1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము
అధ్యాయం 01

1920వ సంవత్సరం నుండే ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ తన చుట్టూ ఉన్న మనుష్యులు తమ అంతరంగంలో కలిగియున్న ప్రశ్నలపై ఉపన్యాసాలిచ్చుటకు మరియు వాటిని రచించుటకు మొదలుపెట్టాడు.

1923/24 సంవత్సరాలలో అతడు అబ్ద్-రు-షిన్ („Abdruschin“) అనే పేరుతో ఉపన్యాసాలను మరియు ప్రశ్నోత్తరాలను ఏడు చిన్న పుస్తకాల రూపంలో గ్రాల్స్బ్లెట్టర్ అనే పత్రిక యొక్క మొదటి వరుసగా “గ్రాల్స్-బ్లెట్టర్ ప్రచురణ సంస్థ” ద్వారా అతని ఆనాటి నివాస పట్టణమైన బాద్ హైల్‌బ్రున్‌ లో ప్రచురించాడు.

ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ తన గ్రాలుసందేశంలోని ఉపన్యాసాల రచయితగా అబ్ద్-రు-షిన్ అనే పేరును ఎంచుకొన్నాడు. దాని అర్థం “వెలుగు యొక్క సేవకుడు (కుమారుడు)”. మొదట అతడు తన పేరును „Abdruschin“ అని వ్రాసాడు, కాని “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రికలలోనే „Abd-ru-shin“ అని కూడా వ్రాసాడు. 1930-40 దశకం మధ్యలోనుండి ఆ పేరు రెండవ విధంగా మాత్రమే వ్రాయబడింది.

gralsbl-serie1-heft3-400px
“గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక మొదటి వరుస

ఉపన్యాసాల శీర్షికలు మరియు అనంతరం ఉపన్యాసాల రూపంలో వెలువడిన ప్రశ్నోత్తరాలు:

సంచిక 1

ఏమి వెదుకుతున్నారు?

జీవించండి (తరువాతి శీర్షిక: మేల్కొనండి!)

గొప్ప మర్మము (తరువాతి శీర్షిక: మౌనము)

విమోచన (తరువాతి శీర్షిక: ఆరోహణ)

సంచిక 2

బాధ్యత

ప్రారబ్ధము

మనుష్యుని సృష్టి

సృష్టిలో మానవుడు

వారసత్వ పాపము

దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు

దేవుడు

అంతర్వాణి

ప్రేమమతము అనే ప్రశ్నకు సమాధానం

సంచిక 3

విమోచకుడు

జన్మ యొక్క మర్మము

గుప్తవిద్య అభ్యాసము హితమైనదా?

జీవాత్మవాదము

భూమితో బంధించబడినవారు

లైంగిక సంపర్క పరిత్యాగం అవసరమా లేక హితమైనదా?

నిష్కళంకమైన గర్భధారణ అనే ప్రశ్నకు మరియు ఇతర ప్రశ్నలకు సమాధానం

సంచిక 4

అంత్యతీర్పు

పొరాటము

ఆలోచనల రూపాలు

శీలము

వివాహము

ప్రార్థన

సంచిక 5

మనిషి మరియు అతని స్వతంత్ర సంకల్పము

ఆధునిక మానసిక శాస్త్రము

తప్పుడు మార్గాలు

“కన్య” మరియ ఆమె వాగ్దాన నిర్వర్తనలో అనే ప్రశ్నకు మరియు ఇతర ప్రశ్నలకు సమాధానం

సంచిక 6

సమస్త పాపాన్ని ఆయనపై వేయండి

అబ్రహాముకంటే ముందునుండే నేను ఉన్నాను

వశీకరణం యొక్క అపరాధము

జ్యోతిష్యశాస్త్రము

మానవుని ప్రారబ్ధంలో ప్రతీకాత్మకత

నమ్మకము

భూలోక ఆస్తులు

మరణము

అద్భుతములు

బాప్తిస్మము

సంచిక 7

పరిశుద్ధమైన గ్రాలు

“లూసీఫరు” మర్మము

చీకటి ప్రదేశములు మరియు నరకము

వెలుగు ప్రదేశములు మరియు పరదేశు

లోకకలాపము

మానవుడు మరియు జంతువు

మానవాళి మరియు విజ్ఞానశాస్త్రము అనే ప్రశ్నకు మరియు ఇతర ప్రశ్నలకు సమాధానం

 

1926వ సంవత్సరంలో అబ్ద్-రు-షిన్ అంతవరకు “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక మొదటి వరుసలో ప్రచురించబడిన తన ఉపన్యాసాలలో అధికభాగాన్ని ఒక పుస్తకం రూపంలో “గ్రాల్స్-బ్లెట్టర్ ప్రచురణ సంస్థ” ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్, టుట్సింగ్, ద్వారా

“సత్యము యొక్క వెలుగులో – అబ్ద్‌ రు షిన్ (Abdruschin) యొక్క క్రొత్త గ్రాలుసందేశము” అనే శీర్షికతో ప్రచురించాడు.

