జడత్వము

సృష్టిలో సమస్తమూ చలనమైయున్నది. చలనము, వెలుగు యొక్క వత్తిడి ద్వారా సంపూర్ణంగా శాసనానుసారంగా కలుగజేయబడినదై, వేడిమిని పుట్టిస్తుంది మరియు దానిలో రూపాలు సంగమమగునట్లు చేస్తుంది. వెలుగులేనట్లైతే ఎటువంటి చలనం ఉండలేదు, మరియు అందువల్ల మనిషి, వెలుగునుండి చాలాదూరంలో కంటే దాని సమీపంలో చలనం తప్పక చాలా వేగంగా, బలంగా ఉండవలసియుంటుందని ఊహించుకోవచ్చు కూడా.

వాస్తవానికి చలనం కూడా వెలుగునుండి
దూరమయ్యే కొలది క్రమంగా నిదానమౌతుంది మరియు మందగిస్తుంది. కాలక్రమేణా అది, మొదట్లొ కదలిక ఇంకా చురుకుగా ఉన్నప్పుడు రూపొందగలిగిన సమస్త రూపాలను జడత్వానికి కూడా నడిపించగలదు.

ఈ సందర్భంలో “వెలుగు” అనే పదం క్రింద ఎదో ఒక నక్షత్రం యొక్క వెలుగు అని అర్థం చేసుకోకూడదు, కాని స్వయంగా జీవమైయున్నట్టి ఆదివెలుగు, అనగా దేవుడు అని!

పైన చెప్పబడిన దానితో సృష్టిలోని ప్రక్రియను గురించి ఇవ్వబడిన గొప్ప విహంగావలోకన చిత్రం తరువాత నేను నేడు భూమిపై దృష్టిని కేంద్రీకరించగోరుచున్నాను. ఈ భూమి చాలా మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగినట్లు కాక ప్రస్తుతం వెలుగునుండి చాలా ఎక్కువ దూరంలో పరిభ్రమిస్తున్నది. ఎందుకంటే, మనుష్యులు తమ హాస్యాస్పదమైన స్వయాతిశయంలో మేధస్సు యొక్క ఏకపక్షమైన అధికాభివృద్ధిలో తమను దేవునినుండి దూరపరచుకొనుట ద్వారా అది క్రమంగా చీకటి యొక్క భారానికి మరియెక్కువగా లోనుచేయబడింది. మేధస్సు కేవలం క్రింది దిశగా స్థూలమైన పదార్థతపై మాత్రమే కేంద్రీకరించబడియున్నది మరియు ఎల్లప్పటికీ ఆ విధంగానే ఉంటుంది, ఎందుకంటే అది దానికొరకే ఇవ్వబడింది. అయితే అది వికిరణాలను మరియు అనుభవాలను పైనుండి, వెలుగు ఔన్నత్యములనుండి ఏమాత్రం కూడా మసకబారకుండా గ్రహించగలగాలి అనే నిబంధన ప్రకారం దానికి ఇవ్వబడింది.

అత్యంత స్థూల పదార్థంలో, అనగా భౌతికతలో మేధస్సు యొక్క బాహ్యకలాపానికి సంబంధించిన పనియంతటి యొక్క బాధ్యత పెద్దమెదడు పరిధిలో ఉంటుంది, అయితే స్థూల పదార్థత కంటే తేలికయైయున్న, ప్రకాశవంతమైయున్న, ఉన్నతం నుండి వచ్చే అనుభవాలను గ్రహించుట మరియు వాటిని విశ్లేషించుటకు తరలించుట చిన్నమెదడు పరిధిలో ఉంటుంది.

