక్క అవసరత ఉన్నది. కేవలం ఉద్వేగంలో మాత్రమే ప్రతి శరీరం సంకల్పం ఉత్పన్నమైన కొన్ని క్షణాలలోనే కార్యాన్ని చేస్తుంది. ఆ సమయంలో పెద్దమెదడు యొక్క మరింత సుధీర్ఘమైన పని నిలిపివేయబడుతుంది, లేనిచో అది శరీరం యొక్క చర్యను ప్రభావితం చేయడంవరకు ఉన్నట్టి సంకల్పం యొక్క మార్గాన్ని సిద్ధపరచవలసియుంటుంది.

సాధారణమైన మార్గానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. అది కొన్నిసార్లు చాల బలహీనమైన కార్యాన్ని మాత్రమే కలుగజేస్తుంది కూడా లేక అసలు కార్యంవరకు కూడా రాదు, ఎందుకంటే ఆ సంకల్పము మరింత సుధీర్ఘమైన మార్గంపై బలహీనపడుతుంది లేక దీర్ఘాలోచనచేసే మేధస్సు ద్వారా పూర్తిగా అడ్డగించబడుతుంది.

ఈ సందర్భంలో నేను నిజానికి దీనితో సంబంధంలేని, మనుష్యుల కార్యాచరణలో కూడా స్పష్టంగా కనబడుతున్నా గమనించబడని సజాతి-ఆకర్షణ-సృష్టిశాసనం యొక్క చర్యలను సూచించగోరుతున్నాను:

మనుష్యుల-భూలోకశాసనాలు భూలోక మేధస్సు ద్వారా క్రోడీకరించబడతాయి మరియు దాని ద్వారానే అమలుచేయబడతాయి. అందువల్ల మేధస్సు ద్వారా యోచించబడిన ప్రణాళికలు, అనగా ఆలోచించబడిన కార్యాలు మరింత కఠినంగా శిక్షించబడతాయి మరియు వాటిపై, ఉద్వేగంలో, అనగా ఆలోచించకుండా చేయబడిన వాటికంటే
కఠినంగా తీర్పు చెప్పబడుతుంది. చివరిగా ప్రస్తావించబడిన వాటికి అధిక సందర్భాలలో శిక్ష తగ్గింపు మంజూరుచేయబడుతుంది.

నిజానికి, సృష్టిశాసనం యొక్క వత్తిడివల్ల జరిగే మేధస్సుకార్యం యొక్క సజాతీయతలో, మేధస్సుకు బేషరతుగా లొంగే వారందరికి, మనుష్యులు గమనించలేని ఒక సంబంధం ఉన్నది. ఇది వారికి పూర్తిగా అర్థం అవుతుంది.

దాని గురించి తెలియకుండానే, ఉద్వేగంలో చేయబడిన కార్యం విషయంలో, దాని ప్రాయశ్చిత్తంలో అధికభాగం ఆత్మీయ క్షేత్రానికి అప్పగించబడుతుంది. శాసనకర్తలు మరియు న్యాయమూర్తులు, దాని గురించి ఏమీ ఎరుగరు, ఎందుకంటే వారు పూర్తిగా వేరైన, సంపూర్ణంగా మేధస్సుకు సంబంధించిన సూత్రాల ప్రకారం మాత్రమే నడచుకొంటారు. లోతుగా ఆలోచించినప్పుడు మరియు క్రియాశీలమైన సృష్టిశాసనాలను ఎరిగియున్నప్పుడు ఇదంతా పూర్తిగా వేరైన వెలుగులో కనబడుతుంది.

అయిననూ, ఇతర భూలోకశిక్షలలో మరియు తీర్పులలో కూడా సజీవమైన దేవునిశాసనాలు సృష్టిలో పూర్తిగా స్వయంచాలకంగా, భూలోక మనుష్యుల శాసనాల ద్వారా మరియు భావనల ద్వారా ప్రభావితం కాకుండ పనిచేస్తాయి. కేవలం మనుష్యుల ద్వారా అపరాధంగా ముద్రవేయబడినది కాక, ఒక నిజమైన అపరాధం, భూలోక మేధస్సు ద్వారా ఆజ్ఞాపించబడిన మరియు అనుభవించబడిన శిక్షతో, అదో సమయంలో దేవుని శాసనాల ఎదుట కూడా ప్రాయశ్చిత్తమైయుండగలదు, అని భావించుటకు ఏ గంభీరమైన మనిషికి కూడా తోచకపోవచ్చు!

