సహాయకునికొరకు కేక

నాడు అతి ప్రత్యేకమైన హుషారుతో ఆత్మీయ సహాయకుని కొరకు వెదుకుతున్నట్టీ, తమ అంతరంగంలో పైకెత్తబడి ఆయన కొరకు వేచియున్నట్టీ మనుష్యులందరినీ మనం ఒకసారి దగ్గరగా పరికిద్దాం. తమ అభిప్రాయం
ప్రకారం వారు, ఆయనను గుర్తించుటకు మరియు ఆయన వాక్యమును వినుటకు, స్వయంగా ఆత్మీయంగా పరిపూర్ణంగా సిద్ధపడియున్నారు!

ప్రశాంతంగా పరిశీలించినపుడు మనం చాలా కూటములను చూస్తాం. క్రీస్తు యొక్క ప్రేషణము ఉదాహరణకు చాలామంది మనుష్యులపై విచిత్రంగా పనిచేసింది. దాని విషయంలో వారు ఒక తప్పుడు చిత్రాన్ని చిత్రించుకొన్నారు. ఎప్పటివలే, తప్పుడు స్వీయ-అంచనా, అహంకారము దానికి కారణమైయుండినవి.

తమ దేవునిపట్ల మునుపటి గౌరవము, ఆయననుండి సహజసిద్ధమైన అంతరము మరియు ఖచ్చితమైన హద్దుల స్థానంలో ఒక ప్రక్క ఆర్తిగా అర్థించుట ప్రవేశించింది. అది ఎల్లప్పుడు పొందగోరుతుందేకాని, ఎట్టి పరిస్థితులలో స్వయంగా ఏమియూ చేయగోరదు. “ప్రార్థించు” అనేదాన్ని వారు గ్రహించారు, కాని దానితోపాటు “మరియు పనిచెయ్యి”, అనగా “నిన్ను నీవు సరిదిద్దుకో” అనేది కూడా ఉన్నదని తెలుసుకొనుటకు వారు ఇష్టపడరు.

మరొక ప్రక్క వారు మరల, సమస్తమును తాము స్వయంగా చేయగల్గునంత మరియు కొద్దిపాటి శ్రమతో దైవత్వాన్ని సహితం పొందగల్గునంత స్వయంసమృద్ధులము మరియు స్వతంత్రులమైయున్నామని నమ్ముతారు.

దేవుడు తమ వెనుక పరుగెత్తవలెనని మాత్రమే అపేక్షిస్తూ మరియు నిరీక్షిస్తూవుండే మనుష్యులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఆయన తన కుమారున్ని పంపించాడు కాబట్టి, దానితో ఆయన, మానవాళి తన దగ్గరకువచ్చుట తనకు ఎంతో ముఖ్యమైనది అనే విషయానికి సాక్ష్యమును అందించాడని వారు భావిస్తారు. అంతేకాక ఆయనకు బహుశా వారి అవసరం కూడా ఉన్నదని వారు భావిస్తారు!

మనిషి ఎక్కడ చూసినా అన్నింటిలో కేవలం మిడిసిపాటుతనాన్ని మాత్రమే కనుగొంటాడు కాని నమ్రతను కాదు. సరియైన స్వీయ-అంచనా కొరవడింది. –

నిజంగా మనిషిగా ఉండగల్గుటకూ, అటువంటి వానిగా తన ఆరోహణను మొదలు పెట్టుటకూ మనిషికి తన కృత్రిమమైన ఎత్తునుండి క్రిందకు దిగివచ్చుట అన్నింటికంటే మొదటిగా అవసరం.

ఈనాడు అతడు రెండు పాదములతో భూమిపై స్థిరంగా నిలుచుటకు బదులు ఆత్మీయంగా ఉబ్బిపోయి పర్వతపు మొదలున ఒక చెట్టుపై కూర్చొనియున్నాడు. అందువల్ల అతడు మొదట ఆ చెట్టుపైనుండి క్రిందకు దిగనట్లైతే లేక క్రింద పడనట్లైతే ఏనాటికీ ఆ పర్వతాన్ని ఆరోహించలేడు.

