లోకము

లోకము! మనిషి ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు, అతని ద్వారా ప్రస్తావించబడిన లోకము నిజంగా ఎట్లు ఉన్నదనే దానిని చిత్రీకరించుకోకుండానే తరచుగా ఆలోచనారహితంగా దానిని పలుకుతాడు.

అయితే, ఈ విషయంలో ఏదో ఒక నిర్దిష్టమైన దానిని ఊహించుకొనుటకు ప్రయత్నించే వారు చాలామంది, ఆత్మలో లెక్కలేనన్ని అత్యంత విభిన్నమైన సంగతత్వం మరియు పరిమాణంగల విశ్వగ్రహాలు సౌరవ్యవస్థలలో అమర్చబడి విశ్వంలో తమ కక్ష్యలలో భ్రమించుటను చూస్తారు. పరికరాలు శక్తివంతమయ్యేకొలది మరియు వాటి దూరపరిమితి పెరిగేకొలది నిత్యం క్రొత్త విశ్వగ్రహాలను మరియు ఇంకా ఎక్కువ విశ్వగ్రహాలను చూడవచ్చని వారికి తెలుసు. సగటుమనిషి అప్పుడు “అనంతం” అనే పదంతో సరిపెట్టుకొంటాడు. దానితో అతనిలో ఒక తప్పు భావంతోకూడిన భ్రమ ప్రారంభమౌతుంది.

విశ్వము అనంతమైనది కాదు. అది పదార్థసృష్టి, అనగా సృష్టికర్త యొక్క కార్యము. ఈ కార్యము, ప్రతి కార్యంవలే సృష్టికర్త ప్రక్కన నిలిచియున్నది మరియు ఆ ప్రకారంగా పరిమితమైనది.

పురోగతి చెందినవారని పిలువబడేవారు, దేవుడు సమస్త సృష్టిలో, ప్రతి పూవులో, ప్రతి శిలలో ఉన్నాడనే గుర్తింపును, ప్రకృతి చోదక శక్తులు, అనగా పరిశోధించబడలేని సమస్తము, ఏదైతే తనను గమనించబడునట్లు చేసుకొంటున్నా నిజంగా గ్రహించబడలేని సమస్తం దేవుడైయున్నాడనే గుర్తింపును కలిగియుండుటపై తరచుగా గర్వపడుతుంటారు. అది నిరంతరం పనిచేయుచున్న ఆదిశక్తి అని, ఎల్లప్పుడు తనను స్వయంగా నూతనంగా అభివృద్ధిపరచుకొనే శక్తిఊట అని, ద్రవ్యరహిత ఆదివెలుగు అని. సంపూర్ణతకు అభివృద్ధిచెందుట అనే ఏకైక నిరంతర లక్ష్యం దిశగా పనిచేయుచున్న, సమస్తంలో వ్యాపించియున్న చోదకశక్తిగా దేవుణ్ణి అంతటా కనుగొంటున్నాం, ఆయనను అంతటా ఎదుర్కొంటున్నం అనే స్పృహలో వారు తాము చాలా అభివృద్ధి చెందినవారమని అతిశయిస్తుంటారు.

కాని అది ఒక నిర్దిష్టమైన భావంలో మాత్రమే సరియైనది. సమస్త సృష్టిలో మనం కేవలం ఆయన చిత్తాన్ని ఎదుర్కొంటున్నాం, మరియు దానితో ఆయన ఆత్మను, ఆయన శక్తిని. ఆయన స్వయంగా సృష్టికి చాలా ఎత్తున నిలిచియున్నాడు.

పదార్థసృష్టి దాని ప్రారంభంనుండే పరిణామము మరియు క్షయము యొక్క తిరుగులేని శాసనాలతో ముడివేయబడింది; కాగా వేటిని మనం సృష్టి శాసనాలని పిలుస్తామో అవి దేవుని సృష్టిచిత్తమైయున్నవి. ఆ చిత్తము తన ప్రభావం ద్వారా నిరంతరం లోకాలను రూపొందిస్తున్నది మరియు క్షయపరుస్తున్నది. ఈ సృష్టిచిత్తం సమస్త సృష్టిలో ఏకరీతిగా ఉన్నది. సూక్ష్మపదార్థ లోకము మరియు స్థూలపదార్థ లోకము ఒకటిగా దానికి చెందియున్నవి.

ఈ మినహాయింపులేని మరియు తిరుగులేని ఆదిశాసనాల ఏకరూపత, అనగా ఆదిచిత్తం యొక్క ఏకరూపత, ప్రతియొక్క ప్రక్రియలో జరిగినట్లే, అనగా సమస్త సృష్టి యొక్క అత్యంత అపారమైన ఘటనలలో కూడా తప్పక జరుగవలసియున్నట్లుగా, స్వయంగా సృష్టిప్రక్రియలో జరుగవలసియున్నట్లుగా, స్థూలపదార్థ భూమి యొక్క అత్యంత చిన్న ప్రక్రియలో ఒకే విధంగా ఎల్లప్పుడు జరుగవలెనని నిర్దేశిస్తుంది.