వేలసంవత్సరాలనుండే అవి, మనుష్యుల క్రియ మరియు ఆలోచనప్రక్రియల ద్వారా విభజించబడిన, దాదాపు రెండు వేర్వేరు లోకములైయున్నవి, నిజానికి అవి కేవలం దేవుని శాసనాలు మాత్రమే పనిచేయుచున్న ఒకే లోకమైయుండవలసియున్నా.

శాసనాలు మరియు శిక్షలు సంపూర్ణంగా దేవుని సృష్టిశాసనాలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ విధమైన భూలోకశిక్ష ద్వారా ప్రాయశ్చిత్తం జరుగవచ్చు.

ఇకపోతే, రెండు రకాల అనాలోచిత కార్యాలున్నాయి. మొదటిగా ముందు వర్ణించబడినవి. అవే నిజానికి ఉద్వేగాలు అని పిలువబడవలెను. మరియు అవి కాక పెద్దమెదడులో ఉత్పన్నమయ్యే అనాలోచిత కార్యాలు, అనగా ఆత్మలో ఉత్పన్నం కానటువంటివి ఉన్నాయి, ఇవి మేధస్సు విభాగానికి చెందినవి. ఇవి అనాలోచితమైనవే కాని ఇవి ఉద్వేగంలో చేయబడిన కార్యాలవలే అదే విధమైన శిక్ష తగ్గింపులను పొందరాదు.

అయితే వాటిలో న్యాయమైన బేధమును ఖచ్చితంగా కనుగొనుటకు, సృష్టిలోని సమస్త దేవుని శాసనాలను ఎవరు ఎరిగియుంటారో మరియు వాటి ప్రభావాల గురించి పరిజ్ఞానాన్ని కలిగియుంటారో, కేవలం అటువంటి మనుష్యులకు మాత్రమే సాధ్యమౌతుంది. అది తప్పక రాబోయే కాలానికి ప్రత్యేకించబడియుండవలెను. ఆ కాలంలో మనుష్యుల మధ్య కూడా ఎటువంటి యాదృచ్ఛికమైన కార్యాలు చోటుచేసుకోవు, ఎందుకంటే వారు ఆత్మీయ పరిపక్వతను కలిగియుంటారు. అది వారిని తమ సమస్త కార్యంలో మరియు ఆలోచనలో కేవలం దేవుని శాసనాలలో మాత్రమే ప్రకంపింపజేస్తుంది.

ఈ అన్యప్రస్తావన కేవలం పార్యాలోచించుటను ప్రోత్సాహించవలెను, ఇది ఈ ఉపన్యాసం యొక్క అసలైన ఉద్దేశానికి చెందనిది.

ఇక్కడ గమనించబడవలసింది ఏమిటంటే, ఆత్మీయ లోకాలలో సంకల్పము మరియు క్రియ ఒకటై యున్నవి, కాని పదార్థలోకాలలో అవి పదార్థత యొక్క రకం ద్వారా వేరుచేయబడతాయి. అందువల్లనే యేసు ఒకప్పుడు మనుష్యులతో: “ఆత్మ సిద్ధమే, కాని శరీరము బలహీనము!” అనియున్నాడు. ఇక్కడ శరీరం అంటే శరీరం యొక్క స్థూలపదార్థత అని అర్థం. అది ఆత్మలో ఏదైతే అప్పటికే సంకల్పము మరియు క్రియయైయున్నదో దానినంతటినీ కార్యంగా మార్చలేదు.

