క్రీస్తువిరోధి

నుష్యులారా!దైవచిత్తం ప్రకారం శుద్ధీకరణ మరియు వేర్పాటు ప్రక్రియలు భూమిపై తప్పక జరగవలసిన ఘడియ వచ్చినప్పుడు,మీకు ప్రవచింపబడిన,పాక్షికంగా లోకాతీతమైన సూచనలను ఆకాశంలో గమనించండి!

క్రీస్తువిరోధికి ఇప్పటికే చాలాకాలంనుండి లొంగిపోయిన మనుష్యుల ద్వారా మరియు చర్చిల ద్వారా కూడా మిమ్ములను అప్పుడు కలవరపెట్టనీయకండి. ఇప్పటివరకు కనీసం చర్చిలు కూడా ఎప్పటినుండో మనుష్యుల మధ్య పనిచేయుచున్న క్రీస్తువిరోధిని ఎక్కడ వెదకవలెనో ఎరుగకుండుట శోచనీయం. కొద్దిగా ఆప్రమత్తతో ఉండినట్లైతే అవి దానిని తప్పక గుర్తించియుండేవి! ఆనాడు స్వయంగా క్రీస్తుతోనే పోరాడిన మరియు తుదకు హత్యచేసిన వారికంటే ఎక్కువగా ఎవరు క్రీస్తుకు విరోధంగా పనిచేయగలరు! అంతకంటే అధ్వానంగా మరియు స్పష్టంగా ఎవరు తమను క్రీస్తువిరోధులనుగా కనబరచుకొనగలరు.

వారు భూలోక మతనాయకులు మరియు మతప్రతినిధులైయుండినారు; దైవకుమారునిలోవున్న మరియు ఆయన ద్వారా బోధించబడిన సత్యపూర్ణమైన దైవబోధ, వారు నిర్మించిన వ్యవస్థలో ఇముడలేదు. సత్యపూర్ణమైన దైవసందేశము దానికి అనుగుణంగా ఉండలేదు కదా, ఎందుకంటే భూలోక మతపెద్దలు నిర్మించిన ఆ వ్యవస్థకు భూలోక ప్రభావం, భూలోక అధికారము మరియు విస్తరణలే లక్ష్యంగా ఉండినవి.

వారు మానవమేధస్సు యొక్క దాసులైయుండినారని దానితో వారు అతి స్పష్టంగా నిరూపించారు. ఆ మేధస్సు కేవలం భూలోక జ్ఞానాన్ని, భూలోక అధికారాన్ని లక్ష్యంగా కలిగియున్నది మరియు భూలోక అవగాహనకు ఆవలవున్న వాటినన్నింటిని శత్రుత్వంతో ఎదిరిస్తూ, ఆటంకపరుస్తూ నిలిచియున్నది! దేవుడు మరియు అదే విధంగా ఆత్మికత కూడా, భూలోకమేధస్సు యొక్క జ్ఞానానికి పూర్తిగా ఆవల ఉన్నందున ఆ ఇషయంలో నిజంగా ఆటంకపరచేది వాస్తవానికి మేధస్సు ఒక్కటే! అందువల్ల అది తన స్వభావంలో దైవికమైన సమస్తానికి మరియు ఆత్మీయమైన సమస్తానికి విరోధియైయున్నది! మరియు అందువల్ల తార్కికంగా దానితో పాటు తమ మేధస్సును అన్నింటికంటే అగ్రమైన దానిగా మరియు అత్యున్నతమైన దానిగా గుర్తించే మనుష్యులందరు కేవలం దానిపై మాత్రమే కట్టడానికి ప్రయత్నిస్తారు!

