- 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
- 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
- 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
- 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
- సంగ్రహము
- అనుబంధము
అధ్యాయం 02
1926 నుండి 1930 సంవత్సరాలలో, “గ్రాల్స్-బ్లెట్టర్” రెండవ వరుసలో (సంచిక 1+2, సంచికలు 3, 4+5, సంచిక 6+7) మరియు “దెర్ రూఫ్” పత్రికలో (సంచిక 1+2, సంచిక 3+4, సంచికలు 5, 6, 7, సంచిక 8+9, సంచికలు 10, 11, 12, సంచిక 13) మరిన్ని ఉపన్యాసాలు అనుసరించాయి.
ఆ ప్రచురణ 1 ఏప్రిల్ 1929 వరకు “గ్రాల్స్-బ్లెట్టర్ ప్రచురణ సంస్థ” ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్, ద్వారా కొనసాగింది. ఆ తరువాత ఆ ప్రచురణ సంస్థ “దెర్ రూఫ్” లిమిటెడ్ అనే మ్యూనిక్‌లో ఉండిన ప్రచురణ సంస్థలో విలీనమయింది.
“గ్రాల్స్-బ్లెట్టర్” రెండవ వరుసలోని మూడు సంచికలలో ప్రత్యేకించి అబ్ద్-రు-షిన్ యొక్క ఉపన్యాసాలు, ప్రశ్నోత్తరాలు మరియు సూచనలు ప్రచురించబడగా, “దెర్ రూఫ్” అనే “సమస్త ప్రగతిశీల జ్ఞాన పత్రికలో” అబ్ద్-రు-షిన్ తో సహా ముఖ్యంగా అతని చేరువలో ఉండిన రచయితలు వ్రాసారు.
“దెర్ రూఫ్” అనే పత్రికలో అబ్ద్-రు-షిన్ యొక్క ఉపన్యాసాలు
- సంచిక 1 / 2 – ఆగష్టు / సెప్టెంబరు 1927
- అనగనగా ఒకనాడు …
- సంచిక 3 / 4 – అక్టోబరు / నవంబరు 1927
- తండ్రీ, వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము!
- సంచికలు 5 / 6 / 7 – డిసెంబరు 1927, జనవరి / ఫిబ్రవరి 1928
- శుద్ధరాత్రి! (గ్రాలుసందేశము “ఆఖరి అధికృత ప్రచురణ” యొక్క మూడవ సంపుటంలోని “శుద్ధరాత్రి” అనే ఉపన్యాసము మరియు ఈ ఉపన్యాసము ఒకటికావు.)
- సంచిక 8 / 9 – మార్చి / ఏప్రిల్ 1928
- దేవుళ్లు – ఒలింప్ – వల్‌హల్
- పిలువబడినవారు
- మానవ జీవి
- సంచికలు 10 / 11 / 12 – మే / జూన్ / జులై 1928
- పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు
- దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగల్గుటకు మనిషి ఏమి చేయవలసియున్నది?
- ప్రకృతిలో పోరాటము
- లింగము
- ఒక చివరి మాట
(తరువాతి శీర్షిక: ఒక ఆవశ్యకమైన మాట)
- సంచిక 13 – మే / జూన్ 1929
- భూతములు మరియు ప్రేతముల రాజ్యంలో
- జ్ఞానదృష్టిలో రకాలు
- అపరిచితుడు
1927 మరియు 1930 సంవత్సరాల మధ్యలో అబ్ద్-రు-షిన్ “దెర్ రూఫ్” పత్రికలో ఉపన్యాసాలే కాక ప్రశ్నోత్తరాలను కూడా ప్రచురించాడు. అబ్ద్-రు-షిన్ “రూఫ్” కొరకు చాలా రచనలు సిద్ధపరుస్తున్నాడని మరియు అందువల్ల “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక రెండవ వరుస కొన్ని నెలల తరువాత మాత్రమే ప్రచురించబడుతుందని రూఫ్ పత్రిక సంచిక 8+9లో సూచించబడింది. ఆ ప్రకటన ప్రకారంగా సంచిక 6+7 – “గ్రాల్స్-బ్లెట్టర్” రెండవ వరుసలో చివరిది – చివరకు 1930లో, అంతకు పూర్వం జరిగినట్లు “గ్రాల్స్-బ్లెట్టర్ ప్రచురణ సంస్థ” ద్వారా కాక “దెర్ రూఫ్” లిమిటెడ్, మ్యూనిక్, ద్వారా ప్రచురించబడింది.