ఆదిచిత్తం యొక్క ఖచ్చితమైన రూపం సరళమైనది మరియు సాధారణమైనది. ఒక్కసారి గుర్తించినట్లైతే మనం దానిని సమస్తంలో సునాయాసంగా కనుగొంటాం. చాలా ప్రక్రియల యొక్క క్లిష్టత మరియు అవగాహన-లేమి, పలువిధమైన, ఒకదానితో ఒకటి అల్లుకొనియున్న మనుష్యుల విభిన్నమైన సంకల్పాల ద్వారా నిర్మించబడిన చుట్టుదారులు మరియు ప్రక్కదారులలో మాత్రమే ఉన్నది.

ఈ విధంగా దేవుని యొక్క కార్యము, లోకము, సృష్టిగా, సమస్తంలో ఏకరీతిగావున్న మరియు సంపూర్ణమైన దేవుని శాసనాలకు లోబడియున్నది, వాటిలోనుండి ఉద్భవించింది కూడా, మరియు అందువల్ల పరితమైనది.

కళాకారుడు ఉదాహరణకు తన కార్యంలో కూడా ఉంటాడు, దానిలో విలీనమౌతాడు, అయినా వ్యక్తిగతంగా దాని ప్రక్కన నిలిచియుంటాడు. కార్యము పరిమితమైనది మరియు తాత్కాలికమైనది, అయితే కళాకారుని సామర్థ్యత అందువల్ల అటువంటిది కాదు. కళాకారుడు, అనగా కార్యం యొక్క సృష్టికర్త తన కార్యాన్ని, దేనిలో అతని చిత్తం ఉన్నదో దానిని, నాశనం చేయగలడు, తద్వారా స్వయంగా అతడు ప్రభావితుడు కాకుండానే. అయిననూ అతడు ఎల్లప్పుడు ఆపై కూడా ఒక కళాకారునిగా ఉంటాడు.

మనం కళాకారున్ని అతని కార్యంలో గుర్తిస్తాం మరియు కనుగొంటాం, మనం అతన్ని వ్యక్తిగతంగా చూడనవసరం లేకుండానే అతడు మనకు పరిచయమౌతాడు. మనం అతని కార్యాలను కలిగియున్నాం, అతని చిత్తం వాటిలో ఉన్నది మరియు మనపై ప్రభావం చూపుతుంది; వాటిలో అతడు మనలను ఎదుర్కొంటాడు, అయిననూ స్వయంగా అతడు నిజానికి మనకు దూరంగా తన జీవితాన్ని గడపవచ్చు.

క్రియాత్మకుడైన కళాకారుడు మరియు అతని కార్యం సృష్టితో సృష్టికర్తకున్న సంబంధాన్ని ఒక మబ్బైన ప్రతిబింబంగా చూపుతాయి.

చిరకాలమైనది మరియు అంతంలేనిది, అనగా నిరంతరమైనది కేవలం సృష్టి యొక్క గతిచక్రం మాత్రమే, దాని యొక్క ఎడతెరపిలేని పుట్టుట, గిట్టుట మరియు తిరిగి క్రొత్తగా రూపొందుటలో.

ఈ యొక్క ఘటనలోనే అన్ని ప్రకటనలు మరియు ప్రవచనాలు కూడా నెరవేరుతాయి. చివరకు దానిలో భూమి యొక్క “అంత్య తీర్పు” కూడా నెరవేరుతుంది!

అంత్య తీర్పు, అనగా చివరి తీర్పు, ఒకనాడు ప్రతియొక్క పదార్థ విశ్వగ్రహానికి వస్తుంది, కాని అది సమస్త సృష్టిలో ఒకే సమయంలో జరగదు.

సృష్టి యొక్క ఏ నిర్దిష్టమైన భాగమైతే తన గతిచక్రంలో తన క్షయాన్ని తప్పక మొదలుపెట్టవలసిన స్థానాన్ని చేరుతుందో ఆ భాగంలో అది ఒక అవసరమైన ప్రక్రియ, తద్వారా అది తన యొక్క తదనంతర గమనంలో తనను తిరిగి క్రొత్తగా నిర్మించుకొనగల్గుటకు.

ఈ నిత్యమైన గతిచక్రం అంటే, భూమి మరియు తమ సూర్యుల చుట్టూవున్న ఇతర నక్షత్రాల గమనం కాదు, కాని అ గొప్ప, అపారమైన గతిచక్రం అని అర్థం. దానిగుండా సమస్త సౌరవ్యవస్థలు తప్పక పోవలసియుంటుంది, అదే సమయంలో అవి తమలో తాము ప్రత్యేకంగా తమ స్వంత కదలికలను కూడా జరుపవలసియుంటుంది.