అయితే ఆ మధ్యకాలంలో బహుశా అందరూ, ఎవరైతే నెమ్మదిగా మరియు బుద్ధిగా అతని చెట్టు క్రింద నేలపై తమ దారిన పోయారో, ఎవరిని అతడు అహంకారంలో చిన్నచూపుతో చూశాడో వారు శిఖరంపైకి చేరుకొనియుంటారు.

అయితే జరగబోయే ఘటనలు అతనికి సహకారాన్ని అందిస్తాయి; కాగా ఆ చెట్టు అచిరకాలంలోనే పడిపోతుంది. ఎప్పుడైతే మనిషి అస్థిరమైన ఎత్తుపైనుండి కరకుగా క్రిందపడతాడో, అప్పుడతడు బహుశా ఇంకొకసారి ఒక మెరుగైన దాని గురించి ఆలోచిస్తాడేమో. కాని అప్పుడు అతనికి అది చిట్టచివరి సమయమైయుంటుంది, కనీసం ఒక్క గంట కూడా వృధాచేయుటకు అతనికి మిగులదు.

ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇదే విధంగా వేల సంవత్సరాలపాటు సాగినట్లు పాతపద్ధతి ప్రకారం ఇకముందు కూడా సాగవచ్చని. పరచుకొని మరియు కులాసాగా వారు తమ వాలుకుర్చీలలో కూర్చొనియున్నారు మరియు ఒక బలమైన సహాయకుని కొరకు వేచియున్నారు.

కాని వారు ఆ సహాయకున్ని ఏ విధంగా ఊహించుకుంటున్నారు! అది నిజంగా దయనీయమైయున్నది.

మొట్టమొదటిగా వారు ఆయననుండి దేనిని ఆశిస్తున్నారంటే లేక పూర్తిగా నిజంగా చెప్పాలంటే, ఆయననుండి దేనిని అపేక్షిస్తున్నారంటే, ఆయన ప్రతి ఒక్కనికి అతని యొక్క వెలుగు ఉన్నతమునకు కొనిపోయే మార్గాన్ని సిద్ధపరచవలెనని! ప్రతి మతం యొక్క అనుచరుల కొరకు సత్యానికి నడిపించే మార్గానికి వంతెనలు కట్టుటకు ఆయన కష్టపడాలి అని! ఆయన దానిని ప్రతి ఒక్కడు సునాయాసంగా అర్థంచేసుకొనగలిగేంత సులువుగా మరియు అర్థమగునట్లుగా తప్ప చేయవలెను. ఆయన ఎంచుకొన్న మాటలు ఎట్లు ఉండాలంటే, వాటి సవ్యత అన్ని అంతస్తులలోని పెద్ద మరియు చిన్న వారినందరిని తక్షణమే ఒప్పించాలి.

స్వయంగా కృషిచేయుట మరియు ఆలోచించుట మనిషికి అనివార్యమైన వెంటనే ఆ సహాయకుడు నిజమైన సహాయకుడు కాదు. కాగా, సహాయకుడు తన వాక్యం ద్వారా సరియైన మార్గమును చూపుటకు పిలువబడినవాడైనట్లైతే, అతడు తప్పక మనుష్యుల కొరకు పాటుపడాలి. మనుష్యులను ఒప్పించుట, మేల్కొల్పుట అతని బాధ్యతయైయున్నది! క్రీస్తు తన జీవితాన్ని సహితం అర్పించాడు కదా.

ఈనాడు ఆ విధంగా ఆలోచించేవారు – అటువంటి వారు చాలామంది ఉన్నారు – అసలు శ్రమపడనవసరంలేదు, కాగా
వారు బుద్ధిలేని కన్యకలను పోలియున్నారు, “చాలా ఆలస్యం” వైపుగా పోవుచున్నారు!

ఖచ్చితంగా సహాయకుడు వారిని మేల్కొల్పడు కాని వారిని, సహాయకుని వాక్యం వారికి మార్గాన్ని చూపినా కూడా వారు తమను సరియైన సమయంలో పదార్థలోకంలోనుండి విముక్తులను చేసుకొనలేనందున, ఆ ద్వారం మూయబడి వెలుగులోనికి వారు ప్రవేశం పొందనంతవరకు, ప్రశాంతంగా అలాగే నిద్రపోనిస్తాడు.