గ్రాలుసందేశం యొక్క ఈ ప్రచురణ (విషయసూచిక అనుబంధంలో) గ్రాలుసందేశం యొక్క “చిన్న ప్రచురణ” లేక “ఊదారంగు ప్రచురణ” లేక్ “టుట్సింగ్ ప్రచురణ” (టుట్సింగ్ బెర్న్-హార్డ్ కుటుంబికుల నివాసస్థలము మరియు ప్రచురణసంస్థ ఉండిన పట్టణమైయుండింది) అని పిలువబడింది మరియు ఇంకా పిలువబడుతున్నది.

lila-augabe-400px
“చిన్న ప్రచురణ”, “ఊదారంగు ప్రచురణ” లేక్ “టుట్సింగ్ ప్రచురణ”

“గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక మొదటి వరుస, సంచిక 1 లోనుండి గ్రాలుసందేశము 1926వ సంవత్సరపు ప్రచురణలో కేవలం “ఏమి వెదుకుతున్నారు?” అనే ఉపన్యాసం మాత్రమే వెలువడింది. “జీవించండి” (1931 ప్రచురణలో మరియు “ఆఖరి అధికృత ప్రచురణలో” దాని తరువాతి శీర్షిక “మేల్కొనండి!”), “గొప్ప మర్మము” (తరువాతి శీర్షిక “మౌనము”) మరియు “విమోచన” (తరువాతి శీర్షిక “ఆరోహణ”) పై ప్రచురణలో అప్పటికి ఇంకా చోటును పొందలేదు. “అబ్రహాముకంటే ముందునుండే నేను ఉన్నాను” అనే ఉపన్యాసాన్ని కూడా అబ్ద్-రు-షిన్ పరిగణించలేదు.

పైన పేర్కొనబడిన పత్రికలలో పాఠకులు అడిగిన ప్రశ్నలకు ఇవ్వబడిన సమాధానలు ఆ తరువాత ఉపన్యాసాల రూపంలో వెలువడ్డాయి. ఉదాహరణకు “ప్రేమమతము” మరియు “మానవాళి మరియు విజ్ఞానశాస్త్రం మధ్య విభజన” అనే ఉపన్యాసాలు. “ఆత్మ” మరియు “సృష్టి యొక్క అభివృద్ధి” అనే ఉపన్యాసాలతో 1926వ సంవత్సరపు గ్రాలుసందేశము ముగించబడింది. ఈ ఉపన్యాసాలు అంతకుముందు ప్రచురింపబడియుండలేదు. గ్రాల్స్-బ్లెట్టర్ మొదటి వరుసలో చివరిదైన 7వ సంచికలో “సృష్టి” అనే రాబోయే ఉపన్యాసం గురించిన సూచన ఇవ్వబడింది.

సరిగ్గా ప్రశ్నోత్తరాలను ఉపన్యాసాలుగా సవరించుటయే రచయితకు మరియు అతని పాఠకులు మరియు శ్రోతలకు మధ్య జరిగిన “పరస్పర సర్దుబాట్లను” చూపుతుంది. వారి అవగాహన – లేక అవగాహనలేమి -, వారి ప్రశ్నలు మరియు సలహాలు తరచుగా మరిన్ని ఉపన్యాసాలకు “కీలక పదాలు” అయినవి. మొదటినుండే మనుష్యుల ఆత్మీయ, అంతరంగిక స్వభావము కొంతవరకు, బొధించే ఆ సందేశం యొక్క రూపానికి కీలకమైయుండింది. ఇదే ప్రక్రియ కిప్స్-డోర్ఫ్ లో అతడు నివాసమున్న కాలంలో ఉపన్యాసాలను “ఆఖరి అధికృత ప్రచురణగా” పునర్వ్యవస్థీకరించే వరకు కొనసాగింది.

ఆ విధంగా అబ్ద్-రు-షిన్, గ్రాలుసందేశం యొక్క 1926వ సంవత్సరపు ప్రచురణను సంకలనం చేయునప్పుడు గ్రాల్స్-బ్లెట్టర్ పత్రికలోని ఉపన్యాసాల పూర్వ వరుసక్రమానికి ఏమాత్రమూ కట్టుబడియుండలేదు. కాని ఆ కాలానికి అవసరమైనట్లు మరియు అతడు సరియైనదిగా పరిగణించినట్లు తన ఉపన్యాసాలను క్రొత్త వరుసక్రమంలో పొందుపరచుటకు రచయితగా అతడు కలిగియుండిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు.

 

  1. 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
  2. 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
  3. 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
  4. 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
  5. సంగ్రహము
  6. అనుబంధము