ఏ స్థానంలో ప్రతి విశ్వగ్రహం యొక్క క్షయం ప్రారంభం కావలెనో అనేది ఖచ్చితంగా నిర్ధారించబడియుంటుంది, తిరిగి ప్రకృతిశాసనాల యొక్క క్రమబద్ధతకు అనుసారంగానే. అది ఒక ఖచ్చితమైన స్థానమైయుంటుంది, దాని వద్ద విచ్ఛిన్న ప్రక్రియ తప్పక అభివృద్ధి చెందవలసియుంటుంది, ఆ విశ్వగ్రహం యొక్క మరియు దాని నివాసకుల యొక్క స్థితితో సంబంధం లేకుండా.

ఆ గతిచక్రం ఆపబడలేకుండా ప్రతి విశ్వగ్రహాన్ని ఆ స్థానానికి నడుపుతుంది, ఎటువంటి జాప్యం లేకుండా విచ్ఛిన్నత యొక్క ఘడియ నెరవేరుతుంది. సృష్టిలో సమస్తంవలే అది నిజానికి ఒక పరివర్తనం మాత్రమే, అభివృద్ధిని కొనసాగించుటకు అది ఒక అవకాశమైయున్నది. అప్పుడు ప్రతిమనిషికి “అటో-ఇటో” అనే ఘడియ వచ్చియుంటుంది. ఒకవేళ అతడు ఆత్మికతను ఆకాంక్షిస్తున్నట్లైతే వెలుగుదిశలో ఎత్తబడతాడు లేక ఒకవేళ అతడు దృఢనమ్మకంలో కేవలం భౌతికమైన వాటినే విలువైనవిగా ప్రకటించినట్లైతే, ఏ పదార్థతను పట్టుకొని అతడు వ్రేలాడుతుంటాడో, దానికి బంధించబడియుంటాడు.

అటువంటి పక్షంలో అతడు తన స్వీయసంకల్పం యొక్క శాసనానుసారమైన ఫలితంగా పదార్థలోకంనుండి తనను పైకి ఎత్తుకొనలేడు మరియు అప్పుడు దానితోపాటు మార్గం యొక్క చివరి అంకంలో క్షయంలోనికి లాగబడతాడు. అప్పుడు అది ఆత్మీయమైన మరణమైయుంటుంది; అది జీవగ్రంథంనుండి కొట్టివేయబడుటతో సమానమైనది.

తనలో పూర్తిగా సహజమైన ఈ ప్రక్రియ, నిత్యమైన శాపం అనికూడా పిలువబడుతుంది, ఎందుకంటే అ విధంగా విచ్ఛిన్నతలోనికి లాగబడినవాడు “వ్యక్తిగతంగా ఉనికిలో ఉండుట, తప్పక అంతం కావలసియుంటుంది”. అది మనుష్యులకు సంభవించగలిగే వాటిలో అత్యంత భయంకరమైనది. అతడు ఆత్మీయ కట్టడానికి పనికిరాని “తృణీకరించబడిన రాయిగా” పరిగణించబడతాడు మరియు అందువల్ల తప్పక పొడిగా నూరబడవలసియుంటుంది.

పూర్తి సహజమైన ప్రక్రియల మరియు శాసనాల కారణంగా కూడా జరిగే పదార్థతనుండి ఆత్మ యొక్క ఈ విభజన “అంత్యతీర్పు” అని పిలువబడుతుంది. అది గొప్ప సంక్షోభాలతో మరియు పరివర్తనలతో కూడియుంటుంది.

ఈ ప్రక్రియ ఒకే ఒక్క భూలోకదినంలో జరగదనే విషయం ప్రతిఒక్కరికి సులభంగా అర్థమవుతుంది; కాగా విశ్వకలాపంలో వెయ్యి సంవత్సరాలు ఒక దినంవలే ఉన్నాయి.

కాని మనం ఈ కాలం యొక్క ప్రారంభం మధ్యలో ఉన్నాం. భూమి ఇప్పుడు, ఎక్కడైతే అది ఇదివరకటి కక్ష్యను వదిలి పోతుందో ఆ స్థానానికి వస్తుంది; ఆ విషయం తనను తప్పక స్థూలపదార్థతలో కూడా బలంగా అనుభవించగల్గునట్లు చేసుకోవలసియుంటుంది. అప్పుడు, గతకాలంలో సిద్ధపరచబడిన, కాని ఇంతవరకు కేవలం “అభిప్రాయాలలో మరియు విశ్వాసాలలో” మాత్రమే వ్యక్తపరచబడిన విభజన మనుష్యుల మధ్య మరింత తీక్షణంగా మొదలౌతుంది.