ఆనాటి మతపెద్దలు దైవకుమారుని యొక్క జ్ఞానోదయ బోధ ద్వారా ప్రజలలో తమ ఆధిపత్యాన్ని కోల్పోతామని భయపడ్డారు. నేడు అందరూ ఎరిగినట్లుగా, వారు క్రీస్తుకు వ్యతిరేకంగా వ్యాపింపజేయుటకు ప్రయత్నించిన అపనిందలకూ మరియు తుదకు దైవకుమారున్ని అంతమొందించుటకు కూడా, అదే ముఖ్యమైన కారణమైయుండింది. ఏ దేవుని ద్వారా ఆయన జ్ఞానోదయాన్ని కలిగించుటకు పంపబడ్డాడో, ఎవరి దాసులమని వారు తమను గురించి చెప్పుకున్నారో, అదే దేవుని దూషకునిగా వారు ఆయనను సిలువవేశారు!

నిజానికి వారు దేవున్ని మరియు ఆయన చిత్తాన్ని అంత తక్కువగా ఎరిగియుండినారు. తాము ఆయనను సేవిస్తున్నట్లు వారు మనుష్యులను నమ్మింపగోరారు, కాని ఆయన గౌరవార్థం, ఆయన యొక్క భూలోక రక్షణార్థం ఆ దైవకుమారున్ని, దైవప్రేషితున్ని … హత్యచేశారు!

కేవలం తన ఆధిపత్యానికై ఆ విధంగా పోరాడే తమ మేధస్సుకు వారు బానిసలగుట యొక్క అనర్థదాయకమైన ఫలితం దానితో విదితమైనది. ఎవరికైతే వారు తమలో మౌనంగా ఒక సింహాసనాన్ని ఏర్పాటుచేశారో ఆ క్రీస్తువిరోధి యొక్క మరణ సాధనాలుగా వారు తమను చేసుకొన్నారు. కాగా దానిలో వారు మిడిసిపాటుతనం, ఉద్ధతి, అహంకారం వంటి మనుష్య బలహీనతల సంతృప్తిని పొందారు.

ఎవడు ఇంతకంటే స్పష్టమైన సాక్ష్యము కొరకు నిరీక్షిస్తాడో, వానికి సహాయం చేయబడజాలదు; కాగా క్రీస్తుకు, ఆ దైవకుమారునికి మరియు ఆయన మాటలకు, అంతకంటే వ్యతిరేకమైనది ఏదియూ లేదు! మరి క్రిస్తువిరోధి అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడేవాడు, దైవసందేశంలోని మానవవిమోచనకు విరోధి అనే కదా అర్థం. భూలోక మేధస్సు వారిని దానికి పురికొల్పింది! సరిగ్గా ఇదే, విషపూరితమైన లూసీఫరుని ఉత్పాదకం రూపంలో, అతనికి ఒక సాధనమైయున్నది! అది మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారింది!

అందువల్ల మానవమేధస్సును ఒకప్పుడు అననుపాతంగా చాలా పెద్దగా పెంచుట మానవులకు వారసత్వ పాపంగా ఎదిగింది! కాని దానివెనుక లూసీఫరే స్వయంగా క్రీస్తువిరోధిగా వ్యక్తిగతంగా నిలిచియున్నాడు! అతడే మనుష్యుల ద్వారా తన శిరస్సును ఎత్తగలిగాడు! అతడే, ఒకే ఒక్క నిజమైన దైవశత్రువు! క్రీస్తువిరోధి అను నామమును అతడు దైవకుమారుని సద్భావన కార్యానికి వ్యతిరేకంగా శత్రుత్వంతో పోరాడుట ద్వారా పొందియున్నాడు. వేరొకడెవడూ కూడా క్రీస్తువిరోధి అగుటకు కావలసిన ఆ శక్తిని కాని మరియు బలాన్ని కాని కలిగియుండలేడు.

