ఏమి వెదుకుతున్నారు?

మి దుకుతున్నారు? చెప్పండి, ఏమిటి ఈ అవేశంతోకూడిన తోపులాట? ఒక హోరువలే అది లోకంగుండా వ్యాపించియున్నది మరియు పుస్తకాల వరద సమస్త జనులను ముంచివేస్తున్నది. పండితులు పురాతన రచనలను తరచిచూస్తున్నారు, పరిశోధిస్తున్నారు, ఆత్మీయంగా అలసిపోయేవరకు యోచనచేస్తున్నారు. హెచ్చరించుటకు, ప్రవచించుటకు, ప్రవక్తలు ముందుకొస్తున్నారు … అన్ని ప్రక్కలనుండి మనుష్యులు అకస్మాత్తుగా ఆవేశంతో క్రొత్త వెలుగును వ్యాపింపజేయాలనుకొంటున్నారు!

సేదతీర్చుటకు మరియు బలపరచుటకు కాదుకాని, దహిస్తూ, హరిస్తూ, వర్తమానకాలపు ఈ విషాదంలో
వ్యాకులపడియున్న వారికి ఇంకా మిగిలియున్న ఆఖరి బలాన్ని పీల్చివేస్తూ; కలతచెందిన మానవాళి ఆత్మపై ప్రస్తుతం ఆ విధంగా ఘోషించుచున్నది.

అక్కడక్కడ గుసగుసలు, ఏదో రాబోయేదాని కొరకై పెరుగుతున్న నిరీక్షణలో గొణుగుడు కూడా వినిపిస్తున్నాయి. అపస్మారకమైన వాంఛ ద్వారా ఉద్రిక్తతతో ప్రతి నరమూ గింజుకొంటున్నది. అంతటా ఉడుకుతూ, పొంగుతూ ఉన్నది మరియు అంతటిపై అరిష్టాన్ని పొదుగుతున్న ఒక రకమైన మైకం కమ్మియున్నది. ఉపద్రవంతో నిండియున్నది. అది దేనిని తప్పనిసరిగా కలుగజేయవలెను? ఆత్మీయంగా భూగోళాన్ని చుట్టియున్న ఆ నల్లటిపొర బలంతో చింపివేయబడనిచో, అది కలవరమును, అధైర్యమును మరియు ఉపద్రవమును తెస్తుంది; అది మురికి బురదకున్నటువంటి మెత్తటి మొండిపట్టుతో ఉన్నతానికి ఆరోహించే ప్రతి వెలుగు-ఆలోచనను గ్రహించి, అది బలపడక ముందే దానికి ఊపిరాడకుండా చేసి, మట్టుబెడుతుంది; అది ఊబి యొక్క భీతిగొల్పే మౌనంతో ప్రతి మంచి సంకల్పాన్ని మొలకలోనే అణిచివేస్తుంది, దానిలోనుండి ఎటువంటి క్రియ కూడా రూపుదాల్చక ముందే విచ్చిన్నంచేస్తుంది, నశింపజేస్తుంది.

వెదికేవారి యొక్క, అడుసును చీల్చుటకు తనలో శక్తిని కలిగియున్న వెలుగుకొరకైన ఘోష ప్రక్కకు మళ్లించబడుతుంది; ఆ ఘోష, సహాయం చేస్తున్నామని ఎవరు అనుకొంటున్నారో సరిగ్గా వారే ఆసక్తితో కడుతున్న ఒక దుర్భేద్యమైన గుమ్మటం క్రింద సమసిపోతుంది. వారు రొట్టెకు బదులు రాళ్లను అందిస్తున్నారు!

లెక్కలేనన్ని ఈ పుస్తకాలను చూడండి:

మానవాత్మ వాటి ద్వారా కేవలం అలసిపోతుందే కాని చైతన్యపరచబడదు! మరియు అదే అవి అందించే దానియంతటి యొక్క నిస్సారత్వమునకు రుజువు. కాగా ఏది ఆత్మకు అలసటను కలుగజేస్తుందో అది ఏనాటికీ సరియైనది కాదు.