ఒకవేళ ఆత్మ చాలా సోమరిగా ఉండియుండనట్లైతే, అది భూమి మీద కూడా స్థూలపదార్థ ఓలములో తన సంకల్పంలోనుండి ఎల్లప్పుడు కార్యం ఉద్భవించునట్లు వత్తిడిచేయగలిగేది. ఆత్మ శరీరాన్ని ఈ సోమరితనానికి బాధ్యున్ని చేయలేదు; కాగా శరీరం ప్రతి ఆత్మకు కేవలం ఒక సాధనంగా మాత్రమే ఇవ్వబడింది. అది దానిని సరిగా ఉపయోగించుటకు, దానిని తన ఆధిపత్యంలో ఉంచుకొనుటకు తప్పక నేర్చుకొనవలసియుంటుంది. –

ఈ విధంగా ఆత్మ సృష్టి యొక్క బిడ్డయైయున్నది. అది ఏ ఉద్దేశంతో ఈ సృష్టిలో ఉన్నదో దానిని నెరవేర్చగోరినట్లైతే, అది దానిలో తప్పక పిల్లలవలే ఉండవలసియుంటుంది. మేధస్సు యొక్క దురహంకారం ఆత్మను పిల్లలవంటి నైజమునుండి తనను దూరపరచుకొనునట్లు చేసింది. ఎందుకంటే, మేధస్సు, ఆత్మ నిజంగా ఏమైయున్నదో అనే విషయాన్ని “అర్థం” చేసుకోలేకపోయింది. అయితే ఆత్మ తద్వారా సృష్టిలో
పట్టును కోల్పోయింది. ఇప్పుడు సృష్టి, తాను స్వయంగా ఆరోగ్యంగా ఉండగల్గుటకు, దానిని అపరచితమైన దానిగా, శాంతిని భంగపరిచే దానిగా మరియు హానికలిగించే దానిగా పరిగణించి తప్పక బయటకు గెంటివేయవలసియుంటుంది.

మరియు అది ఏ విధంగా జరుగుతుందంటే, మనుష్యులు వారి తప్పు ఆలోచనలు మరియు కార్యముల ద్వారా తమ గోతిని తామే త్రవ్వుకొంటారు. –

క్రిస్మస్ పండుగను ఒక్కసారి నిజంగా తనలో అనుభవించగోరే ప్రతిమనిషి తప్పనిసరిగా మొదట తన బాల్యాన్ని గుర్తుచేసుకొనుటకు ప్రయత్నించవలసియుంటుంది, అది ఎంత విచిత్రమైనది!

ఒక వయోజనునిగా అతడు క్రిస్మస్ పండుగను తన అంతఃకరణానుభూతితో అనుభవించుటకు పూర్తిగా అసమర్థుడని చూపుటకు తగినంత స్పష్టమైన రుజువువలే ఇది పరిగణించబడవలసియుంటుంది కదా. అతడు చిన్నబిడ్డగా కలిగియుండిన దానిని దేనినో కోల్పోయాడు అనుటకు ఇది చాలా ఖచ్చితమైన రుజువు! అది మనుష్యులను ఎందుకు ఆలోచింపజేయదో!

తిరిగి అది ఆత్మీయ సోమరితనమే. ఆసక్తితో విషయాలను అధ్యయనం చేయకుండా అది వారిని అడ్డగిస్తుంది. “అది పిల్లల కొరకు” అని, “వయోజనులకు అటువంటి వాటి కొరకు ఏమాత్రం సమయం లేదు! వారు తప్పక వాటికంటే గంభీరమైన విషయాలను గురించి ఆలోచించవలసియున్నది” అని వారి అనుకొంటారు.

గంభీరమైన విషయాలు! వారి అభిప్రాయంలో గంభీరమైన విషయాలు అంటే కేవలం ఐహికమైన వాటిని వెంటాడుట, అనగా మేధస్సు యొక్క కలాపం అని అర్థం! ఎప్పుడో ఒకసారి అంతఃకరణానుభూతికి తావిచ్చినప్పుడు, తన ప్రాధాన్యతను కోల్పోకుండా ఉండుటకు, మేధస్సు త్వరగా జ్ఞాపకాలను చాలా వెనుకకు నెట్టివేస్తుంది!

చాలా చిన్నవిగా కనబడే ఈ విషయాలన్నింటిలో అత్యంత గొప్ప విషయాలు గుర్తించబడవచ్చు, ఒకవేళ మేధస్సు కేవలం సమయాన్ని దానికొరకు కేటాయించినట్లైతే. కాని అది పైచేయిని కలిగియున్నది మరియు దానిని నిలుపుకొనుటకు సమస్తమైన జిత్తులతో మరియు కపటంతో పోరాడుతుంది. అనగా, నిజానికి మేధస్సు కాదు కాని మేధస్సును ఏది సాధనంగా వాడుతున్నదో మరియు దాని వెనుక పొంచియున్నదో అది పోరాడుతుంది: చీకటి!