అందువల్ల భూలోక ఉనికి యొక్క ప్రతియొక్క గంట కూడా ఏనాడూ లేనంత విలువైనది. ఎవడు ఆసక్తితో వెదుకుతాడో మరియు నేర్చుకొనగోరతాడో, వాడు సమస్త ప్రయాసతో నీచమైన, వానిని భూమితో బంధించే ఆలోచనలనుండి తనను తప్పక వేరుపరచుకోవలసియుంటుంది. లేనిచో వానికి పదార్థలోకంతో ముడివేయబడే మరియు దానితోపాటు సంపూర్ణ క్షయంలోనికి లాగబడే అపాయం పొంచియుంటుంది.

వెలుగును అకాంక్షించే వారైతే పదార్థలోకంనుండి క్రమేపీ సడలించబడతారు మరియు చివరకు సమస్త ఆత్మీయమైన వాటి యొక్క స్వదేశం దిశగా పైకెత్తబడతారు.

అప్పుడు వెలుగుకు మరియు చీకటికి మధ్య విభజన అంతిమంగా పూర్తియైయుంటుంది మరియు తీర్పు నెరవేరియుంటుంది.

“లోకం”, అనగా సమస్త సృష్టి, ఆ ప్రక్రియలో పతనం కాదు, కాని ఎప్పుడు విశ్వగ్రహాల గమనం, వాటి యొక్క క్షయం మరియు దానితోపాటు అంతకు పూర్వం జరిగే విభజన ప్రారంభం కావలసిన స్థానాన్ని చేరుతుందో, కేవలం అప్పుడే ఆ విశ్వగ్రహాలు క్షయమయ్యే ప్రక్రియలోకి లాగబడతాయి.

సృష్టి యొక్క ఆదిమొదలునుండి దానిలో ఇమిడియున్నట్టి, స్వయంగా ఈ సృష్టిని ఉద్భవింపజేసిన, నేడు కూడా మరియు భవిష్యత్తులోనూ నిరంతరం సృష్టికర్త యొక్క చిత్తాన్ని భరించుచున్న దేవుని శాసనాల యొక్క ప్రకృతికి అనుగుణమైన ప్రభావం ద్వారా ఈ నిర్వహణం కొనసాగుతుంది. నిత్యమైన గతిచక్రంలో నిరంతరమైన సృష్టించుట, విత్తుట, పరిపక్వమగుట, కోయుట మరియు పతనమగుట ఉన్నవి, తద్వారా సంగమంలో మార్పువల్ల నూతనంగా బలపరచబడి మరల వేరైన రూపాలను పొందుటకు. ఆ రూపాలు తదనంతర గతిచక్రం వైపునకు త్వరితంగా సాగుతాయి.

ఈ సృష్టి యొక్క గతిచక్రం విషయంలో మనం ఒక బ్రహ్మాండమైన గరాటును లేక ఒక బ్రహ్మాండమైన గుహను ఊహించుకోవచ్చు. దానిలోనుండి ఆపబడలేని ప్రవాహంలో నిరంతరం ఆదివిత్తనం బయటకు ఉబుకుతుంది. శాస్త్రం ఇప్పటికే సరిగ్గా ఎరిగినట్లుగా మరియు చిత్రీకరించి యున్నట్లుగా అది పరిభ్రమణ కదలికలలో క్రొత్త సంగమాన్ని మరియు అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది.

రాపిడి మరియి విలీనం ద్వారా దట్టమైన మేఘాలు రూపొందుతాయి, వీటిలోనుండి తిరిగి విశ్వగ్రహాలు ఏర్పడతాయి. ఇవి తిరుగులేని శాసనాల యొక్క స్థిరమైన క్రమబద్ధత ప్రకారంగా సౌరవ్యవస్థలుగా గుమిగూడతాయి. అవి తమకు తాము పరిభ్రమిస్తూ సంయుక్తంగా తప్పక ఆ గొప్ప, నిత్యమైన గతిచక్రాన్ని అనుసరించవలసియుంటుంది.

ఏ విధంగా మొక్కల, జంతువుల మరియు మనుష్యుల శరీరాల విషయంలో, భౌతికకంటికి కనబడే ప్రక్రియలో విత్తనంలోనుండి అభివృద్ధి, రూపునుపొందుట, పరిపక్వత మరియు కోత లేక క్షయం జరుగుతుందో, ఏది మరింత అభివృద్ధి చెందుటకు రూపాంతరాన్ని, విచ్ఛేదమును కలుగజేస్తుందో, సరిగ్గా అదే విధంగా గొప్ప విశ్వకలాపంలో కూడా ఉన్నది. స్థూలపదార్థతలో కనిపించే విశ్వగ్రహాలు, ఏవైతే అంతకంటే చాలా పెద్దదైన సూక్ష్మపదార్థతను అనగా భౌతికకంటికి కనబడని పరిసరాన్ని తమతోపాటు కలిగియున్నాయో, అవి తమ నిత్యమైన గతిచక్రంలో అదే ప్రక్రియకు లోనైయున్నాయి, ఎందుకంటే అవే శాసనాలు వాటిలో పనిచేస్తున్నాయి.

