- 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
- 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
- 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
- 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
- సంగ్రహము
- అనుబంధము
అధ్యాయము 03
1931వ సంవత్సరంలో గ్రాలుసందేశం యొక్క “పెద్ద ప్రచురణ” అనంతరం – 1926వ సంవత్సరపు “చిన్న ప్రచురణతో” పోల్చినట్లైతే పెద్దదైనందున అది ఆ విధంగా పిలువబడింది – 1934 వరకు, 59 వరుస సంఖ్యలు కేటాయించబడిన ఏకమాత్ర ఉపన్యాసాలు అదనంగా ప్రచురించబడ్డాయి.
“గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు”, సంపుటం I, 1934.
ఈ 59 ఏకమాత్ర ఉపన్యాసాలు ఆ తరువాత అతని ద్వారా “అస్తిత్వానికి అతీతము” అనే ఉపన్యాసం మరియు “సందేశము ఏ విధంగా గ్రహించబడవలసియున్నది” అనే చివరిమాటతో కలిపి “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు”, సంపుటం I గా పొందుపరచబడి, ఆ రూపంలో 1934లో మునుపటిలాగే “దెర్ రూఫ్” లిమిటెడ్, మ్యూనిక్, ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురింపబడ్డాయి.
“గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I లోని ఉపన్యాసాలక్రమం వాటి మునుపటి ప్రచురణ యొక్క క్రమానికి వేరుగా ఉన్నది. ఉదాహరణకు, వరుససంఖ్య 25తో ప్రచురించబడిన “పరిశుద్ధ వాక్యము” అనే ఏకమాత్ర ఉపన్యాసము ఈ ప్రచురణలో మొదటిదైయున్నది. అంతేకాక, కొన్ని ఏకమాత్ర ఉపన్యాసాలకు కొత్త శీర్షికలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు “తెల్ల శూరుడు” అనేదానికి “ఆవశ్యకమైన పరిహారము” అని, “శుద్ధరాత్రి 1932” అనేదానికి “బేత్లెహేము నక్షత్రమని, “1932 డిసెంబరు 30న” అనేదానికి “ఒక కొత్త శాసనము” అని “గుడ్ ఫ్రైడే 1933” అనేదానికి “సమాప్తమైనది!” అని అదే విధంగా “ఈస్టరు 1933” అనేదానికి “ఓ మనుష్యుడా, ఈస్టరును నీలో కానిమ్ము!” అని శీర్షికలు ఇవ్వబడ్డాయి.
59 వరుస సంఖ్యలు కేటాయించబడిన ఏకమాత్ర ఉపన్యాసాలు
- 01. సంధ్యాకాల దేశములో
- 02. పునరుత్థాన ఉదయము!
- 03. పర్యాలోచకులు
- 04. స్వచ్చంద ప్రాణత్యాగులు, మతమూఢులు
- 05. దైవసేవకులు
- 06. జంతువుల సహజ జ్ఞానము
- 07. స్నేహపు ముద్దు
- 08. తదుపరి సృష్టి యొక్క స్త్రీ
- 09. వక్రీకరించబడిన సాధనము
- 10. సృష్టిలో చనిపోయినది సమస్తము సజీవపరచబడవలెను, తద్వారా అది తనపై తాను తీర్పు చెప్పుకొనుటకు!
- 11. బిడ్డ
- 12. మానవస్త్రీత్వము యొక్క కర్తవ్యము
- 13. వెయ్యి సంవత్సరాల రాజ్యము
- 14. తెల్ల శూరుడు
- 15. యేసు మరియు ఇమ్మానుయేలు
- 16. శుద్ధరాత్రి!
- 17. సర్వవ్యాపకత్వము!
- 18. క్రీస్తు చెప్పెను …!
- 19. అణుకువ
- 20. స్థూలపదార్థ ముళ్లకంపలు
- 21. ఆత్మ యొక్క సోమరితనము
- 22. “కదలిక” అనే సృష్టిశాసనము
- 23. భౌతికశరీరము
- 24. స్వభావము
- 25. పరిశుద్ధ వాక్యము
- 26. ఓ మనుష్యుడా, కర్మపోగులు నీ ఆరోహణను అడ్డగించకుండా, దానిని ప్రోత్సాహించుటకు నీవు ఏ విధంగా నడచుకోవలెనో గమనించు!
- 27. శుద్ధరాత్రి 1932
- 28. 1932 డిసెంబరు 30న
- 29. వర్గ స్పృహ, సామాజిక క్రమము
- 30. కర్తవ్యము మరియు విస్వాసపాత్రత
- 31. దృఢనమ్మకము కొరకు కృషిచేయండి!
- 32. జాతుల యొక్క సౌందర్యము
- 33. వెలుగు కలుగునుగాక!
- 34. ఓ మనుష్యుడా, నీవు ఏవిధంగా ఉన్నావు!