ఎందుకంటె మనిషి తాను ఊహించుకొన్నంత విలువైనవాడేమీ కాదు. దేవునికి అతడు అక్కరకురాడు, కాని అతనికి తన దేవుని అవసరం ఉన్నది!

మానవాళికి దాని సందేహాస్పదమైన అభివృద్ధిలో తనకు నిజానికి ఏమి కావలయునో తెలియదు కాబట్టి, కడకు అది తాను ఏమి చేయవలసియున్నది అనే దానిని తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది!

ఈ రకమైన మనుష్యులు వెదుకుతూ, అదే సమయంలో బింకంగా విమర్శిస్తూ ప్రక్కనుండి దాటిపోతారు, ఏ విధంగా ఆనాడు చాలామంది, ఎవరి రాకడకొరకు సమస్తమూ ప్రకటనల ద్వారా సిద్ధపరచబడియుండిందో, ఆయన ప్రక్కనుండి దాటిపోయారో అదే విధంగా.

ఎవడైనా ఒక ఆత్మీయ సహాయకున్ని ఆ విధంగా ఎట్లు ఊహించుకోగలడు!

ఆయన మానవాళికి ఒక్క అడుగంత మాత్రం కూడా ఎటువంటి రాయితీలు ఇవ్వబోడు మరియు ఎక్కడ ఆయన ఇస్తాడని ఎదురుచూడబడుతుందో అక్కడంతటా అపేక్షిస్తాడు!

కాని ఏ మనిషైతే మనస్ఫూర్తిగా ఆలోచించగలడో అతడు తక్షణమే గుర్తిస్తాడు, మెలుకువతోకూడిన ఆలోచనను తీక్షణతో మరియు రాజీలేకుండా అపేక్షించుటలోనే అత్యుత్తమమైనది ఉన్నదని; ఆత్మీయ సోమరితనంలో ఇప్పటికే ఎంతో లోతుగా చిక్కుకొనియున్న మానవాళికి రక్షణకొరకు దాని అవసరం ఉన్నది! తన వాక్యాన్ని అర్థంచేసుకొనుటకు మొదటినుండే ఆత్మీయ జాగరూకతను మరియు మనస్ఫూర్తితో కూడిన సంకల్పాన్ని, స్వయంకృషిని అపేక్షించడం ద్వారానే సహాయకుడు సునాయాసంగా ధాన్యం నుండి పొట్టును ప్రారంభంనుండే వేరుచేస్తాడు. దైవ శాసనాలలో ఉన్నట్లు దానియందు స్వయంచలిత క్రియాశీలత ఉన్నది. దీనిలో కూడా మనుష్యులకు వారు నిజంగా ఎటువంటి సంకల్పాన్ని కలిగియుంటారో సరిగ్గా అదే ప్రకారం జరుగుతుంది. –

అయితే ఇంకొకరకమైన మనుష్యులు కూడా ఉన్నారు, వారు తాము అతి ప్రత్యేకమైన జాగరూకతతో ఉన్నామని ఊహించుకొంటారు!

నివేదికలలో చదువగలిగే దాని ప్రకారం వీరు సహజంగా సహాయకుని యొక్క ఒక పూర్తిగా వేరైన చిత్రాన్ని రూపొందించుకొన్నారు. అయితే అదేమీ తక్కువ వికృతంగా లేదు; ఎందుకంటే వారు అతనిలో ఒక … ఆత్మీయ విన్యాసకున్ని ఆశిస్తున్నారు!

ఏమైనప్పటికీ, దివ్యదృష్టి, దివ్యశ్రవణము, దివ్య-అంతఃకరణానుభూతి మొదలగునవి వేలమంది ద్వారా గొప్ప అభివృద్ధి అని ఊహించుకోబడుతుంటాయి, కాని నిజానికి అది సరికాదు. అటువంటిది, నేర్చుకొన్నదైనా, అభివృద్ధిచేయబడినదైనా, ప్రకృతిసిద్ధంగా ప్రాప్తించిన ప్రతిభయైనా సరే, ఏనాటికీ ఈలోక పరిమితులను దాటలేదు, అనగా అధమసీమలలో మాత్రమే పనిచేస్తుంది; అది ఔన్నత్యంపై ఏనాటికీ హక్కును అపేక్షించలేదు మరియు అందువల్ల బొత్తిగా విలువలేనిది.