మనుష్యులకు ఉపయోగార్థం ఇవ్వబడిన రెండు మెదడులు అనుస్వరతతో పరస్పర సహకారంలో పనిచేసే ప్రక్రియ, మనుష్యులు ఏకపక్షంగా, కేవలం భౌతికసంబంధమైన కలాపానికి, అనగా స్థూలపదార్థ కలాపానికి మాత్రమే అంకితమగుటవల్ల ఆటంకపరచబడింది మరియు కాలక్రమేణా పూర్తిగా నిలిపివేయబడింది, నిజంగా ఊపిరిసలపనీయకుండా చేయబడింది. ఎందుకంటే పెద్దమెదడు, చిన్నమెదడుతో పోల్చినట్లైతే అమితమైన కలాపం ద్వారా కాలక్రమేణా తప్పనిసరిగా చాలా పెద్దగా పెరగవలసియుండింది. తద్వారా చిన్నమెదడు గ్రహణసామర్థ్యతను క్రమేణా ఇంకా ఎక్కువగా కోల్పోయింది మరియు బలహీనపడింది. దానితో వేలసంవత్సరాల క్రమంలో స్థూలపదార్థ ప్రజననం ద్వారా పారంపర్య-చెడు ఉద్భవించింది; ఎందుకంటే పిల్లలు కూడా పుట్టుకతోనే చిన్నమెదడుతో పోలిస్తే చాలా మెరుగుగా అభివృద్ధిచెందిన పెద్దమెదడును వెంటతెచ్చుకున్నారు. దానిలో పారంపర్య-పాపం మేల్కొనే అపాయం ఉన్నది. దానిద్వారా మనిషి మొదటినుండే, కేవలం భౌతికమైనదాని గురించి మాత్రమే, అనగా దేవునికి వెన్నుతిప్పి ఆలోచించుటకు నిర్బంధించబడతాడు, దానిలోనే ఆ పాపం ఉన్నది.

పట్టుదలతో ఆకాంక్షించే ప్రతిమనిషికి ఇదంతా సునాయాసంగా అర్థం చేసుకోగల్గునట్లు ఉంటుంది. అంతేగాక నేను దానిని నా సందేశంలో పలువివరాలతో అతిక్షుణ్ణంగా వివరించాను.

తన ఆత్మీయమైన మూలం కారణంగా మనిషి తన సంకల్పం ద్వారా భూమిపై ఉనికిలోవున్న ఇతరవాటిపై ప్రభావాన్ని చూపగలిగాడు. దాని ద్వారానే సమస్త చెడు భూమిపై ఉద్భవించింది. అయితే అదే సమయంలో అతడు సరిగ్గా అదే ఆత్మీయమైన మూలం ద్వారా, ఉద్ధరిస్తూ పనిచేయగలిగేవాడు మరియు పనిచేయవలసియుండెను; కాగా ప్రకృతికి అనుగుణంగా ఆత్మీయమైనది సమస్తమూ నాయకత్వాన్ని కలిగియున్న తదుపరి సృష్టిలో, అదే అతని అసలైన కర్తవ్యమైయుండింది మరియు ఉన్నది. అది ఉన్నతానికి నడిపించగలదు, అది సహజమైనదైయుండేది; అయితే అది, అదే విధంగా, ఒకవేళ ఆత్మికత యొక్క సంకల్పం భూలోకమనుష్యుల విషయంలో ఉన్నట్లు, ప్రధానంగా కేవలం భౌతికమైన దానిని మాత్రమే అకాంక్షించినట్లైతే, క్రిందివైపుకు కూడా నడిపించగలదు.

నా సందేశంలో నా ద్వారా ఇవ్వబడిన సృష్టిజ్ఞానంలో మరియు దానికి సంబందించిన స్వయంచాలకంగా సృష్టియందు పనిచేయుచున్న, మనం ప్రకృతి శాసనాలు అని కూడా పిలువగలిగే సమస్త శాసనాలను గురించిన వివరణలో, సృష్టి యొక్క నేతక్రమం సమస్తం కంతలు లేకుండా కనబడుతుంది; అది అన్ని ప్రక్రియలను స్పష్టంగా గుర్తించగలుగునట్లు చేస్తుంది, దానితో మానవ జీవితమంతటి యొక్క ఉద్దేశాన్ని సహితం. తిరుగులేని హేతుబద్ధతలో అది అతని యొక్క “ఎక్కడనుండి” మరియు “ఎక్కడికి” అనే అంశాలను విశదపరుస్తుంది.
అందువల్ల, మనిషి మనస్ఫూర్తిగా వెదికినట్లైతే, ప్రతి ప్రశ్నకు అది సమాధానం ఇస్తుంది.