- 35. గుడ్ ఫ్రైడే 1933
- 36. ఈస్టరు 1933
- 37. స్థూలపదార్థ సరిహద్దున
- 38. తన దేవునియెదుట భూలోక మానవుడు
- 39. దేవునిగుర్తింపు
- 40. జీవత
- 41. ఎవడు నా వాక్యమును వేరొకదాని కారణంగా ఎరుగగోరడో, వానిని నేను వాడు బాధపడే సమయంలో ఎరుగను!
- 42. చిన్న పంచభూత జీవులు
- 43. పంచభూత జీవుల స్థూలపదార్థ పనిశాలలో
- 44. ఒక జీవాత్మ సంచరించుచున్నది …
- 45. స్త్రీ మరియు పురుషుడు
- 46. వక్రీకరించబడిన జీవాత్మలు
- 47. మనుష్యుని ఆత్మీయ నాయకుడు
- 48. మీపై ఉన్న వెలుగుపోగులు!
- 49. శుద్ధరాత్రి ధ్వనులు హెచ్చరిస్తూ విశ్వం ద్వారా ప్రకంపిస్తున్నవి
- 50. ఆదిరాణి
- 51. వికరణముల యొక్క గతిచక్రము
- 52. పరిసయ్యులనుండి దూరంగా ఉండండి!
- 53. వేరొక ఆత్మ ద్వారా పీడించబడుట
- 54. అడుగుడి, మీకివ్వబడును!
- 55. కృతజ్ఞత
- 56. నేను మిమ్మును పంపుతున్నాను!
- 57. ఈస్టరు 1934
- 58. మరియు ఒకవేళ మానవాళి అడిగినట్లైతే …
- 59. ఆశాభంగములు
అదనంగా 38 ఏకమాత్ర ఉపన్యాసాలు (సంఖ్యలు 60-97) 1934 నుండి 1937 మధ్యకాలంలో ప్రచురించబడినవి మరియు కొనుగోలుకు అందుబాటులో ఉండినవి. అవి “దెర్ రూఫ్” లిమిటెడ్, మ్యూనిక్, ప్రచురణ సంస్థ ద్వారా వెలువడ్డాయి, ఆ తరువాత స్వంత ప్రచురణ సంస్థ, ఫొంపెర్‌బెర్గ్ లేక మరియ బెర్న్-హార్డ్ ప్రచురణ సంస్థ, ఫొంపెర్‌బెర్గ్, ద్వారా వెలువడ్డాయి.
వీటిలో కొన్ని ఉపన్యాసాలను అబ్ద్-రు-షిన్, వాటిని రెండవసారి సరిదిద్దబడిన రూపంలో అదే సంఖ్యతో ప్రచురించుటకు అనుమతించే ముందే, మొదటిసారి ఉపన్యసించిన రూపంలో, అప్పటికే సైక్లొస్టైలు చేసి ప్రచురించాడు. “ఆది-ఆత్మిక సమతలములు I-VII” అనే ఉపన్యాసాలు అంతకు పూర్వం “ఆత్మిక సమతలములు I-VII” అనే శీర్షికతో ప్రచురించబడ్డాయి. ఉదాహరణకు “ఆత్మిక సమతలములు V” మొదటిసారి 22 ఏప్రిల్ 1935న చదువబడింది మరియు ఆ రూపంలో ఆ తరువాత త్వరలోనే ప్రచురించబడింది. 1936/37వ సంవత్సరంలోనే అది సరిదిద్దబడిన రూపంలో “ఆది-ఆత్మిక-సమతలములు V” అనే శీర్షికతో ప్రచురించబడింది. “ఈస్టరు 1935” అనే 73వ ఉపన్యాసాన్ని అబ్ద్-రు-షిన్ “జీవగ్రంథము” అనే శీర్షికతో, “పెంతెకోస్తు 1935” అనే 80వ ఉపన్యాసాన్ని “సజీవమైన వాక్యము” అనే శీర్షికతో ప్రచురించాడు.
అంతేకాక సంఖ్యలు ఇవ్వబడని ఏకమాత్ర ఉపన్యాసాలు “పెంతెకోస్తు”, “సమస్తము నూతనం కావలెను!” మరియు “రక్షణ పర్వతము” అనుసరించాయి.
38 అదనపు ఏకమాత్ర ఉపన్యాసాలు
- 60. ద్వారము తెరువబడుతుంది!
- 61. గాయము
- 62. సర్వజ్ఞత్వము
- 63. మానవ మాట
- 64. నూతనసంవత్సరము 1935
- 65. చూడు, నీకేది ఉపయోగకరమో!