అత్యంత మూర్ఖుడైన సంశయాత్ముడు కూడా ఆదివిత్తనం యొక్క ఉనికిని తిరస్కరించలేడు. అయిననూ అది ఏ భౌతికకంటి ద్వారా చూడబడలేదు, ఎందుకంటే అది వేరొక పదార్థతకు చెందినది, “ఆవలిలోకంలో” ఉన్నది. మనం దానిని ప్రశాంతంగా మరల సూక్ష్మపదార్థత అని పిలుద్దాం.

దానిలోనుండి తనను మొదట రూపొందించుకొనే లోకం ప్రకృతికనుగుణంగా అదే ప్రకారంగా సూక్ష్మపదార్థతకు చెందనదని మరియు భౌతికకనుల ద్వారా గుర్తించబడలేదని గ్రహించుట కూడా కష్టమైనది కాదు. ఆ తరువాతే దానిలోనుండి మరియొక పర్యవసానంగా ఉత్పన్నమయ్యే అత్యంత స్థూలమైన అవక్షేపము అప్పుడు, సూక్ష్మపదార్థ లోకం ఆధారంగా, క్రమక్రమంగా, స్థూలపదార్థ లోకాన్ని దాని యొక్క స్థూలపదార్థ గ్రహాలతోపాటు రూపొందిస్తుంది. కేవలం దానినే దాని యొక్క అత్యంత చిన్న ప్రారంభాలనుండి భౌతికకనులతోనూ మరియు దానికి తోడుగావచ్చే సమస్త స్థూలపదార్థ సహాయకాలతోనూ గమనించవచ్చు.

అసలైన మనుష్యుని యొక్క ఆత్మీయ రకానికి సంబంధించిన అతని ఓలం విషయంలో ఇది వేరుగాలేదు, స్వయంగా దాని గురించి నేను తరువాత చెబుతాను. వివిధ రకమైన లోకాలద్వారా అతని పర్యటనలలో అతని ఓలము, తొడుగు, కాయము, శరీరము లేక సాధనము, ఆ తొడుగులను మనం ఏమని పిలిచినా సరే, తప్పక ఎల్లప్పుడు ఏ నిర్దిష్టమైన పరిసరంలోనికి అతడు ప్రవేశిస్తాడో దాని యొక్క అదే రకమైన పదార్థతకు చెందినదైయుండాలి, తద్వారా అతడు దానిని రక్షణగా మరియు అవసరమైన సహాయకంగా వాడుకొనుటకు, దానిలో నేరుగా సార్థకంగా పనిచేసే అవకాశాన్ని అతడు పొందగోరినట్లైతే.

స్థూలపదార్థ లోకము సూక్ష్మపదార్థ లోకంపై ఆధారపడి యున్నందున, దాని పర్యవసానంగా స్థూలపదార్థ లోకంలోని సమస్త ఘటనల తిరుగు-ప్రభావము సూక్ష్మపదార్థ లోకంపై ఉంటుంది.

ఈ గొప్ప సూక్ష్మపదార్థ పరిసరం ఆదివిత్తనంలోనుండి అదే విధంగా సృష్టించబడింది, నిత్యమైన గతిచక్రంతోపాటు సాగుతుంది మరియు చివరకు ఇది కూడా ఇంతకుముందు ప్రస్తావించబడిన బ్రహ్మాండమైన గరాటు యొక్క వెనుకప్రక్కకు పీల్చబడుతూ నడిపించబడుతుంది; అక్కడ విచ్ఛిన్నత జరుగుతుంది, తద్వారా వేరొక ప్రక్కన ఆదివిత్తనంవలే తిరిగి నూతన గతిచక్రంలోనికి త్రోయబడుటకు.

గుండె యొక్క పని మరియు రక్తప్రసరణవలే, ఆ గరాటు పదార్థసృష్టి యొక్క గుండెవంటిది. అనగా విచ్ఛిన్నప్రక్రియ సమస్త సృష్టికి వర్తిస్తుంది, సూక్ష్మపదార్థ భాగానికి కూడా, కాగా పదార్థత సమస్తం తిరిగి ఆదివిత్తనంలో విలీనమౌతుంది, తనను తిరిగి నూతనంగా నిర్మించుకొనుటకు. ఎక్కడ కూడా ఆ విషయంలో యథేచ్ఛత లేదు, కాని సమస్తము సహజమైన ఆదిశాసనాలకు అనుసారంగా అభివృద్ధి చెందుతుంది. అవి వేరొక గమనాన్ని అనుమతించవు.