అత్యంత చెడుసంకల్పంగల వ్యతిరేకులు సహితం ఇక్కడ నిలిచిపోవలసియుంటుంది, కాగా వారి కపటం, చెప్పబడిన దానియొక్క పరిపూర్ణమైన సంపూర్ణతలోనికి నశింపజేస్తూ చొచ్చుకొని పోగల్గుటకు, తద్వారా మనుష్యులనుండి ఈ సహాయాన్ని కూడా అపహరించుటకు సరిపోదు. —

సృష్టిలో కదలిక, ఒత్తిడి యొక్క ప్రారంభస్థానమైన ఆదివెలుగునుండి ఎంత ఎక్కువ దూరంలో ఏదైనా ఉంటుందో, అది తప్పక క్రమంగా అంతే నిదానం కావలసియుంటుందని నేను చెప్పియున్నాను. కాగా ఆదివెలుగు, ఒత్తిడి యొక్క ప్రారంభస్థానమైయున్నది మరియు ఒత్తిడి తన ప్రభావంలో కదలికను కలుగజేస్తుంది.

భూమి విషయంలో కూడా ప్రస్తుతం అదే విధంగా ఉన్నది. దాని పరిభ్రమణాలు మనుష్యుల పాపం ద్వారా క్రమంగా దూరమయ్యాయి; దానితో కదలికలు నిదానమౌతాయి, క్రమంగా మందగిస్తాయి, మరియు దానిద్వారా ఎన్నో విషయాలు ఇప్పటికే జడత్వం మొదలయ్యే స్థితికి దగ్గరలో ఉన్నవి.

జడత్వం కూడా ఎన్నో దశలను కలిగియున్నది; మొదట్లో అది అంత సులువుగా గుర్తించబడలేదు. అది అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా దానిని గుర్తించుట, ఒకసారి ఒక వెలుగు కిరణం అత్యంత తీక్షణంగా గమనించుటకు ప్రేరేపిస్తే తప్ప, అసంభవమైయుంటుంది.

అది ఎందుకు కష్టమైనదంటే, నిత్యం క్రమంగా నిదానమౌతున్న కదలికల క్షేత్రంలో జీవించే సమస్తం కూడా దానికి సమంగా పెరుగుతున్న దట్టతలోనికి లాగబడుతుంది, అది జడత్వానికి నడిపిస్తుంది. ఆ విషయం కేవలం మనిషి శరీరానికే పరిమితం కాదు కాని సమస్తానికి, అతని ఆలోచనకు కూడా వర్తిస్తుంది. అది అత్యంత చిన్న విషయాలపై కూడా ప్రభావాన్ని కలిగియుంటుంది. గమనిచబడలేకుండానే అన్ని భావనలు, స్వయంగా భాష యొక్క అసలైన అర్థం కూడా మారిపోతాయి మరియు వక్రీకారించబడతాయి.

స్వయంగా అతడు కూడా అదే నిదానమైన ప్రకంపనంలో కలిపిలాగబడతాడు, ఒకవేళ అతడు స్వయంగా తనలోనుండి బలమైన సంకల్పంతో మరియు మొండిపట్టుతో ఆత్మీయంగా మరియొకసారి ఉన్నతమునకు ఆరోహించుటకు ప్రయత్నించనట్లైతే, తద్వారా వెలుగునకు తిరిగి కొంతచేరువగా వచ్చుటకు. దాని ద్వారా అతని ఆత్మ క్రమంగా మరింత గమనశీలమౌతుంది మరియు దానితోపాటు తేలికగా, ప్రకాశవంతంగా మారి భూలోక గుర్తింపుపై ప్రభావాన్ని చూపుతుంది.