మరియు లూసీఫరు, భూమిపై దైవచిత్తానికి వ్యతిరేకంగా చేసే తన పోరాటంలో కేవలం ఎదో ఒక్క మనిషిని మాత్రమే ఉపయోగించుకోడు కాని దాదాపు మానవాళి మొత్తాన్ని ఉపయోగించుకుంటాడు. తద్వారా అతడు దానిని దైవక్రోధం యొక్క ప్రభావంవల్ల కలిగే వినాశానికి కూడా నడిపిస్తాడు! లూసీఫరు మాత్రమే స్వయంగా క్రీస్తువిరోధియై ఉండగలిగాడు, అతడే దేవునికి వ్యతిరేకంగా నిలుచుటకు ధైర్యంచేస్తాడు, అనే అత్యంత సాధారణమైన విషయాన్ని ఎవడైతే గ్రహించలేడో, వానికి స్థూలపదర్థలోకానికి ఆవల, అనగా పుర్తిగా భౌతిక సంబంధమైన దానికి ఆవల జరుగుతున్న దానియంతటిలోనుండి దేనిని కూడా అర్థంచేసుకొనుటకు ఏనాటికీ అవకాశం ఉండదు.

ఆనాడు ఏ విధంగా ఉండిందో, అదే విధంగా నేడు కూడా ఇంకా ఉన్నది! వాస్తవానికి మరింత అధ్వానంగా ఉన్నది. ఈనాడు కూడా చాలామంది మతప్రతినిధులు, ఇప్పటివరకు ఆలయాలలో మరియు చర్చిలలో అమలుచేసిన భూలోక మేధస్సు-నియమాలను కొనసాగించుటకు పూర్తి తెగింపుతో పోరాడగోరతారు.

ఉత్తమమైన సమస్త అంతఃకరణానుభూతిని సంకుచితపరచే సరిగ్గా ఇదే మానవమేధస్సు లూసీఫరు పెంచిన వాటిలో అత్యంత కపటతంత్రము గలది; దానిని అతడు మానవులలో వ్యాప్తిచేయగలిగాడు. అయితే మేధస్సు యొక్క బానిసలందరు నిజానికి లూసీఫరుని సేవకులే. వారు తద్వారా కలిగే మానవాళి యొక్క అనివార్యమైన, భయంకరమైన పతనంలో సహనేరస్తులైయున్నారు!

ఏ మనిషి కూడా క్రీస్తువిరోధిని మేధస్సు వెనుక వెదకకపోవడంవల్ల అతని భీతిగొల్పే వ్యాప్తి ఎంతో సులువయ్యింది! లూసీఫరు గెలిచాడు, ఎందుకంటే తద్వారా అతడు మానవాళిని పదార్థలోకానికి ఆవల ఉన్నదానంతటి యొక్క ప్రతివిధమైన అవగాహననుండి తెంచివేశాడు. నిజమైన జీవితంనుండి! దేవుని యొద్దకు నడిపించే ఆత్మికతతో ఏ స్థానంనుండి స్పర్శ మొదలౌతుందో, ఆ స్థానంనుండి.

తద్వారా అతడు భూమి యొక్క మరియు మానవాళిలో అధికభాగం యొక్క యజమానిగా తన పాదాన్ని ఈ భూమిపై మోపాడు!

అందువల్ల, అతడు ఆరాధనాపీఠములవరకు చొచ్చుకొనిపోగల్గుట మరియు భూలోక మతప్రతినిధులు, క్రైస్తవ చర్చిలకు చెందిన ప్రతినిధులు కూడా అతనికి తప్పక బలియగుట, ఆశ్చర్యకరమైనదేమీ కాదు. క్రీస్తువిరోధి కొరకు వారు కూడా ప్రవచించబడిన తీర్పుకు ముందు మాత్రమే అతడు వస్తాడని ప్రతీక్షించుచున్నారు. బైబిలులోని గొప్ప ప్రకటన ఈ అంశంలో చాలా ఇతర విషయాలవలే ఇంతవరకు అర్థం చేసుకొనబడలేదు.