- సంచిక 1 / 2 – 1926 / 1927
- నేను ప్రభువును, నీ దేవుడను!
- నిష్కళంకమైన గర్భధారణ మరియు దైవకుమారుని జన్మ
- దైవకుమారుని సిలువ మరణము మరియు ప్రభువు రాత్రిభోజనము
- క్రీస్తు భౌతికశరీరం యొక్క పునరుత్థానము
- పరస్పరచర్య శాసనంలో మానవభావన మరియు దైవచిత్తము
- మనుష్యకుమారుడు
- సంచికలు 3 / 4 / 5 – 1927
- తప్పిదములు
- ఆత్మీయ అభివృద్ధిలో ఉత్పాదకశక్తి యొక్క ప్రాధాన్యత
- నేనే పునరుత్థానమును మరియు జీవమునైయున్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు!
- ఎంతోమంది మనుష్యులను నేడు వెలుగునుండి ఏమి వేరుచేస్తున్నది?
- సహాయకునికొరకు కేక
- గొప్ప తోకచుక్క
- స్థూలపదార్థత, సూక్ష్మపదార్థత, వికిరణాలు, స్థలము మరియు కాలము
- దివ్యదృష్టి యొక్క తప్పిదములు
- వర్తమానకాలంలో జీవించండి!
- గుప్తవిద్య అభ్యాసము, మాంసాహారము, శాఖాహారము అనే ప్రశ్నలకు మరియు ఇతర ప్రశ్నలకు సమాధానం
- అయస్కాంత వైద్యము
- వృద్ధాప్యము ఆత్మీయ ఆరోహణకు ఆటంకమా?
- సంచిక 6 / 7 – 1930
- దైవారాధన
- తల్లిదండ్రులపై పిల్లలకున్న హక్కు
- ఆదర్శవంతులైన మనుష్యులు
- నీ సహోదరుని కంటిలోని నలుసును చూస్తావు కాని నీకంటిలోనున్న దూలమును గమనించవు!
- క్రీస్తువిరోధి
- పరిశుద్ధ గ్రాలు యొక్క సిలువ
గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణలో 1926వ సంవత్సర ప్రచురణలోని 43 ఉపన్యాసాలు మరియు 48 ఇతర ఉపన్యాసాలు చోటును పొందినవి. వీటిలో కొన్ని 1926వ సంవత్సరం కంటే ముందు, కాని అధికభాగం 1926వ సంవత్సరం తరువాత “గ్రాల్స్–బ్లెట్టర్” పత్రికలో మరియు “దెర్ రూఫ్” పత్రికలో ప్రచురించబడియుండినవి లేక 1931వ సంవత్సర ప్రచురణలో మొదటిసారి ప్రచురించబడినవి.
“మేల్కొనండి!” అనే ఉపన్యాసం “జీవించండి!” అనే శీర్షికతో, “మౌనము” అనేది “గొప్ప మర్మము” అనే శీర్షికతో మరియు “ఆరోహణ” అనేది “విమోచన” అనే శీర్షికతో 1926కు పూర్వమే ప్రచురించబడ్డాయి.
1926 తరువాత “గ్రాల్స్-బ్లెట్టర్” రెండవ వరుసలో మరియు “దెర్ రూఫ్” పత్రికలో ప్రచురించబడిన ఉపన్యాసాలు (పైన చూడండి) తరచుగా, అవి పూర్వం ప్రచురించబడిన క్రమంలో ఈ ప్రచురణలో చేర్చబడలేదు కాని కొంతవరకు ఇతర ఉపన్యాసాల నడుమ చేర్చబడ్డాయి లేక వేరొక వరుసక్రమంలో పొందుపరచబడ్డాయి.