జ్ఞాపకాలలో వెలుగును కనుగొనకుండా చేయుటను చీకటి కోరుతున్నది. బాల్యంలో అనుభవించిన క్రిస్మస్ పండుగల యొక్క జ్ఞాపకాలతో ఒక విధమైన, దాదాపు బాధకరమైన వాంఛ పుడుతుంది. అది చాలామంది మనుష్యులను తాత్కాలికంగా మెత్తటి స్వభావికులనుగా చేయుటకు సామర్థ్యాన్ని కలిగియుంటుంది. దీనిలో మీరు, ఏ విధంగా ఆత్మ, వెలుగును కనుగొనుటకు, క్రొత్త బలాన్ని దానిలోనుండి పొందుటకు వాంఛిస్తుందో గుర్తిస్తారు.

మెత్తటిస్వభావాన్ని కలిగించే ఈ ప్రక్రియ, ఒకవేళ సత్వరమే మరియు పూర్ణశక్తితో కూడా ఉపయోగించబడినట్లైతే, అది జాగృతికి అత్యుత్తమమైన పునాది కాగలదు! అయితే దురదృష్టవశాత్తు వయోజనులు ఆ సంధర్భంలో కేవలం పగటికలలను కనుటలో మాత్రమే నిమగ్నమైయుంటారు, దానిద్వారా ఉద్భవించే శక్తి వ్యర్థం చేయబడుతుంది, వృధా అవుతుంది. మరియు పగటికలలు కనుటలో ఆ అవకాశం కూడా ఎటువంటి మేలును కలుగజేయకుండా లేక ఉపయోగించబడకుండా చేజారిపోతుంది.

ఒకవేళ అప్పుడు కొందరు మనుష్యులు స్వయంగా కొన్ని కన్నీళ్లు కార్చినా, వారు వాటికొరకు సిగ్గుపడతారు, వాటిని దాచుకొటకు ప్రయత్నిస్తారు, ఒక శరీరపు కుదుపుతో తమను సర్దుకొంటారు. దానిలో అతితరచుగా ఒక అనాలోచితమైన ధిక్కరణ కనిపిస్తుంది.

మనుష్యులు దానియంతటి ద్వారా ఎంత నేర్చుకోవచ్చు. ఏ కారణం లేకుండానే ఒక సున్నితమైన బాధ బాల్యపు జ్ఞాపకాలతో అల్లుకొనదు. అది, ఏదో పోయింది, పోతూ ఒక శూన్యాన్ని వదిలింది అనే ఒక అనాలోచితమైన అనుభూతి, పిల్లలు ఇంకా పొందగలిగే అంతఃకరణానుభూతిని తాము పొందుటకు అశక్తత.

అయితే మీరు తరచుగా తప్పక గమనించియుంటారు, ప్రతిమనిషి, ఎవరి కళ్లలోనుండి అప్పుడప్పుడు పిల్లలవంటి ప్రకాశం వెలువడుతుందో అతడు, ఎంత అద్భుతంగా మరియు తారుణ్యంగా కేవలం అతని సముఖం ద్వారానే నిశ్శబ్దంగా ప్రభావం చూపుతాడో.

పిల్లలవంటి నైజం పిల్లతనం కాదని వయోజనుడు మరువరాదు. కాని మీకు తెలియదు, ఎందువల్ల పిల్లలవంటి నైజం ఆ విధంగా పనిచేయగలదో, అది అసలు ఏమైయున్నదో! మరియు ఎందుకు యేసు “పిల్లలవలే కండి!” అని చెప్పియున్నాడో.