అయితే అప్పుడతడు భయభీతిలో నిశ్చేష్టుడై చూస్తాడు లేక కనీసం అంతఃకరణానుభూతిని పొందుతాడు, ఈ భూమిపై సమస్త భావనల వక్రీకరణాలు జడత్వంలో ఇప్పటికే ఎంతగా అభివృద్ధి చెందియున్నాయో. వాస్తవస్థితిని గురించిన దూరచూపు లోపించింది, ఎందుకంటే సమస్తం ఇరుకైన, గూఢమైన హద్దులలో జొప్పించబడియున్నది. వాటిలోనికి చొచ్చుకొనిపోవుట ఇకపై అసంభవమైయుంటుంది మరియు అవి ఒక నిర్దిష్టమైన కాలంలో, అవి పరివేష్టించియున్న వాటన్నింటికీ తప్పక ఊపిరాడకుండా చేస్తాయి.

తరచుగా నేను ఇప్పటికే వక్రీకరించబడిన భావనలను సూచించియున్నాను; ఇప్పుడైతే అవి వెలుగునుండి నిరంతరం దూరమగుట ద్వారా నెమ్మదిగా అధోముఖంగా పోయే మార్గంపైన జడత్వానికి వస్తున్నాయి.

నిర్దిష్టమైన ఉదాహరణలు ఇవ్వనవసరం లేదు; మనిషి అటువంటి వివరణలను అసలు లెక్కచేయబోడు లేక వాటిని విసిగించే మాయమాటలుగా వర్ణిస్తాడు, ఎందుకంటే మనిషి క్షుణ్ణంగా దానిగురించి ఆలోచించగోరుటకు చాలా స్తబ్ధుడు లేక చాలా సోమరివాడైయున్నాడు.

నేను ఇప్పటికే మాట యొక్క శక్తిని గురించి మరియు మనుష్యుని మాట కూడా భూమి యొక్క క్షేత్రంలో సృష్టికార్యంపై కొంతకాలంవరకు క్రియాత్మకంగా లేక విధ్వంసకరంగా పనిచేయగలదనే మర్మమును గురించి తగినంతగా మాట్లాడియున్నాను. ఎందుకంటే, శబ్దము, స్వరము మరియు పదము యొక్క కూర్పు ద్వారా సృష్టిశక్తులు కదిలించబడతాయి. అవి వ్యాఖ్యాత యొక్క భావం ప్రకారం కాదు కాని పదం యొక్క అర్థంలోని భావం ప్రకారం పనిచేస్తాయి.

అయితే అర్థం, పదం కదలికలోనికి తెచ్చే శక్తుల ద్వారా ఒకానొకప్పుడు ఇవ్వబడింది, మరియు అవి తద్వారా ఖచ్చితంగా, సరియైన భావంతో సంతనచేయబడియుంటాయి లేక ఆ భావం వాటితో సంతనచేయబడియుంటుంది, కాని వ్యాఖ్యాత యొక్క సంకల్పంతో కాదు. భావము మరియు పదము అనుగుణమైన శక్తుల కదలిక ద్వారా ఉద్భవించినవి, అందువల్ల అవి విడదీయలేకుండా ఒకటైయున్నవి!

మానవుని ఆలోచన మరల వేరే శక్తిప్రవాహాలను కదిలిస్తుంది. అవి ఆలోచన యొక్క భావానికి అనుగుణంగా ఉంటాయి. అందువల్ల మనిషి తన ఆలోచనలను వ్యక్తపరచుటకు
సరియైన పదాలను వాడుటకు ప్రయత్నించవలెను, అట్లు చేయునప్పుడు సరిగా మరియు స్పష్టంగా అంతఃకరణానుభూతిని పొందుటకు.

ఒక మనిషి, దేని గురించి అతడు వినియున్నాడో, బహుశా ఒక భాగాన్ని చూడగలిగాడో దాని గురించి ప్రశ్నించబడ్డాడని మనం అనుకొందాం. ప్రశ్నించబడినప్పుడు అతడు తడుముకోకుండా చెప్పవచ్చు, అది తనకు తెలియునని!