ఈ ప్రచురణలో “వేకువగా ఉండు మరియు ప్రార్థించు!, “భూమిని వదిలినవారు”, “సిలువనుండి దిగిరమ్ము!”, “ఇది నా శరీరము! ఇది నా రక్తము!”, “మరియు వేయి సంవత్సరములు ఒక దినమువలే ఉన్నవి!”, “అంతఃకరణానుభూతి”, లోక ఉపాధ్యాయుడు” అదే విధంగా “మరియు అది నెరవేరింది …” అనే ఉపన్యాసాలు మొదటిసారిగా ప్రచురించబడినవి.
1926వ సంవత్సర ప్రచురణలోని వరుసక్రమం ప్రకారం “వేకువగా ఉండు మరియు ప్రార్థించు!” అనే ఉపన్యాసం “శీలము” మరియు “వివాహము” అనే ఉపన్యాసాల మధ్యలో చేర్చబడింది. “భూమిని వదిలినవారు” అనేది “మరణం” అనే ఉపన్యాసం తరువాత చేర్చబడింది.
“సిలువనుండి దిగిరమ్ము!” మరియు “ఇది నా శరీరము! ఇది నా రక్తము!” అనేవి మొదటిసారిగా ప్రచురించబడ్డయి. అవి “దైవకుమారుని సిలువమరణము మరియు ప్రభువు రాత్రిభోజనము” మరియు “క్రీస్తుని భౌతికశరీరం యొక్క పునరుత్థానము” అనే వాటి మధ్యలో చేర్చబడ్డాయి. (ఆ రెండూ కూడా “గ్రాల్స్-బ్లెట్టర్” మొదటివరుస, సంచికలు 1 మరియు 2 లోనివి.)
„గుప్తవిద్య అభ్యాసము, మాంసాహారము, శాఖాహారము“, „అయస్కాంత వైద్యము“ మరియు „వృద్ధాప్యము ఆత్మీయ ఆరోహణకు ఆటంకం కాగలదా?“ అనేవి “గ్రాల్స్-బ్లెట్టర్” రెండవ వరుస, సంచికలు 3, 4, 5 లోనివి.
„పరిశుద్ధ గ్రాలు యొక్క సిలువ“ అనే ఉపన్యాసం ఈ ప్రచురణలో చేర్చబడలేదు.
ముగింపు మాటల తరువాత “దేవుని పది ఆజ్ఞలు” మరియు “జీవము” అనే ఉపన్యాసము అనుబంధంగా దానిలో చేర్చబడ్డాయి. (“దేవుని పది ఆజ్ఞలు” 1929వ సంవత్సరంలోనే ఒక చిన్న పుస్తకం రూపంలో “ప్రభువు ప్రార్థన” అనే ఉపన్యాసంతోపాటు ప్రచురించబడియుండినవి.)
1932 నుండి 1934 సంవత్సరాలలో “దెర్ రూఫ్” లిమిటెడ్ ప్రచురణ సంస్థ, మ్యూనిక్, ఈ ప్రచురణను క్రింది అనువాదాలలో ప్రచురించింది: చెక్ (1932), ఇంగ్లీషు (1933), ఫ్రెంచి (1933) మరియు పోర్చుగీస్.
1926వ ప్రచురణకు వేరుగా ఈ పెద్ద ప్రచురణ పలు “జర్మనీకరించబడిన” పదాలను కలిగియున్నది. క్లౌన్ (Clown) అనే పదానికి స్పాస్ మాఖర్ (Spaßmacher) అనే పదము, రెసొనాన్స్ (Resonanz) అనే పదానికి విదర్ హాల్ (Widerhall) అనే పదము, ఇత్యాది. ఈ మార్పులను అచ్చుచిత్తును దిద్దే సమయంలో ప్రచురణ సంస్థ అనధికారికంగా, “కాలానుగుణంగా” చేసింది. అబ్ద్-రు-షిన్ ఈ మార్పులను ఏనాడూ అనుమతించలేదు. ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ ఆ తరువాత అసలైనలిఖిత ప్రతి ఆధారంగా, అబ్ద్-ర-షిన్ ఉపయోగించియుండిన పదాలనే „ఆఖరి అధికృత ప్రచురణలో“ తిరిగి చేర్చింది.
- 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
- 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
- 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
- 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
- సంగ్రహము
- అనుబంధము