కొ]{.Initial}న్ని మినహాయింపులు తప్ప మనుష్యులు ఒక అవధులు లేని మరియు వారికి చాలా ప్రమాదకరమైన భ్రమలో ఉన్నారు!
దేవునికి వారి వెనుక పరిగెత్తుటకు మరియు వారిని తన ఉనికిని నమ్మవలెనని అర్థించుటకు అవసరం లేదు. ఆయన సేవకులు కూడా, ఎట్టి పరిస్థితులలో ఆయననుండి వెనుదిరుగవద్దని ఎల్లప్పుడు బుద్ధిచెప్పుటకు పంపబడలేదు. అట్లు ఆలోచించుట మరియు అటువంటి దానికొరకు ఎదురు చూచుట, ఉదాత్తమైన దైవతను అవమూల్యంచేయుట మరియు అధోగతికిలాగుటయే.
ఆ తప్పుడు భావన గొప్ప నష్టాన్ని కలుగజేస్తుంది. అది చాలామంది నిజంగా పట్టుదలగల ఆత్మకాపరుల ప్రవర్తన ద్వారా పోషించబడుతుంది. వారు దేవునిపట్ల మరియు మనుష్యులపట్ల నిజమైన ప్రేమతో పదే పదే ప్రయత్నిస్తారు, కేవలం లౌకికమైన వాటిలో మాత్రమే నిమగ్నమైయున్న మనుష్యులను మార్చుటకు, వారిని ఒప్పించుటకు మరియు చర్చికొరకు వారిని గెలుచుకొనుటకు. ఇదంతా, ఇప్పటికే ఎక్కువ మోతాదులోవున్న మనిషి యొక్క ప్రాముఖ్యతను గురించిన అతిశయాన్ని లెక్కలేనంతగా పెంచుటకు మరియు చాలామందిని చివరకు, మంచిని ఆశించుటకు, తాము బ్రతిమాలబడాలనే భ్రమలో వాస్తవంగా ఉంచుటకు దారితీస్తుంది.
“విశ్వాసులలో” అదిక సంఖ్యాకుల యొక్క విచిత్రమైన వైఖరిని కూడా ఇదే కలుగజేస్తుంది, వారు బెదరగొట్టే ఉదాహరణలుగానే ఉంటారు కాని అనుసారయోగ్యులుగా ఉండరు. వేలకువేలమంది, తాము దేవుణ్ణి నమ్ముతున్నాము, తమ ప్రార్థనలను తమకు సాధ్యమైనంత పట్టుదలతో చేయుచున్నాము, తమ పొరుగువారికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించము అనే స్పృహలో ఒక విధమైన సంతృప్తిని, ఉన్నతిని అనుభవిస్తుంటారు.
ఈ ఆంతరంగిక “ఉన్నతిలో” వారు మంచికి బహుమానంగా ఒక విధమైన ప్రతిఫలాన్ని పొందుతున్నామనే అనుభూతిని, వారి విధేయతకు దేవునినుండి కృతజ్ఞతను పొందుతున్నామనే అనుభూతిని, దేవునితో అనుసంధానం చేయబడియున్నట్లు అనుభూతిని పొందుతుంటారు, అప్పుడప్పుడు ఒక విధమైన శుద్ధమైన పులకరింతతో కూడా ఆయనను గుర్తుచేసుకొంటారు, అది పరమానందానుభూతిని కలుగజేస్తుంది లేక మిగుల్చుతుంది, దానిని వారు సంతోషంతో అనుభవిస్తారు.
కాని ఈ విశ్వాసుల గుంపులు తప్పుదారిలో పోతున్నాయి. వారు తాము స్వయంగా సృష్టించుకొన్న భ్రమలో సంతోషంగా జీవిస్తున్నారు. ఆ భ్రమ వారిని, వారికి తెలియకుండానే, వారు వాస్తవంగా కలిగియున్న, కాని పొరపాటుతో కూడిన కృతజ్ఞతాభావాలతో “ప్రభువా, నేను వారివలే లేనందుకు నీకు వందనాలు” అనే చిన్న అర్పణమును తెచ్చే పరిసయ్యుల క్రింద లెక్కింపజేస్తుంది. అది ఉచ్చరించబడదు, నిజంగా ఆలోచించబడదు కూడా, కాని వారి అంతరంగంలోని ఆ “ఉన్నతమైన భావన”, క్రీస్తు కూడా ఆనాడే తప్పైన దానిగా పరిగణించిన స్పృహతో ఆలోచించబడని కృతజ్ఞతప్రార్థన తప్ప ఇంకామీ కాదు.