ఆ ప్రకటన, ఈ క్రీస్తువిరోధి తీర్పుకు ముందు తన శిరస్సును ఎత్తబోతాడని చెబుతుందే కాని అతడు అప్పుడు వస్తాడని కాదు! అతడు తన శిరస్సును ఎత్తుతాడని అక్కడ చెప్పబడియున్నప్పుడు, అతడు అప్పటికే అక్కడ తప్పక ఉండియుంటాడని అది సూచిస్తుందే కాని అతడు అప్పుడు వస్తాడని కాదు కదా. సరిగ్గా తీర్పుకు ముందు అతడు తన ఆధిపత్యం యొక్క అత్యున్నతస్థాయిని కలిగియుండబోతాడని తద్వారా చెప్పబడియున్నది!

మీరు, ఎవరైతే ఆత్మీయంగా ఇంకా చెవిటివారు మరియు గ్రుడ్డివారు కాలేదో, ఈ హెచ్చరికను ఆలకించండి! ఒక్కసారి స్వయంగా సంపూర్ణ ఏకాగ్రతతో ఆలోచించుటకు కృషిచేయండి. ఆ విషయంలో మీరు ఇకపై కూడా బద్దకస్తులుగా కొనసాగినట్లైటే, మిమ్మును మీరు కోల్పోయినవారిగా చేసుకొంటారు!

ఎప్పుడైతే మనిషి ఒక విషసర్పం యొక్క స్థావరాన్ని రక్షించే కప్పును తొలగిస్తాడో మరియు ఎప్పుడది తద్వారా తాను అకస్మాత్తుగా బట్టబయలైనట్లు గమనిస్తుందో, అప్పుడది సహజంగా ఆ కఠినమైన చేతిని కరుచుటకు దానివైపు ఎగురుటకు ప్రయత్నిస్తుంది.

ఇక్కడ కూడా వేరుగా లేదు. తాను బట్టబయలైనట్లు చూసిన క్రీస్తువిరోధి త్వరగా తన సేవకుల ద్వారా నిరసనను తెలుపుతాడు, వేషం తొలగించబడుతున్నప్పుడు కేకలు వేస్తాడు మరియు తనకు మానవులు ఇష్టపూర్వకంగా అందించిన సింహాసనంపై తనను నిలుపుకొనుటకు సాధ్యమైనవన్నీ చేయుటకు ప్రయత్నిస్తాడు. కాని వాటన్నింటినీ అతడు, అతన్ని తమయందు గౌరవించేవారి ద్వారా మాత్రమే చేయగలడు.

అందువల్ల ఆ యుద్ధం మొదలైనప్పుడు ఇకపై నిశితంగా మీ పరిసరాన్ని గమనించండి! సరిగ్గా వారి కేకల ద్వారానే వారిని మీరు అతి ఖచ్చితంగా గుర్తిస్తారు, అతనికి చెందిన ప్రతి ఒక్కడినీ కూడా! ఎందుకంటే వీరు స్వచ్ఛమైన నిజానికి భయపడి ఒకప్పటిలాగే మరల దాని వ్యతిరేకులుగా మారుతారు!

క్రీస్తువిరోధి మరల ప్రయత్నిస్తాడు, భూమిపై తన ఆధిపత్యాన్ని తెగింపుతో నిలుపుకొనుటకు. ప్రతి ఘటనలోనూ మరియు దాడిలోనూ అతని అసంబద్ధతను గమనించండి; కాగా అతడు మరల అపనిందలతో మరియు సందేహాస్పదంగా మాత్రమే పనిచేస్తాడు, ఎందుకంటే అతని అనుచరులు ఏ ఇతర దానినీ చేయుటకు అనర్హులు. సత్యం ఎదుట నిలుచుట మరియు దానిని ఖండించుట అసాధ్యమైనది.

ఆ విధంగా లూసీఫరుని సేవకులు దైవప్రేషకునితో కూడా పొరాడతారు, సరిగ్గా వారు ఒకనాడు దైవకుమారునితో పోరాడినట్లు!

