ఉపాసనము

పాసనము భూలోకరీత్య గ్రహించబడజాలని దానిని భౌతిక ఇంద్రియములకు ఎదో ఒక విధంగా స్వీకరించబడగల దానిగా చేయుటకు రూపంపొందిన ప్రయత్నమైయుండవలెను.

రూపంపొందిన ప్రయత్నమై అది ఉండవలెను, కాని దురదృష్టవశాత్తు అది ఇంకా జరగలేదు; లేనిచో చాలా విషయాలు, ఒకవేళ అవి స్వయంగా ఆ ప్రయత్నంలోనుండి ఉద్భవించియుండినట్లైతే తప్పక పూర్తిగా వేరైన రూపాలను కలిగియుండవలసింది. దానికి సరియైన మార్గం, సరిగ్గా అంతరాంతరంలోనుండి ఉద్భవించే బాహ్యరూపాలనే అపేక్షిస్తుంది. అయితే నేడు మనం చూసేదంతా మేధస్సుకు అనుగుణమైన నిర్మాణమే; దానిలోనికి ఆ తరువాత అంతఃకరణానుభూతులు జొప్పించబడవలసియుంటుంది. అనగా ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకమైన మార్గం ఎంచుకోబడుతుంది; సహజంగా మనం దానిని తారుమారైన మార్గం లేక తప్పు మార్గం అని కూడా అనవచ్చు. అది ఎప్పటికీ తనలో నిజంగా సజీవంగా ఉండలేదు.

తద్వారా చాలా విషయాలు వికృతంగా మరియు అనుచితంగా రూపొందుతాయి. వేరొక రూపంలోనైతే అవి నిజమైన సంకల్పానికి చాలా దగ్గరగా రాగలిగేవి, అప్పుడు మాత్రమే ఒప్పించగలిగే ప్రభావం వాటికి జతకూడగలదు.

చాలా సదుద్దేశాలు దృఢనమ్మకమును కలుగజేయుటకు బదులుగా తప్పక వికర్షించవలసియుంటుంది, ఎందుకంటే వాటికి సరియైన రూపం ఇంకా కనుగొనబడలేదు; భూలోకరీత్యా గ్రహించబడలేని దానికి మేధస్సు ఎప్పటికీ రూపాన్ని ఇవ్వజాలదు!

చర్చిలలో కూడా ఇదే విధంగా ఉన్నది. చాలా ప్రస్ఫుటంగా అక్కడ మేధస్సు యొక్క భూలోకప్రభావన్నే గురిగా కలిగియున్న నిర్మాణం కనబడుతుంది, మరియు పలు మంచి విషయాలు, అవి అక్కడ అసహజంగా పనిచేస్తాయి కాబట్టి, తమ ప్రభావాన్ని కోల్పోతాయి.

కేవలం ఏదైతే సృష్టి శాసనాలకు అనుగుణంగా ఉండదో అది మాత్రమే అసహజంగా పనిచేయగలదు. కాని సరిగ్గా
అటువంటి విషయాలే ఇప్పటి ఉపాసనాలలో చాలా ఉన్నాయి. సహజమైన సృష్టి శాసనాలకు వ్యతిరేకంగావున్న సమస్తం అక్కడ ఏకంగా రహస్యమైన చీకటితో కప్పివేయబడుతుంది.

అయితే మనుష్యులు తమకు తెలియకుండానే అటువంటి విషయాలలో ఏనాడూ ఒక రహస్యమైన వెలుగును గురించికాక ఎల్లప్పుడు ఒక రహస్యమైన చీకటిని గురించి మాత్రమే మాట్లాడుట ద్వారా చాలా సరియైన దానిని చేస్తారు; కాగా వెలుగు ఎటువంటి ముసుగును ఎరుగదు, అందువల్ల గూఢత్వమును కూడా. సంపూర్ణమైన దేవుని చిత్తంలోనుండి వెలసిన మరియు నిశ్చలమైన లయలో స్వయంచాలకంగా పనిచేయుచున్న సృష్టియందు గూఢత్వం ఎటువంటి చోటును కూడా కలిగియుండజాలదు. తన నేతయందు ఏదీ కూడా దేవుని కార్యమైన సృష్టికంటే మరింత స్పష్టంగా లేదు!