ఆ ఆంతరంగిక “ఉన్నతమైన భావన” ఈ సందర్భాలలో ప్రార్థన లేక ఉద్దేశపూర్వకమైన మంచి ఆలోచనల ద్వారా పుట్టించబడిన స్వీయసంతృప్తి తప్ప ఇంకేమీ కాదు. తమను విధేయులనుగా పిలుచుకొనేవారు తరచుగా నిజంగా అణుకువగా ఉండుటనుండి చాలా దూరంలో ఉంటారు! అటువంటి విశ్వాసులతో మాట్లాడుటకు తరచుగా నిగ్రహం అవసరమౌతుంది. ఆ విధమైన మనస్తత్వంతో వారు ఎప్పటికీ మరియు ఏనాటికీ, తాము ఇప్పటికే ఖచ్చితంగా కలిగియున్నామని భావించే మోక్షాన్ని పొందలేరు! వారు విధేయతగా పరిగణించే తమ ఆత్మీయ అహంకారంలో, పూర్తిగా తప్పిపోకుండా ఉండుటకు జాగ్రత్తపడాలి.
ఇప్పుడు ఇంకా పూర్తిగా అవిశ్వాసులౌయున్న వారిలో చాలామందికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట, తమ అతిశయపూర్వకమైన అణకువతో, తమ ప్రార్థనలకొరకు మరియు భక్తిపూర్వకమైన మాటలకొరకు ఆయన వారికి ప్రతిఫలం ఇవ్వవలెనని, నిజానికి సరళంగా అర్థిస్తూ కాదు కాని పరోక్షంగా అపేక్షిస్తూ దేవుని ఎదుట నిలిచే గుంపులకంటే సులభమై ఉంటుంది. వారి అర్థనలు అపేక్షలైయున్నవి, వారి స్వభావం వంచనయైయున్నది. ఆయన వదనం ఎదుటినుండి వారు ఖాళీ పొట్టువలే చెదరగొట్టబడతారు. వారికి ప్రతిఫలం ఖచ్చితంగా కలుగుతుంది, కాని వారు అనుకొన్నదానికి వేరుగా. వారు భూమిపై తమ వ్యక్తిగత మూల్యం యొక్క స్పృహలో తమను ఇప్పటికే తగినంతగా సంతృప్తి పరచుకొన్నారు.
ఆ సుఖ-భావన సూక్ష్మపదార్థ లోకంలో ప్రవేశించుటతో త్వరలోనే అంతరిస్తుంది; దానిలో ఇక్కడ ఏమాత్రమూ తెలియని అంతఃకరణానుభూతి ఉద్భవిస్తుంది, అదే సమయంలో ఇప్పటివరకు ప్రధానంగా కేవలం ఆలోచనల ద్వారా కలుగజేయబడ్డ అనుభూతి శూన్యంలోనికి చెదరగొట్టబడుతుంది.
ఆ ఆంతరంగిక, మౌనమైన, మెరుగైన దానికొరకు సందేహాస్పదమైన అణుకువతోకూడిన ఎదురుచూపు నిజానికి అపేక్షయే తప్ప ఇంకేమీ కాదు, అది ఎంత అందమైన మాటలతో వేరొక విధంగా వ్యక్తీకరించబడినా కాని.
అయితే ప్రతి అపేక్ష అహంకారమైయున్నది. దేవుడొక్కడే అపేక్షించాలి! క్రీస్తు కూడా తన సందేశంతో మనుష్యుల వద్దకు అర్థిస్తూ రాలేదు, కాని హెచ్చరిస్తూ మరియు అపేక్షిస్తూ వచ్చాడు. ఆయన నిజంగా సత్యాన్ని గురించి వివరణలు ఇచ్చాడు, కాని వినేవారి కళ్లయెదుట ప్రలోభపెడుతూ బహుమతులను ఉంచలేదు, వాటిద్వారా వారికి మెరుగు పడుటకు స్పూర్థినిచ్చుటకు. ఆయన పట్టుదలతో అన్వేషించు వారిని ప్రశాంతంగా మరియు తీక్షణంగా శాసించాడు: “వెళ్లండి మరియు ఆ విధంగా చేయండి!” అని.
అపేక్షిస్తూ దేవుడు మానవాళి ఎదుట నిలిచియున్నాడు, ప్రలోభపెడుతూ మరియు అర్థిస్తూ కాదు, ఆరోపిస్తూ మరియు దుఃఖపడుతూ కాదు. ప్రశాంతంగా ఆయన చెడ్డవారినందిరిని, నిలకడలేని వారినందరిని సహితం, చీకటికి వదిలివేస్తాడు, తద్వారా ఆరోహించుటకు శ్రమించేవారిని ఇకపై వారి దాడులకు గురిచేయబడకుండా ఉంచుటకు మరియు ఆ ఇతరులను వారు సరియైనదిగా పరిగణించే దానినంతటినీ లోతుగా అనుభవింపజేయుటకు, ఆ విధంగా వారు తమ తప్పును గుర్తించుటకు!