ఆత్మీయ ఆహారము తక్షణమే ఊరడిల్లజేస్తుంది, సత్యము పునరుజ్జీవపరుస్తుంది మరియు వెలుగు చైతన్యపరుస్తుంది!

సందేహాస్పదమైన మానసికశాస్త్రం ద్వారా ఎటువంటి గోడలు ఆవలిలోకం చుట్టూ కట్టబడుతున్నాయో చూసినప్పుడు సాధారణమైన మనుష్యులు తప్పక నిరాశచెందుతారు. సాధారణమైన మనుష్యులలో ఎవరు శాస్త్రీయమైన వాక్యాలను, ఎవరు అపరిచితమైన వ్యక్తీకరణ విధానాలను గ్రహించాలి? అంటే ఆవలిలోకం కేవలం మానసికశాస్త్రవేత్తలకు మాత్రమే చెందవలెనా?

దేవుని గురించి వారు మాట్లాడతారు! దైవము యొక్క భావనను గుర్తించుటకు సామర్థ్యాలను పొందుటకు మొదట ఒక విశ్వవిద్యాలయమేమైనా స్థాపించబడవలెనా? అతి ఎక్కువ పాళ్లలో కేవలం గాఢవాంఛలో మాత్రమే నాటుకొనియున్న ఈ వ్యసనం ఎక్కడికి నడిపిస్తుంది?

సరళమైన మార్గం నుండి మళ్లించబడినందున చదివేవారు మరియు వినేవారు అనిశ్చితిలో, తమలో తాము అస్వతంత్రులుగా, పక్షపాతులుగా, తాగినవారివలే ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి తూలుతున్నారు.

నిరాశపరులారా ఆలకించండి! మనస్ఫూర్తిగా వెదకువారలారా పైకి చూడండి: అత్యోన్నతానికి మార్గం ప్రతిమనిషి ఎదుట సిద్ధంగా నిలిచియున్నది! పాండిత్యము దానికి ద్వారము కాదు!

క్రీస్తు యేసు, వెలుగుకు నడిపించే నిజమైన మార్గంపై ఆ గొప్ప ఆదర్శము, తన శిష్యులను పండితులైన పరిసయ్యులలోనుండైనా లేక శాస్త్రులలోనుండైనా ఎన్నుకొన్నాడా? ఆయన వారిని సరళత మరియు నిరాడంబరతలలోనుండి తీసుకొన్నాడు; ఎందుకంటే వారికి, వెలుగుకు నడిపించే మార్గం ప్రయాసతోకూడినది మరియు తప్పక కష్టమైనదైయుంటుంది అనే ఆ గొప్ప అపోహతో పోరాడవలసిన అవసరం లేకుండింది.

ఈ ఆలోచన మనుష్యుని యొక్క అత్యంత పెద్ద శత్రువైయున్నది, అది ఒక అబద్ధం!

అందువల్ల, ఎక్కడైతే మనిషిలోని సంపూర్ణంగా గ్రహించబడవలసిన అత్యంత పవిత్రమైన విషయం మూలాంశమైయున్నదో, అక్కడ సమస్త శాస్త్రపరిజ్ఞానం నుండి వెనుదిరగండి! దానిని వదిలివేయండి, ఎందుకంటే శాస్త్రము మనిషి మెదడు యొక్క ఉత్పాదితంగా అసంపూర్ణమైనదైయున్నది మరియు తప్పక అసంపూర్ణంగానే ఉండవలసియుంటుంది.