దానిలోనే సఫలత యొక్క మరియు నిత్యత యొక్క లేక పతనం యొక్క మర్నం ఉన్నది. ఎక్కడ ఏవైనా ఈ సజీవమైన సృష్టి శాసనాలపై నిర్మించబడియున్నవో, అక్కడ అవి సహాయం చేస్తాయి, సఫలతను కలుగజేస్తాయి మరియు స్థిరత్వమును కూడా. కాని ఎక్కడైతే ఈ శాసనాలు అజ్ఞానం ద్వారానైనా లేక స్వసంకల్పం ద్వారానైనా లెక్కచేయబడలేదో, అక్కడ తప్పిపోకుండా అనతికాలంలో లేక దీర్ఘకాలంలో పతనం తప్పక సంభవిస్తుంది; కాగా అది చాలాకాలం నిలువలేదు, ఎందుకంటే అది ఎటువంటి స్థిరమైన, నిశ్చలమైన పునాదిపై లేదు.

అందువల్ల మానవకార్యంలో చాలా భాగం అశాశ్వతమైనది, దానికి అట్లు ఉండవలసిన అవసరం లేదు. పలురకాల ఉపాసనాలు దానికి చెందియున్నవి. అవి పూర్తిగా పతనం కాకుండా ఉండాలంటే, పదే పదే మార్పులకు తప్పక లోనుకావలసియుంటుంది.

దైవకుమారుడు అతి సరళమైన మరియు అతి స్పష్టమైన రితిలో తన వాక్యము నందు మనుష్యులకు సరియైన మార్గమును ఇచ్చియున్నాడు. దానిపై వారు ఆ సృష్టినేతకు అనుగూణంగా తమ భౌతిక జీవితాన్ని సాగించవలసియున్నది, తద్వారా ఆ సృష్టి నేతలో పనిచేయుచున్న దేవుని శాసనాల ద్వారా సహాయపూర్వకంగా పోషించబడుటకు మరియు వెలుగు ఉన్నతములలోనికి ఎత్తబడుటకు, భూమిపై శాంతిని మరియు సంతోషమును పొందుటకు.

దురదృష్టవశాత్తు చర్చిలు దైవకుమారుని ద్వారా స్వయంగా చాలా ఖచ్చితంగా వివరించబడిన మరియు ఇవ్వబడిన విమోచనకు మరియు ఎత్తబడుటకు మార్గమును అనుసరించలేదు. కాని అవి ఆయన బోధకు తమ స్వంత ఆలోచలలోనుండి ఇంకా ఎన్నింటినో చేర్చాయి మరియు దానితో సహజంగా అయోమయాన్ని కలుగజేశాయి. అది తప్పక విభజనలు కలుగజేయవలసియుండెను, ఎందుకంటే అది సృష్టిశాసనాలకు అనుగుణంగా లేదు మరియు అందువల్ల, ఇది విచిత్రంగా వినిపించినా కాని, దైవకుమారుని స్పష్టమైన బోధనకు వ్యతిరేకంగా కూడా ఉన్నది, వారు ఆయన పేరున తమను క్రైస్తవులమని పిలుచుకొన్నా కూడా.

పోపును అనుసరించే క్రైస్తవుల యొక్క మరియమ్మ ఉపాసనం విషయంలో కూడా ఇదే విధంగా ఉన్నది. సరియైనది, దేవుని చిత్తములో ఉన్నది చేయునట్లు, మనుష్యులకు సమస్తమును, వారు ఎట్లు ఆలోచించవలెనో మరియు కార్యం చేయవలెనో, ఎట్లు మాట్లాడవలెనో మరియు ప్రార్థించవలెనో కూడా బోధించిన యేసు ఏనాడైనా కేవలం ఒకే ఒక్క మాటతోనైనా అటువంటిదాని గురించి ఏమైనా చెప్పియున్నాడా? లేదు, ఆయన అది చేయలేదు! మరియు అది, ఆయన దానిని కోరలేదనుటకు, అది అట్లు ఉండకూడదనుటకు, ఒక రుజువైయున్నది!

మరియమ్మ ఉపాసనం సూచించే దానికి వ్యతిరేకమైన దానిని రుజువుచేసే ఆయన వ్యాఖ్యానాలు సహితం ఉన్నాయి.

మరియు క్రైస్తవులు నిజాయితీగా పనిచేయుటలో కేవలం క్రీస్తును అనుసరించగోరతారు కదా, లేనిచో వారు క్రైస్తవులై ఉండరు కదా.

ఒకవేళ మనుష్యుల ద్వారా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేర్చబడియుంటే మరియు పోపును అనుసరించే చర్చిలు వేరుగా పనిచేస్తుంటే, దాని ద్వారా, ఈ చర్చి మిడిసిపాటుతనంలో తనను దైవకుమారునికంటే పైన ఉంచుకొంటున్నదని రుజువుచేయబడింది; కాగా అది దైవకుమారుడు కోరని పద్దతులను ప్రవేశపెట్టుట ద్వారా ఆయన మాటలను మెరుగుపరచుటకు ప్రయత్నిస్తున్నది. ఎందుకంటే, అట్లు కాని పక్షంలో, మనుష్యులకు ఆయన ఇచ్చిన దానియంతటి ప్రకారం మనం చూస్తే, ఆయన తప్పక దానిని కూడా బోధించియుండేవాడు.