ఒకవేళ మనిషి మానవాళికి దానికి సమానమైన స్థాయిపై ఉన్నటువంటి సూక్ష్మపదార్థ విషయాలను చూపినట్లైతే, లేక వాటిని చూచుటను, వినుటను నేర్పినట్లైతే, తద్వారా దానికి ఆరోహణలో ఏమైనా సహాయం చేస్తాడా?

దీనికీ ఆత్మ యొక్క నిజమైన ఆరోహణకూ మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. భూలోకఘటనలకు కూడా అది అంతే అర్థంలేనిది! అవి ఆత్మీయ కళావిన్యాసాలేకాని మరేమీ కావు, వ్యక్తిగతంగా ఆసక్తికరమైనవి, కాని మానవాళి మొత్తానికి మాత్రం పూర్తిగా విలువలేనివి!

అటువంటి వారందరూ తమకు కూడా అదే రకమైన సహాయకున్ని, తమకంటే మెరుగైన సామర్థ్యతగల వానిని, కోరుకోవడం చాలా సులువుగా అర్థమౌతుంది కదా. –

అయితే ఈ విషయంలో ఇంకా ముందుకు, హాస్యాస్పదం అయ్యేవరకు పోయేవారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వారు దానిని అతిగంభీరమైన దానిగా పరిగణిస్తారు.

ఉదహరణకు, వీరి అభిప్రాయంలో, సహాయసామర్థ్యతకు రుజువుగా మరియు మౌళికనిబంధనగా, ఆ సహాయకునికి … జలుబు చేయరాదు! ఎవనికి జలుబు చేయవచ్చో, అటువంటి వాడు అంతటితో త్రోసివేయబడతాడు; కాగా వారి అభిప్రాయం ప్రకారం ఒక ఉత్తముడైన సహాయకునికి అది సరిపడదు. ఒక బలమైనవాడు తప్పక ఎట్టి పరిస్థితులలో మరియు మొదటిగా తన ఆత్మతో ఇటువంటి అల్పమైనవాటికి పూర్తిగా అతీతుడైయుండాలి.

అది ఒకింత వింతగా మరియు హాస్యాస్పదంగా వినపడవచ్చు, కాని అది కేవలం వాస్తవాలపై ఆధారపడియున్నది మరియు
అది “నీవు నిజంగా దైవకుమారునివైతే, నీకు నీవు సహాయం చేసుకొని సిలువనుండి దిగిరమ్ము” అనే ఒకప్పటి కేక యొక్క బలహీనమైన పునరుక్తమైయున్నది. – అదే కేకను వారు నేడే, అటువంటి సహాయకుడు అసలింకా అగుపడక ముందే వేస్తున్నారు!

పేద, అజ్ఞానులైన మనుష్యులు! ఎవడైతే తన శరీరానికి ఆ విధంగా ఏకపక్షంగా అభ్యాసమిస్తాడో, తద్వారా ఆత్మ యొక్క శక్తితో కొన్ని సమయాల్లో మొద్దుబారతాడో, వాడు ఎట్టి పరిస్థితులలో గొప్పవాడు కాదు. అతన్ని మెచ్చుకొనేవారు పూర్వ శతాబ్దాలలోని పిల్లలను పోలియున్నారు. వారు నోళ్ళు వెళ్ళబెట్టుకొని మరియు మెరిసే కళ్లతో సంచార విన్యాసకుని కుప్పిగంతులను వీక్షించారు; అదే సమయంలో వారిలో తాము కూడా ఆ విధంగా చేయగల్గాలనే బలమైన కోరిక కలిగింది.

పూర్తిగా భౌతికమైనదైన ఈ విషయంలో ఆనాటి పిల్లలకంటే సందేహాస్పదమైన నేటి ఆత్మాన్వేషకులు లేక దైవాన్వేషకులు చాలామంది ఆత్మీయ విషయంలో ఎక్కువ పురోగమించలేదు!