ఆలోచించండి, ప్రయాసతో నేర్చుకొనబడిన శాస్త్రపరిజ్ఞానము దైవతకు ఎట్లు నడిపించగలదో? పరిజ్ఞానము అంటే అసలు ఏమిటి? మెదడు గ్రహించగలిగేది పరిజ్ఞానము. అయితే స్థలకాలములతో బలంగా ముడివేయబడియుండే మెదడు యొక్క గ్రహించే సామర్థ్యత ఎంత పరిమితమైయున్నది. కనీసం నిత్యత్వమును మరియు అనంతము యొక్క భావమును, సరిగ్గా ఏవైతే దైవంతో విడదీయలేకుండా అనుసంధానించబడియున్నవో వాటిని, మానవమెదడు గ్రహించలేదు.

అయితే మెదడు, ఉనికిలోవున్న సమస్తము గుండా ప్రవహించే
గ్రహింపశక్యం కాని శక్తి ఎదుట, దేనిలోనుండి అది స్వయంగా తన కార్యశీలతను పొందుతుందో దాని ఎదుట, మౌనంగా నిలిచియున్నది. ప్రతి దినము, ప్రతి గంటలో, ప్రతి ఘడియలో అందరు సహజమైన దానిగా అంతఃకరణానుభూతిని పొందుతున్న, ఎల్లప్పుడు ఉనికిలో ఉన్నట్లు శాస్త్రం ద్వారా గుర్తించబడిన, ఆ శక్తిని మనిషి, మెదడుతో అనగా పరిజ్ఞానంతో మరియు మేధస్సుతో గ్రహించుటకు మరియు అర్థంచేసుకొనుటకు వ్యర్థప్రయత్నం చేస్తాడు.

శాస్త్రం యొక్క మూలరాయి మరియు సాధనమైయున్న మెదడు యొక్క కార్యకలాపము అంత లోపభూయిష్టమైయున్నది. మరియు ఆ ప్రతిబంధకము సహజంగా అది నిర్మించే వాటి ద్వారా కూడా కొనసాగుతుంది, అనగా స్వయంగా సమస్త శాస్త్రముల ద్వారా కూడా. అందువల్ల శాస్త్రము అనుక్రమానికి మంచిదే, తద్వారా అనుక్రమము, తనను నడిపించే సృష్టి శక్తిలోనుండి పరిపూర్ణం చేయబడి దేనిని పొందుతుందో దానినంతటిని మేలుగా అర్థంచేసుకొనుటకు, విభజించుటకు మరియు క్రమీకరించుటకు. కాని ఒకవేళ శాస్త్రము తనను స్వయంగా నాయకత్వానికి లేక విమర్శచేయుటకు హెచ్చించుకొనగోరినట్లైతే, అది ఇదివరకటివలే తనను బలంగా మేధస్సుకు, అనగా మెదడు యొక్క గ్రహించే సామర్థ్యతకు ముడివేసుకొనియున్నంత కాలం, తప్పక విఫలమవ్వవలసియుంటుంది.

ఈ కారణంగా పాండిత్యము మరియు దాని ప్రకారం నడచుకొనే మానవజాతి కూడా, ఎల్లప్పుడు చిన్న చిన్న వివరాలలో చిక్కుకొనివుంటాయి; అయితే అదే సమయంలో ప్రతిమనిషి గొప్పదైన, గ్రహింపశక్యం కాని సమస్తమును బహుమానంవలే తనయందే కలిగియున్నాడు. ప్రయాసపడి నేర్చుకోకుండానే అత్యంత ఉదాత్తమైన మరియు ఉన్నతమైన దానిని చేరుకొనుటకు సంపూర్ణ సమర్థతను కలిగియున్నాడు!

అందువల్ల ఈ అనవసరమైన ఆత్మీయబానిసత్వం యొక్క హింసను దూరపరచండి! కారణం లేకుండానే ఆ గొప్ప నాయకుడు మనలను: “పిల్లలవలే కండి!” అని ఉద్బోధించడు.