చాలామంది పైపైతత్వంగల మనుష్యుల అభిప్రాయం ప్రకారం ఈ జవాబు సరియైనది కావచ్చు, అయితే నిజానికి అది తప్పు మరియు తృణీకారయోగ్యమైయున్నది; కాగా “జ్ఞానము” అంటే అంతటి గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వగల్గుట, ఆదినుండి అంతమువరకు, ప్రతియొక్క వివరమును, కంతలేకుండా మరియు స్వయానుభవంలోనుండి ఇవ్వగల్గుట. అప్పుడు మాత్రమే మనిషి, తనకు తెలియునని అనవచ్చు.

“జ్ఞానము” అనే పదంలో మరియు దానితో జోడించబడియున్న భావంలో ఒక గొప్ప బాధ్యత ఉన్నది!

నేను ఇప్పటికే ఒకసారి “జ్ఞానము” మధ్య మరియు “నేర్చుకొనబడిన” దాని మధ్య గల గొప్ప బేధాన్ని సూచించియున్నాను. పాండిత్యము వాస్తవానికి నిజమైన జ్ఞానము కాదు, జ్ఞానము వ్యక్తిగతమైన దానిగా మాత్రమే ఉండగలదు. మరొక ప్రక్క నేర్చుకొనబడినది, వ్యక్తిగతానికి వెలుపల ఉంటూ కేవలం అంగీకరించబడినదై మాత్రమే ఉంటుంది.

కొంత వినుట మరియు కొంత భాగాన్ని బహుశా చూచుట కూడా వాస్తవానికి జ్ఞానము కాదు! మనిషి నాకు తెలియును అని ఉద్ఘాటించరాదు కాని సరిగా చెప్పాలంటే, నేను దాని గురించి విన్నాను లేక చూశాను అని మాత్రమే అనవచ్చు. అయితే అతడు సరిగా చేయాలనుకొన్నట్లైతే, సత్యం ప్రకారం: నాకు తెలియదు అని చెప్పుటకు బాధ్యుడైయున్నాడు!

తనకు సంబంధం లేని దేనిగురించైనా, అనగా ఏదైతే అతనికి నిజమైన జ్ఞానమై ఉండదో దాని గురించి ఏదైనా నివేదించుటకన్నా ఇది అన్నివిధాలా సరిగా చేయబడినదైయుంటుంది. అదే సమయంలో అతడు అసంపూర్ణమైన నివేదికల ద్వారా ఇతర మనుష్యులను అనుమానితులను చేస్తాడు లేక వారిపై నేరభారాన్ని వేయవచ్చు, పైగా అసలైన వివరాలను ఎరుగకుండానే బహుశా వారిని దురదృష్టానికి గురిచేయవచ్చు. అందువల్ల మీరు వాడదలచుకొన్న ప్రతి మాటను మీ అంతఃకరణానుభూతి ద్వారా జాగ్రత్తగా తూచండి.

ఎవడు లోతుగా ఆలోచిస్తాడో, నోటితుత్తరతోకూడిన డాబునకు మరియు చెడుసంకల్పానికి, ఇప్పటికే స్తంభించిపోయిన భావనలను స్వంతసాకుగా పరిగణించి తనను తృప్తిపరచుకోలేడో, వాడు ఈ వివరణలను తేలికగా అర్థం చేసుకొంటాడు మరియు నిశ్శబ్ద పరీక్షలో తాను మాట్లాడే వాటన్నింటిలో ముందుచూపును నేర్చుకొంటాడు.

అటువంటి కుంచించబడిన వ్యక్తీకరణలు లెక్కలేనన్ని ఇప్పటికే తమ వినాశకరమైన ఫలితాలతో భూలోక మనుష్యుల అలవాటుగా మారినవి. అవి మేధస్సు యొక్క బానిసల ద్వారా ఆశతో లాగుకొనబడతాయి మరియు ప్రోత్సాహించబడతాయి. వారు లూసీఫరుని అత్యంత దట్టమైన చీకటి ప్రభావాల యొక్క అత్యంత ఇచ్ఛాపూర్వకులైన అనుచరులైయుంటారు.