ఖచ్చితంగా, ఒక ఆకాశరాణి ఉన్నది, భూలోక భావనల ప్రకారం ఆమె ఆదితల్లి అని కూడా పిలువబడవచ్చు మరియు అయిననూ ఆమె అత్యంత స్వచ్ఛమైన కన్యత్వమును కలిగియున్నది. అయితే ఈమె నిత్యత్వం నుండి అత్యంత ఉన్నతములలోనే ఉన్నది మరియు ఎప్పుడూ భౌతికంగా శరీరధారి కాలేదు!

అక్కడక్కడ ఒక్కొక్కసారి లోతుగా కదిలించబడిన మనుష్యుల ద్వారా “చూడబడగలిగేది”
లేక “అంతఃకరణంలో గ్రహించబడగలిగేది” ఆమెయే. అయితే ఆ విధంగా చూడబడగలిగేది వాస్తవంగా స్వయంగా ఆమె కాదు కాని ఆమె యొక్క వికిరణం చేయబడిన చిత్రం మాత్రమే. ఆమె ద్వారా తరచుగా వేగవంతం చేయబడిన, అధ్భుతాలు అనబడే సహాయాలు, కూడా కలుగుతాయి.

ఈ ఆదిరాణిని వాస్తవంగా, వ్యక్తిగతంగా చూచుట అత్యంత పరిపక్వం చెందిన మనుష్యాత్మకు కూడా ఏనాటికీ సాధ్యం కాదు, కాగా కఠినమైన సృష్టిశాసనాల ప్రకారం ప్రతిజాతి ఎల్లప్పుడు సజాతిని మాత్రమే చూచుటకు సామర్థ్యతను కలిగియుంటుంది. అందువల్ల భౌతిక కన్ను కేవలం భౌతికమైన వాటిని చూడగలదు, సూక్ష్మపదార్థ కన్ను కేవలం సూక్ష్మపదార్థతకు చెందినవాటిని, ఆత్మీయ కన్ను ఆత్మీయతకు చెందినవాటిని, ఆదికం.

మరియు మానవ ఆత్మ కేవలం ఆత్మీయమైన దానిని, అనగా దేనిలోనుండి అది స్వయంగా ఉద్భవించిందో దానిని మాత్రమే చూడగలదు కాబట్టి, అది కూడా వాస్తవానికి అంతకంటే చాలా ఉన్నతమైన జాతికి చెందిన ఆదిరాణిని చూడలేదు. అయితే ఒకవేళ దానికి ఎప్పుడో ఒక్కసారి అనుగ్రహించబడినట్లైతే, కేవలం ఆమె యొక్క ఆత్మీయంగా వికిరణం చేయబడిన చిత్రాన్ని మాత్రమే చూడగలదు. అయితే అది సజీవమైన దానివలే కనబడుతుంది మరియు ఆ వికిరణంలోనే ఎంత బలంగా ఉండగలదంటే, ఎక్కడైతే అది, దానికొరకు అచంచలమైన విశ్వాసం ద్వారా లేక లోతుగా అనుభవించిన బాధ లేక సంతోషం ద్వారా సిద్ధపరచబడిన నేలను కనుగొంటుందో అక్కడ, అద్భుతాలను కలుగజేస్తుంది.

అది సంపూర్ణమైన దేవునిచిత్తం నుండి ఉద్భవించే మరియు దానిద్వారా కొనసాగించబడే సృష్టికార్యంలో ఉన్నది. ఈ కార్యంలో మనుష్యులకు అన్ని సహాయాలు కూడా మొదటినుండే ఉన్నవి మరియు ఒకవేళ వారు తమకే మెరుగుగా తెలియుననే భావంలో స్వయంగా దానినుండి వెనుదిరగనట్లైటే శాశ్వతంగా ఉంటాయి.

సృష్టిలో దేవుడు పనిచేయుచున్నాడు; కాగా అది ఆయన యొక్క సంపూర్ణమైన కార్యమైయున్నది.

సరిగ్గా ఈ సంపూర్ణత ప్రకారం దైవకుమారుని భూలోకజన్మ విషయంలో కూడా దానికి ముందుగా ప్రజననం తప్పక జరిగియుండవలసియుంటుంది. ఎవడు దానికి వ్యతిరేకమైన దానిని నమ్ముతాడో వాడు దేవుని కార్యముల సంపూర్ణతను అనుమానిస్తాడు, దానితోపాటు, ఎవరి చిత్తంలోనుండి సృష్టి ఉద్భవించిందో స్వయంగా ఆ దేవుని యొక్క సంపూర్ణతను కూడా.