ఎవడు తనయందు మంచికొరకు స్థిరమైన సంకల్పమును కలిగియుంటాడో, తన ఆలోచనలకు స్వచ్ఛతను ఇచ్చుటకు ప్రయాసపడతాడో, అతడు అత్యున్నతానికి నడిపించే మార్గాన్ని అప్పటికే కనుగొనియుంటాడు! అతనికి అప్పుడు ఇతరమైనదంతయూ కలుగుతుంది. దానికొరకు పుస్తకాలుకాని లేక ఆత్మీయ ప్రయాసకాని అవసరం ఉండవు, తపస్సుకాని లేక ఒంటరితనంకాని అవసరం ఉండవు. రోగగ్రస్తమైన సమస్త తీవ్రాలోచన యొక్క వత్తిడినుండి విడిపించబడి అతడు శరీరమునందును మరియు జీవాత్మయందును ఆరోగ్యవంతుడు అవుతాడు; కాగా అతిగా చేయబడే ప్రతి ఒక్కటీ నష్టాన్ని కలుగజేస్తుంది. మీరు మనుష్యులైయుండాలి కాని, ఏకపక్షమైన పెంపుదల ద్వారా మొదటి చిన్న గాలికే నశించే హరితగృహ మొక్కలు కాదు.

మేల్కొనండి! మీచుట్టూ చూడండి! మీ అంతరంగములో వినండి! అది మాత్రమే మార్గమును తెరువగలదు!

చర్చిల యొక్క కలహాలను పట్టించుకోవద్దు. సత్యమును తెచ్చిన గొప్పవాడు, దైవప్రేమ యొక్క శరీరధారియైన క్రీస్తు యేసు మతవిశ్వాసమును గురించి అడుగలేదు. ఈనాడు మతవిశ్వాసాలు అంటే అసలు ఏమిటి? స్వతంత్రమైన మానవాత్మను బంధించుట మరియు మీలో నివసించుచున్న దైవమిణుగురును బానిసగాచేయుటయే; అవి సృష్టికర్త యొక్క కార్యమును మరియు ఆయన గొప్ప ప్రేమను మానవభావం ద్వారా అచ్చువేయబడిన రూపాలలో కుంచించుటకు ప్రయత్నించే పిడివాదములు; దాని అర్థం, దైవతను కించపరచుట, క్రమంగా విలువహీనం చేయుటయే.

మనస్ఫూర్తిగా వెదికే ప్రతివానిని అటువంటి విషయాలు వెనుకకు నెట్టివేస్తాయి, ఎందుకంటే అతడు తనలో ఎప్పటికీ ఆ గొప్ప వాస్తవికతను వాటి ద్వారా అనుభవించలేడు. అతని యొక్క సత్యము కొరకైన ఆకాంక్ష తద్వారా మరింత ఆశాహీనమౌతుంది మరియు అతడు చివరకు తనపై మరియు లోకంపై నిరాశచెందుతాడు!

అందువల్ల మేల్కొనండి! మీలోని పిడివాదముల గోడలను విచ్చిన్నం చేయండి, కండ్లగంతలను తొలగించండి, తద్వారా మహోన్నతుని ఆ స్వచ్ఛమైన వెలుగు మసకబారకుండా మీవద్దకు చొచ్చుకొని రాగల్గునట్లు. అప్పుడు మీ ఆత్మ సంతోషిస్తూ ఉన్నతమునకు ఉడ్డీనమవుతుంది, ఉత్సాహంగా నినాదాలు చేస్తూ, ఎటువంటి భూలోకమేధస్సు యొక్క హద్దులు ఎరుగని, ఆ గొప్ప తండ్రిప్రేమను అనుభవిస్తుంది. దానిలో మీరు ఒక భాగమని చివరకు మీరు తెలుసుకొంటరు. ప్రయాసలేకుండా మరియు సంపూర్ణంగా దానిని గ్రహిస్తారు, మిమ్ములను దానితో ఐక్యపరచుకొంటారు మరియు ఆ విధంగా ప్రతిదినము, ప్రతిగంటలో క్రొత్త శక్తిని బహుమానంగా పొందుతారు. అది అస్తవ్యస్తతనుండి మీ ఆరోహణను సహజసిద్ధం చేస్తుంది!