అందువల్ల ఆ గొప్ప గతిచక్రం యొక్క ఒక నిర్దిష్టమైన స్థానంలో సృష్టించబడిన సమస్తానికి, స్థూల- లేక సూక్ష్మ పదార్థతకు, ఏ ఘడియలో సృష్టించబడిన దానిలోనుండి క్షయప్రక్రియ తనను స్వేచ్ఛాయుతంగా సిద్ధపరచుకొంటుందో మరియు చివరకు పెల్లుబుకుతుందో ఆ ఘడియ వస్తుంది.

ఇక ఈ సూక్ష్మపదార్థ లోకం భూమిని వదిలివెళ్లిన వారికి, ఆవలిలోకం అని పిలువబడే మజిలీయైయున్నది. అది స్థూలపదార్థ లోకంతో సన్నిహితంగా అనుసంధానించబడి యున్నది, దానికి చెందియున్నది, దానితో ఒకటైయున్నది. మరణించే క్షణంలో మనిషి, అతడు స్థూలపదార్థ శరీరంతోపాటు ధరించే తన సూక్ష్మపదార్థ శరీరంతో, సజాతీయమైన సూక్షపదార్థ పరిసరంలోనికి ప్రవేశిస్తాడు. అదే సమయంలో అతడు స్థూలపదార్థ శరీరాన్ని భూమిపై వదిలివేస్తాడు.

ఇక ఈ సూక్ష్మపదార్థ లోకం, ఆవలిలోకం, సృష్టికి చెందినదై, అవే నిత్యమైన అభివృద్ధి మరియు క్షయముల శాసనాలకు లోనైయున్నది. విచ్ఛిన్నం మొదలైనప్పుడు పూర్తి సహజమైన మార్గంలో పదార్థతనుండి ఆత్మీయత యొక్క విభజన కూడా జరుగుతుంది. స్థూలపదార్థ లోకంలో అదే విధంగా సూక్ష్మపదార్థ లోకంలో మనిషి యొక్క ఆత్మీయ స్థితి ప్రకారం ఆ ఆత్మీయ మనిషి, ఆ అసలైన “అహం”, తప్పక ఊర్ధ్వదిశగా కదలవలసియుంటుంది లేక పదార్థతతో కట్టివేయబడి కొనసాగవలసియుంటుంది.

సత్యముకొరకు మరియు వెలుగుకొరకు గల ఆసక్తితో కూడిన ఆకాంక్ష ప్రతివానిని దానికి తోడైయున్న మార్పు ద్వారా ఆత్మీయంగా మరింత స్వచ్ఛంగా మరియు దానితోపాటు మరింత ప్రకాశవంతంగా చేస్తుంది; తద్వారా ఈ స్థితి అతన్ని తప్పక దట్టమైన పదార్థతనుండి ప్రకృతికనుగుణంగా క్రమక్రమంగా ఎక్కువగా సడలించవలసియుంటుంది మరియు అతని స్వచ్ఛతకు మరియు తేలికకు అనుగుణంగా ఉన్నతమునకు నడిపించవలసియుంటుంది.

అయితే, పదార్థతపై మాత్రమే విశ్వసించేవాడు తన దృఢనమ్మకం ద్వారా తనను స్వయంగా పదార్థతకు కట్టివేసుకొనియుంటాడు మరియు దానితో బంధించబడి కొనసాగుతాడు, అందువల్ల అతడు ఊర్ధ్వదిశగా నడిపించ బడలేడు. ప్రతివాని యొక్క స్వయంగా ఆశించబడిన తీర్మానం ద్వారా అందువల్ల వెలుగును ఆకాంక్షించే వారి మధ్య మరియు చీకటితో బంధించబడియున్న వారి మధ్య, ఉనికిలోవున్న ఆత్మీయ గురుత్వాకర్షణ ప్రకృతిశాసనాలకు అనుగుణంగా విభజన జరుగుతుంది.

దానితో, భూమినుండి వేరైన వారి యొక్క అభివృద్ధిచెందే అవకాశానికి కూడా ఆవలిలోకం అని పిలువబడే దాని యొక్క శుద్ధిచేసే ప్రక్రియలో ఎప్పుడో ఒకసారి నిజమైన అంతం ఉంటుందని విశదమౌతుంది. ఒక ఆఖరి తీర్మానం! రెండు లోకాలలోని మనుష్యులు, వెలుగు ప్రదేశాలకు పైకెత్తబడ గల్గునంతగా శుద్ధిచేయబడియుంటారు లేక వారు తమ నిమ్నమైన స్వభావంలో తమ స్వీయసంకల్పానికి అనుగుణంగా బంధించబడియుంటారు మరియు దానిద్వారా చివరకు “నిత్యమైననాశనం” లోనికి క్రిందకు విసిరివేయ బడతారు, అనగా, ఏ పదార్థతనుండి వారు తమను విడిపించుకొనలేరో దానితో విచ్ఛిన్నత వైపుగా ఈడ్చబడతారు, విచ్ఛిన్నాన్ని స్వయంగా బాధతో అనుభవిస్తారు మరియు దానితో వ్యక్తిగతంగా ఉనికిలో ఉండుటనుండి అంతమౌతారు.