నిష్కళంకమైన గర్భధారణ అంటే అత్యంత స్వచ్ఛమైన ప్రేమలో గర్భధారణ. అది పాపపూరితమైన కామంతోకూడిన గర్భధారణకు వ్యతిరేకమైనది! కాని ప్రజననం లేకుండా ఏ భౌతికజననం కూడా ఉండదు.

ఒకవేళ భౌతికగర్భధారణ, అనగా భౌతికప్రజననం నిష్కళంకమైనదై ఉండలేకపోతే, అప్పుడు ప్రతి యొక్క మాతృత్వం కూడా తప్పక కలుషితంగా పరిగణించబడవలసియుంటుంది కదా!

సృష్టి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, తన చిత్తాన్ని స్పష్టంగా చూపుతాడు.

ఈ చిత్తమును గుర్తించుట మనిషి యొక్క కర్తవ్యమైయున్నది. మనుష్యులు దానికొరకు కృషిచేయనందున మరియు తద్వారా స్వయంచలిత సృష్టిశాసనాలలో క్రమేపీ ఇంకా ఎక్కువ చిక్కుకొన్నందున, దైవకుమారుడు తన పరిశుద్ధమైన వాక్యంలో సరియైన మార్గమును దానికొరకు సూచించియున్నాడు.

కఠినమైన ఈ సృష్టినేత మనుష్యులను వారి అజ్ఞానంలో మరియు తప్పుడు ఉపయోగంలో కాలక్రమేణా తప్పక మట్టుబెట్టవలసియుండింది. అయితే అదే సృష్టినేత, ఒకవేళ మానవాళి దేవుని చిత్తం ప్రకారం జీవించినట్లైతే, దానిని ఉన్నతానికి ఎత్తుతుంది.

మనిషికి బహుమానం మరియు శిక్ష, స్వయంగా దేవుని చిత్తం ద్వారా నిరంతరం ఏకరీతిగా నడిపించబడుతున్న సృష్టినేతయందు ఉన్నవి! తృణీకరణ లేక విమోచన కూడా దానిలో ఉన్నాయి! అది నిష్కారుణ్యమైనది మరియు న్యాయమైనది, ఎల్లప్పుడు వస్తుగతమైనది, యధేచ్ఛత లేనిది.

దానిలో దేవుని యొక్క వర్ణనాతీతమైన గొప్పదనం, ఆయన ప్రేమ మరియు న్యాయత ఉన్నవి. అనగా ఆయన మనుష్యులకు మరియు చాలా ఇతర జీవులకు నివాసంగా మరియు జన్మభూమిగా ఇచ్చిన ఆయన కార్యంలో.

మనుష్యులు దాని గురించి తప్పక జ్ఞానమును పొందవలసిన సమయం ఆసన్నమైయున్నది, తద్వారా వారు దేవుని యొక్క క్రియాశీలత, ఏదైతే ఆయన కార్యము నందు వ్యక్తపరచబడియున్నదో దాని గురించి, సంపూర్ణ దృఢనమ్మకంతో గుర్తింపునకు వచ్చుటకు!

అప్పుడు ప్రతి భూలోకమనుష్యుడు స్థిరంగా, అత్యంత సంతోషకరమైన క్రియాశీలత కొరకు సంకల్పంతో, అత్యంత కృతజ్ఞతతో పైకి, దేవుని వైపునకు చూస్తూ ఈ భూమిపై నిలిచియుంటాడు, ఎందుకంటే గుర్తింపు అతన్ని జ్ఞానం ద్వారా శాశ్వతంగా అనుసంధానం చేస్తుంది!


జ్ఞానమైతే మనుష్యులకు, దేవుడు తన న్యాయత మరియు ప్రేమలలో పనిచేయుటను గురించి స్పష్టమైన మరియు గ్రహింపశక్యమైన దృఢనమ్మకమును కలుగజేస్తుందో ఆ జ్ఞానాన్ని అందజేయుటకు నేను “సత్యము యొక్క వెలుగులో” అనే గ్రంథాన్ని వ్రాసియున్నాను. ఇది ఎటువంటి కంతను వదలదు, ప్రతీ ప్రశ్నకు తనలో సమాధానాన్ని కలిగియున్నది. ఆయన చిత్తం యొక్క సేవకులు నిర్వర్తించుచున్న సృష్టిలోని మార్గములు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనే విషయం గురించి ఇది మనుష్యులకు స్పష్టతను తెస్తుంది.

అయితే దేవుడు మాత్రమే పరిశుద్ధుడైయున్నాడు!