ఈ సృష్టిలోని ప్రవాహాలను జాగ్రత్తగా గమనించుటకు మరియు సరిగా వాడుటకు నేర్చుకోండి. అవి తమయందు దేవుని చిత్తమును, దానితోపాటు స్వచ్ఛమైన రూపంలో దేవుని న్యాయాన్ని కలిగియున్నాయి. అప్పుడు మీరు మీనుండి బలవంతంగా లాగుకొనబడిన నిజమైన మానవత్వాన్ని కూడా తిరిగి కనుగొంటారు.

ఎంత ఎక్కువ శ్రమ తద్వారా నివారించబడబోతుందో మరియు మనుష్యులలో ఎంతమంది చెడును కాంక్షించే వారికి తమ కార్యములను చేయుటకు అవకాశం తొలగించబడుతుందో.

ఈ చెడు కారణంవల్లనే దైవకుమారుడైన యేసుని భౌతికజీవితం యొక్క వర్ణన, కొన్ని అంశాలలో వాస్తవాలకు అనుగుణంగా లేదు. దానిలోనుండి కాలక్రమేణా నేటివరకు మనుష్యుల ఆలోచనప్రక్రియలో ఒక పూర్తిగా తప్పైన చిత్రం ఉద్భవించింది. అదే విధంగా ఆయన ద్వారా ఇవ్వబడిన మాటలు, మతంగా చేయబడిన అన్ని బోధల విషయంలో జరిగినట్లే, వక్రీకరించబడినవి. ఆ బోధలు మనుష్యులకు ఔన్నత్యమును మరియు ఆత్మ యొక్క సంపూర్ణతను తేవలసియుండింది.

మరియు మనుష్యులందరిలోవున్న అయోమయం దానిలోనే ఉన్నది. క్రమంగా వారు ఇంకా తక్కువగా ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకోగలరు. అది అశాంతిని, అనుమానమును, అపనిందలను, అసూయను, ద్వేషమును పెరుగునట్లు మరియు వికసించునట్లు చేస్తుంది.

అవియన్నియూ భూమిపై పురోగమించుచున్న జడత్వానికి సందేహంలేని చిహ్నాలు!

మీ ఆత్మను ఉన్నతమునకు ప్రోత్సాహించండి, దూరదృష్టితో మరియు సర్వతోముఖంగా ఆలోచించుటకు మరియు మాట్లాడుటకు మొదలుపెట్టండి! సహజంగా దానికి షరతు
ఏమనగా, మీరు కేవలం అత్యంత స్థూలపదార్థతకు చెందిన మేధస్సుతో మాత్రమే పనిచేయకూడదు, కాని మీ ఆత్మకు కూడా మీ మేధస్సును నడిపించుటకు ఆ అవకాశాలను తిరిగి ఇవ్వవలెను; మీ సృష్టికర్త యొక్క నిర్ణయం ప్రకారంగా మేధస్సు ఆత్మను సేవించవలెను; ఆయన మిమ్ములను ఈ భూమిపై మొదటినుండి వక్రీకరించబడకుండా ఉద్భవింపజేశాడు.

చాలా విషయాలు ఇప్పటికే జడత్వం యొక్క మొదటి స్థితిలో ఉన్నాయి. త్వరలో మీ సమస్త అలోచన కూడా దాని ద్వారా పట్టివేయబడవచ్చు మరియు అది తప్పనిసరిగా దృఢమైన, ఇనుప కాలువల ద్వారా ప్రవహించవలసియుంటుంది. అవి మీకు స్వయంగా కేవలం అసౌకర్యాన్ని, శ్రమ వెంట శ్రమను మాత్రమే కలుగజేస్తాయి, మరియు మిమ్ములను చివరకు మానవత్వం నుండి దిగజార్చి, సమస్త వెలుగునుండి చాలా దూరంలో, కేవలం చీకటిని మాత్రమే సేవించుచున్న అర్థరహితమైన యంత్రంగా చేస్తాయి.