వారు పొట్టువలే గాలికి కొట్టుకొనిపోతారు, పిండిచేయబడతారు మరియు దానితో బంగారు జీవగ్రంథంలోనుండి కొట్టివేయబడతారు!

ఇందువల్ల, “అంత్య తీర్పు” అని పిలువబడేది, అనగా అంతిమ తీర్పు సహితం ఒక ప్రక్రియయైయున్నది. అది సృష్టిని మోయుచున్న శాసనాల ప్రభావంలో పూర్తి సహజమైన విధంగా అమలౌతుంది, ఏ విధంగానంటే, అది వేరొక విధంగా సాధ్యం కాజాలనట్లు. మనిషి ఇక్కడ కూడా తాను స్వయంగా దేనిని కోరుకొనియున్నాడో, అనగా దేనిని అతడు తన దృఢనమ్మకం ద్వారా కలుగజేశాడో, కేవలం దాని ఫలాలను మాత్రమే ఎల్లప్పుడు పొందుతాడు.

సృష్టిలో జరిగే సమస్తం అతి ఖచ్చితమైన తార్కిక సవ్యత ప్రకారం స్వయంచాలకంగా జరుగుతుందనే, మనుష్యుల ప్రారబ్ధాలకు మార్గదర్శకం ఎల్లప్పుడు వారి కోరికల మరియు ఆశల ద్వారా మాత్రమే ఇవ్వబడుతుందనే, సృష్టికర్త గమనిస్తూ బహుమానమునిచ్చుటకు లేక శిక్షించుటకు జోక్యం చేసుకోడనే జ్ఞానం, సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని కించపరచదు కాని ఆయనను గురించి మరింత ఉదాత్తునిగా ఆలోచించుటకు తరుణం ఇవ్వగలదు.

ఆ గొప్పతనము ఆయన కార్యం యొక్క సంపూర్ణతలో ఉన్నది మరియు అది గౌరవభావంతో కూడిన ఊర్ధ్వ వీక్షణకు బలవంతపరుస్తుంది, కాగా అత్యంత గొప్ప ప్రేమ మరియు తిరుగులేని న్యాయత, తప్పనిసరిగా, అత్యంత అపారమైన, అదే విధంగా అత్యంత చిన్న ఘటనలో కూడా తేడా లేకుండా ఉండవలసియుంటుంది కాబట్టి.

మనిషి కూడా గొప్పవాడే, అటువంటివానిగా అతడు సృష్టిలో తన స్వంత ప్రారబ్ధానికి అధిపతిగా ఉంచబడి యున్నాడు! తన సంకల్పం ద్వారా అతడు ఆ కార్యంలోనుండి తనను హెచ్చించుకోగలడు, అదే సమయంలో దాని యొక్క మరింత ఉన్నతమైన పరిణతికి తోడ్పడగలడు; లేదా దానిని అధోగతికి లాగగలడు మరియు స్వయంగా దానిలో చిక్కుకోగలడు, ఆ విధంగా ఇకమీదట బయటకురాలేకుండా దానితోపాటు క్షయం దిశగా పోవుటకు, స్థూలపదార్థ లోకంలోనేకాని లేక సూక్ష్మపదార్థ లోకంలోకాని.

అందువల్ల, అధమమైన భావనల యొక్క సమస్త కట్లలోనుండి మిమ్ములను విడిపించుకొనుటకు పోరాడండి; కాగా ఇది చివరి సమయం! దానికొరకు కేటాయించిన గడువు ముగిసే ఘడియ సమీపిస్తున్నది! స్వచ్ఛమైన, సత్యమైన, ఉన్నతమైన దానికొరకు ఆకాంక్షను మీలో మేల్కొల్పండి! –

సృష్టి యొక్క నిత్యమైన గతిచక్రానికి చాలా ఎత్తున మధ్యలో ఓక కిరీటంవలే ఒక “నీలవర్ణ ద్వీపం” తేలియాడుచున్నది; అది ఆశీర్వదించబడిన, శుద్ధిచేయబడి వెలుగు ప్రదేశాలలో నివసించుటకు ఇప్పటికే అనుమతించబడిన ఆత్మల యొక్క నివాసమైయున్నది! ఈ ద్వీపం లోకంనుండి వేరైయున్నది. అందువల్ల ఆ గతిచక్రంతోపాటు తిరుగదు కూడా, కాని భ్రమించుచున్న సృష్టికంటే అంత ఎత్తులో అది ఉన్నా, బయటకుపోయే ఆత్మీయ శక్తుల యొక్క ఆసరాను మరియు కేంద్రాన్ని అది నిర్మిస్తుంది. దాని ఉన్నతస్థాయిలో, చాలా ప్రసిద్ధమైన బంగారు వీధుల నగరాన్ని కలిగియున్న ద్వీపం అదే. ఇక్కడ ఏది కూడా మార్పుకు లోనైయుండదు. ఎటువంటి “అంత్యతీర్పునకు” ఇకపై భయపడనవసరం ఉండదు. అక్కడ నివసించగలిగే వారు*“స్వదేశంలో”*ఉన్నారు.