ఎక్కడ అటువంటి ప్రయత్నం జరుగుతుందో, అక్కడ జాగ్రత్తగా ఉండండి; కాగా అటువంటి మనుష్యులు దానితో కేవలం లూసీఫరును కాపాడవలెనని కాంక్షిస్తారు, తద్వారా భూమిపై అతని ఆధిపత్యాన్ని నిలబెట్టుటకు. అక్కడ మనుష్యులు బాహ్యంగా తెల్లని భౌతికవస్త్రాలను ధరించుటను పాటిస్తున్నా, వారు ఒక చర్చి యొక్క సేవకులైనా కూడా, అక్కడే చీకటి యొక్క కేంద్రం ఉంటుంది.

దైవకుమారుని భూలోకకాలంలో జరిగిన దానిని మీరు మరువవద్దు, కాని ఆలోచించండి, నేడు కూడా అదే క్రీస్తువిరోధి ఇంకా చాలా ఎక్కువమంది మానవ అనుచరులతో ప్రయాసపడుతున్నాడు, భూలోక ఆధిపత్యాన్ని నిలబెట్టుకొనుటకు, నాశనంనుండి తప్పించుకొనుటకు మరియు ఇకపై కూడా నిజమైన దైవచిత్తాన్ని మబ్బుపరచుటకు.

అందువల్ల ప్రవచించబడిన అన్ని సంకేతాలను జాగరూకతతో గమనించండి! ప్రతి ఒక్కనికి ఇది తుది నిర్ణయమైయున్నది. రక్షణ లేక వినాశం! కాగా, ఏదైతే మరియొకసారి ఆయనకు వ్యతిరేకంగా నిలుచుటకు ధైర్యంచేస్తుందో అది గతించవలెను అన్నది, ఈసారి దేవుని చిత్తమైయున్నది!

దానిలో ప్రతి అజాగ్రత్తత మీకు తీర్పు అవుతుంది! – దేవుని చిహ్నములు ఒక చర్చిపైన ఉండవు, ఒక భూలోక మతాధిపతి దైవప్రేషితునిగా గుర్తింపును కలిగియుండడు! కాని ఆ చిహ్నంతో విడదీయలేకుండా జతపరచబడియున్న, దానిని అందువల్ల సజీవంగా ప్రకాశవంతంగా, భూమిపై ఉన్నప్పుడు ఒకనాడు దైవకుమారుడు ధరించినట్లు, ధరించియున్నవాడు మాత్రమే. అవే, సజీవంగా ప్రకాశిస్తూ అతనియందున్న సత్యము యొక్క సిలువ మరియు అతనిపైవున్న పావురము! ఆత్మీయమైన వాటిని చూచుటకు అశీర్వదించబడిన వారందరికి అవి, వాటిని గురించి భూమిపైవున్న మనుష్యులందిరికి సాక్ష్యమిచ్చుటకుగాను కనబడతాయి; కాగా దేవుని యొక్క చివరి కృపగా, “చూచుటకు” అనుమతి పొందినవారు, అన్ని జాతులలో ఉండబోతారు! —

ఎప్పటికీ కూడా పరిశుద్ధమైన సత్యం యొక్క ఈ ఉన్నతమైన చిహ్నములు అనుకరించబడజాలవు. వాటి ఎదుటనుండి తప్పక పారిపోవలసిన లూసీఫరునికి కూడా అది సాధ్యం కాదు, ఒక మనిషికైతే అంతకంటే అసాధ్యం. అందువల్ల ఎవడైతే ఇంకా ఈ యొక్క దేవుని సాక్ష్యానికి వ్యతిరేకంగా నిలువగోరతాడో, వాడు ఇకపై దేవునికి వ్యతిరేకంగా దైవశత్రువైయుంటాడు. అతడు ఇంతవరకు భూమిపై తాను ఏమైయున్నట్లు నటించినా సరే, అతడు దైవసేవకుడు కాదని మరియు దైవసేవకుడై ఉండలేదని, తద్వారా చూపుతాడు.

మీరు కూడా అటువంటి వారికి చెందకుండా ఉండుటకు జాగ్రత్తపడండి!