మనం ఒక్కసారి ఆలోచనను కొనసాగిద్దాం: నేను ఎవరి గురించి ఇప్పుడు మాట్లాడానో ఆ పూర్వకాల సంచార విన్యాసకులు, క్రమంగా అభివృద్ధిచెంది, సర్కస్‌లలో, సంగీతకొలువులలో విన్యాసకులయ్యారు. వారి సామర్థ్యత విపరీతంగా అభివృద్ధిచెందింది, మరియు ప్రతిరోజు వేలమంది విలాసవంతులైన మనుష్యులు నేడు కూడా ప్రతినిత్యం క్రొత్త ఆశ్చర్యంతో మరియు అంతరంగిక వణుకుతో ఆ ప్రదర్శనలను చూస్తుంటారు.

చాలామంది విన్యాసకులు అటువంటి ప్రదర్శనలలో తమ జీవితాన్ని సహితం పణంగా పెట్టినా కూడా వారికి దానినుండి ఎటువంటి లాభమైనా కలుగుతుందా? అటువంటి ప్రదర్శనల తరువాత వారు తమతో ఏమి తీసుకొనిపోతారు? అణువంత మాత్రం కూడా కాదు; కాగా అత్యంత పరిపూర్ణతలో కూడా ఈ విషయాలన్నీ ఎప్పటికీ సంగీతకొలువులకు మరియు సర్కస్‌లకు మాత్రమే పరిమితమై ఉండవలసియుంటుంది. అవి ఎప్పటికీ వినోదానికి మాత్రమే పనికివస్తాయి కాని ఏనాటికీ మానవాళికి ప్రయోజనాన్ని కలిగించవు.

అయిననూ గొప్ప సహాయకునికి కొలమానుగా ఆత్మీయ రంగంలో అటువంటి విన్యాసాలను ఈనాడు వారు వెదుకుతుంటారు!

ఆత్మీయ హాస్యగాళ్లను అటువంటి మనుష్యులకు వదిలివేయండి! తగినంత త్వరలోనే వారు, అది ఎక్కడికి నడిపిస్తుందో అనుభవిస్తారు! వారు దానితో అసలు ఏమి ఆకాంక్షిస్తున్నారో వారికి తెలియదు కూడా. వారు అనుకొంటారు: కేవలం ఎవని ఆత్మ శరీరాన్ని అది వ్యాధిని ఎరుగకుండా కట్టడిచేస్తుందో, అతడు మాత్రమే గొప్పవాడని!

అటువంటి ప్రతి అభ్యాసం ఏకపక్షమైనది, మరియు ఏకపక్షత కేవలం అనారోగ్యతను, జబ్బును కలుగజేస్తుంది. ఇటువంటి వాటితో ఆత్మ బలపరచబడదు కాని శరీరం మాత్రం బలహీనపరచబడుతుంది! శరీరానికి మరియు ఆత్మకు మధ్య సామరస్యతకు అవసరమైన సమతుల్యత భంగపరచబడుతుంది మరియు దాని అంత్యప్రభావం ఏమిటంటే, అటువంటి ఆత్మ చివరకు చాలా ముందుగానే ఆ దుర్వినియోగం చేయబడిన శరీరం నుండి తనను వేరుపరచుకుంటుంది; ఆ శరీరం దానికి భౌతిక అనుభవానికి అవసరమైన బలమైన, ప్రతినాదమును ఇకపై ఇవ్వలేదు. అయితే ఈ అనుభవం ఆత్మకు అప్పుడు కరువౌతుంది మరియు అది అపరిపక్వంగానే ఆవలిలోకంలోనికి వస్తుంది. అది తన భౌతిక జీవితాన్ని మరియొకసారి జీవించవలసియుంటుంది.

ఇవి భౌతికశరీరానికి నష్టం కలిగించే ఆత్మీయ కళావిన్యాసాలే తప్ప మరేమీకాదు. నిజానికి శరీరం ఆత్మకు సహాయం చేయవలెను. శరీరం ఆత్మ యొక్క అభివృద్ధిలోని ఒక శకానికి చెందినది. కాని అది బలహీనపరచబడినట్లైతే మరియు అణచివేయబడినట్లైతే, అది ఆత్మకు కూడా ఏమాత్రమూ ఉపయోగకరంగా ఉండదు; కాగా దాని వికిరణాలు ఆత్మకు పదార్థలోకంలో దానికి అవసరమైన పూర్ణశక్తిని ఇచ్చుటకు చాలా బలహీనంగా ఉంటాయి.