కాని ఈ నీలవర్ణ ద్వీపంపై చివరి దానిగా, అత్యంత ఉన్నతమైన దానిగా, ప్రత్యేకంగా పిలువబడని వారు దగ్గరకు పోజాలని, కవితలలో ఎన్నొసార్లు ప్రస్తావించబడిన ఆ … గ్రాలుకోట నిలిచియున్నది!

ఐతిహ్యములతో ఆవరించబడినదై, లెక్కలేనంతమంది యొక్క ఆకాంక్షగా, అత్యంత గొప్ప వైభవం యొక్క వెలుగులో అది అక్కడ నిలిచియున్నది మరియు సర్వశక్తిమంతుని స్వచ్ఛమైన ప్రేమ యొక్క పరిశుద్ధమైన పాత్రను, గ్రాలును, భద్రపరచుచున్నది!

సంరక్షకులుగా ఆత్మలలో అత్యంత స్వచ్ఛమైనవారు నియమించబడియున్నారు. వారు దైవప్రేమను దాని అత్యంత స్వచ్ఛమైన రూపంలో మోయుచున్నారు, ఆ ప్రేమ భూమిపై మనుష్యుల ద్వారా ఊహించుకొనబడిన దానికి గణనీయంగా వేరుగా కనిపిస్తుంది, వారు దానిని ప్రతి రోజూ మరియు ప్రతి గంటలో అనుభవిస్తున్నా సరే.

ప్రకటనల ద్వారా ఆ కోటను గురించిన వర్తమానం పలు అంచెలలో నీలవర్ణ ద్వీపంనుండి ఆ సుదూర మార్గంపై సూక్ష్మపదార్థ లోకం ద్వారా క్రిందకు, చివరిగా కొంతమంది కవుల లోతైన ప్రేరణ ద్వారా స్థూలపదార్థపు భూమి యొక్క మనుష్యుల మధ్యకు వచ్చింది. ఒక స్థాయినుండి మరొక స్థాయికి క్రిందివైపునకు ఇవ్వబడుటలో ఆ సత్యం ఉద్దేశించ బడకుండా కూడా వివిధమైన వక్రీకరణలకు గురియయింది, తద్వారా చివరి వర్ణన కేవలం పలుసార్లు మసకబారిన ప్రతిబింబంగా మాత్రమే మిగులగలిగింది, అదే చాలా భ్రమలకు కారణమయింది.

ఇప్పుడు ఒకవేళ గొప్ప సృష్టి యొక్క ఒక భాగంలోనుండి ఘోరమైన దుస్థితిలో బాధ మరియు శోకమయ విజ్ఞాపణ సృష్టికర్తవరకు ఆరోహించినట్లైతే, అప్పుడు ఆ పాత్ర యొక్క ఒక సేవకుడు పంపబడతాడు, ఈ ప్రేమ యొక్క ఒక వాహకునిగా ఆత్మీయ అవసరంలో సహాయపడుతూ జోక్యం చేసుకొనుటకొరకు. ఏదైతే కేవలం ఒక కథగా మరియు ఆఖ్యానముగా మాత్రమే సృష్టికార్యంలో తేలుతూ ఉంటుందో అది అప్పుడు సజీవంగా సృష్టిలోనికి ప్రవేశిస్తుంది!

కాని అటువంటి ప్రేషణలు తరచుగా జరుగవు. ప్రతిసారి నిర్ణయాత్మకమైన మార్పులు, గొప్ప సంక్షోభాలు వాటితో వస్తాయి. ఆ విధంగా పంపబడినవారు తప్పిపోయిన వారికి వెలుగును మరియు సత్యమును, నిరాశచెందిన వారికి శాంతిని తెస్తారు, తమ సందేశంతో అన్వేషకులకందరికి చేతిని అందిస్తారు, తద్వారా వారికి క్రొత్త ధైర్యమును మరియు క్రొత్త బలమును అందించుటకు మరియు వారిని సమస్త చీకటి ద్వారా ఊర్ధ్వదిశగా వెలుగుకు నడిపించుటకు.

వారు వెలుగునుండి సహాయమును ఆకాంక్షిచే వారికొరకు మాత్రమే వస్తారు, కాని అపహాసకుల కొరకు మరియు స్వనీతిపరుల కొరకు కాదు.