పిల్లలవంటి నైజం అంటే ఏమిటో కనుగొనుటకు మీకు మొదట తప్పక, పిల్లలవంటి నైజం స్వయంగా చిన్నబిడ్డతో ముడిపడిలేదనే విషయం తెలిసియుండాలి. మీరు స్వయంగా పిల్లలను, ఎవరిలో ఆ నిజంగా అందమైన పిల్లలవంటి నైజం లోపించియుంటుందో
వారిని తప్పక ఎరిగియుంటారు కదా! అనగా పిల్లలవంటి నైజం లేని పిల్లలు ఉన్నారు. ఒక చెడ్డపిల్లవాడు ఎప్పటికీ పిల్లలవంటి నైజం ద్వారా ప్రభావాన్ని చూపలేడు, అదే విధంగా ఒక సరిగా పెంచబడని, నిజానికి చెడుగా పెంచబడిన పిల్లవాడు కూడా!

పిల్లలవంటి నైజం మరియు పిల్లవాడు రెండు పరస్పరం స్వతంత్రమైన విషయాలని దానిద్వారా స్పష్టమౌతున్నది.

ఏదైతే భూమిపై పిల్లలవంటి నైజం అనబడుతుందో, అది శుద్ధత్వం లోని ప్రభావం యొక్క ఒక శాఖయైయున్నది! కేవలం భూలోకమనుష్యుల భావంలో శుద్ధత్వం కాదు కాని దాని ఉన్నతమైన భావంలో. ఏ మనిషి దైవ శుద్ధత్వం యొక్క కిరణంలో జీవిస్తాడో, శుద్ధత్వం యొక్క కిరణానికి తనలో స్థానమిస్తాడో, అతడు దానితో పిల్లలవంటి నైజాన్ని కూడా పొందియున్నాడు, ఇంకా బాల్యంలోనే అయినా లేక ఒక వయోజనునిగా కూడా.

పిల్లలవంటి నైజం అంతరంగిక శుద్ధత్వం యొక్క ఫలితమైయుంటుంది లేక అది అటువంటి మనిషి శుద్ధత్వానికి లోబడియున్నాడు, దానిని సేవించుచున్నాడు అనే విషయానికి ఒక సూచనయైయుంటుంది. అవి అన్నీ కేవలం వేర్వేరు వ్యక్తీకరణ విధాలు మాత్రమే కదా, కాని నిజానికి అవి ఎల్లప్పుడూ ఒక్కటైయున్నవి.

అనగా కేవలం తనలో శుద్ధుడైన పిల్లవాడు, మరియు శుద్ధత్వాన్ని తనలో పోషించే వయోజనుడు, పిల్లలవంటి నైజం ద్వారా ప్రభావం చూపగలడు. అందువలన అతడు తారుణ్యంగా మరియు ఉత్తేజపరుస్తూ ప్రభావం చూపుతాడు, విశ్వాసాన్ని కూడా కలుగజేస్తాడు!

మరియు ఎక్కడ నిజమైన శుద్ధత్వం ఉన్నదో, అక్కడ నిజమైన ప్రేమ కూడా ప్రవేశించగలదు; కాగా దేవునిప్రేమ శుద్ధత్వం యొక్క కిరణంలో పనిచేస్తుంది. శుద్ధత్వం యొక్క కిరణం దానికి మార్గమైయున్నది, దానిపై అది నడుస్తుంది. వేరొక దానిపై అది పోలేదు.

ఎవడు శుద్ధత్వం యొక్క కిరణాన్ని తనలో గ్రహించలేదో, వాని యొద్దకు దేవుని ప్రేమ యొక్క కిరణం ఏనాటికీ మార్గాన్ని కనుగొనలేదు!

అయితే మనిషి తన ఏకపక్షమైన మేధస్సు-ఆలోచనప్రక్రియ ద్వారా వెలుగునుండి వెనుదిరుగుట ద్వారా తన పిల్లలవంటి నైజాన్ని పోగొట్టుకొన్నాడు. ఆ విధమైన ఆలోచనకు అతడు, అతన్ని పైకెత్తగలిగే దానినంతటినీ త్యాగంచేశాడు, మరియు ఆ విధంగా అతడు తనను వెయ్యి గొలుసులతో పటిష్టంగా భూమితో, అనగా స్థూలపదార్థతతో మాటువేసుకొన్నాడు. అతడు తనను స్వయంగా దానినుండి విడిపించుకొనేవరకు అది అతన్ని తన వశంలో ఉంచుకొంటుంది. అయితే, భౌతికమరణంతో అతనికి విడుదల కలుగదు, కాని కేవలం ఆత్మీయ మేల్కొల్పులో మాత్రమే.