ఒక మనిషి వ్యాధిని అణచివేయాలనుకుంటే, అతడు తప్పక ఆత్మీయంగా తన్మయత్వపు ఒత్తిడిని శరీరంపై కలుగజేయాలి, ఏ విధంగా అల్పమైన విషయంలో దంతవైద్యునిపైవున్న భయం నొప్పిని అణగద్రొక్కగలదో ఆ విధంగా.

అటువంటి తీవ్రమైన ఉత్తేజిత అవస్థలను శరీరం అపాయం లేకుండా ఒక్కసారి తట్టుకోగలదేమో, బహుశా చాలాసార్లు కూడా, కాని తీవ్రమైన నష్టాన్ని అనుభవించకుండా అనునిత్యం తట్టుకోలేదు.

మరియు ఒకవేళ ఒక సహాయకుడు దానిని చేసినట్లైతే లేక చేయమని సలహా ఇచ్చినట్లైతే, అతడు సహాయకునిగా ఉండుటకు అనర్హుడు; కాగా అతడు తద్వారా సృష్టియందలి ప్రకృతి శాసనాలను ఉల్లంఘిస్తాడు. భూలోకమానవుడు తన శరీరాన్ని తనకు అప్పజెప్పబడిన ఆస్తివలే కాపాడవలెను మరియు ఆత్మ
మరియు శరీరముల మధ్య ఆరోగ్యవంతమైన సామరస్యతను కలిగించుటకు ప్రయత్నించవలెను. ఏకపక్షమైన అణచివేత ద్వారా ఇది భంగపరచబడినట్లైతే, అది అభివృద్ధి కాదు, ఆరోహణ కాదు, కాని భూమిపై, అసలుకు పదార్థలోకంలో, అతని కర్తవ్యాన్ని నెరవేర్చుటకు తీవ్రమైన అడ్డంకి. పదార్థలోకంలో క్రియాశీలతకు అవసరమైన ఆత్మ యొక్క పూర్ణశక్తి తద్వారా నశిస్తుంది, ఎందుకంటే ఆత్మకు అందుకొరకు ఎట్టి పరిస్థితులలో భౌతికశరీరం యొక్క అణచివేయబడని, ఆత్మతో సామరస్యతను కలిగియున్న శక్తి అవసరం కాబట్టి!

ఎవడైతే అటువంటి వాటి కారణంగా గురువు అని పిలువబడతాడో, వాడు మానవాత్మ యొక్క కర్తవ్యాలు మరియు దాని యొక్క అభివృద్ధి అవసరాలు ఏమాత్రము తెలియని విద్యార్థికంటే అల్పుడు! వాడు ఆత్మకు హానికరుడు కూడా.

తగినంత త్వరలోనే వారికి బాధలో తమ బుద్ధిహీనత యొక్క గుర్తింపు కలుగుతుంది.

ప్రతి కపట సహాయకుడు మాత్రం చేదు అనుభవాన్ని తప్పక పొందుతాడు! ఆవలిలోకంలో అతని ఆరోహణ, ఆత్మీయ వెకిలిచేష్టల ద్వారా అతడు ఎవరిని ఆపివేశాడో లేక తప్పుదారి పట్టించాడో వారిలో ఆఖరివాడు జ్ఞానోదయానికి వచ్చిన తరువాతే మొదలు కాగలదు. అతని పుస్తకాలు, అతని వ్రాతలు ఇక్కడ భూమిపై పనిచేస్తున్నంత కాలం అతడు ఆవలిలోకంలో పట్టియుంచబడతాడు, ఒకవేళ అక్కడ అతనికి ఆలోపున మెరుగైన గుర్తింపు కలిగినా సరే.

ఎవడు గుప్తాభ్యాసాలను సిఫార్సుచేస్తాడో, వాడు మనుష్యులకు రొట్టెకు బదులు రాళ్లు ఇస్తాడు మరియు దానితో చూపుతాడు: వానికి ఆవలిలోకంలో నిజంగా జరిగేవాటి గురించి కనీసం కొంచెం కూడా తెలియదని, సంపూర్ణ లోకయంత్రాంగం గురించి అంతకంటే తక్కువగా తెలియునని!