- 66. (ఆది)ఆత్మిక సమతలములు I
- 67. కేవలం అలవాటు ప్రకారమైన విశ్వాసులు
- 68. రక్షణను కలిగించే వాంచ
- 69. (ఆది)ఆత్మిక సమతలములు II
- 70. గొప్ప శుద్ధీకరణ
- 71. (ఆది)ఆత్మిక సమతలములు III
- 72. (ఆది)ఆత్మిక సమతలములు IV
- 73. ఈస్టరు 1935 (జీవగ్రంథము)
- 74. (ఆది)ఆత్మిక సమతలములు V
- 75. (ఆది)ఆత్మిక సమతలములు VI
- 76. (ఆది)ఆత్మిక సమతలములు VII
- 77. 1935 మే 30న (త్యాగము)
- 78. జ్వాల యొక్క సంరక్షకురాలు
- 79. భాష యొక్క శక్తి
- 80. సజీవమైన వాక్యము (పెంతెకోస్తు 1935)
- 81. కుటుంబభావము
- 82. అన్యోన్యమైన గృహము
- 83. శిష్యుని యొక్క జ్వాల
- 84. బలహీనమైన స్త్రీలింగము
- 85. నాశనంచేయబడ్డ వారధి
- 85. సృష్టి యొక్క పటము
- 86. ఆత్మ-బీజములు
- 87. జీవతలోనుండి వచ్చే బీజములు
- 89. మార్గమును సిద్ధపరిచే పూర్వగాములు
- 90. అత్యంత కష్టంలో, దేవుని సహాయం అత్యంత చేరువలో ఉంటుంది!
- 91. శుద్ధీకరించే జ్వాలలు
- 92. స్వార్థ కోరికల యొక్క అగాధము
- 93. జీవాత్మ
- 94. ప్రకృతి
- 95. జీవత యొక్క వలయం
- 96. శోధనలో పడిపోకండి!
- 97. శుద్ధరాత్రి
రచయిత మొట్టమొదట ఈ ఏకమాత్ర ఉపన్యాసాలను “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం II గా పొందుపరచగోరి ఉండవచ్చు. అయితే, చారిత్రిక మరియు ఆత్మీయ పరిణామాల కారణంగా అది జరగలేదు. ఒకవేళ నేడు అటువంటి ఒక ప్రచురణ “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం II రూపంలో అందుబాటులో ఉన్నట్లైతే, అది ఎట్టి పరిస్థితులలో అధికృతమైనది కాదు.
జాతీయ సామ్యవాద పాలన యొక్క క్రమంగా పెరిగే వత్తిడి కారణంగా “దెర్ రూఫ్” లిమిటెడ్, మ్యూనిక్, ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురించుట కష్టతరమైనందున అబ్ద్-రు-షిన్ పది అదనపు ఉపన్యాసలను మరియు ప్రశ్నోత్తరాలను 1937లో “దీ స్టిమ్మె” పరిమిత సంస్థ, జ్యూరిక్, వారి “దీ స్టిమ్మె” పత్రికలో ప్రచురింపజేసాడు.
“దీ స్టిమ్మె” చివరి సంచికలో అమ్మకంలో కష్టాలు సూచించబడ్డాయి మరియు ఆ తరువాతి సంచిక యొక్క ప్రచురణ జులై 1938 వరకు వాయిదావేయబడవలసి ఉంటుందని వివరించబడింది.
“స్టిమ్మె” పత్రిక యొక్క తరువాతి సంచికలు కాని “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం II కాని ఆపై ప్రచురించుటకు సాధ్యంకాలేదు. 1938వ సంవత్సరం మార్చి నెలలో జాతీయ సామ్యవాదుల ద్వారా అబ్ద్-రు-షిన్ నిర్బంధించబడ్డాడు. వారు స్వాధీనం చేసుకొన్న ఆస్ట్రియ దేశంలోనుండి 1938 సెప్టెంబరు నెలలో అతని బహిష్కరణ మొదట గోర్లిట్స్ సమీపంలోని శ్లౌరోత్ కు మరియు 1939 మార్చి నెలలో కిప్స్-డోర్ఫ్ కు (ఎర్జ్ పర్వతశ్రేణి) అనుసరించాయి.
- సంచిక 1
- రక్తం యొక్క మర్మము
- సంచిక 2
- ప్రభువు యొక్క భాష
- సంచిక 4
- పిల్లలవంటి నైజము
- సంచిక 5
- మానవుడు మరియు భూమి
- సంచిక 7
- పెంతెకోస్తు
- సంచిక 8
- మొదటి అడుగు
- సంచిక 9
- శీలము
- సంచిక 10
- రక్షణ! విమోచన!
- సంచిక 11
- ఉపాసనము
- సంచిక 12
- జడత్వము
- 1920-1926: “గ్రాల్స్-బ్లెట్టర్” పత్రిక, గ్రాలుసందేశము 1926వ సంవత్సర ప్రచురణ
- 1926-1931: “దెర్ రూఫ్” పత్రిక, “గ్రాల్స్-బ్లెట్టెర్” పత్రిక, గ్రాలుసందేశము 1931వ సంవత్సర ప్రచురణ
- 1931-1938: గ్రాలుసందేశం యొక్కప్రతిధ్వనులు, “దీ స్టిమ్మె” పత్రిక
- 1938-1941: గ్రాలుసందేశం యొక్క సవరణ, ఆఖరి అధికృత ప్రచురణ
- సంగ్రహము
- అనుబంధము